జమిలి ఎన్నికల వల్ల ఎవరికి ప్రయోజనం?

jamili elections
jamili elections

ఒ కదేశం ఒక ఎన్నిక పేరుతో దేశమంతా ఒకేసారి పార్ల మెంటుకు, రాష్ట్రాలలోని శాసనసభ లకు జమిలీగా ఎన్నికలు నిర్వహిం చాలని కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. జమిలి ఎన్ని కలు నిర్వహించే పక్షంలో తలెత్తే న్యాయపరమైన అంశాలపై కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది. బిజెపి ప్రభుత్వం భావిస్తున్న ట్లుగా జమిలీగా ఎన్నికలు నిర్వహించాలంటే అయిదు రాజ్యాంగ సవరణలతోపాటు కొన్ని అధికరణలను మార్పులు చేర్పులు చేయా ల్సి ఉంటుందని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారతదేశం వంటి అతిపెద్ద ప్రజాస్వామ్యదేశంలో అన్ని సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదన ఆచరణ సాధ్యమేనా? ఈ ప్రతిపాదనలో రాజకీయ కోణం ఉందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొదటి ప్రశ్న విషయానికి వస్తే మనది ఫెడరల్‌ వ్యవస్థ.

పార్లమెంటు తరహా పాలనా వ్యవస్థ. రాష్ట్రాలకు స్పష్టమైన అధికారాలున్నాయి. ఈ స్థితిలో జమిలీగా ఎన్నికలు నిర్వహించడానికి ఒకసారికి వీలు కలుగుతుందే కానీ ప్రతిసారి జమిలీగా ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమనే చెప్పాలి. గత చరిత్రను గమనిస్తే 1952, 1955లో సాధారణంగానే పార్లమెంటు కు, శాసనభలకు జమిలి ఎన్నికలు జరిగాయి.ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో క్రమంగా ఎన్నికలు వేరుపడి పోయాయి. మన రాజ్యాంగం ప్రకారం ప్రధాన మంత్రి తన కేబినెట్‌ ద్వారా లోక్‌సభను రద్దు చేసి, మరల ఎన్నికలు నిర్వహిం చాలని రాష్ట్రపతిని కోరే హక్కు ఉంది. 1977 సంవత్సరంలోనే జనతాపార్టీ అధికారంలోకి రావడం, ఆ తర్వాత జరిగిన పరిణా మాల నేపథ్యంలో మూడేళ్లలోపుగానే అప్పటి ప్రధాన మంత్రి చంద్రశేఖర్‌ ప్రభుత్వం లోక్‌సభ రద్దు చేయగా, మరల మధ్యంతర ఎన్నికలు జరిగాయి. అదే విధంగా రాజకీయ పార్టీల బలాబలా లలో మార్పులు జరిగి అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ మెజార్టీ కోల్పోయే పక్షంలో మెజార్టీ ఉన్న మరో రాజకీయ పార్టీకి రాష్ట్ర పతి ఆహ్వానం పలుకుతారు.

ఆ పార్టీ కూడా బలాన్ని నిరూపించుకోలేక గందరగోళ పరిస్థితి ఏర్పడినప్పుడు కూడా రాష్ట్రపతి లోక్‌సభను రద్దు చేసి మరల ఎన్నికలు నిర్వహించ వచ్చు. ఈ ప్రకారం చూస్తే 1977లో జరిగిన ఆరు జనరల్‌ ఎన్నికలు, 1989లో జరిగిన 9 జనరల్‌ ఎన్నికలు, 1998లో జరిగిన 12వ జనరల్‌ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన పార్టీలు పూర్తికాలం పాలన చేయకుండానే రద్దయ్యాయి. కేంద్రంలో లోక్‌ సభను రద్దు చేసి మరల ఎన్నికలు నిర్వహించాలని ప్రధాన మంత్రి రాష్ట్రపతిని కోరే హక్కు ఉన్నట్టుగానే రాష్ట్రాలలో కూడా ముఖ్యమంత్రులు మధ్యంతరంగా అసెంబ్లీని రద్దు చేసి, మరల ఎన్నికలు నిర్వహించమని గవర్నర్‌కు సిఫార్సు చేసే అధికారం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లు కూడా గడవకుండానే నాటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావ్ఞపై ఆయన మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న నాదెళ్ల భాస్కరరావ్ఞ తిరుగుబాటు చేసి నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం, ఆ తర్వాత ఎన్టీరామారావ్ఞకు మద్దతుగా వచ్చిన ప్రజా ఉద్యమానికి తలవంచిన కేంద్ర ప్రభుత్వం నెల రోజుల వ్యవధిలోనే మరల ఎన్టీఆర్‌కు అధికారం అప్పగించడం అందరికీ గుర్తుండి ఉంటుంది.

రెండోసారి అధికారం చేపట్టిన నాటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావ్ఞ 1985లో అసెంబ్లీని రద్దుచేసి మధ్యంతర ఎన్నికలకు ఆహ్వానం పలికారు. ఇటువంటి పరిస్థితులు తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో కూడా తలెత్తాయి. రాజ్యాంగ సవరణలు జరిగి జమిలీగా ఎన్నికలు నిర్వహించే పక్షంలో మధ్యంతర ఎన్నికలకు అవకాశం ఉండద నిపిస్తోంది. రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ప్రభుత్వం సంక్షోభంలో పడితే గవర్నర్‌ సంప్రదింపుల ద్వారా ఏదో ఒకపార్టీ అధికారం చేపట్టే విధంగా చూస్తారు. ఒకవేళ లోక్‌సభలో సంక్షోభం ఏర్పడితే రాష్ట్రపతి సంప్రదింపుల ద్వారా ప్రభుత్వం కొనసాగే విధంగా చేస్తారు. ఇక అనివార్య పరిస్థితుల్లో మధ్యంతర ఎన్నికలు జరిగినా కొత్తగా అధికారంలోకి వచ్చే ప్రభుత్వం ఐదేళ్లు కాకుండా మిగిలిన కాలం వరకు మాత్రమే అధికారంలో ఉంటుంది. ఉదాహరణకు ఏదైన రాష్ట్రంలో లేదా కేంద్రంలో మూడేళ్ల తర్వాత సంక్షోభం ఏర్పడినా, లోక్‌సభ లేదా శాసనసభ రద్దయి ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే కొత్తగా వచ్చే ప్రభుత్వం మిగిలిన రెండేళ్ల వరకు మాత్రమే అధికారంలో ఉంటుంది.

ఈ విధానం వల్ల ఎన్నికల వ్యయం అటు ప్రభుత్వానికి, ఇటు పోటీ చేసే అభ్యర్థులకు రెట్టింపు అవ్ఞతుంది. ఇదే సమయంలో అధికారంలో ఉన్న శాసనసభ్యుడు లేదా పార్లమెంటు సభ్యుడు చనిపోతే సమీప ప్రత్యర్థి లేదా పోటీ చేసినవారిలో ఉన్నత విద్యావంతుడిని అధికారంలోకి వచ్చే విధంగా చట్టం సవరించాలనే ఆలోచన ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే నేరప్రవృత్తి బాగా విస్తరించిన ప్రస్తుత పరిస్థితుల్లో గెలిచిన అభ్యర్థి ప్రాణాలకు రక్షణ లేకుండాపోతుంది. జమిలి ఎన్నికల నేపథ్యంలో తలెత్తే మరో ముఖ్య ప్రశ్న రాజ్యాంగ సవరణ ద్వారా జమిలికి శ్రీకారం చుట్టినా దేశవ్యాప్తంగా పార్లమెంటుకు రాష్ట్రాలలోని శాసనభలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయడం సాధ్యమేనా? ఇటీవల లోక్‌సభతోపాటు అయిదురాష్ట్రాలకు ఎన్నికల నిర్వహణకు 45 రోజుల వ్యవధి పట్టింది.

అదే దేశవ్యాప్తంగా లోక్‌సభతోపాటు 29 రాష్ట్రాలకు ఏడు కేంద్రపాలిత ప్రాంతాలకు జమిలిగా ఎన్నిరోజులు సమయం పడుతుంది? ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని సమాకూర్చడం సాధ్యమయ్యేపనికాదు. ఒకవేళ ఉన్న సిబ్బందితోనే ఎన్నికలు నిర్వహించాలని ప్రయత్నించినా సాంకేతికంగా అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఒకవేళ రాజ్యాంగసవరణలు, నిర్వహణా పరమైన సమస్యలను ఎదుర్కొనే జమిలీగా ఎన్నికలు నిర్వహించ డం వల్ల ప్రజలకు కానీ, దేశానికి కానీ ప్రత్యక్షంగా ఒరిగే ప్రయోజనం ఏమిటో అర్థంకావడం లేదు. జమిలి వల్ల రాష్ట్రాలపై కేంద్రానికి గుత్తాధికారం వస్తుంది. ఇదే సమయంలో ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత కూడా తగ్గిపోయే అవకాశం ఉంది.

  • అన్నవరపు బ్రహ్మయ్య, సామాజిక విశ్లేషకుడు