ర్యాగింగ్‌ వికృతికి రాలిపోతున్న విద్యాసుమాలు

Anti Raging
Anti Raging

ర్యాగింగ్‌ వికృతికి రాలిపోతున్న విద్యాసుమాలు

రాగింగ్‌ భూతం విద్యార్థులను విడిచిపెట్టడం లేదు. ఒకటికాదు, రెండు కాదు ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. ఆంధ్రాలోని కర్నూలు జిల్లా నంద్యాలకు సవిూ పాన ఇంజినీరింగ్‌ కాలేజీలో ర్యాగింగ్‌ పైశాచికం విద్యార్థి జీవితాన్ని బలిగొనడం తీరని విషాదం. ఇంకా మన సమాజంలో ముఖ్యంగా విజ్ఞానం కలిగిన విద్యార్థుల్లో ఈ దుర్మార్గ దుర్నీతి పెచ్చువిూరడం ప్రాణాలు గాలిలో కలిసిపోవడం మానవత్వానికే మాయని కళంకం. కొందరు అధ్యాపకులు ఈ కీచక పిశాచానికి ప్రోత్సాహం ఇవ్వడం మరీ దారుణం. కళాశాల ప్రిన్సిపాల్‌ కూడా ఎలాంటి చర్యలు తీసు కోలేని బలహీనులుగా ఉంటే విద్యార్థినులకు రక్షణ ఎక్కడ? అన్నది ప్రశ్న. ప్రాణాలు పోయాక కేసులు

నమోదు చేసినా ఏం లాభం? కాలేజీల్లో కొత్తగా చేరే విద్యార్థులను సీనియర్‌ విద్యార్థులు ఏదో ఒక రూపంలో ఆటపట్టించడం ఈనాడు కొత్తగా రాలేదు. ఇది వరకు సరదాగా పరిహాసంగా ఎవరినీ కించపరచని రీతిలో ర్యాగింగ్‌ సాగేది. ప్రిన్సిపాల్‌, లెక్చరర్లు ఈ ర్యాగింగ్‌ను అసలు ప్రోత్సహించే వారు కాదు. వారికి ఫిర్యాదులు రాగానే గట్టి చర్యలు తీసుకునే వారు. కానీ ఇప్పుడు విద్యార్థులకు అండగా కొందరు అధ్యాపకులే ర్యాగింగ్‌ సంస్కృతిని కొనసాగించడం ఘోరనేరం. ముఖ్యంగా ఇంజినీరింగ్‌ కళాశాలలు పెరిగాక ఈ ర్యాగింగ్‌ రాక్షసత్వానికి అడ్డూఅదుపూ లేకుండా పోయిందన్న ఆరోపణలున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కొత్త విద్యార్థులను సీనియర్‌ విద్యార్థులకు పరిచయం చేయడమనే సంప్రదాయం నుంచి పుట్టిన ఈ వైపరీత్యం. ఇలా వెర్రితలలు వేయడం విద్యార్థుల తల్లిదండ్రులను కుంగదీస్తోంది. కేంద్ర ప్రభుత్వం దీన్ని నిరోధించడానికి చట్టాన్ని అమలులోకి తెచ్చింది. చట్టానికి భయపడి కొన్నాళ్ల వరకు ర్యాగింగ్‌ తగ్గినా మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో చెలరేగడం ప్రారంభమైంది. కొత్తగా చేరిన విద్యార్థినులను వేధిస్తే ఆరు నెలలు జైలుశిక్షతో పాటు వెయ్యి రూపాయల జరిమానా,విద్యార్థిని దౌర్జన్యంగా గాయ పరిస్తే లేదా బెదిరిస్తే ఏడాది జైలు శిక్ష రెండువేల రూపాయల జరిమానా విధించాల్సి ఉంటుంది.

ఐపిసి సెక్షన్‌ 352, 506 కింద క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తారు. నిర్బంధించినా, గాయపరిచినా, రెండేళ్లు జైలు, రూ. ఐదువేలు జరిమానా విధించే వీలుంటుంది. ఇంకా ఐపిసి సెక్షన్‌ 341, 342,324, 323 కింద కేసులు పెట్ట డానికి వీలుంది. బాధితులను గాయపరిచినా, కిడ్నాప్‌, అత్యాచారా లకు పాల్పడినా 5ఏళ్ల వరకు జైలుశిక్ష 10వేల వరకు జరిమానా విధిస్తారు.ఐపిసి సెక్షన్‌376,366, 363,325,326, 377 కింద కేసులు నమోదు చేసే వీలుంది. ర్యాగింగ్‌కు బలైన విద్యార్థి చనిపోయినా, ఆత్మహత్య చేసుకున్నా జీవిత ఖైదుతోపాటు 50వేలు జరిమానా విధించవచ్చు. ఇన్ని సెక్షన్లతో శిక్షలు స్పష్టీక రించినా ర్యాగింగ్‌కు పాల్పడిన వారిని ఎందుకు నివారించలేకపోతున్నారు? ఎందుకు వారిపై కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నారు? దీని వెనుకనున్న బలహీనతలకు ముఖ్యకారణాలు చాలా ఉంటున్నాయి. ప్రముఖ రాజకీయ నేతల బిడ్డలే ఈ ఆగడాలకు పాల్పడు తున్నారన్న ఆరోపణులు ఉన్నాయి. వారికి అండగా పలుబడులు, ఒత్తిడులు, ధనప్రవాహం చేస్తుంటాయన్న విమర్శలున్నాయి. ఈ ప్రలోభాలకు లొంగకుండా ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థుల ఫొటో లను నోటీిసుబోర్డులో, బహిరంగ ప్రదేశాల్లో, పత్రికల్లో ప్రచురిం చాల్సి ఉంటుంది. ర్యాగింగ్‌ నేరం జరిగిందని కోర్టు నిర్ధారిస్తే నిందితులు ఎవరైనా సరై కాలేజీ నుంచి బహిష్కరించక తప్పదు. అంతేకాదు రాష్ట్రంలో ఏ విద్యాసంస్థలోనూ చేర్చుకోరాదు. ఇలాంటి ఆపద ఎదురైతే బాధితులు పోలీసులకు, లేదా ప్రిన్సిపాల్‌కు కానీ, కాలేజీ యాజమాన్యానికి కానీ ఫిర్యాదు చేయాలి. అలాగే కళాశాల యాజమాన్యం విద్యార్థులను చేర్చుకునే ముందు నిబంధనల బ్రోచర్లు లేదా బుక్‌లెట్లు అందించడం చేస్తే కొత్త వారికి ఎలా ప్రవర్తించాలో సీనియర్‌ విద్యార్థుల దగ్గర ఎలా మసలుకోవాలో తెలుస్తుంది.

యాంటి ర్యాగింగ్‌ హెల్ప్‌ లైన్‌ నెంబరు, మెయిల్‌,ఐడి, ఫోన్‌నెంబర్లు, వివరాలు అందించాలి. కాలేజీలోనూ, హాస్టళ్లలోనూ యాంటీర్యాగింగ్‌ స్క్వాడ్‌ను నియమించాల్సిన అవసరం ఉంది. ర్యాగింగ్‌ వల్ల ఎదురయ్యే కష్టనష్టాలు, పేదవిద్యార్థుల భవిష్యత్తుకు వాటిల్లే ముప్పును తెలియచేసేలా ఎప్పటికప్పుడు విద్యార్థుల సమావేశాలు నిర్వహించి వారిలో మైత్రీభావం పెంపొందేలా కౌన్సిలింగ్‌ నిర్వహించడం, విద్యార్థుల శారీరక సౌందర్యం కన్నా వారి కుటుంబ పరిస్థితులు, వారి మానసిక వికాసం ఎటువంటిదో వారిలో ఇమిడి ఉన్న విజ్ఞాన ఆసక్తి ఎటువంటిదో అటువంటి శక్తి సత్పరిణామాలు నెలకొనడా నికి ఎలా దోహదపడుతుందో వివరిం చేలా కళాశాల నిర్వాహకులు సమష్టి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతైనా అవసరం. తల్లిదం డ్రుల ఫిర్యాదులు స్వీకరించడానికి వీలుగా తల్లిదండ్రుల కమిటీలను ఏర్పాటు చేయాలి, కళాశాల సాంస్కృతిక కార్యక్రమాల్లో తల్లిదండ్రు ల ప్రమేయం కూడా ఉండేలా చూడాలి. ఇటువంటివి చేస్తే కళాశాల వాతావరణం చాలా వరకు ప్రశాంతంగా మార్పు చెందడానికి వీలవ్ఞ తుంది. ఫిర్యాదులు చిన్నవైనా పెద్దవైనా తక్షణం స్పందిస్తే విద్యా ర్థులకు హానికలిగించే దుర్ఘటనలు జరగవు

-కె. అమర్‌