లౌకికవాద ముసుగులో ఉమ్మడి పౌరస్మృతి

Triple talak
Triple talak

లౌకికవాద ముసుగులో ఉమ్మడి పౌరస్మృతి

త్రిపుల్‌తలాక్‌ అంశానికి బిజెపి ఎందుకు అంత ప్రాధా న్యత ఇస్తోంది. ఏకీకృత జీవన విధానాన్ని భారత దేశంలో అవలంభించాలని భావించిన హిందూత్వ శకులు ముస్లీం మహిళలపట్ల ఎందుకంత అవ్యాజ మైన ప్రేమను కనబరుస్తున్నాయి.1984లో సిక్కు ప్రజల ఊచకోత తర్వాత 1992లో బాబ్రీమసీదు విధ్వంసం చేసి,దేశీయ మతోన్మాద శక్తులు ముస్లీం ప్రజలపె ౖతమ యుద్దాన్ని ప్రకటించా యి.

2002లో గుజరాత్‌లో హిందువ్ఞల మధ్య వ్ఞన్న ముస్లీం ఇళ్ళ ను ధ్వంసం చేయడం,వారి హత్యాకాండ వెనుక మతపరమైన లక్ష్యం వ్ఞందని తేలిపోయింది.ఇప్పుడు ముస్లీం వ్యతిరేక భావాన్ని కొంతమే రకైనా తగ్గించుకోవడానికి, ప్రభుత్వానికి లౌకికవాద ముసుగు తొడుక్కో వాల్సిన అవసరం ఏర్పడింది. ముస్లీంలను కామన్‌ సివిల్‌ కోడ్‌,ట్రిపుల్‌ తలాక్‌ అనే అంశాలతో మరింత అభ్రదతాభావానికి గురిచేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉమ్మడి పౌరస్మృ తిని ముస్లీం ప్రజానీకం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఆల్‌ ఇండియా ముస్లీం పర్సనల్‌ లా బోర్డు తన వ్యతిరేకతను బాహాటంగానే ప్రక టించింది.రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 44 ప్రకారం ఉమ్మడి పౌరస్మృతి ఈ దేశ ప్రజలందరికి వర్తిస్తుంది.

ఆ దేశికసూత్రాలను ఏమాత్రం పాటించని పాలక వర్గాలు ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతి అమలులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.ముస్లీం, హిందూ, మత చట్టా లను ఆధునీకరించే ప్రయత్నం ఎప్పటినుండో మొదలైంది. మతా ల్లోని అనాచార,మూఢ సంప్రదాయాలను వదిలేసి,ప్రజాస్వామ్య బద్ధ,లింగవివక్ష లేని సమాన అంశాలతో మార్పులు చేయాల్సిన అవసరం వ్ఞంది. 1937లో షరియత్‌ చట్టం తెచ్చి ముస్లీం ప్రజలం దరూ దాన్ని పాటించేవిధంగా చర్యలు చేపట్టారు. నిజానికి హిందూ, ముస్లీం మత చట్టాలలో స్త్రీకి ఏమాత్రం స్వేచ్ఛ లేదు.

స్త్రీకి ఆస్తిహక్కును రెండూ నిరాకరిస్తాయి. మహిళలపై వివక్ష ఇంకా కొనసాగుతూనే వ్ఞంది. భర్తే దైవంగా సగటు భారతీయ భార్య బానిస బ్రతుకును గడుపుతోంది. మహిళల ఆర్థిక జీవితం పై ఇప్పటికీ మగవాడి పెత్తనమే నడుస్తోంది. మహిళలపై లైంగిక నియంత్రణ కొనసాగుతోంది. నిజానికి పర్సనల్‌ లా చట్టాలలో అనేక లోపాలున్నాయి. వీటినే సవరించి అన్ని సామాజిక అంశా లలో మహిళలకు పురుషులతో సమానంగా హక్కులను గ్యారెంటీ చేయడం మానివేసి రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి లాంటి సున్నితమైన అంశాలను తెరమీదకి తెస్తోంది.

ముస్లీం షరియత్‌లో తలాక్‌ అంశానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు.నిజానికి ముస్లీం పెద్దలు అందరూ కలిసి ఎన్నో సార్లు ఇరు వ్ఞరు భార్యాభర్తలను కూర్చోపెట్టి, వివాహాన్ని నిలబెట్టేందుకు ప్రయ త్నించి,విఫలమయినప్పుడే పురుషుడు చేత మూడు సార్లు తలాక్‌ చెప్పిస్తారు. మహిళలు అయితే భర్తకి ఖులా ఇవ్వాల్సి వ్ఞంటుంది. కోర్టులకు మహిళల విడాకుల కోసం వస్తున్న కేసులను పరిశీలిస్తే, 90 శాతం హిందూ మతానికి చెందినవారివే ఉన్నాయి. ఇతర మైనారిటీ మతస్థుల విడాకుల కేసులు కేవలం 10 శాతం మాత్రమే కోర్టులకు వస్తున్నాయి.

దీనికి తోడు మతాలకు,కులాలకు సంబం ధం లేకుండా స్పెషల్‌ మ్యారెజ్‌ యాక్ట్‌ 1954 కూడా ఉంది. నిజానికి భిన్న జాతులు, భిన్న సంస్కృతులు వ్ఞన్న భారతదేశంలో కామన్‌ సివిల్‌ కోడ్‌ అవసరం లేదు. హిందూ వివాహ వ్యవస్థలో ఉన్న లోపాలను పట్టించుకోకుండా ఒక్క ముస్లీం పర్సనల్‌ లాన్‌ మాత్రమే సవరించాలని ప్రయత్నించడం అది ముస్లీం ప్రజలను టార్గెట్‌ చేయడం ఇదంతా అఖండ హిందూ భారతఖండాన్ని ఏర్పా టు చేయాలన్న ఆకాంక్ష కోసమే.

అందులో భాగంగానే ఆర్టికల్‌ 370,ఉమ్మడి పౌరస్మృతి లాంటి సున్నితమైన అంశాలను రాజకీయంగా వాడుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. భూస్వా మ్యానికి వ్యతిరేకంగా పని చేయాల్సిన ప్రభుత్వం దానితో దోస్తీ చేయాల్సిన అవసరమే హిందూ మతోన్మాదాన్ని పెంచుతోంది. ఈ విధానాలు ఈ దేశం అర్థవలస, అర్థ భూస్వామ్య దేశమనే సూత్రీ కరణను మరింత బలపరుస్తున్నాయి. దేశ పేదరికానికి ముస్లీంలే కారణమనే తప్పుడు ప్రచారాన్ని పెంచుతోంది. సమాజాన్ని భిన్న మైన జాతులను, ఆహారపు అలవాట్లను గౌరవించే ప్రగతిశీల వ్యవ స్థకు ప్రయత్నించకుండా,హిందూత్వ ఆధిపత్యం వైపు నడపకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉంది.

– ఎం.కె.కుమార్‌