రైతు సమన్వయ సమితులు లక్ష్యాన్ని సాధించేనా?

Farmers
Farmers

రైతు సమన్వయ సమితులు లక్ష్యాన్ని సాధించేనా?

చేసింది చెప్పుకోవడం చాలా సులభం. చెప్పింది చేయడంమాత్రం చాలా కష్టం. ఇది అందరివల్ల అయ్యే పనికాదు. అలా చెప్పింది చేసి చూపించేవారు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. తెలుగు రాష్ట్రాలకు, దేశానికి సంబంధించిన ఈ ఏడుదశాబ్దాల కాలంలో ఎందరో నాయ కులు వచ్చారు. వెళ్లారు. కానీ అతి కొద్ది మాత్రమే ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. తెలంగాణ సాధించడంలో కానీ, ఆ తర్వాత బంగారు తెలంగాణవైపు రాష్ట్రాన్ని నడిపించడంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ శక్తిమేరకు కృషి చేస్తూనే ఉన్నారు. వాగ్దానాల మీద వాగ్దానాలు కురి పిస్తున్నారు. నష్టాలఊబిలో కూరుకుపోయిన వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా నిరంతరం ఉచితంగా రైతు లకుకరెంటు అందిస్తున్నారు. కరవ్ఞ రక్కసిని రాష్ట్రం నుండి శాశ్వతంగా పారద్రోలేందుకు ప్రాజెక్టులను నిర్మిస్తు న్నారు. వేలాది కోట్ల రూపాయల రుణమాఫీ చేశారు.

కోట్లాది రూ పాయల సబ్సిడీలతో విత్తనాలు, వ్యవసాయ పరికరాలు, యంత్రాలు, అందిస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేసి ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం వ్యవసాయం కొనసాగేందుకు రూపకల్పన చేశారు. ఈ పెట్టుబడి పథకం కోసం వచ్చే బడ్జెట్‌లో పన్నెండువేల కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లు వెల్లడించారు.

ఆది వారం హైదరాబాద్‌ శివారులో రాజేంద్రనగర్‌లోని ప్రొఫె సర్‌ జయశంకర్‌ వ్యవసాయవిశ్వవిద్యాలయంలో జరిగిన రైతు సమన్వయకర్తల సమావేశంలో సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. రైతు సమన్వయ సమితులు ఎలా పనిచేస్తాయి? రైతులకు ఏరకంగా ఉపయోగపడతాయి? తదితర విషయా లు అన్నీ వివరంగా తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు చెప్ప డమేకాదు ఎలాఅమలు చేయబోతున్నారనేది కూడా వివరిం చారు.

రైతులు దగాపడకుండా దళారీ వ్యవస్థను నియం త్రించనున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి ఉపన్యాసం తెలంగాణాలోనే కాదు అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా కోట్లాది మంది రైతులు ప్రత్యక్షంగా వీక్షించారు.అయితే ఇవన్నీ విన డానికి ఇంపుగా ఉండవచ్చు. అద్భుతంగా అనిపించవచ్చు. కార్యాచరణకు వచ్చేసరికి ఎలా ఉంటాయో? అనే అనుమా నాలు వ్యక్తమవ్ఞతున్నాయి. ఆదిలో హంసపాదు అన్నట్లు మొదలు కాకముందే ఇలాంటి సందేహాలు వ్యక్తం చేయడం మంచి సంప్రదాయం కాకపోవచ్చు.కానీ గత మూడున్నర సంవత్సరాల పాటు జరిగినా, జరుగుతున్న సంఘటనలు ఇందుకు కొంతబలం చేకూర్చుతున్నాయి.

అలాని తెలంగా ణ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని చెప్పడం లేదు. గతం లో కంటే ఎక్కువగానే ప్రజల సంక్షేమం వైపు కార్యక్ర మాలు చేపడుతూనే ఉంది.కానీ చెప్తున్న మాటలు, చేస్తున్న వాగ్దానాలు, ఇస్తున్న హామీలస్థాయిలో జరగడం లేదు. రైతులకు రుణమాఫీ చేసింది. కొంత ఊరట కలిగించిన మాటవాస్తవమే. కానీ వాయిదాల పద్ధతిలో చెల్లించడంతో రైతులకు ఈసహాయం పూర్తిగాఅందలేదనే చెప్పాలి. బ్యాం కులు చేసిన అంకెల గారడీతో రైతులు అసంతృప్తిలో ఉన్నా రు.

లక్ష రూపాయల వరకు ఇస్తామన్న వడ్డీ ప్రస్తావించడం లేదు. కొందరు నేతలు ఇచ్చేశామని ప్రకటించారు. ప్రతిప క్షాల నేతలు గ్రామగ్రామం నుండి రైతుల వివరాలు, చెల్లిం చాల్సిన వడ్డీ వివరాలన్నీ సేకరించి ప్రభుత్వానికి వేల దరఖాస్తులు పంపారు. ఇప్పుడు ఆ విషయం మాట్లాడటం లేదు. రైతులపేరు మీదఇస్తున్న సబ్సిడీలు ఏ మేరకు సద్వి నియోగం అయి నిజమైన అర్హులకు అందిందో ఒక్కసారి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే విస్తుపోయే విషయాలు వెలుగు లోకి వస్తాయి.

అలాగే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పథకం ఇది అద్భుతమైన పథకం. నిరుపేదలకు ఇంత గూడు కల్పించే ఆశయంతో ఉద్దేశించిన పథకం ఇది. ఇప్పటి వరకు ఎన్ని కట్టారు?ఎంత మందికి ఇచ్చారు? క్షేత్రస్థాయిలో వాస్తవాలు గ్రహించాలి. ఇవన్నీ ఒక్కరోజులో, ఒక నెలలో, ఒక ఏడా దిలోనే పూర్తిఅయిపోతాయని ఆశించడంలేదు.ఎంత మంద కొడిగా నడుస్తున్నాయో? ఎందుకు కాంట్రాక్టులు ముందుకు రావడం లేదో పరిశీలించాలి

.వేలాది టిఎంసిలు నిరుపయో గంగా పోతున్న నీటికి అడ్డుకట్ట వేసి బీడుభూములకు నీరు మళ్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నీటిపారుద ల ప్రాజెక్టుల నిర్మాణం మహత్తరమైందే. ఇందులో ముఖ్య మంత్రి కానీ, నీటిపారుదల శాఖా మంత్రి కానీ చూపుతు న్న శ్రద్ధ, పట్టుదల, సంకల్పం మహోన్నతమైంది. ఆయన పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది.

తెలంగాణ ప్రభుత్వ ప్రతి ష్ట ఇప్పటికే రాష్ట్రం ఎల్లలు దాటి విస్తరిస్తున్నది. కానీ అక్క డ జరుగుతున్న అవినీతి, ప్రభుత్వానికి మచ్చ తెస్తున్నది. ఇంతపెద్దఎత్తున వేల కోట్లరూపాయల పనులు చేపట్టినప్పు డు తప్పులు, పొరపాట్లు అసలే జరగకుండా ఉంటాయని చెప్పడం లేదు. కాంట్రాక్టర్లు, ప్రజల పట్లసేవాభావంతో లా భాపేక్ష లేకుండా ఈపనులు చేపడతారని కూడా ఆశిం చడంలేదు.వారి లాభాలు వారికిఉండాలి. దేనికైనా ఒక హద్దుఉండాలి. పరిమితి ఉండాలి.

ఏకంగా మూలసంకల్పా నికే తూట్లు పొడిచే పరిస్థితులు రాకూడదు. రానివ్వరాదు. ఒక్క ప్రాజెక్టు విషయంలో కూడా మిగిలిన అన్ని పథకాల విషయంలోనూ ప్రజాధనం అక్రమార్కుల పాలుకాకుండా కాపాడేందుకు సమర్థులు, నిజాయితీపరులైన అధికారులుం డాలి. వారు ఎప్పటికప్పుడు ఆచరణలో జరుగుతున్న పొర పాట్లను,అవకతవకలను,తప్పులను పాలకుల దృష్టికి తీసు కువెళ్లాలి. ఇక్కడ అది కొరవడినట్లు కన్పిస్తున్నది. కొందరు కాంట్రాక్టరులే అధికారులను నిర్దేశిస్తున్నారు.

ఎవరైనా నిజా యితీపరులైన అధికారులు వేలెత్తిచూపే ప్రయత్నం చేస్తే ముఖ్యమంత్రి పేరు చెప్పి నోరుమూయిస్తున్నారు. ముఖ్య మంత్రి ఎన్నో ఆశయాలతో ఆలోచనలతో ప్రకటించిన రైతు సమన్వయ సమితులు లక్షలాది రైతు కుటుంబాలకు అభ్యున్నతి కోసం వారి కష్టాలను తొలగించేవైపు అడుగులు వేయాలి. అప్పుడే ముఖ్యమంత్రి ఆశించిన లక్ష్యాలు నెర వేరే అవకాశాలున్నాయి.

– దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌ హైదరాబాద్‌