అధికార వికేంద్రీకరణతోనే సుపరిపాలన

AP
AP

ఆంధ్రప్రదేశ్‌ను మొత్తం 35 జిల్లాలుగా విభజిస్తేనే పరిపాలన వికేంద్రీకరణ జరిగి సుపరిపాలన అందివ్వగలం. చిన్నజిల్లాలు, చిన్నరాష్ట్రాలు అనేవాంఛ ప్రజల్లో ప్రబలుతోంది. దీనిని పసిగట్టిన ముఖ్య మంత్రి జగన్‌ ఇంకా కొన్ని కొత్త జిల్లాలను ఏర్పరుస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇవ్వడమే కాకుండా మేనిఫెస్టోలో కూడా పొందుపరిచారు. దానివలన ఇప్పుడు ప్రజలకు తీవ్రఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. తెలంగాణ ప్రభుత్వం పరిపాలనపరంగా పెద్ద జిల్లాలను చిన్న జిల్లాలుగా చేసి పరిపాలన సాగిస్తున్న నేపథ్యంలో నవ్యాంధ్రప్రదేశ్‌లోనూ కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై అప్పట్లో తెరపైకి వచ్చింది. దాదాపు ఏర్పాటు ఖాయమనే ప్రచారం జోరుగాసాగింది. కొత్త జిల్లాల ఏర్పాటును తెరపైకి తీసుకొస్తే మాత్రం ప్రకాశంజిల్లా రెండు జిల్లాలుగా అయ్యే అవకాశాలు కన్పించాయి.
అ ధికారంలోకి వస్తే ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తానని ఇప్పటికే జగన్‌ ప్రకటించారు. దానికి అనుగుణంగానే కమిటీలను కూడా వేశారు.

జిల్లాల సంఖ్య పెరగడం అన్ని రకాలుగా ఎంతో ఉపయోగం. అంతేకాకుండా పరిపాలనా సౌలభ్యం కలుగుతుంది. జిల్లాల సంఖ్య పెరిగే కొద్దీ వాటి సైజు తగ్గుతుంది. కనుక జిల్లా అభివృద్ధి, రథానికి సారధుల్లాంటి ఐ.ఎ.ఎస్‌, ఐ.పి.ఎస్‌ ఆఫీసర్లు జనానికి దగ్గరవ్ఞతారు. పోలీసు బలగాలు, ప్రభుత్వ సహాయకులు అందుబాటులో ఉంటాయి. కావ్ఞన శాంతిభద్రలు అదుపు చేయడం కూడా చాలా సులభం. కొన్ని ప్రత్యేకమైన సంస్థలు కొత్తగా ఏర్పడతాయి. జిల్లా కేంద్రానికి మారుమూల గ్రామాల ప్రజలు ప్రయాణం చేయడానికి దూరం, భారం తగ్గుతాయి. అధికార వికేంద్రీకరణ జరిగి మరిన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. విపరీతమయిన జనాభారంతో ఇబ్బంది పడుతుంటే పెద్ద నగరాల నుండి జనం, ఉద్యోగులు చెదిరిపోయినందువల్ల ఆయా నగరాలు కూడా ఊరట చెందుతాయి. ప్రతి జిల్లాలోనూ భారీ పరిశ్రమలు ఉండాలనే కేంద్ర ప్రభుత్వ ఆశయం మేరకు జిల్లాల సంఖ్యతో పాటు పరిశ్రమల సంఖ్య పెరుగుతుంది.

సామాన్య ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. పరిశ్రమలన్నీ ఒకే చోట కేంద్రీకృతం కాకుండా అన్నీ ప్రాంతాలు సమంగా అభివృద్ధి చెందుతాయి. కొత్త జిల్లాలో ఉండే చిన్న పట్టణాలు మౌలికంగా అభివృద్ధి సాధిస్తాయి. వాటిని ఆనుకొని ఉండే గ్రామాలు అభివృద్ధి దిశగా ప్రయాణం సాగిస్తాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఒక్కొక్క పార్లమెంటు సభ్యులు 15.79 లక్షల ప్రజలకు 6549 చ.కి.మీ భూభాగానికి ప్రతినిధ్యం వహిస్తుంటే ఒక్కొక్క జిల్లా కలెక్టర్‌ 28.83 లక్షల జనానికి, 11,959 చ.కి.మీ భూభాగానికి సేవలందిస్తున్నారు. ఇది జాతీయ సగటు కంటే 12 లక్షల జనాభా, 5398 చ.కి.మీ భూభాగం ఎక్కువ. అంటే శ్రీకాకుళం సైజున్న మరో 22 జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేయాలి. రాష్ట్రం లోని ఆరు జోనుల్లో జోనల్‌ కార్యాలయాలు ఏర్పాటు చేయాలి. అంటే ఆంధ్రప్రదేశ్‌ను మొత్తం 35 జిల్లాలుగా విభజిస్తేనే పరిపాలన వికేంద్రీకరణ జరిగి సుపరిపాలన అందివ్వగలం. చిన్న జిల్లాలు, చిన్న రాష్ట్రాలు అనే వాంఛ ప్రజల్లో ప్రబలుతోంది.

దీనిని పసిగట్టిన ముఖ్యమంత్రి జగన్‌ ఇంకా కొన్ని కొత్త జిల్లాలను ఏర్పరుస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇవ్వడమే కాకుండా మేనిఫెస్టోలో కూడా పొందుపరిచారు. దానివలన ఇప్పుడు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. తెలంగాణ ప్రభుత్వం పరిపాలనపరంగా పెద్ద జిల్లాలను చిన్న జిల్లాలుగా చేసి పరిపాలన సాగిస్తున్న నేపథ్యంలో నవ్యాంధ్రప్రదేశ్‌ లోనూ కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై అప్పట్లో తెరపైకి వచ్చింది. దాదాపు ఏర్పాటు ఖాయం అనే ప్రచారం జోరుగా సాగింది. కొత్త జిల్లాల ఏర్పాటును తెరపైకి తీసుకొస్తే మాత్రం ప్రకాశం జిల్లా రెండు జిల్లాలుగా అయ్యే అవకాశాలు కనిపించాయి. ప్రకాశం జిల్లాలోని మార్కాపురం దాని పరిసర ప్రాంతాలను కలిపి కొత్త జిల్లాగా ప్రకటించే అవకాశముండేది. అప్పట్లో జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైన మార్కాపురం డివిజన్‌ను కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలన్న అంశం తెరపైకి వచ్చింది. దాని కోసం విపక్షాలు, ప్రజాసంఘాలు, వామపక్షాలు చాలా రోజుల పాటు నిరాహారదీక్షలు చేసాయి. కానీ ఎందుచేతనో చంద్రబాబు జిల్లాల విభజనను అర్థాంతరంగా ఆపేశారు.

ఇదిలా ఉండగా ప్రకాశం జిల్లాను రెండుగా విభజించి మార్కాపురం జిల్లాను చేస్తే మాత్రం పరిపాలనపరంగనూ, అభివృద్దిపరంగనూ మరింత వేగవంతం చెందే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రకాశంజిల్లాలోని రెవెన్యూ డివిజన్లు అయిన ఒంగోలు, కందుకూరు జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉండడం, కేవలం మార్కాపురం మాత్రమే దూరంగా ఉండడం, అదీకాక మార్కాపురం పరిధిలోని పుల్లల చెరువ్ఞ, ఎర్రగొండ పాలెం, దోర్నాల, త్రిపురాంతకం, కొమరోలు గిద్దలూరు, అర్ధవీడు మొదలైన ప్రాంతాల ప్రజలకు జిల్లా కేంద్రం సుదూర తీరంలో ఉండడం వల్ల వారు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నారు. ఇవి అన్నీ బాగా వెనుకబడి ఉండటం వల్ల ప్రస్తుతం జిల్లా అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే అన్న చందంగా తయారైంది. ప్రధానంగా జిల్లాకు తలమానికంగా ఉన్న వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం మూడు అడుగులు ముందు ముప్ఫై అడుగుల వెనక్కి అన్నచందంగా తయారైంది. అదేవిధంగా దొనకొండ పారిశ్రామిక హాబ్‌, కనిగిరిలో నిమ్జ్‌ జిల్లాకు కొత్త పరిశ్రమలు కాని ఒక్కటి కూడా రాలేదు.

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జిల్లాకు సరైన ప్రాతినిధ్యం లభించలేదు. జిల్లాకు సంబంధించి మాత్రం ఆర్భాటపు ప్రచారాలు చేసిందే తప్ప ఏ ఒక్క నూతన ప్రాజెక్టుకు శంకుస్థాపనలు చేసిన పరిస్థితి లేదు. దీంతో కొత్త జిల్లాలు ఏర్పాటు అయితే అక్కడి నాయకులు అభివృద్ధిపై దృష్టిసారించే అవకాశాలున్నాయన్న వాదన కూడా ఆయా రాజకీయ పార్టీల నాయకుల నుండి వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే మాత్రం ప్రకాశంజిల్లా భౌగోళిక స్వరూపమే మారిపోనుంది. ప్రతి పార్లమెంట్‌ కేంద్రం జిల్లా అయితే ప్రకాశంజిల్లాకు సంబంధించి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉన్నందున ఈ ప్రాంతవాసుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చే ప్రమాద ముంది. ప్రకాశంజిల్లాలోని ఆయా ప్రాంతాలు బాపట్ల, ఒంగోలు, నెల్లూరు పార్లమెంటు స్థానాల పరిధిలో ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలోని చీరాల, పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు అసెంబ్లీలు బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. బాపట్ల జిల్లా అయితే ఈ నాలుగు సెగ్మెంట్లు బాపట్లలో కలుస్తాయి. దీంతో ఒంగోలుకు అతి సమీపంగా ఉండి, జిల్లాలో మమేకమైన ఈ ప్రాంత ప్రజలకు తీవ్ర నష్టం కలుగుతుంది. అలాగే కందుకూరుజిల్లా నుండి విడిపోయి నెల్లూరు జిల్లాలో కలుస్తుంది. జిల్లాలో భాగమైన కందుకూరు అసెంబ్లీ సెగ్మెంట్‌ కూడా నెల్లూరుజిల్లాలో కలుస్తుంది.

ఆ సెగ్మెంట్‌లోని ప్రజలలో కూడా ఈ ప్రతిపాదన పట్ల అసంతృప్తి వ్యక్తమవ్ఞతోంది. ప్రత్యే కించి జిల్లాలోని పశ్చిమ ప్రాంత అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉన్న ప్రజలు దీన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. పశ్చిమ ప్రాంతం అంతా ఒంగోలు లోక్‌సభ పరిధిలోఉంది. ప్రధానంగా మార్కాపురం డివిజన్‌లోని మూడు నియోజకవర్గాల ప్రజలు ఒంగోలు సుదూరమన్న భావనలో ఉన్నారు. మార్కాపురం నైసర్గికంగా పార్లమెంటు స్థానం కావలసినంత అవకాశం ఉండి ననూ రాజకీయంగా ఎంతో నష్టం ఏర్పడి పార్లమెంటు స్థానం కాలేకపోయింది. అది అప్పట్లోనే తీవ్ర చర్చనీయాంశమైంది. అసలు మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ ఎంతో కాలంగా ఉంది. ప్రకాశంజిల్లా ఏర్పడే సమయం లో కూడా అన్నీ ప్రాంతాలకు మధ్యలో పొదిలిని జిల్లా కేంద్రం చేయాలని అప్పట్లో ఆ ప్రాంతవాసులు కోరుకున్నారు. అయితే రైలు, రోడ్డు, రవాణా సౌకర్యాలు, తీరప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకొని ఒంగోలును జిల్లాకేంద్రంగా చేశారు.

ప్రస్తుతం పశ్చిమ ప్రాంతంలో రోడ్డు, రైలు, మార్గాలు బాగా అభివృద్ధి చెందాయి. వెలిగొండలాంటి నీటి పథకానికి శ్రీకారం పలికారు. కేవలం 1500 కోట్లు కేటాయిస్తే వెలుగొండ పూర్తవ్ఞతుంది. అప్పుడు ఈప్రాంతం అంతా సస్యశ్యామలమవ్ఞతుంది. భవిష్యత్తులో తాగునీరు వస్తే ఆ వైపు అభివృద్ధికి మార్గాలు కనిపిస్తాయి. దీంతో సుదూరంగా ఉన్న నల్లమల అటవీ ప్రాంత మండలాలను దృష్టిలో ఉంచుకొని మార్కాపురం కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ ఆ ప్రాంతవాసులలో వ్యక్తమవ్ఞతోంది. మార్కాపురం నియోజకవర్గం జనాభా 273900, గిద్దలూరు నియోజకవర్గం జనాభా 297659, ఎర్రగొండపాలెం నియోజకవర్గం జనాభా 266418, దర్శి నియోజకవర్గం జనాభా 280834 ఈ నాలుగు నియోజకవర్గాల మొత్తం జనాభా దాదాపు పన్నెండు లక్షలు ఉం టుంది. అలాగే దర్శి నియోజకవర్గం కిందికి వచ్చే దొనకొండలో బ్రిటిష్‌వారు ఏర్పాటు చేసిన విమానాశ్రయం అందుబాటులో ఉంది.

అలాగే దొనకొండలో దాదాపు యాభైవేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. పాలకులు కొంచెం శ్రద్ధ వహిస్తే పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి సాధించవచ్చు. దొర్నాల ఆనుకొని అనేక చెంచు గూడేలు నల్లమల అడవ్ఞలలో అటు గిద్దలూరు నుండి పుల్లల చెరువ్ఞ వరకు నివసిస్తున్నారు. వారందరికీ అను కూలంగా ఉంటుంది. ప్రజలు మాత్రం జగన్‌ నాయకత్వం పట్ల అచంచల విశ్వాసాన్ని కనబరచి పశ్చిమ ప్రకాశంలోని గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలు జగన్‌కు అండగా నలిచి మూడు స్థానాలను గెలిపించారు. కావ్ఞన జగన్‌ ప్రభుత్వం కూడా అనవసరమైన వివాదాలకు తావ్ఞ ఇవ్వకుండా పశ్చిమ ప్రకాశం చిరకాల వాంఛ అయిన మార్కాపురం జిల్లాను ఏర్పరిచి వారి మనసుల్లో సుస్థిరస్థానం ఏర్పరుచుకోవాలి.

  • బి.వెంకట శైలజ