రానిబాకీల కట్టడికి ‘సిబిల్‌ ‘ స్కోరు కీలకం!

Bank
Bank

రానిబాకీల కట్టడికి ‘సిబిల్‌ ‘ స్కోరు కీలకం!

బ్యాంకుల్లో పెరిగిపోతున్న నిరర్ధక ఆస్తులను కట్టడి చేసేందుకు వాణిజ్యబ్యాంకులతోపాటు రిజర్వు బ్యాంకు సైతం లెక్కకు మించిన చర్యలు తీసుకుంటున్న ప్పటికీ ఏటికేడాది ఈ మొండిబకాయిలు పేరుకుపోతు న్నాయి. వీటికి ఇకపై మోక్షం లభించేటట్లు కనిపించడం లేదు. బ్యాంకింగ్‌ వ్యవస్థలో వృద్ధికి ప్రధాన ఆటంకంగా ఈ నిరర్ధక ఆస్తులేనని ప్రత్యేకించి చెప్పనవసరంలేదు.

రుణాలు పొందే అభ్యర్ధుల గతచరిత్ర, ఆర్ధిక స్తోమత వంటి వాటి ఆధారంగా బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి. ఎక్కువశాతం కార్పొరేట్‌ రంగాలకే వేలకోట్లలో రుణాలు మంజూరుచేస్తున్న సందర్భాలు మనబ్యాంకింగ్‌ వ్యవస్థలో కోకొల్లలు. ఈ తీసుకున్న రుణాలు కాలంలో చెల్లించకపోవడం, రుణాలను పునర్‌వ్యవస్థీకరించుకోవ డం వంటి చర్యలతోనే బ్యాంకులు సరిపెడుతున్నాయి. ఈవిధానాలను కట్టడిచేసి బ్యాంకుల్లో పేరుకుపోతున్న నిరర్ధక ఆస్తులను నియంత్రించేందుకు రిజర్వుబ్యాంకు ప్రవేశపెట్టిన కార్యాచరణ ఆచరణలో విజయవంతం అయితే అంతకంటే మంచి విధానం మరోటి ఉండదు. క్రెడిట్‌ ఇన్‌ఫర్మేషన్‌బ్యూరో ఇండియా లిమిటెడ్‌ (సిబిల్‌) ఇచ్చే స్కోరు ఆధారంగా రుణాలు మంజూరుచేయాలని తప్పనిసరిచేసింది.

బ్యాంకులన్నీ ముద్దుగా పిలుచుకునే సిబిల్‌ స్కోరు ఇకపై కీలకం కానుంది. ఇప్పటివరకూ బ్యాంకు మేనేజర్లకు విచక్షణాధికారా లుండటంతో ఇబ్బడిముబ్బడిగా రుణాలు మంజూరు చేయడం, కొన్నిప్రలోభాలకు తలొగ్గి రుణాలు జారీచేయ డం జరుగుతున్నది.ఇకపై ఆర్‌బిఐచేపట్టిన సిబిల్‌ స్కోరిం గ్‌ ప్రతిపాదనలవల్ల ఈ విచక్షణాధికారాలకు అడ్డుకట్ట వేయవచ్చు.సహకార బ్యాంకులుసైతం సిబిల్‌పరిధిలో నికి రావాలనే ఆర్‌బిఐ భావిస్తోంది.రైతులు తీసుకుంటు న్న స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలమంజూరు చెల్లింపు ప్రక్రియను సిబిల్‌లో నమోదుచేసేటట్లు ఆర్‌బిఐ మార్గ దర్శకాలు విడుదలచేస్తోంది.దేశవ్యాప్తంగాఅన్ని ప్రభుత్వ, ప్రైవేటురంగ బ్యాంకులువిధిగా సిబి రుణరేటింగ్‌ పాటిం చాలని ఆదేశాలు సైతం జారీచేసింది. ప్రైవేటు బ్యాంకు లు విధిగా నూరుశాతం అమలుచేస్తున్నా, ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కొన్నింట మాత్రం ఇప్పటికీ విచక్షణమేరకు రుణాలు మంజూరువుతున్నాయనే చెప్పాలి. ఇకపై ఆ విధానానికి చెల్లుచీటీ చెప్పడంవల్ల రానిబాకీలను సాధ్య మైనంతగా కట్టడిచేయగలుగుతామని కేంద్ర బ్యాంకు భావిస్తోంది.అయితే రుణగ్రహీతల సామర్ధ్యం, చెల్లింపుల చరిత్ర వంటి వాటిని పరిగణన లోనికి తీసుకుని రుణా లు మంజూరుచేసినా తిరిగి కావాలనే వాటిని చెల్లించ కుండా ఎగవేస్తే పరిణామాలు ఏమిటన్న అంశాలపై కూడా ఆర్‌బిఐ దృష్టిసారించాల్సి ఉంటుంది.బ్యాంకులు విధిగా కేసులు నమోదుచేస్తున్నాయి.ఆపై న్యాయ స్థానా లకు వెళ్లడం, రికవరీ విధానం అంతా జాప్యం జరుగు తోంది.

ఈపద్ద్థతికి చెక్‌పెట్టేందుకే సిబిల్‌ చరిత్ర ఆధారం గా రుణాలు ఇవ్వాలని ఆర్‌బిఐ సూచిస్తోంది. బ్యాంకుల కు వచ్చిన నగదును కొందరు ఖాతాదారులు రుణాలు తీసుకునితరచూ ఎగవేసేవారికి ఇచ్చే అవకాశం లేకుండా మరింతగా కట్టుదిట్టంచేయాలన్న ఆర్‌బిఐ వైఖరి మంచి దే. అదేజరిగితే వచ్చే ఏప్రిల్‌ ఒకటవ తేదీనుంచి వ్యక్తి గతరుణాలు,వాహన,విద్య,ఆస్తి తాకట్టురుణాలకు సిబిల్‌ స్కోరు ప్రామాణికంగా మారుతుంది. రుణాలకు ఇచ్చేరేటింగ్‌లో ఎవ్వరికైనా700స్కోరుదాటితేనే రుణం మంజూరవుతుంది.ఇందులో బ్యాంకు మేనేజర్లకు ఎలాం టి మినహాయింపులు ఉండవు.ప్రస్తుత విధానంలో ఉన్న ట్లు దరఖాస్తును పరిగణనలోనికి తీసుకోడానికి బ్యాంకు మేనేజ్‌మెంట్‌ వ్యవస్థను సిబిల్‌స్కోరులేనిదే అంగీకరించే పరిస్థితులుండవు.

గతంలో రుణాలు ఎగవేయడం, వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్లు చేసుకోవడంవంటి సంఘటనలుంటే అర్హతలున్నా అడిగినంతగా రుణాలివ్వరు.కొంత రుణం ఇచ్చి తర్వాత చెల్లింపుల విధానం బట్టి అదనపు రుణం మంజూరవుతుంది. ఏకంపెనీ అయినా రానిబాకీల జాబి తాలో ఉంటే వారికి కూడా అప్పు పుట్టదు. ఆకంపెనీ ఛైర్మన్‌ మేనేజింగ్‌ డైరెక్టరు, ఇతర కీలకపదవుల్లో ఉన్న వారైనాసరే రుణం మంజూరుకానేకాదు. క్రెడిట్‌కార్డులు విచ్చలవిడిగా వాడుతూ తిరిగి సకాలంలో చెల్లించకపో యినా సిబిల్‌స్కోరు తగ్గిపోతుంది.ఇంటిరుణాలపై బ్యాం కులు ఇప్పటికే 75శాతం స్కోరుప్రామాణికంగా తీసు కుంటాయి.దీనివల్ల 40శాతం దరఖాస్తులు తిరస్కరణకు గురవుతాయి.

నెలకు లక్షరూపాయల జీతం ఉన్నా సిబిల్‌స్కోరు లేకుంటే ఇంటిరుణం పొందేవీలుండదు. ఇటీవలికాలంలో ఐటిరంగ నిపుణులు,ఉద్యోగులు ఎక్కువ క్రెడిట్‌కార్డులు వినియోగిస్తున్నారు. వీరి సిబిల్‌ స్కోరు సక్రమంగా లేకపోవడంవల్లనే వీరికి రుణాలు అందడంలేదని ఒకపరిశీలనలో సైతం తేలింది. క్రెడి ట్‌కార్డుల విషయంలో సిబిల్‌స్కోరు ప్రభావితం కాకుండా చూసినా వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి. ఇటువంటి సందర్భాల్లో సిబిల్‌స్కోరు పడిపోతుండటంవల్ల వారికి ఇకపై అప్పు పుట్టని పరిస్థితులు ఉంటాయి. ఈవిధానంవల్ల బ్యాంకుల రుణరేటింగ్‌ కూడా తగ్గుతుందని కొంత వినిపిస్తోంది. ఈ సిబిల్‌ స్కోరు ఆధారంగా దరఖాస్తుల పరిశీలన జరిగితే మెజార్టీ సంఖ్యలో తిరస్కరణకు గురవుతాయని బ్యాంకర్లే చెపుతున్నారు

పెద్దనోట్ల రద్దు ప్రభావంతో బ్యాంకులకు భారీ మొత్తంలో డిపాజిట్లు రావడం వల్ల రుణాలు మరింతగా మంజూరుకు ఆస్కారం ఉంది. అయితే సిబిల్‌స్కోరు లేనిదే రుణం మంజూరు చేస్తే సంబంధిత మేనేజర్‌ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆర్‌బిఐ విడుదలచేసిన తాజా మార్గదర్శకాలు, ఆదేశా లతో ఇకపై కార్పొరేట్లకు రుణం మంజూరు చేసేముందు బ్యాంకర్లు ఒకటికిరెండుసార్లు పునఃపరిశీలనచేసి ముందు కు వెళ్లాల్సి ఉంటుంది. లేనిపక్షంలో బ్యాంకురుణం ఎం దుకు ఎలా మంజూరు చేసారన్న విచారణలు ఎదుర్కొ నాల్సి ఉంటుందనడంలో సందేహంలేదు.

-దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌, వార్త