‘లఘువుగా మారుతున్న ‘గురువు

IMAGe
IMAGe

‘లఘువుగా మారుతున్న ‘గురువు

ప్రొఫెసర్‌ వేధింపుల వల్ల వైద్యవిద్యార్థిని బలి, విద్యా బుద్ధులు నేర్పించాల్సిన అధ్యాపకుడే కీచకుడిగా మారి విద్యార్థిని ప్రాణాలు బలిగొన్నాడు, గైడ్‌ వేధిం పుల కారణంగా దళిత విద్యార్థి ఆత్మహత్యయత్నం, అధ్యాపకుడు దూషించాడని అవమానభారంతో విద్యార్థిని బలవన్మరణం ఇలా ఒకే రోజున ఒకే దినపత్రికలో వచ్చిన వార్తాంశాలు ఇవి. ఇటువంటి వార్తలు వింటున్నప్పుడు, భారతీయ విద్యావిధానంలో సంస్కృతిలో ఒకప్పుడు గొప్పస్థానంలో నిలబడిన గురువ్ఞ ఉనికే నేడు ప్రశ్నార్థ కంగా మారుతోంది.ఒకప్పుడు ఎంతటి మహారాజు కొడుకైనా సామా న్య విద్యార్థిలాగా గురుకులాల్లో ఈత చాపలపై కూర్చుని విద్య నేర్చుకోవాల్సిందే
. మారుతున్న కాలంతోపాటు మనుషుల ప్రాధాన్య తలు మారటంతో విద్య కన్నా డబ్బే ప్రధానం కావటంతో గురువ్ఞలే ఇళ్లకెళ్లి పాఠాలు చెప్పే స్థితికొచ్చింది.అయినా కూడా గురువ్ఞకి దక్కా ల్సిన గౌరవం కొంతలో కొంత దక్కుతూనే ఉంది. కాని ఈ అంతర్జా లపు యుగంలో ఉపాధ్యాయుని ఉనికికే ప్రమాదం ఏర్పడే స్థాయి కొచ్చింది. కొంత స్వయంకృతాపరాధం అయితే అన్ని రంగాల్లో లాగానే విద్యారంగంలో కూడా పెనుమార్పులు చోటు చేసుకోవటం వాటిని అందిపుచ్చుకోలేకపోవటం కూడా ఇంకొక కారణం. ఉపాధ్యాయుడు అంటే ఉప+అధ్యాయనం.

అంటేవిద్యార్థి దగ్గర (ఉప- సమీపం) కూర్చుని చదువ్ఞ నేర్పే వాడని అర్థం. ఒక తరగతిలో ముప్పయి మంది విద్యార్థులు ఉంటే పది మంది మెరిక ల్లాంటి ఏకలవ్ఞ్యలు. ఇంకో పదిమంది చెపితే నేర్చుకునే అర్జునుల్లాం టి బుద్ధిమంతులు, మిగతా పది మంది ఒకటికి పదిసార్లు చెపితే కాని తలకెక్కని భీమసేనులు కూడా ఉంటారు. ఏకలవ్ఞ్యలకు, అర్జు నులకు గురువ్ఞ అవసరం రాకపోవచ్చు. కాని భీములు, ధుర్యోదను డి లాంటి వారికి గురువ్ఞ అవసరం ఎంతైనా ఉంది. ఎన్ని ఆన్‌లైన్‌ తరగతులు, అంతర్జాలపు పాఠాలు ఉన్నా అవి గురువ్ఞతో సమానం కావ్ఞ.చాలామంది ఉపాధ్యాయులు కూడా ఈ ఇ-టెక్నాలజీని అంది పుచ్చుకోలేక వెనుకబడిపోతున్నారు.ఇంకోపక్క స్కూల్‌ టాప ర్లు సైతం అంతర్జాలపు గదుల్లో పగలు రాత్రి అనే తేడా లేకుండా బ్రౌజింగ్‌,చాటింగ్‌లో మునిగిపోయి చివరకు పెయి¶ల్యూర్స్‌గా మిగు లుతున్నారు. ఇంటర్నెట్‌ వినియోగం యువతలో ఒకవ్యస నంగా మారి జ్ఞాపకశక్తి, తెలివి తేటలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.

యూనివర్శిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా ఆల్జీమార్స్‌ సొసైటీ తదితర సంస్థలు నిర్వహించిన ఒక సర్వేలో ఆన్‌లైన్‌ టూల్స్‌ను విపరీతంగా వాడుతున్న వారిలో 60 నుంచి 70శాతం మంది మతిమరుపు బారిన పడుతున్నారని తేలింది. మతిమరుపే కాకుండా శ్రద్ధాసక్తులు కూడా సన్నగిల్లు తున్నాయని మైక్రోసాఫ్ట్‌ సంస్థ నివేదిక చెపుతోంది. ఒక సగటు యువకుడు 12 సెకన్ల పాటు శ్రద్ధా సామర్థ్యం కలిగి ఉంటాడు.

కాని ఆన్‌లైన్‌ విధానం వల్ల ఇది 8 సెకన్లకు తగ్గిపోయి విద్యార్థుల్లో వినికిడిపై శ్రద్ధలోపిస్తుంది.ఏకాగ్రత తగ్గడం, ఉపాధ్యా యుడు చెప్పే వాటిని వినకపోవడం వల్ల విషయ పరిజ్ఞానంలో వెనుకబ డతారు. ఒకవైపు టెక్నాలజీ అవసరం, మరోవైపు టెక్నా లజీ అతి వినియోగంతో ఎన్నోఅనర్థాలు జరుగుతున్నాయి. రెండిం టి మధ్య సమతుల్యం సాధించేట్లు చూడాల్సిన బాధ్యత నేడు ఉపా ధ్యాయుల మీద ఉంది.వీరిని ఈ పెడ ధోరణుల నుండి విముక్తి కలిగించి స్వీయ ఆలోచనశక్తిని వారిలో పెంపొందించాలి. ఏ సాంకేతిక అంశమైన అతి వినియోగం వల్ల అసహనం ఆందో ళన, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు ఎక్కువ అవ్ఞతాయి. వీటి వల్లే ఇప్పుడుఎక్కువగా జరుగుతున్న ఆత్మహత్యలు విపరీత పరిణా మాలు వీటి గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉపాధ్యా యులపై ఎంతైనాఉంది.ముఖ్యంగాఅంతర్జాలంలో సబ్జెక్టుకు సంబం ధించిన అంశాలు లభ్యమవ్ఞతున్నాయి

కాని జీవితానికి కావలసిన నైతిక విలువలు, నియమాలు, జీవితంలో ఎదురయ్యే సవాళ్లు వాటి ని అధిగమించేందుకు కావలసిన మానసిక ధైర్యం వంటివి దొరకవ్ఞ. ఇవి గురువ్ఞ దగ్గర నుండి వారికి నేర్పిస్తే తప్ప అలవడవ్ఞ. వీటి పట్ల తల్లిదండ్రులు పిల్లలప్రవర్తనపై నిఘా ఉండాలి. ఉపాధ్యా యుడు, తల్లిదండ్రులకు ఇద్దరికి సమానమైన బాధ్యతఉంది. ఇది నా బాధ్యతకాదు అని ఉపాధ్యాయులు తప్పిం చుకోజాలడు. అలా తప్పించుకున్న రోజున సమాజం ముందు దోషిగా నిలబడాల్సివ స్తుంది. దేశ భవిష్యత్తు తరగతిగదుల్లో నిర్ణయించ బడుతుందనే నానుడి నిజంచేయడానికి ప్రతిఉపాధ్యాయుడు కార్యోన్ముఖుడవ్వాలి. లేకుంటే దేశయువశక్తి అంతర్జాలపు గదుల్లో నిర్వీర్యమైపోతుంది.

ఈదర శ్రీనివాసరెడ్డి
(రచయిత: ప్రిన్సిపాల్‌ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం)