రాజీనామా వెనుక ఆంతర్యం?

Nazeeb jung
Nazeeb jung

రాజీనామా వెనుక ఆంతర్యం?

దేశంలో రాజకీయకారణాలతోకొందరు తమతమ పదవులనుంచి వైదొలుగుతుంటే మరికొందరు పాలకుల మైండ్‌గేమ్‌తో అసహనంపెరిగి తమ పాతవృత్తులనే ఎంచుకుని తప్పుకునేందుకు ప్రయత్నిస్తు న్నారు. ఈ దిశగా ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌ రాజీనామా మరోసారి ప్రకంపనలు సృష్టించిందనే చెప్పాలి. గతంలో ఆర్‌బిఐగవర్నర్‌గా రఘురామ్‌రాజన్‌ పదవినుంచి దిగిపోయినవైనం ఎంత సంచలనానికి దారితీసిందో ప్రస్తుతం నజీబ్‌ జంగ్‌ రాజీనామా కూడా అంతేప్రకంపనలు సృష్టించిందని చెప్పాలి. దేశరాజధాని ఢిల్లీ కేంద్రపాలితప్రాంత రాష్ట్రంలో పాలకపార్టీకి కంటిమీ ద కునుకులేకుండాచేసిన వ్యక్తిగా నజీబ్‌జంగ్‌ పేరుతెచ్చు కున్నవ్యక్తి. ఢిల్లీప్రభుత్వ లెఫ్టినెంట్‌గవర్నర్‌గా ఆమ్‌ ఆద్మీ పార్టీతో ఒకవిధంగా చెప్పాలంటే ఉప్పునిప్పుగా నడిచా రు. గడచిన కొద్దినెలలుగా వైదొలగాలనే భావిస్తున్నా మని, తనకు ఎంతోఇష్టమైనబోధనారంగంవైపునకు వెళ్లా లని యోచిస్తున్నట్లు జంగ్‌ వెల్లడించడం మింగుడుపడ టంలేదు.

జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాల యం వైస్‌ఛాన్సలర్‌గా పనిచేసిన నజీబ్‌జంగ్‌ తిరిగి అదే వృత్తికే అంకితమయ్యే లక్ష్యంతో వైదొలుగుతున్నట్లు వెల్ల డించినా రాజకీయ పరిణామాలే ఇందుకు కారణమయ్యా యని ప్రత్యేకించి చెప్పనవసరంలేదు. కేంద్ర ప్రభుత్వం పైనిత్యం విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఒకవిధంగా బర్త రఫ్‌కుకూడాగురైన ఆప్‌అధినేత కేజ్రీవాల్‌ తిరిగిఅనూహ్య మెజార్టీతో పాలనపగ్గాలు చేపట్టినప్పటినుంచి కేంద్రం తీరును విభేదిస్తూనే వచ్చారు. ప్రత్యేకించి గవర్నర్‌లక్ష్యం గా పోరుసాగించారు.

గవర్నర్‌గా నజీబ్‌జంగ్‌ నిర్ణయా లను ఒక దశలో సుప్రీంకోర్టుసైతం అభిశంసించింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలకు కొనసాగే హక్కుందని లేనిపక్షంలో ప్రభుత్వం పనిచేయలేదని వ్యా ఖ్యలుకూడా చేసింది. ఐతే ఢిల్లీ ఒకరాష్ట్రం కాదని, లెఫ్టి నెంట్‌ గవర్నర్‌కు కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయని చేసిన వాదనలను ఢిల్లీ హైకోర్టు ఆమోదించింది. అదేవి ధంగా అప్పట్లో కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టు జంగ్‌ నిర్ణయాలను ఒకవిధంగా సమర్ధించిందనే చెప్పా లి. దేశరాజధానినగరం కావడం అందులోను కేంద్రపా లితప్రాంతంకావడంతో గవర్నర్‌గాజంగ్‌కు కొన్ని పాలనా పరమైన అదికారాలుంటాయని, ప్రభుత్వ నిర్ణయాలను అవసరమైతే నిలిపివేయడం, లేదా రద్దుచేసే అధికారా లున్నాయని రూలింగ్‌ ఇచ్చింది. అయితే కేజ్రీవాల్‌ ఈ తీర్పుపై సుప్రీంలో సవాల్‌చేయడం వచ్చే జనవరిలో విచారణకు రానున్న ఈకేసులోకూడా ఢిల్లీ గవర్నర్‌ అధి కారాలు కీలకం అవుతున్నాయి. ఇంకా 18 నెలల వ్య వధి ఉన్నప్పటికీ నజీబ్‌జంగ్‌ రెండేళ్లకాలంలోనే పదవి నుంచి దిగిపోవాలని నిర్ణయించుకోవడం ఆప్‌ పార్టీకి ఆనందంగానే ఉన్నా రాజకీయ నిపుణుల్లోమాత్రం ఇది మంచి పరిణామం కాదన్న అభిప్రాయాలను కేంద్రం గమనించాలి.

ఆయన పాలనహయాంలో రెండేళ్లూ ఆప్‌ పాలక ప్రభుత్వంతో నిరంతరయుద్ధం చేస్తూనే ఉన్నారని చెప్పాలి. 2013లో అప్పటి యుపిఎ ప్రభుత్వంలోనే జంగ్‌ లెప్టినెంట్‌ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. మధ్యప్రదేశ్‌ ఐఎఎస్‌ అధికారిగా ఉన్న జంగ్‌ విశ్వవిద్యా లయ వైస్‌ఛాన్సలర్‌గా ఢిల్లీలోపనిచేసిన అనుభవంతో తిరిగి బోధనారంగానికే వెళుతున్నారని ఆయన సన్నిహి తులు చెపుతున్నా కేంద్రపాలిత ప్రాంతంలోనెలకొన్న రాజకీయ పరిస్థితులు ఆయన్ను కలిచివేసాయని ప్రస్తుత రాజకీయాలతో ఇమడలేకనే జంగ్‌ రాజీనామాచేసినట్లు రాజకీయ పరిశీలకులుచేస్తున్న విశ్లేషణలు గతంలో జరి గిన సంఘటనలకు అద్దంపడుతున్నాయి.

ఆయనపదవీ కాలం మొత్తం కేంద్రప్రభుత్వం, ఆమ్‌ఆద్మీపార్టీ ప్రభుత్వ నిర్ణయాలతో నిత్యం రాజ్‌భవన్‌ ఉద్రిక్తంగానే నడిచింది. 18నెలలకాలంలో గవర్నర్‌గా నజీబ్‌జంగ్‌ ఢిల్లీ ముఖ్య మంత్రి కేజ్రీవాల్‌, తమతమఅధికారాల పరిధిలపైనిత్యం పోరాటంచేసారనేచెప్పాలి. ఒకదశలోరిలయన్స్‌తో నజీబ్‌ జంగ్‌జట్టుకట్టారని ముకేష్‌ అంబానీతో సన్నిహితంగా ఉన్నారని, కేంద్ర ప్రభుత్వానికి ఏజెంట్‌గా పనిచేస్తున్నా రని ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్‌ విరుచుకుపడ్డారు. విద్యుత్‌శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి శకుంతలా గామ్లిన్‌ను తాత్కాలిక ముఖ్యకార్యదర్శిగా నియమించినప్పటి నుంచి జంగ్‌కు వివాదాలు మొదలయ్యాయి. ఆమె నియామకం చివరకు రాష్ట్రపతి వద్దకుసైతం చేరింది.

విద్యుత్‌కంపెనీ లతో నిత్యం లాబీయింగ్‌ చేసిన వ్యక్తికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదా ఎలా ఇస్తారని ఢిల్లీ పాలకులు కేంద్రా నికి లేఖలు రాయడంతో ఈ నియామకాన్ని పక్కన పెట్టాలని ఆదేశాలు జారీచేయక తప్పలేదు. ఒక దశలో అన్ని శాఖల కార్యదర్శులు, అధికారులకు జంగ్‌ ఆదేశా లను అమలుచేసే ముందు తనను సంప్రదించాలని కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి ట్విట్టర్‌లో వ్యాఖ్యలు చేసారు. గవర్నర్‌, ముఖ్యమంత్రిమధ్య జరిగిన పతాకస్థాయి పోరుకు ఈ వ్యాఖ్యలు దర్పణం పడతాయి. 15 వేల మంది తాత్కాలిక టీచర్ల సర్వీసులను క్రమబద్దీకరించ డం, భూసేకరణ పరిహారం ప్రస్తుతం ఉన్న ధరకంటే మూడు కోట్లకు పెంచడం, అక్షయ పాత్రను మధ్యాహ్న భోజన పథకానికి నియమించడం వంటి వాటిపై ఇరు వురిమధ్య పతాక స్థాయిలోనే నడిచాయి.

ఇవన్నీ ఒక ఎత్తైతే అకస్మాత్తుగా గవర్నర్‌ రాజీనామా నిర్ణయం రాజ కీయ పార్టీలకు అంతుబట్టడం లేదు. బోధనా వృత్తిలోనికి వెళతానని ప్రకటించిన జంగ్‌ తన మనో గతం వెల్లడించకుండా తనలోనే దాచుకున్నట్లు అవగతం అవుతోంది

-దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌, వార్త