రైతులకు ముప్పుతెస్తున్న అవినీతి

FARMERS
FARMERS

రైతులకు ముప్పుతెస్తున్న అవినీతి

భూమిని నమ్ముకున్న వాడు ఎన్నటికీ చెడి పోడనిపాతకాలపు నమ్మకంగా మారిపో యింది. గ్రామాల్లో ఉంటూ భూమిపైనే ఆధా రపడుతూ వ్యవసాయమే జీవనాధారంగా బతకడం ఒకశాపంగా పరిణమించే దురదృష్టపురోజులు దాపురించా యి. తెలుగు రాష్ట్రాల్లో అన్నదాతల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆమాటకొస్తే దేశవ్యాప్తంగా కూడా రైతులు ఎక్కడో ఒక దగ్గర ప్రతిరోజూ పిట్టల్లా రాలిపోతున్నా రు. మొన్న పొగాకు రైతులు, నిన్న పత్తి రైతులు, మిర్చి రైతు లు ఒకరేమిటి అందరి పరిస్థితి అలానే ఉంది. రైతు సంకే ్షమమే ధ్యేయమని, వారి అభ్యున్నతే లక్ష్యమని పాలకులు ఎంతగట్టిగా చెప్తున్నారో అంతకురెట్టింపు స్థాయిలో రైతులు కష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు.

ఒక పక్క ప్రకృతిసహా యనిరాకరణ, మరొకపక్క తోటి మానవుడు చేస్తున్న దోపి డీలు, అవినీతితో రైతులు రోజురోజుకు కృంగిపోతున్నారు. అలాని ప్రభుత్వాలు ఏమి చేయడం లేదని చెప్పడం లేదు. ఉచిత కరెంటు ఇస్తున్నారు.లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి దేశంలో ఎక్కడలేని విధంగా పెట్టుబడి కింద సీజన్‌కు, పంట కు ఎకరాకు నాలుగువేల రూపాయల చొప్పున అందివ్వ బోతున్నది. అయినా ఇవేమీ రైతుల్లో విశ్వాసాన్ని కలిగించలేక పోతున్నాయి.

నమ్మకాన్ని పెంచలేకపోతున్నాయి.వ్యవసాయ ఆదాయం రెట్టింపు చేసేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర పెద్దలు చెప్తున్న మాటలను కూడా పెద్దగా నమ్మడం లేదు. గురువారం తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని సోమగూడెం చొప్పరపల్లి గ్రామంలో రైతు కుటుంబం మొత్తం ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. భార్యాభర్తలు ఇద్దరు చనిపోగా పిల్లలు ఇద్దరు చావ్ఞబతుకుల మధ్య ఆస్పత్రిలో మృత్యువ్ఞతో పోరాడుతున్నారు. తిరుపతి అనే ఈ రైతు గత ఆరుసంవత్సరాలుగా తనకున్న రెండెకరా ల తోపాటు మరో ఐదు ఎకరాలను కౌలుకు తీసుకొని కూరగా యలు పండిస్తున్నారు. సాగులో తీవ్ర నష్టం వాటిల్లడంతో తనకురుణసహాయం అందించాల్సిందిగా మంచిర్యాల పాల నాధికారికి విజ్ఞప్తి చేశారు.

అధికారులు తీసుకున్న చర్యల ఫలి తంగా ఆయనకు ఐదు లక్షల రూపాయల రుణం మంజూరు చేశారు. అయితే బెల్లంపల్లిలోని ఎండిఒ కార్యాలయంలోని ఒక ఉద్యోగి ఇరవైవేల రూపాయలు లంచం ఇస్తేనే రుణం వస్తుందని చెప్పడంతో ఏమీ చేయలేని నిస్సహాయక స్థితిలో రుణదాతల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు ప్రయ త్నం చేశారు. గతనెల ఇరవైఏడోతేదీ రాత్రిసమయంలో భార్యాపిల్ల లకు నిద్రమాత్రలు ఇచ్చారు.ఇద్దరుపిల్లలు వాంతులు చేసు కోగా భార్యమత్తులో నిద్రపోయింది. ఎవరి ప్రాణం పోలేదు. మళ్లీ మరుసటి రోజు ఇరవైఎనిమిదో తేదీ రాత్రి పండ్ల రసం లో ఎలుకల మందు కలిపి పిల్లలతో పాటు భార్యకు ఇచ్చా డు.

అప్పటికే నిద్ర మాత్రల ప్రభావంతో ఉన్న భార్య ఈ విష ప్రభావంతో మృతిచెందగా తిరుపతి అదే గదిలోఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లలకు ఇచ్చిన మందు మోతాదు తక్కువగా ఉండటంతో వారి ద్దరిని ఆస్పత్రికి తరలించిచికిత్స అందిస్తున్నారు.హృదయాన్ని కలిచివేసే ఈ సంఘటన ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది.కేవలం ఇరవైవేల రూపా యల కోసం ఆ కుటుంబం బలైంది. పిల్లలు ఇద్దరూ అనాధల య్యారు. ఇది ఆయన ఒక్కడి పరిస్థితే కాదు.

ఇలా ఎన్నో కుటుంబాలు పడుతున్నవేదన వర్ణనాతీతమని చెప్పొచ్చు. వాణిజ్యపంటలు, కూరగాయల సాగుఒకజూదంలా తయారైం ది. ఎప్పుడు ఏమవ్ఞతుందో, ధరలు ఎందుకు పెరుగుతాయో అర్థంకాకుండాపోతున్నాయి.రైతుల దగ్గరపంటలు ఉన్నప్పుడు ధరలు అడుగంటిపోతున్నాయి. వారు పూర్తిగా అమ్ముకున్న తర్వాత ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ మాయాజాలంలో అటు రైతులు, ఇటు వినియోగదారులు తీవ్రంగా నష్టపోతు న్నారు. పాలకులు ఎన్ని మాటలు చెప్తున్నా వారిలో విశ్వా సం కల్పించలేకపోతున్నారు. ఏదో ఒక సమస్య అయితే పోరాడవచ్చు,తట్టుకోవచ్చు. భరించవచ్చు. కానీ విత్తే దగ్గర నుండిపంటలను విక్రయించి డబ్బులు చేతికి వచ్చేవరకు అన్నీ సమస్యలే, మోసాలే. ప్రకృతి సృష్టించే బీభత్సాలను కొంత వరకు తట్టుకోగలం.వరదలు, కరవ్ఞలతో వచ్చే నష్టా న్ని తగ్గించుకోగలం.

కానీ తోటి మానవుడు చేస్తున్న మో సాన్ని భరించలేకపోతున్నామనే ఆ రైతుల వేదన అరణ్య రోదనగానే మారిపోతున్నది.నకిలీనాసిరకం విత్తనాలువేస్తే పంటలు పండే సమయంలో బయటపడుతుంది. అప్పటికే పెట్టుబడి అంతా పెట్టి, చేయాల్సిన శ్రమ అంతా చేసి పంటచేతికివస్తుందన్న దశలో నాసిరకమని బయటపడడంతో రైతులు కుప్పకూలి పోతున్నారు. ఆ దశలో ఏమి చేయాలో తోచక అప్పుల వాళ్ల ముందు ఆత్మాభిమానం చంపు కొనిజీవనం సాగించలేకమరో దారి కానరాక నిస్సహాయంగా ఆత్మహత్యలవైపు మొగ్గుచూ పుతున్నారు. ఆత్మహత్యలకు గురవ్ఞతున్న రైతుల్లో అధికశా తం చిన్న,సన్నకారు,మరీ ముఖ్యంగా కౌలురైతులనే విషయా న్ని విస్మరించలేం.

కౌలు రైతుల విషయంలో బ్యాంకు అధికారులు తీవ్ర నిర్లక్ష్యానికి పాల్పడుతున్నారు. బ్యాంకు అధికారుల సమావేశంలో మంత్రులు,ఉన్నతాధికారులు కలిసి తీసుకున్న నిర్ణయాలు కూడా అమలు కావడం లేదు. మంత్రు ల ఆదేశాలను చాలా బ్యాంకులు పాటించడం లేదు. రుణాలు ఇవ్వడంలో తీవ్ర జాప్యానికి పాల్పడుతున్నారు. ఇక ప్రభు త్వం నుంచి వచ్చే సహాయ కార్యక్రమాల్లో కూడా అవినీతి చోటు చేసుకుం టోంది. ఇప్పుడు తిరుపతి మరణానికి కూడా అవినీతే కారణమని చెప్పకతప్పదు.

తిరుపతి ఒక్కడే కాదు లక్షలాది మంది రైతులు అధికారుల చుట్టూ తమ సమస్యల పరిష్కారం కోసం చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. ప్రతి స్థాయిలోనూ అవినీతి తాండవిస్తున్నది. ఇది రైతులకు ప్రాణ గండంగా మారుతున్నది. పాలకులు మూడోకంటికి తెలియ కుండా జరుగుతున్న అవినీతిని పట్టించుకోకపోతేపోయారు పబ్లిక్‌గా అందరూ చూస్తుండగా బెదిరించి వసూలు చేస్తు న్న అవినీతిని అరికట్టాలి. అన్నిటికంటే ముఖ్యంగా రైతులు ఎదు ర్కొంటున్న సమస్యలను అర్థంచేసుకొని మాటలతోకాకుండా ఆదుకునేందుకు చేతల్లో చూపాలి. అప్పుడే వారిలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ఈ ఆత్మహత్యలు ఆగుతాయి.

 దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌, హైదరాబాద్‌