పాఠశాలల్లోకి విస్తరించిన ర్యాగింగ్‌ భూతం!

ragging
ragging

ర్యాగింగ్‌ను నిరోధించేందుకు చట్టాలు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నామని పాలకులు పదేపదే చేస్తున్న ప్రకటనలు, హెచ్చరికలు కాగితాలకే పరిమితమైపోతున్నాయి. ప్రభుత్వం ఎంత తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేసినా ఈ జాడ్యం ఆగకపోగా మరింత విస్తరిస్తుంది. ఈ విష సంస్కృతి విశ్వవిద్యాలయాలు, ప్రొఫెషనల్‌ కాలేజీలు దాటి ఇంటర్మీడియేట్‌ స్థాయిలోకి విజృంభించడమేకాక ఇప్పుడు తాజాగా పాఠశాలలకు కూడా విస్తరించడం ఆందోళన కలిగిస్తున్నది. కొత్తగా అడుగుపెట్టిన వారికి భయం, బెరుకు పోగొట్టేందుకు చేపట్టిన పరిచయవినోద కార్యక్రమం కొందరి విద్యార్థుల కారణంగా ప్రాణాంతక వికృత క్రీడగా మారిపోయింది. ఎన్నో వ్యయప్రయాసా లకు ఓర్చి సెకండరీ విద్యను పూర్తి చేసుకొని ఉజ్వల భవిష్యత్తును ఊహించుకుంటూ కాలేజీల్లో అడుగుపెట్టే విద్యార్థులు ఎదురయ్యే అవమానాలు భరించలేక కొందరు తమలో తాము కుమిలిపోతుండగా,మరికొందరు అర్థాంత రంగా ప్రాణత్యాగాలు చేస్తున్నారు.

అశ్లీలసాహిత్యం, నీలిచిత్రాలు,మాదకద్రవ్యాలు ఇతర బలహీనతలు కూడా ఈ సంస్కృతిని మరింత రెచ్చగొడుతున్నాయి. దేశవ్యాప్తం గా అనేక కళాశాలల్లో ఇది విచ్చలవిడిగా జరుగుతున్నా నియంత్రించలేకపోతున్నారు. అయితే వీలైనంతవరకు ఇది బయటకు రాకుండా పోలీసుల దృష్టికి వెళ్లకుండా యాజ మాన్యాలు కూడా అడ్డుపడుతుండటం ఆవేదన కలిగిస్తు న్నది. పాశ్చాత్య సంస్కృతి విషవలయంలో చిక్కుకొని ఆలోచనారహితంగా కొందరు విద్యార్థులు చేస్తున్న ఈ ర్యాగింగ్‌ సున్నిత మనస్కులు తట్టుకోలేకపోతున్నారు. ఎంతో మంది విద్యార్థులు తమ భవిష్యత్తును అర్థాంత రంగా ముగించుకున్నారు. ఈ ర్యాగింగ్‌ క్రీడకు వెరసి ఇంకొందరు ఏకంగా విద్యాభ్యాసానికే స్వస్తిచెప్పిన సంఘ టనలు కూడా ఉన్నాయి.

ఇప్పుడు తాజాగా హైదరాబాద్‌ నగరంలో ఒక పాఠశాలలో పదో తరగతి చదువ్ఞతున్న విద్యార్థి ఈ ర్యాగింగ్‌ వేధింపులు భరించలేక ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. తల్లిదండ్రులు సకాలంలో గమనించి అప్రమత్తమై ఆస్పత్రికి తరలించ డంతో ప్రాణాలు దక్కా యి. నగరంలోని కర్మాన్‌ఘాట్‌లో పాఠశాలలో పదోతర గతి చదువ్ఞతున్న విద్యార్థి అదే పాఠశాలలో చదువ్ఞతున్న మరో ఇద్దరు విద్యార్థులు గత కొన్ని రోజులు అసభ్యకర మాటలతో ర్యాగింగ్‌ చేస్తున్నారు. బాత్‌రూమ్‌లకు వెళ్లిన ప్పుడు బయట నుండి తలుపుపెట్టడం లాంటి వెకిలిచేష్ట లతో వేధించారు. తమ ర్యాగింగ్‌ ఆగాలంటే ఆరువేల రూపాయలు ఇవ్వాలని బెదిరించారు. దీంతో భయపడిన ఆ విద్యార్థి ఇంట్లో తెలియకుండా వారు అడిగిన ఆరు వేలు తెచ్చిచ్చాడు. కొన్నిరోజులు తాత్కాలికంగా ర్యాగింగ్‌ ఆపిన ఆ విద్యార్థులు మళ్లీ మరో వెయ్యి రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గత బుధవారం రోజు బాధితుడిపై దాడి కూడా చేశారు. దీంతో ఆందోళన చెందిన ఆ విద్యార్థి అదేరాత్రి ఆత్మహత్యకు ప్రయత్నించా డు.

భోజనం చేయడానికి కుమారుడు రాకపోవడంతో వెళ్లి అతని రూమ్‌లోకి చూడగా ఉరివేసుకున్న కుమారుడిని గమనించిన తల్లిదండ్రులు అప్రమత్తమై హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. తృటిలో ప్రాణాపాయం నుంచి భయటపడ్డాడు. తనతోటి విద్యార్థులు వేధిస్తున్నారని బాధితుడు సుసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. డబ్బుల కోసం తోటి మిత్రులే బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని, ఇప్పటికే ఒకసారి ఇంట్లో చెప్పకుండా ఆరువేల రూపాయలు ఇచ్చినట్లు, మరో వెయ్యి కావాలని బెదిరిస్తున్నారని అమ్మనానలు క్షమించండి ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఆ సుసైడ్‌నోట్‌లో పేర్కొన్నాడు. సకాలంలో తల్లిదండ్రులు అక్కడ ఉండటంతో ఆస్పత్రికి తరలించడం డాక్టర్లు వైద్యసహాయం అందించ డంతో ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు. దీనిపై సరూర్‌నగర్‌ పోలీసులు ర్యాగింగ్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

పాఠశాలల్లో ర్యాగింగ్‌ జరిగిన సంఘటన పోలీసు స్టేషన్‌లో నమోదు కావడం ఇది మొదటిదే కావచ్చు. గతంలో ఇంజినీరింగ్‌, మెడికల్‌ విద్యార్థులు ఎందరో ఈ ర్యాగింగ్‌ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. పెరుగుతున్న ర్యాగింగ్‌ నిరోధించేందుకు పాలకులు ఉన్నతస్థాయిలో చర్చించి దీనిని ఆపకపోతే మరిన్ని పసిప్రాణాలు బలయ్యే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం దాదాపు దశాబ్దం క్రితమే చర్యలు చేపట్టింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఈ విషయంలో జోక్యం కల్పించుకొని ర్యాగింగ్‌ నిరోధానికి చర్యలు చేపట్టాల్సిందిగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను దేశంలోని విశ్వవిద్యాలయాలకు, ప్రొఫెషనల్‌ విద్యాసంస్థలకు లేఖలు రాసింది.

దీనికి అను గుణంగా 1977లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర చట్టమే తీసుకువచ్చింది. 1997 మార్చి 18న రాష్ట్ర శాసన సభ ఆమోదించిన రాజ్యాంగ చట్టప్రకారం వేధింపులకు గురి చేస్తే ఆరు నెలలు జైలు శిక్ష, ర్యాగింగ్‌లో భాగంగా దౌర్జ న్యానికి పాల్పడితే ఏడాదిపాటు జైలుశిక్ష, ర్యాగింగ్‌ పేరుతో రేప్‌ చేసినా, కిడ్నాప్‌ చేసినా,లేదా ఇతర అసహజ చర్యలకు పాల్పడినా ఐదేళ్ల పాటు జైలు,పదివేల రూపాయల జరిమా నా విధించే విధంగా కఠిన శిక్షలతో చట్టాన్ని రూపొందిం చారు. అంతేకాదు వీటన్నింటికంటే మించి ర్యాగింగ్‌ చేసిన విద్యార్థులను ఆయా విద్యాసంస్థలనుంచి డిస్మిస్‌ చేయడమే కాకుండా మరొకచోట అడ్మిషన్‌ కూడా ఇవ్వరాదని చట్టంలో పేర్కొన్నారు.

ఈ విషయంలో అధికారులు, మంత్రులతో సహా అందరు హెచ్చరికలు చేస్తున్నా మరొకపక్క యధావిధి గా ఈ రాక్షస క్రీడ కొనసాగుతూనే ఉంది. గతంలో ర్యాగింగ్‌ పేరుతో రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యా లయంలో తమతోటి విద్యార్థినిపై తొమ్మిదిమంది సీనియర్లు పైశాచికంగా వ్యవహరించిన తీరు నేటికీ విద్యార్థిలోకం మరిచిపోలేకపోతున్నది. ఇప్పటికైనా పాలకులు మనసు పెట్టి ఆలోచించాలి. రాజకీయాలకు అతీతంగా పొరుగునున్న తమిళనాడు లాగా కఠినమైన చర్యలు తీసుకోగలిగితే ఈ ర్యాగింగ్‌ భూతాన్ని పారద్రోలగలుగుతాం.

  • దామెర్ల సాయిబాబ,ఎడిటర్‌, హైదరాబాద్‌