తెలుగును కాపాడుకుందాం

శి ఖర సమావేశమైన తెలుగు భాషా ఔన్నత్యం సుస్తా వస్థలో ఉంది. భావ దారిద్య్రంతో మనం మన మాతృభాష తెలుగుకు తెగులు అంటిస్తున్నాం. పరభాషా సైతం తలకెక్కి, తెలుగును స్మరిం పక, విస్మరించి, ఉపాధికి పనికి రాదని అనుమానించి, అవమా నించడం తెలుగు నేలపై తెలుగు పరాయి భాషగా పరిగణించబడడం ఆవేదనకు గురిచేసే అంశం. సుమనోహరమైన అక్షరాల అల్లికతో, తేనెలాంటి పదాల పొందికతో ప్రవాహసదృశంలా సాగే ప్రాచీన భాష మన తెలుగు భాష. గ్రాంథికమైనా, వ్యవహారికమైనా, పొగడ్తలకైనా, తెగడ్తలకైనా, ముచ్చటైన, ఒద్దికైన మురిపాల భాష మన ముగింటనుండగా ఆంగ్లభాషా వ్యామోహంతో అమ్మ భాషను తృణీకరించడం దారు ణం. ఆంగ్లేయులు వారి భాషపై మమకారంతో మనదేశంలో ఆంగ్లాన్ని ప్రవేశపెట్టినా, బ్రౌన్‌ లాంటి మహామహులెందరో తెలుగుభాషా ప్రాశస్త్యాన్ని గుర్తించి గౌరవించారు. తెలుగు భాషా ప్రాశస్త్యాన్ని కొనియాడడానికి కొలబద్దలు లేవ్ఞ. శతాబ్దాల చరిత్ర గల ప్రాచీన భాష మన తెలుగు. ఏ భాషకూ అందనంత శిఖరాగ్రభాగాన కొలువై ఉన్న తెలుగుభాషను నిర్లక్ష్యం చేయడం మనం కూర్చున్న కొమ్మను మనం నరుక్కున్న చందంగా ఉంది. రాష్ట్రాలన్నీ భాషా ప్రాతిపదికనే విభజింపబడ్డాయి. ఈ విషయాన్ని మరువకూడదు. భాషను అణగద్రొక్కడానికి ఇతర రాష్ట్రాలు అనేక ప్రయత్నాలు చేశాయి. అయినప్పటికీ తెలుగు భాష ప్రాచీన భాష హోదాను సొంతం చేసుకుంది. తెలుగు భాషా వికాసమంటూ హోరెత్తించిన వారంతా నేడు మౌనముద్రలోకి జారుకున్నారు. బతుకుతెరువ్ఞకు ఆంగ్లభాష ఎంత అవసరమో, ఎలా బతకాలో నేర్పిన మాతృభాష కూడా అంతే అవసరం. అలాంటి మాతృభాష ‘మృతభాషగా మారుతుంటే తెలుగు భాషాభిమానుల ఘోష కంఠశోషగానే మిగిలిపోవడం మన భావదారిద్య్రానికి నిదర్శనం. తేనెలొలుకు తేట తెలుగు నిస్తేజంగా మారుతుంటే మారుమాట పలకకుండా మిన్నకుండడం విచిత్రం. హిందీ భాష తర్వాత దేశంలో అత్యధికులు మాట్లాడే భాష తెలుగు. ఈ దృష్ట్యా మన తెలుగుభాష అస్థిత్వాన్ని కొనసాగించాలి. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలలో తెలుగును బోధించేటట్లు చేయాలి. కనీసం పదవ తరగతి వరకైనా కొన్ని సబ్జెక్టుల్లోనైనా తెలుగు భాషను తప్పనిసరి చేయాలి. జాతీయ స్థాయిలో జరిగే అన్నిపోటీపరీక్షలను తెలుగు భాషలో కూడా నిర్వహించాలి. కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో కూడా తెలుగు బోధన తప్పనిసరి చేసినప్పుడే ప్రభుత్వ సంస్థల్లో చదివే విద్యార్థులకు కూడా సమన్యాయం జరుగుతుంది. తేనెలొలికే తేటగీతితో, ఆహ్లాదంగా సాగే ఆటవెలదితో పలు ఉపమానాలతో, ప్రాసలతో అలంకారాలతో, అష్టావధాన, శతావధాన ప్రక్రియలతో, భాషకు జీవం పోసే చతురోక్తులతో పలు వ్యాకరణాంశాలతో విరాజిల్లిన తెలుగు భాషా సోయగం ఆంగ్లభాషా విస్తరణతో అడుగంటిపోవడం బాధాకరం. ప్రపంచీకరణ ప్రభావం తెలుగు భాషకు శాపంలా మారింది. ఆంగ్లభాషా ప్రభావం ఎంతగా విస్తరించినా ఇతర రాష్ట్రాల ప్రజలు వారి మాతృభాషను విస్మరించలేదు. విమర్శించనూ లేదు. అయితే మనం మాత్రం పరభాషా వ్యామోహంతో తెలుగు భాషకు తెగులు పుట్టించి, అధోగతిపాలు చేస్తున్నాం. బతుకుదెరువ్ఞకు ఆంగ్లభాష ఎంత అవసరమె ఎలా బతకాలో నేర్పే తెలుగుభాష కూడా అంతే అవసరం. కళాశాలస్థాయిలో ఆంగ్ల మాధ్యమం అవసరమే. కానీ పదవతరగతి వరకైనా తెలుగును కొనసాగిస్తే భాష బతుకుతుంది. భాషను ఎంచుకునే హక్కు విద్యార్థులకే ఉండాలి. అన్ని ప్రభుత్వం, ప్రైవేట్‌ పాఠశాలల్లో కనీసం రెండు, మూడు పాఠ్యాంశాలు తప్పనిసరిగా తెలుగులోనే బోధించాలి. ధనిక, పేద, విద్యార్థులనే తారతమ్యం లేకుండా తెలుగును అందరికీ తప్పనిసరి చేయాలి. ఆంగ్ల పాఠ్యాంశాలను కొంతవరకైనా కుదించి, ఆ స్థానంలో అదనంగా తెలుగు పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలి. ఆంగ్లభాషను అందరికీ అందుబాటులోకి తేవడంతోపాటు మాతృభాషకు విశేష ప్రాధాన్యాన్ని కల్పించాలి. తెలుగుభాష మాట్లాడితే చులకనైపోతామన్న భావదారిద్య్రధోరణి దారుణం. ఇతర రాష్ట్రాలలోని ప్రజలు వారి భాషకు ఇస్తున్న ప్రాధాన్యతను మనం అవగాహన చేసుకోవాలి. ప్రాచీన భాష హోదా సంపాదించుకున్న తెలుగుభాషను గౌరవించడమంటే మనం మన మాతృమూర్తిని గౌరవించుకోవడమే కదా! ఆంగ్ల భాషను నేర్చుకుంటూనే తెలుగు భాషా వికాసానికై పాటుపడాలి. మాతృభాషను పారద్రోలడమంటే విలువైన ప్రాచీన సంపదను కోల్పోయినట్లే. ఈ విషయాన్ని గుర్తించి తెలుగు ప్రభుత్వాలు తెలుగు భాషా వికాసానికై పాటుపడాలి.
-సుంకవల్లి సత్తిరాజు

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/