పౌరసత్వచట్టం జాతిహితమైనదే..

చి న్నారి నాగరికత ఉత్తర ఢిల్లీలోని యమునా నది ఒడ్డున గల మజ్నుకాతిలా కాలనీ లోని ఒక శరణార్థి శిబిరంలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు పాకిస్థాన్‌లో పీడననుంచి తప్పిం చుకుని నగర తీరానికి చేరుకు న్నారు. తమ గౌరవప్రద మైన జీవితానికి భరోసానిచ్చే పౌరసత్వ బిల్లు చట్టరూపం దాల్చిన తరువాత వారు తమబిడ్డకు నాగరికత అన్న పేరును పెట్టుకున్నారు. ఈ దంపతుల దృష్టిలో పౌరసత్వబిల్లు వారికి దేశ పౌరసత్వానికి సంబంధించిన ఆశలు చిగురింపచేసింది. ఈ హక్కువారికి తమ స్వదేశంలో ఎంతో కాలంగా నిరాకరణకు గురిఅవ్ఞతూ వచ్చింది.పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎవచ్చిన తరువాత వెల్లువెత్తిన వదంతులు, ఆవేశంలో చాలా ప్రశ్నలు వెనుకపట్టుపట్టాయి.ముందుగా పీడన,ముఖ్యంగా కొన్నిదేశాలలో మతం పేరిట పీడన కొనసాగుతున్నదా? లేదా? రెండు,భారత్‌ వంటి గొప్ప నాగరికత విలువలు కలిగిన దేశం ఇలాంటి వివక్షను ఎదుర్కొంటున్న ప్రజల బాధను తీర్చాలా? అవసరం లేదా? చివరగా, సిఎఎ రూపంలో తీసుకున్న చర్య రాజ్యాంగ సూత్రాలకు అనుగుణమైనదా? ఈ ప్రశ్నలకు సమా ధనం అవ్ఞను అయితే, దీనిపై జరుగుతున్న రాద్ధాంతం,అంతా కేవలం రాజకీయ ప్రేరేపితమైనదేఅవ్ఞతుంది. పౌరసత్వ సవరణ బిల్లు (సిఎబి)ను భారత పార్లమెంటు చర్చిస్తున్న సమయంలోనే, అమెరికా విదేశాంగశాఖ రూపొందించిన ఒక నివేదిక పాకిస్థాన్‌ ను మతస్వేచ్ఛను దారుణంగా ఉల్లంఘిస్తున్న దేశాలలో ఒకటిగా పేర్కొంది. పౌరసత్వంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ ముందుకు వచ్చిన సాక్ష్యాలను ఉటంకిస్తూ దీనిని పేర్కొన్నారు. ఈ నివేదికను 2019 జనవరిలో ఉభయసభల ముందుంచారు. దీనికితోడు పాకిస్థాన్‌లోని మతపరమైన మైనార్టీలపై యూరోపి యన్‌ పార్లమెంట్‌ విడు దల చేసిన నివేదిక, అక్కడి మైనారిటీ లు,మహిళల దయనీయ స్థితిని ప్రస్తావించింది.ఈ దుస్థితికి గరైన వారిలో ఎక్కువమంది హిందువ్ఞలు. వీరు ఆ దేశాన్ని విడిచి శరణార్థులుగా భారత్‌కు వచ్చినవారే. ఇంకొక విషయాన్ని ఇక్కడ మరిచిపోరాదు. సిఎఎ కింద ప్రస్తావించిన మూడు దేశాలూ అధికారికంగా మతరాజ్యాలు. ఇక రెండో ప్రశ్నవిషయా నికి వస్తే మతపరమైన పీడనను ఎదుర్కొంటున్న ప్రజలు భారత్‌కువస్తే వారి విషయంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై భారత్‌ ముందు ఉన్న ప్రత్యామ్నాయాలు ఏమిటి?సిఎఎ 1950లో శ్యామాప్రసాద్‌ ముఖర్జీ ప్రస్తావించిన కష్టాలనుతొలగిం చడానికి ప్రయత్నిస్తుంది. ఆయన హాబీసియన్‌ విశ్లేషణను ఉపయోగించి చెప్పిన మాట’ పాకిస్థాన్‌లో మైనార్టీల జీవితం దుర్భరంగా, దారుణంగా, స్వల్ప కాలికమైనదిగా మారింది. భారతదేశం ఎన్నో గొప్ప మతాలైన సిక్కు, జైన, బౌద్ధాలకు పుట్టినిల్లు.భారతీయ విలువలు వివిధ మతవిశ్వాసాలను, వివిధ వర్గాలను సంప్రదాయాలనూ తనలో ఇముడ్చుకున్నాయి. చివ రగా, పౌరసత్వానికి సంబంధించి శాశ్వత చట్టం రూపొందించే బాధ్యతను పార్లమెంటుకు విడిచిపెట్టడం జరిగింది. ఇక ఇప్పుడు సిఎఎ రాజ్యాంగంలోని 14వ అధికరణ ప్రకారంసమానత్వ హక్కుకు అనుగుణంగా ఉన్నదా అన్న ప్రశ్న. ఆర్టికల్‌ 14 ఏం చెబుతున్నదంటే భారతదేశ భూభాగంలో ఏ వ్యక్తికీ చట్టం ముందు అందరూ సమానులే అన్నదానిని, చట్టపరంగా సమాన రక్షణలను ప్రభుత్వం నిరాకరించరాదు అని చెబుతున్నది. ప్రత్యేక వర్గీకరణ ద్వారా ఆర్టికల్‌ 14కు ఏదైనా మినహాయిం పునివ్వాలంటే అందుకు రెండు లక్ష్యాలను నెరవేర్చవలసి ఉంటుంది. అవి, హేతుబద్ధత సాధించాల్సిన లక్ష్యానికి, వర్గీకరణ ప్రాతిపదికకు మధ్య సంబంధం కలిగి ఉండటం.వివిధ తీర్పుల స్ఫూర్తిని గమనించినప్పుడు డిఫరెన్షియల్‌ట్రీట్‌మెంట్‌ అనేది దానంతట అదే రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించదని తేల్చి చెప్పాయి. సిఎఎ లక్ష్యాలు, దీనికి గల కారణాలను హోంమంత్రి అమిత్‌షా స్పష్టంగా తెలియచేశారు. భారతదేశంలో భూతల సరిహద్దులు కలిగిన ఏడు దేశాలలో మూడు దేశాల రాజ్యాంగాలు మాత్రమే అధికారిక మతానికి అవకాశం ఇస్తున్నా యి. దీనినిబట్టి మనద్వైపాక్షిక సంబంధాల ఆధారంగా ఎలాంటి వివక్షా చూపడంలేదని అర్థమవ్ఞతోంది. చారిత్రకంగా ఇండియా, పాకిస్థాన్‌, ఆప్ఘనిస్థాన్‌, బంగ్లాదేశ్‌ల మధ్య సరిహద్దుల నుంచి వలసలు ఉన్నాయి. మత ప్రాతిపదికన పీడనను ఎదుర్కొంటు న్న వారు ఆయా దేశాలను వదిలి భారత్‌లో ఆశ్రయంకోసం వస్తున్నారు. ప్రయాణ డాక్యుమెంట్ల గడువ్ఞ తీరిన వారు, లేదా అసంపూర్ణ లేదా అసలు డాక్యుమెంట్లే లేని వారూ ఇందులో ఉన్నారు. ప్రధాని నరేంద్రమోడీ తన తొలిప్రభుత్వ హయాంలో ఇలాంటి వలసదారులను పాస్‌పోర్ట్‌ (ఎంట్రీ టు ఇండియా) చట్టం 1920, విదేశస్థుల చట్టం 1946ల ప్రకారం చట్టపరమైన వ్యతిరేక చర్యల నుంచి మినహాయింపు నిచ్చింది. అంతేకాదు 2016లో వీరిని దీర్ఘకాలిక వీసాకూ అర్హులుగా చేసింది. పీడన కు గురవ్ఞతున్న ఈ మైనార్టీలను పౌరసత్వానికి దరఖాస్తు చేసు కునేందుకు సిఎఎ సాధికారత కల్పిస్తున్నది.సిఎఎరాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25కు విరుద్ధమా అనే చర్చలూ జరుగుతున్నాయి. ఆర్టి కల్‌ 25,ప్రజలందరూ ఏ మతాన్ని అయినాస్వేచ్ఛగా ప్రకటిం చుకునే,అనుసరించే, ప్రచారం చేసుకునే హక్కును కల్పిస్తున్నది. సిఎఎ ఈ ప్రొవిజన్లను ఎంతమాత్రం ఉల్లంఘించడం లేదు. ఇదే వాస్తవాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీస్పష్టంగా పునరు ద్ఘాటించారు కూడా.సిఎబికి చట్టరూపం ఇవ్వడంద్వారా మైనా ర్టీల హక్కులను ఉల్లంఘించడం లేదా భారతదేశలౌకిక విలు వలు, సంప్రదాయాలను ఎంతమాత్రం ఉల్లంఘించడం జరుగ లేదని ప్రధానమంత్రి సుస్పష్టం చేశారు. తరతరాలుగా పీడనకు గురి అవ్ఞతూ నిలువ నీడ లేని వారికి సాధికారితను కల్పించే చరిత్రాత్మక చట్టం ఇది. వీధులలో హింసను రెచ్చగొడుతూ, అశాంతిని రేకెత్తిస్తున్న నాయ కులు విజ్ఞతతో ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. 1883లో స్వామి వివేకానంద విశ్వమత సమ్మేళనంలో చేసినటువంటి తన ప్రతిష్టాత్మక ప్రసంగంలో ‘ఈ భూమండలంపై గల అన్ని దేశాల, అన్ని మతాల శరణార్థులకు, పీడనకు గురైన వారికి ఆశ్రయం ఇచ్చిన దేశానికి చెందిన వ్యక్తిగా నేను గర్వపడుతున్నానుఅన్నారు. సిఎఎ ఎన్నో రకాలుగా ఈ ఆక్షాంక్షలను నెరవేరుస్తున్నది.
-ఎస్‌హెచ్‌. ధర్మేంద్ర ప్రధాన్‌ కేంద్ర మంత్రి

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/