బెంగళూరులోనూ పెరుగుతున్న నీటి కొరత

DRINKING WATER PROBLEM
DRINKING WATER PROBLEM

ఇటీవల ఒక నివేదిక బెంగళూరు కూడా దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌ తరహాలోనే నీరు లేకుండా పోయే మొట్టమొదటి భారతదేశ ప్రధాన నగరంగా మారుతుందని పేర్కొంది. కానీ అది నిజంగా జరుగుతుందా? అదేజరిగితే ఏమవ్ఞతుంది. అసలు ఏమి జరుగుతుంది. భారతీయ సిలికాన్‌ వ్యాలీ అని పిలిచే బెంగళూరు నగరం ఇప్పటికే చుట్టుపక్కల ఉన్న 100కుపైగా గ్రామాలను తనలో విలీనం చేసుకుని విస్తరించింది. అందువల్ల నగరంలోని నీటి వనరులపై తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. బెంగళూరు వాటర్‌ సప్ల§్‌ు అండ్‌ సీవరేజీ బోర్డు 2014లో విడుదల చేసిన ఒక నివేదికలో బెంగళూరులో నీటి వనరులు అడుగంటనున్నాయని పేర్కొంది.

చె న్నై నగరం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. చెన్నై ప్రస్తుత పరిస్థితులను వర్షం ఒక్కటే కాపాడగలదు. బావ్ఞ లన్నీ ఎండిపోయాయి. కనీస అవ సరాలను పక్కనపెడితే తాగేందుకు కూడా కొందరికి నీరు దొరకడం లేదు. దీంతో స్కూళ్లు, ప్రముఖ హోటళ్లు కొన్ని మూతపడ్డాయి. అలాగే ఐటి కార్యాలయాలు సైతం తమ సంస్థల నుంచి క్యాంటీ న్లను రద్దు చేశాయి. కొందరైతే ఎంప్లాయిస్‌కు ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఆప్షన్‌ను ఇచ్చారు. ఇటీవల ఒక నివేదిక బెంగళూరు కూడా దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌ తరహాలోనే నీరు లేకుండా పోయే మొట్టమొదటి భారతదేశ ప్రధాన నగరంగా మారుతుందని పేర్కొంది. కానీ అది నిజంగా జరుగుతుందా? అదేజరిగితే ఏమవ్ఞతుంది. అసలు ఏమి జరుగుతుంది. భారతీయ సిలికాన్‌ వ్యాలీ అని పిలిచే బెంగళూరు నగరం ఇప్పటికే చుట్టుపక్కల ఉన్న 100కుపైగా గ్రామాలను తనలో విలీనం చేసుకుని విస్తరించింది.

అందువల్ల నగరంలోని నీటి వనరులపై తీవ్రమైన ఒత్తిడి పెరిగిం ది. బెంగళూరు వాటర్‌ సప్ల§్‌ు అండ్‌ సీవరేజీ బోర్డు 2014లో విడుదల చేసిన ఒక నివేదికలో బెంగళూరులో నీటి వనరులు అడుగంటనున్నాయని పేర్కొంది. ప్రస్తుతం బెంగళూరులో సగటు న ప్రతి వ్యక్తికి 100 లీటర్ల నీరు అందుతోందని కానీ భవిష్యత్‌ అవసరాల కోసం నగరంలో 50 కన్నా ఎక్కవ అపార్ట్‌మెంట్ల ప్రజలు కలిసి చిన్న చిన్న నీటి ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. రోజూ ప్రతి నగరవాసి ఉపయోగించే 100 లీటర్ల నీటిలో 20 లీటర్లు తాగడానికి, వంటకు, స్నానానికి ఖర్చవ్ఞతాయి. మిగిలిన 80 లీటర్లు టాయిలెట్‌ ఫ్లషింగ్‌, ఇళ్లు కడ గడం, కార్లు తుడవడం, బట్టలు ఉతకడం లాంటి వాటికి ఖర్చవ్ఞ తోంది.ఈ పరిస్థితులలో వచ్చే ఐదేళ్లలో కొత్తగా కట్టే అపార్ట్‌మెంటు లకు అనుమతులు ఇవ్వడం లేదని ప్రజలు కూడా ఆ దిశగా ఆలో చించాలని పేర్కొనడం గమనార్హం. అయితే కేవలం నీటి సరఫరా పెంచినంత మాత్రాన బెంగళూరు నీటి సమస్య తీరిపోదు.

బెంగ ళూరు వాసులు జలపరిరక్షణ చేపడితేనే నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం అవ్ఞతుందని వాటర్‌ బోర్డు తీవ్రంగా ప్రచారం చేస్తు న్నా, ఇంతవరకు దానికి తగిన ప్రతిస్పందన మాత్రం కనిపించడం లేదు. గత కొన్ని ఏళ్లుగా నీటి ఎద్దడితో తమిళనాడు రాజధాని చెన్నై నగరం అల్లాడుతున్న విషయం తెలిసిందే. వర్షాభావ పరి స్థితులు నెలకొనడంతో చెన్నైలో భూగర్భజలాలు అడుగంటిపోయా యి. నగరానికి తాగునీటిని సరఫరా చేసే నాలుగు ప్రధాన రిజ ర్వాయర్లతోపాటు భూగర్భజలాలు కూడా అడుగంటడంతో నగరం లో తీవ్ర నీటి సమస్య ఏర్పడి దానివల్ల గత కొన్ని రోజులుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఈ పరిస్థితిపై ఇప్పటికైనా అందరూ మేలుకోకపోతే రానున్న సంవత్సరాలు మరింత నీటి ఎద్దడిని ఎదుర్కోవలసి వస్తుందని పలువ్ఞరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. గవర్నమెంట్‌ నీటి ట్యాంకుల నుంచి నీటిని పొందేందుకు అక్కడి ప్రజలు గంటలు గంటలుగా ఎదురు చూస్తున్నారు. తాగునీటి కోసం గంటల తరబడి క్యూలో నిల్చోవలసిన పరిస్థితి నెలకొనడంతో కొందరు ఉద్యోగాలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. నీటి ఎద్దడి కారణంగా ప్రజలు రాత్రిం బవళ్లు ప్రభుత్వం సరఫరా చేసే నీటి ట్యాంకర్ల కోసం ఎదురుచూ డాల్సిన దుస్థితి నెలకొంటోంది.

తాగునీటి సమస్య కారణంగా ఆర్థిక ఇబ్బందులతోపాటు సమయం వృధా, నిద్రలేక ఆరోగ్య సమస్యలు ఎదురవ్ఞతున్నట్లు బాధితులు వాపోతున్నారు. భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో తాగునీటితోపాటు గృహ అవసరాలకు పూర్తిగా ప్రభుత్వం సరఫరా చేస్తున్న నీటి మీదే పలు ప్రాంతాల ప్రజలు ఆధారపడుతున్నారు. తీవ్ర సమస్యగా మారిన నీటి ఎద్దడిని పరిష్కరించడం తమిళనాడు ప్రభుత్వానికి పెను సవాలుగా మారింది. నగరంలో ప్రైవేట్‌ నీటి ట్యాంకు ధర ఒక గ్రాము బంగారం కన్నా ఎక్కువగా ఉందని, ఇప్పుడు చెన్నైలో నీటికన్నా బంగారమే చవకని సాక్షాత్తు ప్రజాప్రతినిధులే వ్యాఖ్యాని స్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. తమిళనాడు, మహారాష్ట్రలకు చెందిన ఎంపిలు పార్లమెంటులో ప్రజల నీటికష్టా ల్ని వివరించారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థి తులపై పలు డాక్యుమెంటరీలలో సైతం నటించిన టైటానిక్‌ సినిమా హీరో లియోనార్డో ఐక్యరాజ్యసమితిలోనూ చెన్నై నగరం నీటి ఎద్దడి గురించి ప్రస్తావించడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతుంది. ఇవేకాక దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో ప్రజలకు నీళ్లు దొరకడం లేదు. పలుచోట్ల పరిస్థితి దయనీయంగా మారింది. చాలారాష్ట్రాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. బిందెడు నీటిని బంగారంలా భావించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

ఒక్కచుక్కనీటి బొట్టు కోసం అల్లాడిపోవలసిన పరిస్థితులు దాపురించాయి. ఒక్క బిందె నీటి కోసం కిలోమీటర్ల చొప్పున పరుగులు పెడుతున్నారు. ఒక్కో నీటి ట్యాంకు దగ్గర వందల సంఖ్యలో ప్రజలు బలప్రదర్శన చేస్తున్నారు. జలసంరక్షణ ను ఓ మహోద్యమంగా చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. ప్రజలంతా వర్షపు నీటిని సంరక్షించేందు కు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా పలు నదులు, జలాశయాలు ఎండిపోయి ప్రజలు నీటికి కటకటలా డుతున్న నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో తీవ్ర నీటిఎద్దడిని ఎదుర్కొంటున్న 255 జిల్లాలకు ఇన్‌ఛార్జులుగా సీనియర్‌ అధికారులను ప్రభుత్వం నియమించింది. అదనపు, సంయుక్త కార్యదర్శులు సహా పలువ్ఞరు ఉన్నతాధికారులను కేంద్ర ప్రభారీ అధికారులుగా రంగంలోకి దించింది. కొద్దిరోజుల్లో ప్రారంభం కానున్న జల్‌శక్తి అభియాన్‌ (జెఎస్‌ఎ)లో భాగంగా వీరంతా ఆయా జిల్లాల్లో జలసంరక్షణ, సమర్థ నీటిపారుదల కార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందిస్తారు.

మొత్తం 255 మంది ఉన్నతాధికారులు, డైరెక్టర్‌ లేదా డిప్యూటీ కార్యదర్శి స్థాయి కేంద్ర ప్రభుత్వ అధికారులతో పాటు వివిధ స్థాయిల రాష్ట్ర, స్థానిక అధికారులు, భూగర్భజల నిపుణులు, ఇంజినీర్లతో కూడిన బృందాలతో సమన్వయంగా పనిచేస్తారు. ఈ మేరకు సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆదేశాలిచ్చింది. గుర్తించిన బ్లాక్‌లు, జిల్లాల్లో ఈ బృందాలు పర్యటించి జలసంరక్షణ తదితర కార్యక్ర మాలు సమర్థంగా అమలయ్యేలా చర్యలు చేపడతాయి.ఇందుకు గాను 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఆయా జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉన్న 313 ప్రాంతాలు సహా 1593 నీటి ఎద్దడి బ్లాక్‌లను గుర్తించారు. ప్రత్యేకించి వేసవిలోనూ, వర్షాభావంతోనూ ఎండిపోయిన వివిధ ప్రాంతాల్లో జల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రత్యేకత.

ఈ క్రమంలో దేశంలోని ప్రతి ఇంటికి 2024 నాటికి స్వచ్ఛమైన తాగునీటిని అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2000లో ప్రపంచ జనాభా 6.2 బిలియన్లు. 2018కి వచ్చే సరికి దాదాపు 7.5 బిలియన్లు. ఇప్పటికే నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న అభివృద్ధి చెందుతున్న దేశాలలో విపరీతమైన పెరుగుదల కారణంగా 2050 కల్లా అదనంగా మరో 3.5 బిలియన్‌ జనాభా పెరుగుతుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేస్తోంది. అందువల్ల ప్రాణాధారమైన జల వనరులను జలసంరక్షణ, పునరావర్తనం ద్వారా పెంచకపోతే నీటి అవశ్యకత మరింత పెరుగుతుంది.

పెరుగుతున్న మానవ జనాభా కారణంగా నీటికి పోటీ పెరిగి ప్రపంచంలోని అతిపెద్ద జలశయాలు క్షీణిస్తున్నాయి. అంటే మానవ అవసరాలకు, అలాగే వ్యవసాయ సేద్యానికి రెండింటికీ భూగర్భజలాలనే ఉపయోగించ డాన్ని కారణంగా చెప్పవచ్చు. బోరుబావ్ఞల ద్వారా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భూగర్భజలాన్ని తోడేస్తున్నాం. ఇది కేవలం ప్రభుత్వ సమస్య కాదు. ప్రతి వ్యక్తి సమస్య. కావ్ఞన సమస్య మూలాలను గుర్తించి రేపటి గురించి ప్రతి ఒక్కరు ఆలోచించవలసిన అవశ్యకత ఎంతైనా ఉంది. భావితరాల గురించి ఆలోచించకపోతే భవిష్యత్తు అగమ్యగోచరం అవ్ఞతుంది.

  • కాళంరాజు వేణుగోపాల్‌