అతివేగం అనర్థదాయకం

Resizer
Resizer

ఆధునాతన సాంకేతిక పరిజ్ఞా నంతో రోడ్లను నిర్మిస్తున్నప్ప టికీ అంతే స్థాయిలో సాంకేతికం గా మోటారు వాహనాల యంత్రా లు, సిసికెమెరాలులు పెంచుకొని భద్రత సౌకర్యాలు కలిపిస్తున్నట్లు కంపెనీలు చెప్తున్నప్పటికీ అంత కంతకు రహదారులపై ప్రమాద ఘంటికలు పేట్రేగి రోడ్లపై వాహ నాలు నడిపే మనుషులు సుఖమయ ప్రయాణం చేయలేక కష్టాలపాలవ్ఞతున్నారు.రోడ్డురవాణా వ్యవస్థీకృతలోపమో,మాన వ తప్పిదమో,విధివైపరీత్య శాపమో రోడ్డు ప్రమాదాలు నానా టికీ పెరిగిపోతున్నాయి. బాధితుల శోకం అక్షరీకరించలేనిదై అనాధలు, విగతజీవ్ఞలై బతుకులు నరకంగా మారుతున్నాయి. ఆ కుటుంబాలు కన్నీరు మున్నీరై కష్టంగా బతుకులు నెట్టు కొస్తున్నారు. దీనికంతటికి ప్రధాన కారణం తగినంత రవాణా సదుపాయాలు లేకపోవడం, నిబంధనలు పాటించకపోవడం, రోడ్డు ప్రమాదాలు అరికట్టాల్సిన విభాగాలు నిర్లక్ష్యానికి తోడ వ్ఞతున్నాయి. నాణ్యత తగ్గి గుంతలమయమైన రహదారులు, వాటిపై కనిపించని సూచనల బోర్డులు ఉన్నా పట్టించుకోని వాహనదారులు, మద్యపానం సేవించి వాహనాలను నడపడం వలన జరుగుతున్నట్లు తెలుస్తుంది. మనస్సులను కలిచివేసే హృదయ విదారక ప్రమాద ఘటనలు చూసి ప్రజలు బెంబే లెత్తుతున్నారు.రోడ్లపై నిర్లక్ష్యంగా అడ్డూఅదుపు లేకుండా అతి వేగంగా ట్రాఫిక్‌నిబంధనలను తుంగలోతొక్కి పలువ్ఞరు ప్రయా ణీకులు, వాహనదారులు వ్యవహరించడం మూలంగా రోడ్డు ప్రమాదాలు,దుర్మారణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత మూడేళ్లుగా రాష్ట్రంలో నమోదైన రోడ్డు ప్రమాదాలు ఇలా ఉన్నాయి. సుమారుగా 2017లో 22,811 ప్రమాదాలు జరుగగా, 7,219 మంది మృతిచెందారు. 24,217 మంది క్షతగాత్రులైనారు. 2018లో 22,484 ప్రమాదాలు జరుగగా అందులో 6,596 మంది మృతి చెందారు. 24,017 మంది క్షతగాత్రులైనారు. 2019లో ప్రమాదాలు 11,302 జరుగగా అందులో మృతులు 5,024 కాగా, 11,715 క్షతగాత్రులై నారు. 2019లో 11,302 ప్రమాదాలు జరుగగా అందులో 3628 మృతులు కాగా, 11,715 మంది క్షతగాత్రులైనారని తెలుస్తుంది. ప్రతి 86 నిమిషాలకు ఒక ప్రాణం పోతుందని గణాంకాలు చెబుతున్నాయి. ఏటా దేశవ్యాప్తంగా 4,80,652 ప్రమాదాలు జరుగు తుండగా 1.5 లక్షలమంది ప్రాణాలు కోల్పోతున్నట్లు రోడ్డు రవాణా హైవేలమంత్రిత్వశాఖ 2016లో ఇచ్చిన నివేదిక చెప్పింది. ఈ ప్రమాదాలలో 68 శాతం మితిమీరిన వేగం వల్లేనని తెలిసింది. ఈ మరణాల్లో మన తెలంగాణరాష్ట్ర వాటా ఐదువేలకుపైగానే ఉంది. ఇలా ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లం ఘించడం,అతివేగం కారణాల వల్లరోజు కు 16 మంది మృత్యు వాతపడుతున్నారు. మనదేశంలో కానీ, రాష్ట్రంలో కానీ మద్యా న్ని అందుబాటులో ఉంచడం పాలకులు చేస్తున్న తప్పిదం కాదా! ప్రభుత్వాలకు ప్రధానంగా ఆదాయం మద్యం ద్వారానే వస్తుంది నిజం కాదా! రాష్ట్రంలోని హైవేలకు ఇరువైపులా మద్యంషాపులు స్వాగతం చెపుతుంటే? రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి అనేది తెలియందా? ట్రాఫిక్‌ నియంత్రణ, అబ్కారి, ఆర్‌టిఓ, పోలీసుశాఖల మధ్య సమన్వ యం ఏర్పరిచి రోడ్డుప్రమాదాల నివారణచర్యలకుపూనుకోవాలి. వాహన దారులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించి ప్రమాదాలను నివారిం చాలి. పౌరులుగా మనం స్వీయనియంత్రణ చేసు కుంటూ ప్రయాణించాలనే కనీస బాధ్యతలను మరువరాదు. మనుషులు గా మానవత్వాన్ని ప్రదర్శించాలి కానీ మరణాలను కొని తెచ్చు కోరాదు. ప్రయాణ సమయంలో వేగంకన్నా నిదా నంగా గమ్యా న్ని క్షేమంగా చేరుకోవాలి. మనదేశంలో ఉన్న రోడ్ల పరిస్థితుల ఆధారంగా ఏ వాహనానికైనా గరిష్టంగా వేగ పరిమితి కేవలం 80కి.మీ మాత్రమే.అంతకుమించి వెళ్లరాదు. కాని ఇక్కడ కార్లు ఇతర వాహనాలు 120 కి.మీ.లు దాటిన వేగంతో ప్రయాణం చేస్తున్నాయి. ద్విచక్ర వాహనదారులు హెల్మెంట్లు ధరించాలి. కార్లు, జీపుల్లో ప్రయాణించేవారు సీటుబెల్టు పెట్టుకోవాలి. భారీ వాహనాలతో సుదీర్ఘప్రయాణం చేసే డ్రైవర్లు తగినంత నిద్ర ఉండేలా చూడాల్సిన బాధ్యత యాజమాన్యాలదే. మొన్న గచ్చిబౌలి మైండ్‌ స్పేస్‌ వద్ద జరి గిన ప్రమాదంలో కారు ఫ్లైఓవర్‌ పై నుంచిపడేందుకు ప్రాథ మిక కారణం మితిమీరిన వేగంఒక్కటైతే, ఫ్లైఓవర్‌ నిర్మాణంలో డిజైన్‌ లోపమని భావిస్తున్నారు. ఇదిలావ్ఞంటే గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే తేడా లేకుండా ఆటోలు, ట్రక్కులు, ట్రాక్టర్లు, లారీలు వివిధ రకాల వాహనాలు, గూడ్సు వస్తు రవాణాకు వాడేవాహనాలతో ప్రజలను తరలించడం జరుగుతుంది. మను షులను తరలించే వాహనాలు నిబంధనలను అతిక్రమించి ప్రయాణికులను ఎక్కించుకొని ప్రయాణిస్తున్నాయి. గతంలో అనేక మార్లు ప్రమాదాలు సంభవించిన సంఘటనల నుండి అప్రమత్తతను ఆచరణలో చూపడంలేదు. రహదారిపై ప్రయా ణించే రెండు ఎదురెదురుగా వచ్చే వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు జరగవ్ఞ. గమ్యాలకు క్షేమంగా చేరుకోగలమనే వాస్తవాన్ని మరువరాదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా కాకుండా రోడ్డు ప్రయాణాల్లో, ప్రమాదాలు జరగకుండా వాహనదారుల స్వీయనియంత్రణ ఎంతోఅవసరం. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై వివిధ శాఖలు కఠినంగా వ్యవహరించాలి.ఈ మధ్యకాలంలో పోలీసు శాఖవారు డ్రంక్‌ అండ్‌డ్రైవ్‌ను అరికట్టడంవల్ల కొంత మెరుగైన ప్పటికీ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. రోడ్డు ప్రమాదాలలో అత్యధికంగా యువకులు మృత్యుబారిన పడుతున్నారు. ట్రాఫి క్‌ నిబంధనల ఉల్లంఘనల్లో మెజారిటీ విద్యావంతులే కావ్ఞన కాలేజీల్లో, విద్యాసంస్థల్లో, కార్యాలయాల్లో కౌన్సిలింగ్‌లతో ప్రమాదాల తగ్గుదలకుపాటుపడాలి. ప్రజాప్రతినిధుల వాహ నాలు రోడ్లపై రాగానే ట్రాఫిక్‌ పోలీసువారు, రక్షకభటులు, అనుయాయుల వాహనాలు ఎలాంటి ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకుండా మనదేశంలోని గరిష్ట వేగమైన 80కి.మీలకు మించి వెళ్లుతున్నది నిజంకాదా!వారిని పంపుతున్న వివిధ శాఖ లకు నిబంధనలు వర్తించవా! ఇలా ప్రజాప్రతినిధుల వాహనా లు అతివేగంగా దూసుకెళు తుంటే ప్రయాణదారులు చోద్యం చూస్తూవారు వెళ్లేదాకా ఆగాల్సివస్తుంది.చట్టంముందుఅందరూ సమానమే అనే నిబంధనలు వీరికి అతీతం ఎలా అవ్ఞతుంది. మాన్యుడైనా, సామాన్యుడైనా ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తూ నియమిత వేగంతో ప్రయాణిస్తే ఇతరుల ప్రాణాలకు హాని జరగకుండా చూడాలి. రోడ్డు ప్రయాణం చేస్తూ ప్రాణాలు కోల్పోవాలని ఎవరూ అనుకోరు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలాంటి వారి వల్ల అనేక కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోతున్నాయి.