విష సంస్కృతి విషమిస్తే విలయమే!

స్వామీజీలు, మఠాధిపతులు చేసే అసక్తికరమైన ప్రసంగాలు, ఇతిహాసపురాణ గాధలు నిరుపేద మధ్యతరగతి గ్రామీణులకు అందించాల్సిన అవసరం వ్ఞంది. మమ్మీడాడీ చదువ్ఞలు వ్ఞంటే వ్ఞండనీయండి. కానీ వాటితోపాటు మన సంస్కృతిసాంప్రదాయాలు, నైతిక విలువలు తెలిపే పాఠ్యాంశాలు ప్రాథమికస్థాయి నుంచే పిల్లలు తెలుసుకునేలా విద్యావిధానంలోనే మార్పులు తేవాలి. అలాగే సైబర్‌కేసులు నీలిచిత్రాల ప్రదర్శనలు, క్లబ్బుల్లో అంగాంగ ప్రదర్శనపై ఉక్కుపాదం మోపాలి. శుభాకాంక్షలన్నీ శుభప్రదంగా వ్ఞండాలేకానీ విషసంస్కృతికి బీజాలు వేయకూడదు.

cyber crime
cyber crime

చదువ్ఞకోకముందు పెసలు అనేవారు చదివిన తర్వాత పిసలు అన్నారట వెనకటికి ఎవరో. చదువూ సంధ్యలు పెరిగే కొద్దీ మనుష్యుల ప్రవర్తనల్లో మార్పులు రావాలి. ఏది మంచో? ఏది చెడో? గ్రహించే విచక్షణ ఈ చదువ్ఞలతోపాటు పెంపొందాలి. అందుకే విద్యాబోధన ఆ పరిసరాలతోపాటు నైతికవిలువలు నేర్పించేవిధంగా జరగాలి. ఇది ఏనాటినుంచో పెద్దలు చెబుతున్నారు. నిన్న గురువారంతెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావ్ఞ ఒక పుస్తకావిష్కరణ సందర్భంగా మాట్లాడుతూ నైతిక విలువలతో కూడిన పాఠ్యాంశాలను రూపొం దించి, బోధన జరగాలని అన్నారు. కొందరు మృగాలుగా మారి వ్యవహరిస్తున్నారని తీవ్రఆవేదన వ్యక్తం చేస్తూ, ఈ పరిస్థితిని సరిదిద్దేందుకు చర్యలు అడుగులు వేయాల్సిన తరుణం ఆసన్న మైందన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచే నైతిక విలువలను నేర్పే పాఠ్యాంశాలను రూపొందించేందుకు మేధావ్ఞలు, అనుభవ జ్ఞులైన పెద్దలతో కమిటిని కూడా వేయనున్నట్లు తెలిపారు. సాంకేతికంగా ఎంతో అభివృద్ధిచెందాం. విద్యావిధానంలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. అత్యంతర ప్రతిభావంతులైన యువ కులు అహర్నిశలు శక్తివంచన లేకుండా కృషిచేస్తూ దేశవిదేశాల్లో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కానీ మరోపక్క పాశ్చాత్యమోజులో పడి మరికొందరు మన సంస్కృతి సాంప్రదాయాలకు, నైతిక విలువలకు మంగళం పాడుతున్నారు. మొన్న దేశవ్యాప్తంగాకానీ, తెలుగురాష్ట్రాల్లో మరిముఖ్యంగా హైదరాబాద్‌లో జనవరి ఒకటి తేదీ ముందురోజు రాత్రిఇంగ్లీషు సంవత్సరం 2019కి వీడ్కొలు, 2020నూతన ఏడాదికి ఆహ్వానం పలికే పేరుతో యువత చేసిన అల్లరి అంతాఇంతాకాదు. ఆడమగ తేడాలేదు. అర్ధరాత్రి రోడ్ల పైకి వచ్చి, వెర్రిగంతులు వేయడం కొన్ని క్లబ్బుల్లో నృత్యాల పేరుతో చేసిన వెకిలిచేష్టలు, వెర్రితలలు వేస్తున్న విషసంస్కృతికి పరా కాష్ఠగా చెప్పవచ్చు. ‘హ్యాపీ న్యూఇయర్‌ అంటూ నినాదాలు చేశా రు. అసలు వారు ఎవరికి చెబుతున్నారో వారికే తెలియదు. ప్రతి ఏడాదిలాగానే పోలీసులకు ఈ యువతీయువకులను నియంత్రిం చడం తలప్రాణం తోకకొచ్చింది. ఈ ఆనందకేళీలో అదుపుతప్పి ఎంతోమంది గాయపడ్డారు. ఆరోజు తెల్లవార్లూ స్టారు హోటళ్లు, క్లబ్బుల్లో పాశ్చాత్యసంగీత హోరు, అశ్లీల నృత్యాల జోరు పెరిగి పోయాయి. ఒక్క హైదరాబాద్‌ నగరానికే పరిమితం కాలేదు. మండలం నుంచి గ్రామాలకు కూడా ఈ సంస్కృతి పాతుకుని పోయింది. పాశ్చాత్యసంస్కృతి ప్రభావం క్రమేణా విస్తరించిపోవ డం ఆందోళన కలిగించే అంశం. గ్రామీణ జనజీవన స్రవంతిలో విలీనమై భాసిల్లుతున్న మన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే కూచిపూడి, భరతనాట్యం, జాన పదకళలు పాశ్చాత్య నాగరి కత విలువల్లో ఆధునిక ముసుగులో కనుమరుగైపోతున్నాయి. అనేక మతాలు, కులాలు, అంతరాల దొంతరాలపై నిర్మితమైన మన కళాసంస్కృతి కాపాడుకోలేమేమో ననిపిస్తున్నది. గతంలో జాతర్లు, తిరునాళ్లు జరిగినా ఆయా ప్రాంతాలకు ఆచారవ్యవ హారాలతో అద్దంపట్టేవి. జానపద కళలు, పురాణాలకు చెందిన హరికథలు, బుర్రకథలు, ఒగ్గుకథలు, నాటకాలు, పగటివేషాలు, ఎంతో అహ్లాదకరంగా ప్రదర్శించేవారు. పండుగదినాల్లో కూడా ఇలాంటి కళలతోపాటు కోలాటం, భజనం చేసేవారు. సంక్రాంతి పండగ వస్తుందంటే గ్రామసీమల్లో ఎంతగానో కళకళలాడాయో. ప్రతికళారూపం మన సంస్కృతికి అద్దం పట్టేదే కాక, ప్రజలకు ధర్మాధర్మ వివేచనను, ఆలోచనల్లో ఉజ్జీవనం పెంపొందించేం దుకు ఎంతో ఉపయుక్తంగా ఉండేవి. మనంవేసే ప్రతి అడుగు లోను నాగరికతల విశిష్ఠతల పరిణామాలు గుభాలించేవి. మన ప్రతి మాటలోను సభ్యతాసంస్కారం తొణికి సలాడుతుండేది. ఇప్పుడు వాటిస్థానంలో డిస్కో, రికార్డు డాన్సులు ప్రత్యక్ష మయ్యాయి. వేలాది ప్రజల ముందు అంగాంగ ప్రదర్శన చేస్తు న్నారు. గ్రామాలు సైతం మత్తు, సెక్సు సీమలుగా మారుతున్నా యి. ఏ సందర్భంగానైనా, పండుగపబ్బాలకే కాదు. చావ్ఞలాంటి విషాద సందర్భాల్లో కూడా మద్యం వాడకాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.. కొందరికైతే ఆ మద్యం మత్తులో ఏం చేస్తు న్నారో కూడా తెలియకుండా పోతున్నది. జనవరి 1 పెద్దపండగల జాబితాలో చేరిపోయింది తెలుగురాష్ట్రాల్లో మద్యం ఏరులైపారింది. వీటికితోడు మాదకద్రవ్యాలు కూడా విచ్చలవిడిగా వాడుతున్నారు. తెలుగురాష్ట్రాల్లోనే వేలాది ఎకరాల్లో గంజాయి సాగుచేస్తున్నారు. కొకిన్‌, బ్రౌన్‌షుగర్‌లాంటివి మత్తుపదార్థాలు గోవాప్రాంతం నుంచి తెలుగురాష్ట్రాలకు చేరుకుంటుంటే గంజాయి తెలుగురాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నది. ఈ మాదకద్రవ్యాల మత్తుతో, మద్యం కలవడంతో విచక్షణాజ్ఞ్ఞానం కోల్పోతున్నారు. కొడుకే తండ్రిని చంపుతున్నాడు. తండ్రే సొంత కూతురుపై అత్యా చారానికి తెగబడుతున్నారు. ఈరోజు ఆరోజు అని కాదు. ప్రతి రోజూ ఈ అత్యాచారాలకు అంతేలేకుండా పోతున్నది. ప్రభుత్వా లు ఎన్నిచట్టాలు చేసినా, మరెన్నీ నిబంధనలు విధించినా ఎంత మంది అధికారులను నియమించినా పరిస్థితుల్లో ఏమాత్రంమార్పు రావడం లేదు. ఒక్కవిషయం గుర్తు వ్ఞంచుకోవాలి. ఈ నేరాల్లో ఉన్న నిందితుల్లో 90శాతం వరకుమద్యం, మాదకద్రవ్యాల మత్తు లో వ్ఞన్నవారే. ఆనాటి నిర్భయ కేసులో నిందితులు కానీ, మొన్న టి దిశకేసులో నిందితులు కానీ, అందరూ పూర్తి మైకంలో ఈ దారుణానికి పాల్పడ్డారనే విషయం పోలీసుల దర్యాప్తులో బయట పడింది. ఒకపక్క ఈ మద్యం, మాదకద్రవ్యాల మోజులో పడి యువత పతనావస్థకు చేరుకుంటుంటే మరోక పక్క మన సాం ప్రదాయాలు, నైతిక విలువలు బోధించే కళలు కనుమరుగై పోతు న్నాయి. ఒకనాడు ప్రపంచపటం మీద ఆంధ్రకళాకారులు ఎగుర వేసారు. నాట్య వైజంతిక కూచిపూడి నాట్యానికి జన్మస్థలమైనా కృష్ణాజిల్లాలోని మువ్వమండలం కూచిపూడి గ్రామంలో పరిస్థితి చూస్తే ఆవేదన కలగక తప్పదు. రవీంద్రనాథ్‌ఠాగూర్‌ కళానికేతన్‌ ఏర్పడకముందే అక్కడి కళాకారులు చేసిన గజ్జెల చప్పుళ్లు భారత దేశం అంతా ఇంటింటా మారుమోగాయి. అంతటి ఘనకీర్తి ఆర్జిం చిపెట్టిన కూచిపూడికి నేడు ఆదరణలేక పాలకుల ప్రోత్సాహాన్ని నోచుకోక వెలవెలపోతున్నది. ప్రభుత్వపరంగా కూడా ఇలాంటి సంస్కృతిని కాపాడుకునేందుకు ఎలాంటి కృషి జరగడం లేదు. గతంలో ఉమ్మడిఆంధ్రప్రదేశ్‌లో కూడా పెరిగిపోతున్న విషసంస్కృ తి పట్ల 1999మార్చి 4వ తేదీన శాసనసభలో ప్రస్తావనవచ్చింది. శాసన సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు. అప్పటి హోంమంత్రి ఎలిమిలేటి మాధవరెడ్డి కూడా చర్చల్లో పాల్గొంటూ జరుగుతున్న విష సంస్కృతిపట్ల ఆవేదన వ్యక్తం చేశారు. జంటనగరాల్లో ఈ సంస్కృతి పెరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని శాసనసభకు హామీ ఇచ్చారు. కానీ నియంత్రణ చర్యలకు సంగతి దేవ్ఞడెరుగు. అసలు ఏడాదికెడాది పెరిగిపోతున్నాయి. గతంలో ఈ సంస్కృతి మగవారికే పరిమితమై వ్ఞండేది. కానీ క్రమేపీ కొందరు యువతులు కూడా అందులో భాగస్వామ్యులవ్ఞతున్నా రు. మధ్యతరగతికి చెందిన యువతీయువకలు ఏదోవిధంగా ఈ క్లబ్బుల్లో ప్రవేశానికి ఆరాటపడుతున్నారు. ఇది ఒక స్టేటస్‌ సింబ ల్‌గా మారిపోయింది. అందుకోసం యువత నానాఅగచాట్లు పడు తున్నారు. దీంతో నేరాలసంఖ్య కూడా పెరిగిపోతున్నాయి. విలాస వంతమైన జీవననేపథµ్యంలో ఖర్చులు పెరిగిపోతున్నాయి. విని యోగించడమేకాదు చివరకు ఆవ్యాపారంలో దిగిమెరికలాంటి నలు గురు ఇంజినీరింగ్‌ విద్యార్థులను గంజాయిని రవాణాచేస్తూ పోలీసు లకు పట్టుబడ్డారంటే ఏస్థాయిలో వ్ఞందోఊహించుకోవచ్చు. కేవలం తమ విలాసవంతమైన జీవితాలకోసం ఇలాంటి నేరాల్లో పాల్గొంటు న్నట్లు పోలీసులముందు అంగీకరించారు. నైతిక విలువలు ధర్మాలు మనసంస్హృతి సాంప్రదాయాలను వివరించియువతను సన్మార్గంలో నడిపించేందుకు ఎలాంటి కార్యక్రమాలు జరగడంలేదు. స్వామీజీ లు, మఠాధిపతులు చేసే అసక్తికరమైన ప్రసంగాలు, ఇతిహాసపురా ణ గాధలు నిరుపేద మధ్యతరగతి గ్రామీణులకు అందించాల్సిన అవసరం వ్ఞంది. మమ్మీడాడీ చదువ్ఞలు వ్ఞంటే వ్ఞండనీయండి. కానీ వాటితోపాటు మన సంస్కృతిసాంప్రదాయాలు, నైతికవిలువలు తెలిపే పాఠ్యాంశాలు ప్రాథమికస్థాయి నుంచే పిల్లలు తెలుసుకునేలా విద్యా విధానంలోనే మార్పులు తేవాలి. సైబర్‌కేసులు నీలిచిత్రాల ప్రదర్శనలు, క్లబ్బుల్లోఅంగాంగ ప్రదర్శన పై ఉక్కుపాదం మోపాలి. శుభాకాంక్షలన్నీ శుభప్రదంగా వ్ఞండాలేకానీ విషసంస్కృతికి బీజాలు వేయకూడదు. ఇందులో ప్రభుత్వంతో పాటుప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, మేధావ్ఞలు పాలుపంచుకోవాలి. ప్రజల భాగస్వామ్యమే మన సంస్కృతి పరిరక్షణకు ఏకైకమార్గం. ఆ వైపు ప్రజలను చైతన్యం చేయాల్సిన గురుతర బాధ్యత పాలకులపై ఉంది.

  • దామెర్ల సాయిబాబ

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/