విద్యావ్యాపారంపై నియంత్రణేది?

School Fees
School Fees

విద్యావ్యాపారంపై నియంత్రణేది?

ఊదురు గొట్టడం వారు ఊదుతూ ఉంటే చల్లార్పుడు గొట్టంవాడు చల్లార్పుతున్న ట్టుగా ఉంది ఫీజుల నియంత్రణలో పాల కులు కొన్ని ప్రైవేట్‌సంస్థలు వ్యవహరిస్తున్న తీరు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులకంటే ఎక్కువవసూలు చేయ రాదని, నిబంధనలు అతిక్రమించిన స్కూలు యాజమాన్యా లపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని పాలకులు పదేపదే హెచ్చరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో నోటీసులు కూడా ఇస్తున్నారు. అంతటితో ఆగకుండా నిబంధనలను అతిక్రమించినందుకు భారీగా జరిమానాలు కూడా వసూలు చేస్తున్నారు.కానీ ఇవేమిపట్టనట్లు తమనేమీ చేయలేవన్నట్లు కొన్ని యాజమాన్యాలు ఇష్టానుసారంగా ఫీజు వసూలు చేస్తున్నాయి. మరో రెండు నెలల్లో నూతన విద్యాసంవత్స రం ఆరంభంకానుండటంతో ఫీజుల వసూళ్ల హడావ్ఞడి ఊపందుకుంది. విద్యార్థులనే కాదు విద్యార్థుల తల్లిదండ్రు లను కూడా ఇంటర్‌వ్యూ చేసే సంస్కృతి పెరిగిపోతున్నది. వారి ఆర్థిక స్తోమతను అంచనా వేసుకొనే సీట్లు ఇవ్వాలా? వద్దా? అనేది నిర్ణయిస్తున్నారు. మొత్తం మీద గత ఏడాది కంటే ఈ ఏడాది ఇప్పటికే కొన్ని సంస్థలు ఫీజులు రెట్టింపు చేశాయి.

ఈ దోపిడీ ఎల్‌కెజి నుంచి ఆరంభమవ్ఞతున్నది. ఇదంతా పాలకులకు తెలియంది కాదు. మొన్న శాసనసభ లో కాగ్‌నివేదిక కూడా బట్టబయలు చేసింది. కొన్ని ప్రైవేట్‌ విద్యాసంస్థలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నా యని క్యాపిటేషన్‌ ఫీజు అధికమొత్తంలో బోధనారుసు ములు వసూలు చేస్తూ విద్యాహక్కు చట్టాన్ని అతిక్రమిస్తు న్నారని స్పష్టంగా పేర్కొంది. బోధనారుసుం ఏడాదికి పద హారున్నర వేల నుంచి ఐదు లక్షల నలభైరెండువేల వరకు వసూలు చేసే సంస్థలున్నాయని ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇది పూర్తిగా చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. పాఠశాలల వార్షిక పాలనా నివేదికలు కానీలేక ఆడిట్‌ రిపోర్టులు కానీ సమర్పించడం లేదని కూడా కాగ్‌ వెల్లడిం చింది. మరొక పక్క ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ప్రధా నంగా మౌలికవసతుల కొరతతీవ్రంగా వేధిస్తున్నదని స్పష్టం చేసింది.రక్షిత తాగునీరు, విద్యుత్‌ గ్రంథాలయాలు, ఆటస్థ లాలు, తదితర కనీస వసతులు కూడా లేని పాఠశాలలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇక నిధుల కేటాయింపులో కూడా ప్రభుత్వం అవసరం మేరకు అందించడం లేదు. 2016- 17 సంవత్సరాల మధ్య దస్త్రాలను పరిశీలిస్తే ప్రాజెక్టు అప్రూవల్‌ బోర్డు 2014-17 సంవత్సరాలకు ఆమోదించిన బడ్జెట్‌తో సరిచూస్తే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఐదువేల మూడువందల అరవై కోట్లకుపైగా ఆమోదముద్రవేసి కేవ లం రెండువేల ఆరువందల తొంభైమూడున్నర కోట్లు మాత్రమే విడుదల చేశారు. ఇక సర్వశిక్షఅభియాన్‌తోపాటు ఇతర పథకాలకు నిధులు అందచేయడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర జాప్యం చేస్తున్నాయి.

ఇక మౌలిక వసతు లకు, ఇతర కనీస అవసరాలకు కేటాయిస్తున్న నిధులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి.2014-17 మధ్య నాణ్యమైన విద్యకోసం రెండువేల ఎనిమిదివందల యాభై ఒక్క కోట్లు ఖర్చు చేసినట్లురికార్డుల్లో చూపినా అందులో రెండువేల నూటెనిమిది కోట్లు జీతభత్యాలకే వెచ్చించారు. సమీపంలో బడివసతి లేనివారికి వేరే గ్రామాలకు వెళ్లివ చ్చేందుకు రవాణా ఛార్జీల్లో కూడా శ్రద్ధ చూపడం లేదనేది కాగ్‌ గుర్తించింది. 2015-16లో పదిహేనువేల మందికి నాలుగుకోట్ల అరవైఎనిమిది లక్షలు కేటాయించగా అందు లో ఒకటిన్నర కోట్లు కూడా వినియోగించలేదని కాగ్‌ తప్పు పట్టింది. 2016-17కు అసలు నిధులే విడుదల చేయలేద ని కాగ్‌ ఎత్తిచూపింది. దీన్ని బట్టి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకనాడు ప్రభుత్వ పాఠశాలలేకానీ ప్రైవేట్‌ బడులు అంత గా లేవ్ఞ. అక్కడక్కడ పట్టణాల్లో ఈ ప్రైవేట్‌ బడులు నడి చేవి. వాటిల్లో కూడా వ్యాపార ధోరణులు కన్పించేవి కావ్ఞ. లాభనష్టాలతో సంబంధం లేకుండా కేవలం సేవాదృక్పథం తో ఈ విద్యాసంస్థలు ప్రజలకు సేవలు అందించేవి. నిర్వాహకులు సామాజిక బాధ్యతగా భావించి బడులు నడి పేవారు.అందువల్ల వాటిని అరికట్టాల్సిన అవసరం ఆనాడు లేకుండాపోయింది.

అందుకే చట్టాల అవసరం అంతగా తలెత్తలేదు.కానీ పరిస్థితులు మారిపోయాయి. ఎయిర్‌కండి షన్‌ రూమ్‌లు, బస్సులు,డ్రస్సులు అంటూ ప్రతి దాంట్లో వ్యాపార ధోరణితో కొన్నియాజమాన్యాలు వ్యవహరించడం అత్యంత బాధాకరం. పోనీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుస్తున్నాయంటే అదీ లేదు. తనిఖీలే కరవైపోయాయి. ఆటస్థలం, గ్రంథాలయం, సైన్స్‌ల్యాబ్‌ వంటి ప్రాథమిక వసతులు ఉన్నా లేకపోయినా పట్టించుకోవడం లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు ఏ అనుమతులు లేకుం డానే నడుస్తున్న పాఠశాలలు కోకొల్లలు. వాటిలో చదివే విద్యార్థుల భవిష్యత్‌ అగమ్యగోచరంగా ఉంటోంది. మధ్య లో ఆ పాఠశాలలు మూసివేస్తే వారిచ్చే బదిలీ సరిఫ్టికేట్‌ ఎందుకూ పనికిరాదు. ఇవేమి రహస్యంగా మూడోకంటికి తెలియకుండా జరగడం లేదు.

బాహాటంగా పెద్దపెద్దబోర్డు లు పెట్టి ప్రకటనలు ఇచ్చుకుంటూ ఇంటింటికి తిరిగి తల్లి దండ్రులను ఒప్పించి,మెప్పించి తమపాఠశాలల్లో చేర్చుకుం టున్నారు. ఇటీవల తమ పాఠశాలల్లో చదివే విద్యార్థులకే కొత్త విద్యార్థులను తీసుకువస్తే ప్రోత్సాహకాలు ఇచ్చే సరి కొత్త పథకానికి కొన్ని యాజమాన్యాలు శ్రీకారం చుట్టాయి. ఈ విద్యావ్యాపారం గూర్చి పాలకులకు తెలియంది ఏమీ లేదు. అంతా బహిరంగమే. చదివినవారిని, చదువుకుంటు న్నవారిని ఎవరిని అడిగినా కథలుకథలుగా చెప్తారు. బాలబాలికలను భావిపౌరులుగా తీర్చిదిద్దాల్సిన విద్యావ్యవ స్థను ఇంతటి దారుణ పరిస్థితిలోకి నెట్టడం దురదృష్టక రం. మారిన పరిస్థితులకు అనుగుణంగా పటిష్టమైన చట్టా లు రూపొందించాలి. విద్యను కేవలం ఒక వ్యాపారంగా చూసేవారిపై ఉక్కుపాదం మోపాలి.

– దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌, హైదరాబాద్‌