ఉరుముతున్న కరువు

కారణాలు ఏమిటో, కారకులు ఎవరో కానీ దేశంలో అత్యంత జనాభా జీవనాధారంగా ఉన్న వ్యవసాయరంగం పరిస్థితి అంతకంత కు సంక్షోభంలో కూరుకుపోతున్నది. తోటి మనిషి చేస్తున్న ద్రోహం పాలకుల నిర్వాకంతో వ్యవసాయరంగం పరి స్థితి ఆందోళనకరంగా మారుతున్నది. వ్యవసాయరంగానికి వేలాది కోట్ల రూపాయలు కేటాయిస్తున్నా సబ్సిడీ రూపంలో రైతులకు లెక్కకు మించి చేయూతనిస్తున్నా పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. ఈ సబ్సి డీలు, నాయకుల హామీలు ఏవీ వారిని ఆత్మహత్యల నుంచి కాపాడలేకపోతున్నాయి. సాగునీరు సంగతి దేవ్ఞడె రుగు. గుక్కెడు మంచినీటికి కూడా అల్లాడిపోతున్నారు. భూగర్భజలాలు అడుగంటిపోవడంతో వేలాది బోరుబావులు నీరులేక నోళ్లెళ్లబెట్టాయి.ఎందుకోఏమోకాని ప్రకృతి కూడా రైతులపై పగబట్టి వ్యవహరిస్తున్నదేమోననిపిస్తు న్నది.వరుస కరువులతో రైతులను అల్లాడిస్తున్నది.

తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది.మొన్న సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేంద్ర2016-17సంవత్సరానికి బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన సందర్భంగా ప్రసంగిస్తూ గతరెండేళ్లలో వర్షపా తం బాగాతగ్గిపోయిందని వెల్లడించారు.నైరుతి రుతుపవ నాల ప్రభావంతో కురిసేవర్షాలు 2014లో 30.2 శాతం 2015లో14.3శాతానికి తగ్గిపోయింది.ఈశాన్య రుతుప వనాలతో వచ్చే వర్షాలు 2014లో 58 శాతం తగ్గగా ఈ ఏడాది ఏకంగా 79 శాతం వర్షపాతం తగ్గిపోయింది. బహుశా రాష్ట్ర చరిత్రలో ఈస్థాయిలో వర్షపాతం తగ్గిన సందర్భం లేకపోవచ్చు. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులు ఇంతటి పరిస్థితిని గతంలో చూడలేదని వాపోతున్నారు.మార్చి రెండోవారంలోనే ఎండల తీవ్రత, మంచినీటి కొరత, ఈస్థాయిలో ఉంటే మే చివరి రోహిణి కార్తె నాటికి పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు.గత పది,పన్నెండేళ్లుగా తెలంగాణరాష్ట్రం లో ఆహార ధాన్యాల ఉత్పత్తి, విస్తీర్ణం కూడా క్రమేణి తగ్గిపోతున్నది. 2013-14లో సాగునీటి వసతులు ఉన్న విస్తీర్ణం 31.54 లక్షల హెక్టార్లు కాగా, 2014-15లో 25.29లక్షల హెక్టార్లకు తగ్గింది. సాగైన విస్తీర్ణం కూడా 22.8 లక్షల నుంచి 17.26 లక్షల హెక్టార్లకు తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 13.13 పడిపోయింది. ఇక 2001-02లో మొత్తం సాగువిస్తీర్ణంలో ఆహారధాన్యాల పంటల వాటా 71 శాతం కాగా 2014-15 నాటికి 58 శాతానికి పడిపోయింది. 2014-15లో నలభైఐదున్నర లక్షల టన్నుల ధాన్యం దిగుబడి 2015-16లో ముప్పై లక్షల టన్నులకు పడిపోయింది. చిరుధాన్యాల పరిస్థితి చెప్పాల్సిన పనిలేదు.ఈవిషయాలు దృష్టిలో ఉంచుకొని వ్యవసాయరంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా నిధులుమాత్రం అంతంత మాత్రంగానే కేటాయించారు.ఒక్క తెలంగాణాలోనే కాదు దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా వ్యవసాయరంగం తీవ్రసంక్షోభంలో ఉంది. ఎల్‌నినో కారణంగా వర్షపాతం తగ్గిపోతున్నదని వాతావరణ పరిశోధన నిపుణులు అభి ప్రాయపడుతున్నారు. పసిఫిక్‌ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రత బాగా పెరిగితే ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు సంభవిస్తాయి. ఫలితంగా అనేక దేశాల్లో రుతుపవనాలు గతితప్పివర్షపాతం గణనీయంగా పడిపోతుందని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. దీనినే ఎల్‌నినో అంటారు. ప్రతి నాలుగు నుంచి పన్నెండేళ్లకు ఒకసారి ఎల్‌నినో ప్రపంచం మీద పరుగెత్తుతు ప్రజాజీవనాన్ని అల్లకల్లోలం చేస్తుందని ముఖ్యంగా ఆఫ్రికా,బ్రెజిల్‌, ఆస్ట్రే లియా, ఆగ్నేయాసియాతో పాటు అమెరికాలోని కొన్నిప్రాం తాల్లో పంటలపై దీని ప్రభావం ఇప్పటికే చూపినట్లు చెప్తున్నారు. భారతదేశంలో గత వందేళ్లలో సంభవించిన కరువ్ఞల్లో సగానికిపైగా ఎల్‌నినోప్రభావంతోనే వచ్చాయి.

దేశంలో నాలుగోవంతు భూభాగం ఎడారిగా మారి పోతుండటం ఆందోళన కలిగించే అంశం. 2009లో దే శంలో సాధారణ స్థాయికన్నా 23శాతం తక్కువగా వర్షం నమోదైంది. దక్షిణాదిన ఏడు శాతం, వాయువ్యంలో 36 శాతం,మధ్యభారతదేశంలో 19శాతం తక్కువగా వర్షాలు పడినట్లు నమోదైంది. ఫలితంగా వరి, తృణధాన్యాలు, ప్రధానంగా పండించే హర్యానా, పంజాబ్‌, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఏదిఏమైనా వాతావరణంలో వచ్చే మార్పులను ఏ పేరుతో పిలిచినా అవి వ్యవసాయరంగంపై తీవ్రప్రభావం చూపే పరిస్థితు లు ఏర్పడుతున్నాయి. దీనిని అధిగమించేందుకు పాలకు లు నడుం కట్టాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతం గుక్కెడు నీటి కోసం అల్లాడుతున్న ప్రజలకు తాత్కాలిక చర్యలు చేపట్టి మంచినీటిని అందించాలి. ముఖ్యంగా గ్రామీణప్రాంతంలో కిలోమీటర్ల కొద్దీ బిందెడు నీటికోసం పోవాల్సిన పరిస్థితుల నుంచి గట్టెక్కించాలి.ఈ తాత్కాలి కచర్యలతో రాబోయే  రెండు నెలల కాలంలో మంచినీటి సమస్యను పరిష్కరించే వైపు అడుగులు వేయాలి. ఇక ఈ కరువు రక్కసిని పారద్రోలేందుకు,ఎల్‌నినో  ప్రభావంతో వర్షపాతం తగ్గినా అధిగమించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి పథకాలను యుద్ధప్రాతిపది కపై పూర్తి చేయాల్సి ఉంటుంది. మిషన్‌ కాకతీయ పథ కాన్ని నిర్ణీతకాలంలో పూర్తిచేసి భూగర్భజలాల మట్టాన్ని పెంచేందుకు కృషి జరగాలి. ఏదిఏమైనా ఈ కరువు రక్కసిని శాశ్వతంగా రాష్ట్రం నుంచి పారద్రోలాలంటే ఏటా నిరుపయోగంగా సముద్రుడి పాలవుతున్న వేలాది టిఎంసిలకు అడ్డుకట్ట వేసి బీడుభూములకు మళ్లించిన నాడే  ఈ సమస్యకు పరిష్కారం.