విశృంఖల వైద్యవిద్యా వ్యాపారం!

school fees
school fees

ఎం తో పవిత్రంగా భావించి పూజించి, ఆరాధించిన సరస్వతి నేడు అంగడి బొమ్మగా మారిపోయింది.విద్యనేకాదు విద్యా ర్థులతో సహా విద్యాసంస్ధలను కూడా అమ్ముకొనే దురదృష్టపు రోజులు దాపురించాయి. విద్యార్థులకు, తల్లి తండ్రులకు ధనభారం మోయలేనంతగా పెరిగిపోతున్నది. పాలకుల అసమర్థత,అధికారుల అవినీతి వీటిన్నంటిని మించి మితిమీరిపోయిన రాజకీయజోక్యానికి నిదర్శనంగా దేశవ్యాప్తంగా విద్యావ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నది.లాభసాటిగా ఉండే వ్యాపారం లోకి కొందరు రాజకీయ నాయకులు నేరుగా పాలుపంచు కోవడం ప్రారంభమైన నాటినుండి పరిస్ధితి మరింత దిగ జారిపోతున్నది.ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రాధమిక స్థాయి నుండే ఆంగ్లంలోనే బోధన ప్రవేశపెట్టాలని నిర్ణయించడం వివాదం అయింది.దానిపై రకరకాల అభిప్రాయలు వెల్లు బుకుతున్నాయి.ఆ విషయం అలాఉంచితే వైద్యవిద్యలో రానురాను పరిస్థితి అదుపు తప్పిపోతున్నది.లక్షలాది రూపాయలు వెచ్చిస్తే తప్ప వైద్యవిద్యలో ప్రవేశం దొరకని పరిస్థితులు దాపురించాయి. వచ్చే విద్యాసంవత్పారానికి సీట్లు అమ్మకాలు ఇప్పటికే ప్రారంభమైనాయి. అరకోట ిరూపాయల నుండి కోటి రూపాయల వరకు పలుకుతు న్నట్లు చెపుతున్నారు. పిజీ కోర్సుల్లో అయితే కోట్లరూపా యలకు ఎగబాకింది. ప్రభుత్వ విధానాలు సైతం ఈ వ్యాపారాన్ని మారింత ప్రోత్సహించేవిధంగా ఉన్నాయి.ఈ ప్రభావం సమాజంపై తీవ్రంగా చూపుతున్నది.ప్రాణం కాపాడాల్సిన వైద్యులే కొందరు వచ్చీరాని వైద్యంతోనో, లేక అవగాహనారాహిత్యంతోనో,లేక ఇతర కారణాలతో రోగులకు ప్రాణకంటకంగా తయారు అవుతున్నారు. ఇటీవల జరుగుతున్న సంఘటనలు ఆందోళనే కాదు ఆవేదన కల్గిస్తున్నాయి.ఒక కాలికి చేయాల్సిన శస్త్రచికిత్స మరోకాలుకు చేశారంటే ఏమనుకోవాలి?ఎంతటి నిర్లక్ష్యంగా వ్యవహరించారో అర్థంఅవుతుంది.ఇక మనిషి జీవనానికి అత్యంత ప్రధానమైనవి కళ్లు అనేది అందరికి తెలిసిన విషయమే.అంధత్వం సంప్రాతిస్తే ఆ మనిషిజీవితం ఎంత దుర్భరమౌతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇటీ ల కాలంలో కళ్లుకు చేస్తున్న శస్త్రచికిత్సలు విఫలమై అంధులుగా మారుతున్న సంఘటనలు తరుచుగా జరుగు తున్నాయి. కంటికి సంబంధించినవేకాదు, గుండె, కాలే యం లాంటి వాటికి జరుగుతున్న శస్త్రచికిత్సల్లో ఏన్నో అపశృతులు,అనర్థాలు చోటు చెసుకొంటున్నాయి. అప్పు డప్పుడు కొన్ని వెలుగు చూస్తున్నాయి.అలాంటి సంద ర్భాల్లో భాదిత కుటుంబాలకు చెందిన వారు ఆందోళన లకు దిగుతున్నారు. మరికొన్ని సందర్భల్లో ఆస్పుత్రి సిబ్బందిపై దాడికి దిగుతున్నారు.పోలీసుస్టేషన్‌కు వెళ్లిన సంఘటనలు కోకొల్లలు.ఆస్పుత్రల సిబ్బందిపై దాడులకు దిగడం ఏకోణంలో చూసినా సమర్థనీయం కాదు.అయితే ఆ సంఘటనలకు కారణాల్లోని మూలాల్లోకివెళ్లాల్సిన అవ సరం ఉంది.ఏ వైద్యుడు కావాలని రోగి ఆరోగ్యం పాడు చేసి మరణానికి దగ్గరకు చేర్చాలని ప్రయత్నించడు. డబ్బు గుంజాలనే దురాశతో లేనిపోని పరీక్షలతోపాటు చికిత్స వీలైనంతవరకు పొడిగించి బిల్లు పెంచేప్రయత్నం కొందరు చేయవచ్చు.కాని చాలాకేసుల్లో వచ్చీరాని వెద్యం, ప్రధానంగా కొత్తకొత్తగా వస్తున్న రోగాలకు అనుగుణంగా అంతర్జాతీయ స్ధాయిలో వైద్యరంగంలో వస్తున్న మార్పుల అనుసరించి కొందరు డాక్టర్లు అప్‌డేట్‌ కాకపోవడం వల్ల ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి.వైద్యబోధనలో మారిన పరిస్థితులకు అను గుణంగా మార్పులు రాకపోవడం,నాణ్యత ఇందుకు మరో కారణాలౌతున్నాయి.మెడికల్‌ విద్యలో ఏనాడోనిర్ణయించిన సిలబస్‌ను మార్చాలని ఎన్నో అధ్యయన కమిటీలు సూచించాయి.ఆధునిక అవసరాలు తీర్చేందుకు ప్రస్తుతం ఉన్న ఎంబిబిఎస్‌ సిలబస్‌ పనికిరావడంలేదని సాక్షాత్తు కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమశాఖకు సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ రెండేళ్లక్రితమే వ్యాఖ్యానిం చింది.ఎంసిఐ తీరుతెన్నులపై ఆ కమిటీ అధ్యయనం అనంతరం అనేక వివరాలతో 134 పేజీలతో ఒక నివేది కను పార్లమెంటుకు సమర్పించింది.వైద్యవిద్యను మెరుగు పరచాల్సిన అవశ్యకతను ప్రధానంగా వైద్యవిద్యలో సిల బస్‌లో మార్పులు,చేర్పులు తదితర అంశాలపై ఆ కమిటీ అధ్యయనం చేసింది.వైద్యవిద్య నైపుణ్యంలో ఎంబిబిఎస్‌ కోర్సుచాలా కీలమైనదనికానీ ప్రస్తుతం వస్తున్న జబ్బుల కు ఎంబిబిఎస్‌ చదువులకు పొంతనలేకుండా పోయిందని ఆ కమిటీ తీవ్రంగా తప్పుపట్టింది.ఏనాడో నిర్ణయించిన సిలబస్‌ను నేటికీ కొనసాగించడం ఏ మాత్రంసమంజసం కాదని,మార్చాల్సిన అవసరాన్ని ఆ నివేదికలో ప్రస్తావిం చింది. మిగతా చదువులు ఎలాఉన్నా మనిషి ఆరోగ్యానికి సంబంధించిన వైద్యం విషయంలో మాత్రం పాలకులు ప్రత్యేక శ్రద్ధతీసుకోవాలి.మారిన మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వైద్యవిద్యలో మార్పులు చేయాలి.ప్రతి ఐదేళ్లకు ఒకసారి అంతర్జాతీయంగా వస్తున్న మార్పులను, కొత్త కొత్త రోగాలను పరిగణలోకి తీసుకొని అవసరాన్ని బట్టి సిలబస్‌లోనూ మార్పులు చేయాలి. ప్రభుత్వ ఆస్ప త్రిలోపనిచేస్తున్న వైద్యులకు ఆ మేరకు ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్‌ అయ్యేలా శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలి.అవేమి పట్టించుకోకుండా ఏదో నామమాత్రపు చదువ్ఞలు చెప్పి డిగ్రీ కాగితాలు ఇచ్చిఏ మాత్రం ప్రయోజనం ఉండదు. ముఖ్యంగా వైద్యవిషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకో వాల్సిన అవసరంఉంది.కొత్తకొత్త రోగాలు ప్రజారోగ్యంపై దాడి చేస్తున్నాయి.అందుకనుగుణంగా రకరకాలమందులు కనుగొంటున్నారు.దానికి తగ్గట్టుగా చికిత్స విధానంలో అత్యాధునిక పరికరాలను ప్రవేశపెడుతున్నారు.ఇలా శర వేగంగా పెరుగుతున్న వైద్య విధానానికి అనుగుణంగా మన దేశంలో కూడా వైద్యబోధన నాణ్యతా ప్రమాణా లను పెంచాల్సిన అవసరం ఉంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/