ధూమపానంతో కలుషితమవుతున్న పర్యావరణం

        ధూమపానంతో కలుషితమవుతున్న పర్యావరణం

smoking
smoking

పొగాకు వినియోగాన్ని తగ్గించేందుకు పాలకులు చట్టాలు చేస్తున్నా, ప్రకటనలు, హెచ్చరికలు జారీ చేస్తున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదు.పొగాకు వినియోగం అంతకంతకు పెరిగి పోతుండడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ ప్రభావం పర్యా వరణాన్ని కలుషితం చేస్తున్నదని పర్యా వరణ శాస్త్రజ్ఞులు ఎంతోకాలంగా హెచ్చరిస్తున్నారు. తెలు గు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలోనూ ఆ మాటకొస్తే ఆగ్నేయాసియాలో గంటకు నూటయాభై మందికి పైగా మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలో వెల్లడిం చింది. పదకొండు దేశాల్లో దాదాపు ఇరవైనాలుగున్నర కోట్లమందికిపైగా ధూమపానం చేస్తుం డగా ముప్ఫైకోట్ల మంది పొగాకును ధూమపానేతర ఉత్పత్తు ల్లో ఉపయో గిస్తున్నారు. పొగాకు వినియోగం వల్ల ఏటా ఆగ్నేయా సియాలో పదమూడు లక్షల మంది మరణిస్తున్నట్లు డబ్ల్యు.హెచ్‌.ఓ. రికార్డులు వెల్లడిస్తున్నాయి.అయితే పొగా కు వినియోగాన్ని నియంత్రించేందుకు భారతదేశంలో చట్టాల మీద చట్టాలు చేస్తున్నారు. ధూమపానంవల్ల జరిగే నష్టాల ను, ప్రధానంగా సోకే రోగాలను గూర్చి సవివరంగా ప్రకటన రూపంలో హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

బహిరంగ ప్రదే శాల్లో పొగ నిషేధిస్తూ కేంద్రప్రభుత్వం ఏనాడో సమగ్రమైన చట్టమే చేసింది. కానీ ఈ చట్టం చేసేముందు అసలు ఈ చట్టంవల్ల ఎవరికి ఉపయోగం?ఎవరికి నష్టం? నష్టపోయిన వారి పునరావాసానికి తీసుకోవాల్సిన చర్యల గూర్చి ఏమా త్రం ఆలోచించకుండా చట్టం చేసేశారు. అందుకే ఆ చట్టం కాగితాలకే పరిమితమైపోయింది. వాస్తవంగా మద్యపానం, ధూమపానం రెండూ మానవ జాతిని పట్టిపీడిస్తున్న రెండు భూతాలు.ఒకటి బ్రహ్మరాక్షసి అయితే మరొకటి పిశాచం. ఇందులో మరోవాదనకు తావులేదు. మద్యపానాన్ని పోషిస్తూ ఆదాయ వనరులుగా మలుచుకుంటున్న పాలకులు ధూమపా నం విషయంలో చట్టం చేయడం కొంతలోకొంత మేలనిచెప్ప వచ్చు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌, మరెన్నో రోగాలకు ధూమపా నం కేంద్ర బిందువని ఎందరో వైద్య నిపుణుల అధ్యయనం లో తేలింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు నూట ముప్ఫై కోట్ల మందికి పైగా ధూమపానంలో మునిగితేలుతున్నట్లు డబ్ల్యు. హెచ్‌. ఓ. రికార్డులే వెల్లడిస్తున్నాయి.భారతదేశానికి సంబం ధించి దాదాపు ఇరవై కోట్ల మందికి పైగా పొగాకు అలవాటు పడ్డారు. అందులో బీడీలు తాగేవారే ఎక్కువగా ఉన్నారు.

బీడీలు, సిగరెట్లు తాగడం సరదాగా ఆరంభమై ఆ తరు వాత అలవాటుగా మారిపోతున్నది.పదిహేనేండ్ల వయసు లో ఇది ఆరంభం కావడం ఆందోళన కలిగించే అంశం. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ఇందువల్ల రోగాల బారిన పడుతుంటే అందు లో లక్షలాదిమంది అసువులు బాస్తున్నారు.ఇదే పరిస్థితి కొన సాగితే ఈ వ్యసనానికి ఒక్క భారతదేశంలోనే పది లక్షల మందికి పైగా బలయ్యే అవకాశాలు ఉన్నట్లు న్యూ ఇండియన్‌ మెడిసిన్‌ జనరల్‌ అధ్యయనం వెల్లడించింది. సిగరెట్‌ పొగలో నాలుగు వేల ఎనిమిది వందలకు పైగా ప్రమాదకర విషవా యువులు ఉన్నాయని అవి అనేక రోగాలకు కారణం అవుతు న్నాయి. పరిస్థితిని గమనించిన కేంద్ర పెద్దలు పొగాకును పారదో లేందుకు ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టారు. అయి తే అందువల్ల జీవనోపాధి కోల్పోతున్న కుటుంబాల గురించి పట్టించుకోకపోవడం దురదష్టకరం. అప్పట్లో బీడీ కట్టల మీద భయంకొల్పే పుర్రెబొమ్మ,శవంబొమ్మ ముద్రించాలని ఉత్తర్వులు జారీచేశారు. దీంతో దేశవ్యాప్తంగా బీడీ కార్మి కుల నుంచి తీవ్రవ్యతిరేకత వ్యక్తమైంది.జీవనోపాధి కోల్పో తున్నా మని ఆందోళనకు దిగి రోడ్లపైకి వచ్చారు.

బీడీ పరిశ్రమ ప్రత్యక్షంగానో,పరోక్షంగానో కోట్లాది మందికి బతుకుతెరువును ఇస్తున్నదనేది కాదనలేని వాస్తవం. బీడీ ఆకుల సేకరణ,అడవు ల్లో లక్షలాది కుటుంబాలకు ప్రధాన ఆదాయవనరుల్లో ఒకటి. కొన్నిశతాబ్దాలుగా అదొక కుటీర పరిశ్రమగా వర్ధిల్లుతున్నది. మరొకపక్క బీడీలు చుట్టుకుంటూ లక్షలాది కుటుంబాలు జీవనం గడుపుతున్నాయి. ఈ వాస్తవాలను పట్టించుకోకుండా బీడీ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రయత్నం చేయడం అవివేకమే అనిపిస్తున్నది. దీంతో వారంతా సంఘటితమై ఎదురు తిరగడం రాజకీయ వత్తిడులు తోడుకావడంతో విర మించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ తరువాత మళ్లీ గాంధీ జయంతినాడు, బహిరంగప్రదేశాల్లో ధూమపానాన్ని అప్పటి ప్రభుత్వం నిషేధిస్తూ ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం 2003 ప్రకారం ఆరోగ్యశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

దీనిపై పలు రాష్ట్రాల్లో భారత హోటళ్ల సంఘం, ఇతర సంస్థలు ఉన్నత న్యాయస్థానాల్లో కేసులు వేశారు. నోటిఫి కేషన్‌ అమలు నిలిపివేయాలన్న అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించడంతో చట్టం అమలుకు శ్రీకారం చుట్టారు. బహిరంగ ప్రదేశాలంటే ఏమిటో, ఏమమేమి వస్తాయో విశదీక రించింది.ప్రయివేటు కార్యాలయాలు, ఆడిటోరియా లు,ఆస్ప త్రులు, ఆరోగ్య సంస్థలు,వినోదకేంద్రాలు, న్యాయస్థానాలు, విద్యాసంస్థలు, గ్రంథాలయాలు, వాణిజ్య సము దాయాలు తదితర అన్ని ప్రాంతాలను నోటిఫికేషన్‌లో చేర్చారు. దీన్ని ఉల్లంఘించినవారికి రెండు వందల రూపాయలు జరిమానా విధించేవిధంగా చట్టాన్ని రూపొందిం చారు. కార్యాలయాల్లో ఉల్లంఘన జరిగినట్లు రుజువయితే యాజమాన్యాలను కూడా బాధ్యులను చేసే విధంగా చట్టం రూపొందించారు. హోటళ్లు, కార్యాలయాల్లో పొగ తాగేం దుకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలని కూడా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

అయితే ఈ ఉత్తర్వులు అమలు చేయడం సాధ్యంకాదని కొన్ని రాష్ట్రాలు స్పష్టం చేయగా, మరికొన్ని రాష్ట్రాలు కొంత గడువు కావాలని అభ్యర్థిం చాయి.చట్టంలో కూడా కొన్ని లోపాలున్నాయి.బహిరంగ ప్రదేశాల్లో రోడ్లు చేర్చకపోవడం, రోడ్లపైకి వచ్చి తాగితే చట్టం ఏం చేయలేదని ధూమపాన ప్రియుల వాదన. అంతేకాదు చట్టం అమలుకు అవసరమయిన యంత్రాంగం కూడా లేదు. అసలు ఒక వ్యవస్థే లేదని చెప్పవచ్చు. ఏది ఏమయినా ప్రభుత్వం చిత్త శుద్ధి ఉంటే జీవనోపాధి కోల్పో తున్నవారికి ప్రత్యామ్నాయం చూపి, పొగాకు ఉత్పత్తులను, అమ్మకాలను, వినియోగాన్ని భూటాన్‌ దేశంలోలాగా పూర్తిగా నిషేధించాలి. అప్పుడే దీనికో పరిష్కారం దొరుకుతుంది.
– దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌, హైదరాబాద్‌