విజయదశమి సందేశంలో అంతరార్థం

DDURGA
Mahisasura Mardhini Alamkara

విజయదశమి సందేశంలో అంతరార్థం

దసరా, దీపావళివంటి పండుగలు ఇతిహాసాల క్రమం లో సంస్కృతిలో భాగంగా ముందుకు వచ్చాయి. అవి యుద్ధాలకు సంబంధించిన పర్యవసానాలను, పరిణామాలను గుర్తు చేస్తుంటాయి. ఆధునిక కాలం లో భారత జాతీయ ఉద్యమం రామాయణ, మహాభారత యుద్ధాల కన్నా తక్కువదేమీ కాదు. అయితే మనం శాంతియుతంగా, అహిం సాయుతంగా సాధించిన స్వాతంత్య్రమని చెప్పుకుంటూనే ఉన్నాం. నెహ్రూప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే సమయంలో ఇలాగే శాంతి, అహింసల గురించి మాట్లాడారు. గాంధీజీ నిరాహార దీక్ష పూనారు. అయినా స్వాతంత్య్రం వస్తున్న సమయంలో 20 లక్షల మంది హతులయ్యారు. రెండవ ప్రపంచయుద్ధంలో బ్రిటిష్‌ పాల కులకు సహకరిస్తూ, వేలాదిమంది భారతీయ సైనికులను పంపించ డానికి జాతీయోధ్యమ నాయకులు అంగీకరించి ఒప్పందం కుదుర్చు కోవడం వల్లనే రెండవ ప్రపంచయుద్ధం తర్వాత స్వాతంత్య్రం ఇవ్వడానికి నిర్ణయమైంది.

యుద్ధంముగిసిన తర్వాత ఆనాటి బ్రిటిష్‌ ప్రధాన మంత్రి చర్చిల్‌ రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని ముక్కలు చేసే హక్కు నాకులేదని తప్పించుకున్నాడు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో లేబర్‌పార్టీ తరపున ప్రధాన మంత్రి అయిన అట్లీ భారతదేశానికి స్వాతంత్య్రం ప్రకటించాడు.స్వాతంత్రోద్యమంలో లక్షలాది ప్రజలు ఎన్నో త్యాగాలు చేశారు. హతులయ్యారు. సైనికు లుగా చేసిన త్యాగాలు మరువలేనిది. మొదటి స్వాతంత్య్ర పోరాటం 1857నుండి, పాలకులపై ఆది వాసీ, గిరిజనులు ఎక్కడికక్కడ చేసిన 170 తిరుగుబాట్లు బలిదా నాలు కూడా తక్కువేమీకావ్ఞ. ఇలా అనేక త్యాగాలతో విజయం సాధించిన పరంపరలో స్వాతంత్య్రం వచ్చింది. దాని ఫలితాలు పాలితుల్లో ఒక సెక్షన్‌ పాలకులుగా ఎదగడంతో ఆగిపోయింది. మిగ తా పాలితులు అన్నిరంగాల్లో అభివృద్ధి పధంలో ఎదగడానికి పాల కులుగా తమ పరిణామంలో ఎదగడానికి ఉండే నిచ్చెనలు తీసివేయ బడ్డాయి. వారిని నిరంతరం పాలితులుగా మార్చే బహిరంగ కుట్ర కొనసాగుతూ వస్తున్నది. మానవాళికి, మనిషికి ఆరు శత్రువ్ఞలు అని అవి అరిషట్‌ వర్గాలని అంటుంటారు. అవి కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు. వీటికి మానవ పరిణామం మరో నాలుగైదు జతచేసింది. స్వార్థం, అన్యాయం, అమానత్వం, అహంకారం, ద్వేషం, మొత్తం కలిపితే పదకొండు. దశ అరి అంటే పది శత్రువ్ఞ వర్గాలు. దసరా పదాన్ని దశ అర అని, దశహర రక రకాలుగా విడగొట్టి కొత్త వ్యాఖ్యానాలు చేశారు. అలా దసరా అనేది పది శత్రుపూరిత స్వభావాలను వదిలించుకోవాలని దసరా సందే శంగా చెప్తుంటారు. బౌద్ధంప్రేమ, కరుణ, ప్రజ్ఞ, మంచిమాట, మం చి పలుకు, మనో వాక్కాయ త్రికరణశుద్ధి, మంచి ఆచరణ,అష్టాంగ మార్గం,అష్టాంగ జీవనవిధానం ప్రతిపాదించింది. ఇలా శైవ, వైష్ణవ, బౌద్ధ సామాజిక తాత్వికతలు ఎప్పటికప్పుడు పరస్పరం ప్రభావిత మవ్ఞతూ వస్తున్నాయి. శత్రువ్ఞలను ఓడించడానికి, మిత్రులను కలుపుకోవడానికి పరస్పరం స్వీకరించడం అనివార్యమవ్ఞతుంది. అందువల్ల శత్రువ్ఞలనుండి ఎన్నోస్వీకరిస్తారు.

మిత్రులనుండి కూడా సహజంగానే స్వీకరిస్తుంటారు. ఇలాబౌద్ధ, గ్రీకు సోఫిస్టు, శైవ, వైష్ణవ, క్రైస్తవ, ఇస్లాం, సిక్కుబహాయి మతాలు, ఉద్యమాలు భావ జాలాలు, సంస్కృతులు పరస్పరం ఆయాకాలాల్లో స్వీక రిస్తూ వస్తు న్నాయి. అందువల్ల ఎవరుగొప్ప, ఏది ముందు అనే చర్చలు అయో మయానికి అనవసరసంఘర్షణకు దారితీస్తాయి. వాటిద్వారా స్వ ప్రయోజనాలు, సాధికారికత, రాజకీయలబ్ధి, మతలబ్ధి, సాంస్కృతి క ఆధిపత్యం చెలాయించాలనుకున్న వారు ఈ సహజీవన సౌంద ర్యాన్ని, సమైక్యతను కలిసిపోతున్న తీరును ప్రధానంగా చేయకుం డా, వైరుధ్యాలను,భిన్నాంశాలను ప్రధానంచేసి సంఘర్షణను పెంచి తమ వైపునకు మలుపుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఏమైనప్పటికి మనిషి తనపై తానుపోరాటం చేస్తూ,తనను తాను పౌర సమాజంలో ఉత్తమ పౌరులుగా, మహిమాన్విత స్వభావంతో ఎదగడానికి కృషిచేయడం అవసరం.అప్పుడే సృజనాత్మకత,కళలు, సాహిత్యం, వైజ్ఞానిక ఆవిష్కరణలు, అన్వేషణలు విస్తరిస్తాయి. చర్య, ప్రతిచర్యకుదారితీస్తుంది. చర్యప్రతిచర్యకు అతీతంగా ప్రేమ, కరుణ, శాంతియుత సహజీవనం సాధించడం ఎంతో సౌజన్యం, సహృదయత, సహనంతో మాత్రమే సాధ్యం.సహనం,సహృదయ త, సౌజన్యం అనేవి తనలోని స్వార్థాన్ని, కోపాన్ని, లోభాన్ని అసూ యను, ద్వేషాన్ని అహంకారాన్ని జయించి నప్పుడే సాధ్యం. వాటిని జయించడం కాకుండా అవిలేని దశల్లోకి ఎదగడం నిజమైన ఉదాత్త వ్యక్తిత్వ సాధన. విజయం గర్వాన్ని తెచ్చిపెట్టవచ్చు. అధికారం గర్వి ష్టిగా మార్చవచ్చు. స్వార్థం మనిషిని పతనంవైపు క్రూరత్వంవైపు నడిపించవచ్చు. ఓటమి,పేదరికం,నిస్సహాయతకు నడిపించవచ్చు. కులాధిపత్య, వర్ణాధిక్యత,సాంస్కృతికాధిక్యత, ధనాధిక్యత,అష్ట అశ్వైర్యాలు, అష్టదరిద్రాలు, మానవ సమాజంలోని అసమానతలను వివక్షను, స్వార్థాలను, తరతరాలుగా శతాబ్ధాలుగా కొనసాగిస్తున్న క్రమానికి చిహ్నాలు. ఈ ఆధిక్యతలను వదులుకోవడం అంత సుల భం కాదు. ఆధిక్యతలను వదులుకోకపోతే వాటి పాలితులైన బాధి తులైన ప్రజలు సంఘర్షిస్తారు. తిరుగుబాటు చేస్తారు. అప్పుడు యుద్ధాలు అనివార్యమవ్ఞతాయి. ప్రజలు, పీడితులుచేసే యుద్ధాలు వేరు. ఆధిక్యతావాదులు చేసే ఆక్రమణయుద్ధాలు వేరు. ఒకటి తమ పై గలఆధిక్యతలను, అవమానాలను తొలగించుకొని, సమానత్వా న్ని సాధించుకోవడానికి సంబంధించింది. మరొకటి ఒక మనిషి, మరో మనిషిపై ఆధిపత్యం చెలాయిస్తూ,స్వార్థాన్ని, అధికారాన్ని చెలాయించడానికి సంబంధించింది. దసరా వంటి పండుగలు విజ యానికి సంకేతం. ఈ విజయం యుద్ధాల ద్వారా సంభవించింది. ప్రజాస్వామ్యవ్యవస్థలో యుద్ధాలు శాంతియుత ఆందోళన రూపం లో సాగుతుంటాయి. లేదా అలా సాగాలని కోరుకుంటాము. కానీ ప్రాంతానికి ప్రాంతానికి మధ్య, దేశానికి దేశానికి మధ్య మతానికి మతానికి మధ్య జరిగే సంఘర్షణలు శాంతియుత స్థాయి నుండి రక్తపాతందాకా కొనసాగుతాయి. ఎవరోఒకరు తగ్గకపోతే అది నిరం తరం కొనసాగుతూనే ఉంటుంది. ఒకరు ఓడిపోవడమే లక్ష్యమై నప్పుడు అదొక రకమైన విజయం. సహృదయతతో రెండు పక్షాలు కలిసి జీవించడం ప్రేమకు, కరుణకు, సహజీవన సౌందర్యానికి నిజమైన ప్రజాస్వామ్య సంస్కృతికి నిదర్శనం. పాతపండుగలు ప్రజాస్వామ్యవ్యవస్థలో కొత్తఅర్థంలో, కొత్తలక్ష్యా లకు అనుకూలంగా మలచుకోవడం జరుగుతున్నది. బతుకమ్మపం డుగ తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని, వైవిధ్యాన్ని, అస్థిత్వా న్ని ప్రపంచవ్యాప్తంగా తెలియచేసే పండుగగా విస్తరిస్తున్నది. బాల గంగాధర్‌ తిలక్‌ ప్రవేశపెట్టిన గణేశ విగ్రహాల స్థాపన కాలక్రమంలో విస్తరించి కోట్లాది మంది ఎక్కడికక్కడ పూజలు జరుపుతున్నారు.

నిమజ్జనం చేస్తున్నారు. అదే క్రమంలో దుర్గాదేవి, నవరాత్రులు కొన సాగుతున్నాయి.ఇలా ఆయా పండుగలు పుట్టినప్పుడు వాటి సంద ర్భాలువేరు. జాతీయోద్యమకాలం నాటిపాలకులు నశించారు. బ్రిటి ష్‌ పాలకులు వెళ్లిపోయారు. నూతన పాలకవర్గాలు ఎదిగారు. జాతీయో ధ్యమకాలంలో పాలితులుగా ఉన్నవారి నుండి కొందరు పాలకులుగా ఎదిగి అధికారం చేపట్టారు. అంతకుముందు అధికారంలో ఉన్నసంస్థా నాధీశులు వగైరావారిని కలుపుకొని పాలితులు పాలకులై అధికారం లోకి వస్తున్నారు. అయితే విషాదకరమైన విషయం ఏమిటంటే మిగ తాపాలితులు పాలకులుగా ఎదిగే క్రమాలను నిరం తరం అడ్డుకుంటూ వస్తున్నారు. అందువల్ల దసరా, పంద్రాగస్టు, జనవరి 26వంటిపండు లను పాలితులనుండి ఎప్పటికప్పుడు పాలకులుగా ఎదిగే విధంగా స్ఫూర్తినిఉత్సాహాన్ని, కర్తవ్యాలను ప్రణాళికలను, ఉద్యమాలను గుర్తు కు తెచ్చేవిగా మలచుకోవడంఅవసరం. అప్పుడే ప్రజాస్వామ్యంలో అం దరికి సమాన అవకాశాలుఅందుతాయి. అప్పుడేకుల, వివక్ష,మత వివ క్ష, ప్రాంతీయ వివక్ష, భాషావివక్ష, సాంస్కృతిక, ఆధిపత్యం, వగైరా తొలగి ఆత్మగౌరవంతో స్వేచ్ఛా సమానత్వంతో కలిసి ప్రేమ, కరుణ సౌజన్యంతో, వినయంతో జీవించడం సాధ్యపడుతుంది. మనిషిలోని పైన చెప్పిన స్వార్థాలను ద్వేషాలను ఆధిక్యతలను ఈర్ష్యను వదులు కున్నప్పుడే ఇవి సాధ్యపడతాయి. ఇదే దసరా సందేశం.

బి.ఎస్‌.రాములు,
(రచయిత సామాజిక తత్వవేత్త)