ప్రజావాక్కు

Voice of the people
Voice of the people

మూగజీవ్ఞలకు చలికోట్‌లు

మనది మానవ సమాజం!మనమంతా మనుషులం! మనిషి తనకు తానుగా కోరుకున్న వాటినన్నింటినీ స్వయంగా సమకూ ర్చుకోగలిగే మేధావి. అందువల్ల ఎల్లప్పుడూ ప్రభుత్వం వారి సేవలకే పరిమితం కావడంలో కొత్తేముంది అని ప్రత్యేకంగా ఆలోచించిన ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కడకు పెద్ద సంచలనాత్మ కమైన నిర్ణయమే తీసుకుంది.అందుకే కనీసం గుడిసెలు కూడా లేని అతిపేదరికంలో మగ్గిపోతూ చలిలో,వర్షంలో వణికిపోతూ ముడుచుకుపోతూ ఎంతోమంది అనాధలు ఫుట్‌పాత్‌లపై నిద్ర పోతున్నా ఎంతో మంది పసిపిల్లలు, అభాగ్యులు వీధుల్లో, అనాధాశ్రమాల్లో అర్థాకలికతోను అలమటించిపోతున్న వారికి అందించాల్సినసేవలనుప్రభుత్వంఆవ్ఞలు,లేగదూడలు, ఎద్దుల సంరక్షణ గురించి ఆలోచించి వాటికి చలికోట్‌లు తయారు చేయించి తొడగాలనే నిర్ణయం తీసుకుంది. ఎంత ఔదార్యం. -బి.ఎన్‌.సత్యనారాయణ, హైదరాబాద్‌

మానసిక రోగులా! ద్రోహులా?

ఈ దేశంలోరక్షణలేదు.గన్‌లైసెన్స్‌ ఇవ్వండిఅంటూ ఆందోళన చేస్తున్నవారిని చూస్తుంటే అనుమానమే కలుగుతోంది. ము ఖ్యంగా ఏ సమాజంలోనయినా మంచి,చెడుఉంటాయి. మంచి ని పెంచుకుంటూ, చెడును వీలైనంతగా తగ్గించే విధంగా ఒక ప్పుడు మన సమాజంలో ఉండేది. వ్యక్తికుటుంబ, సామాజిక జీవనవిధానం,దానిలోభాగమే.ఆధునికత,వ్యక్తి స్వేచ్ఛ పేరుతో కొందరు విదేశీ సిద్ధాంత ప్రేరితులు మన సమాజంలో ఆచార వ్యవహారాలను, సంప్రదాయాలను నాశనంచేస్తున్నారు. ఫలి తంగా నైతికత ప్రశ్నార్థకమవ్ఞతోంది.వ్యక్తి స్వేచ్ఛ విశృంఖల మైంది.దారుణాలకు ఒడిగట్టినఉన్మాదులకు,దుర్మార్గులకు వారి కులం,మతం,ప్రాంతం ఆధారంగా రక్షణకల్పించేవిధంగా వ్యవ హరిస్తున్న వ్యక్తులు, శక్తులు మనదేశంలోనే ఎక్కువైపోయారు.

-వీరుభొట్ల పేరయ్యశాస్త్రి, విజయవాడ

అఘాయిత్యాల నియంత్రణకు కళ్లెం లేదా?

రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు రోజు రోజుకు శృతిమించిపోతున్నాయి.ఏడుదశాబ్దాల స్వతంత్ర భార తావనిలో ఇలాంటిసంఘటనలు చోటుచేసుకోవడందేశం యావ త్‌ నిర్ఘాంతపోతుంది. సంఘటన జరిగిన సమయంలో కొన్ని రోజులు మీడియా మహిళా విద్యార్థి సంఘాలు వంటి వారు హడావ్ఞడి చేయడం తర్వాత షరామామూలే.గతంలో స్వప్నిక ప్రణీతలపై యాసిడ్‌ దాడి వరంగల్‌లో జరిగినప్పుడు పోలీసు లు ఎన్‌కౌంటర్‌ చేసినట్లుగానే ఇలాంటి సంఘటనలు పునరా వృతం కాకుండా ఉండాలంటే అదే తరహాలో కాల్చివేయాలి. -ఉయ్యాల నర్సయ్యగౌడ్‌, సూర్యాపేట

కేసుల పురోగతి ఏది?

స్త్రీలపై లైంగిక వేధింపులు,అత్యాచారాలకేసులలో చాలా వరకు ఏళ్లతరబడి పరిష్కారానికి నోచుకోవడం లేదు. చాలా కేసుల్లో అసలు శిక్షలేపడని వైనం మనపోలీసు,న్యాయవ్యవస్థల బలహీ నతలకు అద్దం పడుతున్నది. ఇంకా ఆందోళనకరమైన అంశం ఏమంటే ఈ కేసులలో ఉన్న ముద్దాయిలే ఏకంగా చట్టసభలలో ప్రతినిధులుగా ఎన్నికవ్ఞతున్నారు.వీరి రాజకీయ ప్రాబల్యంతోనే కేసులు నీరుగారిపోతున్నాయి. మన రాష్ట్రంలో గత ఆరు నెలల కాలంలో నిత్యంస్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాల వార్తలను చూస్తున్నాం.అయినా కేసులలో ఎటువంటి పురోగతి ఉండటం లేదు. న్యాయకోవిదులు,ప్రజాప్రతినిధులు చట్టాలను కఠినతరం చేయడానికి ప్రభుత్వాలపైఒత్తిడి తీసుకురావాలి.నేరాలకు పాల్ప డిన వారి ఓటుహక్కు రద్దు చేయాలి. చట్టసభలకు రాకుండా కట్టడి చేయాలి.అలాగే కేసులపరిష్కారానికి నిర్దిష్టకాల పరిమితి విధించి పోలీసు, న్యాయవ్యవస్థలను జవాబుదారీ చేయాలి.
-గరిమెళ్ల రామకృష్ణ, ఏలూరు, ప.గోజిల్లా

రాజ్యమేలుతున్న నకిలీ మందులు

తెలుగు రాష్ట్రాలలోనకిలీ మందులురాజ్యమేలుతున్నాయి. తక్కు వ ధరలకు లభించే జనరిక్‌ మందులు, ఎక్స్‌పైరీ అయిన మం దులను బ్రాండెడ్‌ ప్యాకేజీలలో అందంగా తయారుచేసి విక్రయి స్తున్నారు. వీటిని సేవించే వారికి వ్యాధి తగ్గకపోగా మరింత ముదురుతుండడంపై సర్వత్రాఆందోళన వ్యక్తమవ్ఞతోంది. ఎప్ప టికప్పుడు ఫార్మాస్యూటికల్‌ కంపెనీలు,డిస్టిబ్యూటర్లు, మెడికల్‌ షాపులపై తనిఖీలు నిర్వహించి అక్రమార్కులపై కేసులు నమోదు చేయాల్సిన డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు నిర్లక్ష్యవైఖరి కారణంగా నకిలీ మందుల విక్రయం యధేచ్ఛగా సాగుతోంది. కేన్సర్‌, పక్షవాతం, కిడ్నీ, కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడే రోగులకు కూడా నకిలీ మందులు అంటగడుతుండడంతో వారి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. –సి. ప్రతాప్‌, శ్రీకాకుళం

వినియోగదారుల ఫోరం ఏర్పాటు చేయాలి

తెలంగాణ రాష్ట్రప్రభుత్వం పరిపాలన అందరికి అందుబాటులో ఉండాలంటే కొత్తజిల్లాలను ఏర్పాటు చేసింది. కానీ ఈ రోజు వరకూ భద్రాద్రి కొత్తగూడేం జిల్లాలో ఇప్పటివరకు జిల్లా విని యోగదారుల ఫోరం,కన్‌జ్యూమర్‌ కోర్టును ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం మూలంగా వినియోగదారులు పలురకాల సమ స్యలకు పరిష్కరం లభించక సమస్యలను ఎదుర్కొంటున్నారు. న్యాయశాఖ స్పందించి కన్జ్యూమర్‌ కోర్టును ఏర్పాటు చేయాలి. -పిలకాలక్ష్మణరెడ్డి, భద్రాచలం,కొత్తగూడేం

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/