కార్యకర్తలకు ఎన్నాళ్లీ కంచి గరుడ సేవ?

రాజకీయం ఒక వ్యాపార రంగంగా రూపుదాల్చింది. పెట్టుబడులు పెట్టడం, ఎన్నికల్లో గెలవడం, తిరిగి రాబట్టుకోవడం, మళ్లీ పెట్టుబడి ఇలా ఒక విషవలయంగా మారింది. అంగబలం, ఆర్థికబలం ఉన్నవారు మాత్రమే ఈ విషవలయంలో నెగ్గుకురాగలుతున్నారు. సామాన్యులెవరూ ఆ వైపు కన్నెత్తి చూసే ధైర్యం కూడా చేయలేకపోతున్నారు. ప్రజలతో సంబంధం లేనివారు నేరుగా మంత్రులైపోతున్నారు. వార్డుమెంబర్‌గా కూడా గెలవలేనివారు రాజ్యసభ సభ్యులుగా ఎదిగి ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పేస్థాయికి ఎదుగుతున్నారు.. ఇదేదో కొత్త విషయం కాదు. అందరికి తెలిసిందే. కానీ సంప్రదాయం రానురాను శృతిమించిపోతున్నది. ప్రత్యర్థిపార్టీలో ఉండి విమర్శలు కురిపించి తెల్లవారే సరికి పార్టీ మార్చి అధికారం అందలం ఎక్కుతున్నారు. ఈ శిక్షణలు, సిద్ధాంతాలు, మేనిఫేస్టోలు ఎందుకు అనే అనుమానాలు రాకతప్పదు. ఒకవేళ పార్టీ సిద్ధాంతాలు, క్రమశిక్షణ, ప్రజాసేవల గురించి శిక్షణ ఇవ్వాల్సి వస్తే ముందుగా పదవ్ఞలు వెలగబెడుతూ పార్టీ పరువ్ఞను, ప్రతిష్టను బజారులో పెడుతున్న పెద్దలకే ఇవ్వాలి. పార్టీలోనే ఉంటూ గోతులు తవ్వే నాయకులకే ఇవ్వాలి. అవకాశం రాకపోతే కప్పదాట్లకు సిద్ధపడే నేతలకు ఇవ్వాలి.

party meeting
party meeting

‘కూడు, గుడ్డ అడక్కపోతే బిడ్డలను సాకినట్టు సాకుతా. అన్నట్లుగా ఉంది కార్యకర్తల పట్ల రాజకీయ పార్టీల వైఖరి. ధర్నాలంటారు, రాస్తారోకోలంటారు, పార్టీ జిల్లాస్థాయి సమావేశాలంటారు, కార్యకర్తల సమావేశాలంటారు, రాష్ట్రస్థాయి విస్తృత సమావేశాలంటారు, శిక్షణ తరగతులంటారు, పార్టీ విధానాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలంటారు. బహిరంగ సభలకు జనాన్ని తరలించుకురావాలంటారు ఇలా ఒక్కటేమిటీ ఏడాది పొడుగునా ఏదో ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తూనే ఉంటారు. పైకి ఏమనలేకపోయినా జీతభత్యంలేని ఈ కంచిగరుడ సేవ ఎన్నాళ్లు అనుకునేవారి సంఖ్య రానురాను ఎక్కువైపోతున్నది.ముఖ్యంగా దిగువ శ్రేణి నాయకులకు ఆర్థికభారం ఎలా భరించాలన్నది సమస్యగా పరిణమిస్తున్నది. అయినా ఏనాటికైనా సేవలను గుర్తించలేకపోతారా? ఏదో పదవి రాకుండాపోతుందా?అనే ఆశతో కొందరు ఈ రాజకీయ యజ్ఞంలో పోరాటం చేస్తూనే ఉన్నారు. గతంలో ఇలా రాజకీయ కార్యకర్త లుగా జీవనం ప్రారంభించిన వారెందరో సర్పంచ్‌లుగా, సమితి అధ్యక్షులుగా, ఎమ్మెల్యేలుగా, పార్లమెంటు సభ్యులుగా, మంత్రు లుగా, ముఖ్యమంత్రులుగా, చివరకు కేంద్ర మంత్రులుగా ఎదిగిన వారెందరో ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ విడిపోయి ఇందిరా కాంగ్రెస్‌ ఏర్పడినప్పుడు నాయకులు కరవై కార్యకర్తలే నాయకత్వం వహిం చి పెద్దపెద్ద పదవ్ఞలకు ఎదిగారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో ఎంతోమంది నూతన నాయకులు పుట్టుకొచ్చారు. కార్యకర్తలుగా ఉన్నవారు నాయకులుగా ఎదిగారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆనాడు వెనుకబడిన తరగతులకు ప్రాముఖ్యత ఇచ్చి ఆ వర్గాల నుండి ఎందరినో నాయకులుగా తీర్చిదిద్దింది. ఇటీవల జరిగిన తెలంగాణా ఉద్యమంలో పాల్గొన్న ఎందరో కార్యకర్తలు నేడు మంత్రులుగా, శాసనసభ్యులుగా, పార్లమెంటు సభ్యులుగా ఎదిగారు. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు ప్రకటించారు. తెలంగాణలో పురపాలిక ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్‌లో సర్పంచ్‌లు, వార్డుమెంబర్లు, మండల అధ్యక్షులు, జెడ్‌పిటిసి, ఎంపిటిసిలాంటి పదవ్ఞలకు ఎన్నికలు జరగబోతున్న సందర్భంలోకార్యకర్తల నుంచి పెద్దఎత్తున అభ్యర్థనలు వస్తున్నాయి. కానీ వాటిని పట్టించుకునే పరిస్థితులు కన్పించడం లేదు. యువతకు ప్రాధ్యానం అంటే కుమారులనో, అల్లుళ్లలనో ముందుపెడుతున్నారు.మహిళలంటే కుమార్తెలనో ,భార్యలపేర్లో చెపుతున్నారు.రాజకీయాల్లో వారసులు ఎక్కువైపో తున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో సామాన్య కార్యకర్తలకు పదవ్ఞలు దక్కెదెప్పుడు?అందరికి పదవ్ఞలు ఇవ్వడం అనేది సాధ్యమయ్యే పనికాదనేది వాస్తవం. పరిస్థితులు మారిపోయాయి. ప్రజాసేవ, ప్రజాభిమానం వంటి కొలమానాలతో పదవ్ఞలకు ఎంపిక చేసే రోజులకు కాలం చెల్లిపోయింది. ఆర్థికస్తోమత ఉందా? ఖర్చు పెట్టగల శక్తి ఉందా? కులబలం ఏమిటి? ఏ నాయకుడికి తోకగా, బాకాగా,బంటుగా వ్యవహరిస్తున్నారనేదే చూస్తున్నారు తప్ప ప్రజలకు అంకితభావంతో పనిచేసేవారిని పట్టించుకునే రోజులు పోయాయి. రాజకీయం ఒక వ్యాపార రంగంగా రూపుదాల్చింది. పెట్టుబడులు పెట్టడం, ఎన్నికల్లో గెలవడం,తిరిగి రాబట్టుకోవడం, మళ్లీ పెట్టుబడి ఇలా ఒక విషవలయంగా మారింది. అంగబలం, ఆర్థికబలం ఉన్నవారు మాత్రమే ఈ విషవలయంలో నెగ్గుకు రాగలుతున్నారు. సామాన్యు లెవరూ ఆ వైపు కన్నెత్తి చూసే ధైర్యం కూడా చేయలేకపోతున్నారు.ప్రజలతో సంబంధం లేనివారు నేరుగా మంత్రులైపోతున్నారు. వార్డుమెంబర్‌గా కూడా గెలవలేని వారు రాజ్యసభ సభ్యులుగా ఎదిగి ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పే స్థాయికి ఎదుగుతున్నారు. ఇదేదో కొత్త విషయం కాదు. అందరికి తెలిసిందే. కానీ సంప్రదాయం రానురాను శృతిమించి పోతున్నది. ప్రత్యర్థిపార్టీలో ఉండి విమర్శలు కురిపించి తెల్లవారే సరికి పార్టీ మార్చి అధికారం అందలం ఎక్కుతున్నారు. ఈ శిక్షణ లు, సిద్ధాంతాలు, మేనిఫేస్టో లు ఎందుకు అనే అనుమానాలు రాకతప్పదు. ఒకవేళ పార్టీ సిద్ధాంతాలు, క్రమశిక్షణ, ప్రజాసేవల గురించి శిక్షణ ఇవ్వాల్సి వస్తే ముందుగా పదవ్ఞలు వెలగబెడుతూ పార్టీ పరువ్ఞను,ప్రతిష్టను బజారులో పెడుతున్న పెద్దలకే ఇవ్వాలి. పార్టీలోనే ఉంటూ గోతులు తవ్వే నాయకులకే ఇవ్వాలి. అవకాశం రాకపోతే కప్పదాట్లకు సిద్ధపడే నేతలకు ఇవ్వాలి. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఈసారి కొత్తగా ధృవీకరణ పత్రాల సంప్రదాయాన్ని ప్రవేశపెట్టింది. తమ పార్టీ టిక్కెట్టుపై పోటీచేసి గెలిచిన అభ్యర్థు లు పార్టీమారబోమని అఫిడవిట్‌ ఇవ్వాలని ఆ పార్టీ అధ్యక్షుడు ప్రకటిం చారు. ఆ మేరకు అఫిడవిట్‌ తీసుకుంటున్నారు. ఈ అఫిడవిట్‌తో ఈ కప్పదాట్లను ఆపగలుగుతారా?ఇలాంటి ధృవీక రణ పత్రాలు, పసుపుబియ్యం ప్రమాణాలు, మరెన్ని హెచ్చరికలు చేసినా అవన్నీ నిష్ప్రయోజనమే. అధికారం కోసం ఆరాటపడే ప్రతినాయకుడి పరిస్థితి ఇదే. సభ్యత్వకార్యక్రమం అంటూ కార్య కర్తలతో అన్ని పార్టీలు చేస్తున్నాయి.వాస్తవంగా ఎంతమంది ప్రజలు పార్టీ సిద్ధాంతాలవైపు మొగ్గుచూపి అర్థం చేసుకొని మనస్ఫూర్తిగా విశ్వసించి ఆకర్షితులై సభ్యత్వం తీసుకుంటున్నారో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుంటే అర్థమవ్ఞతుంది. సభ్యత్వ రుసుం ఎవరు కడుతున్నారు?నిజంగా పార్టీలో చేరుతున్న వారే కడుతు న్నారా?వారి పేర్లపై మరెవరన్నా కడుతున్నారా?ఇవన్నీ క్షేత్రస్థాయి లో పరిశీలించగలిగితే ఎన్నో వాస్తవాలు తెలుస్తాయి. ఈ పార్టీ, ఆపార్టీ అనికాదు. అన్ని పార్టీల్లో ఇదే సంస్కృతి పెరిగిపోతున్నది. అధికారంలో ఉన్న పార్టీలో కూడా అంతర్గతంగా జరుగుతున్నా అధికారానికి భయపడి, జంకి, పెదవి విప్పలేకపోవచ్చు. ఇక కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి అయితేచెప్పక్కర్లేదు. గాంధీభవన్‌లో జరిగిన సమావేశాల్లో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి అది సంకేతమని సర్దిచెప్పుకునేవారు. వాస్తవా నికి క్రమశిక్షణ కాంగ్రెస్‌ పార్టీలో నేతిబీరకాయలోని నీతిచందంగా మారిపోయింది. ఏ పార్టీలోనైనా పార్టీని అప్రతిష్టపాలు చేసి ప్రజల ముందు చులకన చేసే చిన్న సంఘర్షణ అయినా సీరియ స్‌గా తీసుకొని నిర్దాక్షణ్యం గా అణచివేసే చర్యలు చేపట్టాలి. అప్పుడే అలాంటి సంఘటనలు పునరావృతం అయ్యే అవకాశా లుండవ్ఞ. అంతేకానీ మనవాడే కదా అని సర్దుకుపోతే మళ్లీ మళ్లీ తప్పవ్ఞ. పార్టీ కూడా ప్రజల్లో చులకన అవ్ఞతుంది.ఇంటి దీపమని ముద్దు పెట్టుకుంటే మూతి కాలక తప్పదనే విషయం పెద్దలు విస్మరించరాదు. క్రమశిక్షణ విషయంలో విఫలమై ప్రజలకు దూర మైన పార్టీలు ఎన్నో ఉన్నాయి.ప్రజలు ఎంతో చైతన్యవంతుల య్యారు. ప్రతి ఒక్క నాయకుని ప్రతి అడుగు, ప్రవర్తన, చర్యలు ప్రజలు వెయ్యి కళ్లతో గమనిస్తున్నారు. ముఖ్యంగా కష్టం కలిగిన ప్పుడు పార్టీని వదిలివెళ్లి ఇష్టం వచ్చినప్పుడు తిరిగి రావచ్చనే దుస్సంప్రదాయానికి అడ్డుకట్ట వేయాలి. అధికారంలో ఉన్నప్పుడు పదవ్ఞలతోపాటు సకల సౌకర్యాలు అనుభవించి పార్టీ అధికారం కోల్పోగానే అంతవరకు తాము విమర్శించిన, వ్యతిరేకించిన పార్టీలోకి దూకేది సాధారణంగా కొందరు నాయకులే కార్యకర్తలు కాదు. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కోల్పోయిన తర్వాత ఎందరు నాయకులు కప్పదాట్లకుపాల్పడ్డారో చెప్పక్కర్లేదు. కార్యకర్తలుగా ప్రజలతో వారి సమస్యలతో మమేకమై ఎదిగిన నాయకులు ఇలాంటి కప్పదాట్లకు పాల్పడటానికి వెనుకాముందు ఆలోచిస్తారు. నియోరిచ్‌ కుబేరులు మాత్రం ఆలోచించే అవకాశా లుండవ్ఞ. ఈ పార్టీలోకి వచ్చినప్పుడు కూడా అధికారాన్ని అడ్డంపెట్టుకొని తమ ఆస్తులను కాపాడుకోవడం కోసమో.తమ వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించుకునే ఉద్దేశ్యంతోనే అధికార పార్టీలోకి అడుగుపెడతారు. అలాంటివారు పార్టీ అధికారం పోగానే క్షణం కూడా ఆలోచించరు. పార్టీ గురించి కానీ, ఆ నాయకుల గురించి కానీ పట్టించుకోకుండా తమ వ్యాపార సామ్రాజ్యాలను కాపాడుకునేందుకు గట్టుదాటుతారు. పేర్లు రాసి వారిని ఇబ్బంది పెట్టడం ఎందుకు కానీ వారెవరో వారి చరిత్ర లేమిటో ప్రజలకు కూడా తెలుసు.అంతెందుకు చంద్రబాబునాడు దేదీప్యమానంగా వెలిగినప్పుడు చక్రం తిప్పిన నేతలు ఇప్పుడు ఆయన రోడ్ల మీద ఉంటే వారు ఎక్కడున్నారో పరిశీలిస్తే అర్థమవ్ఞతుంది. అందుకే అన్ని పార్టీల అధిష్టాన వర్గాలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందుకే పార్టీని నమ్ముకొని కార్య కర్తలుగా ఏళ్లతరబడి జెండామోస్తూ పార్టీకి,ప్రజలకు సేవ చేస్తున్న కార్యకర్తలను విస్మరించడం ఏ కోణంలో చూసినా ధర్మంకాదు. కనీసం ఈ స్థానిక సంస్థల్లో జరుగుతున్న ఎన్నికల్లో అలాంటి వారిలో కొందరికైనా అన్ని పార్టీలు అవకాశాలు కల్పించాలి.

  • దామెర్ల సాయిబాబ

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/