మేలుకోకుంటే ముప్పే!

మేలుకోకుంటే ముప్పే!

drugs
drugs


మా దకద్రవ్యాల వ్యాపారం, వినియోగం అంతకంతకు పెరిగిపోతుండటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తం అవ్ఞతున్నది. మొన్న హైదరాబాద్‌ నడిబొడ్డులో ఒక విదేశీ మహిళ నుండి అత్యంత విలువైన కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు ఈ వ్యాపారంలో ఒక మహిళ అరెస్టు కావడం ఇదే మొదటిసారి. గతంలో నైజీరియన్లు, ఆఫ్రికన్లు ఎందరో విదేశీ యువకులు మత్తుపదార్థాలు సరఫరా చేస్తూ పట్టుబడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. వారిని అరెస్టు చేయడం, జైళ్లకు పంపడం జైళ్ల నుంచి తిరిగి వచ్చి అదే వ్యాపారంలో కొనసాగుతున్న విషయం అనేకసార్లు బయటపడింది. పోలీసులు కానీ, ఈ చట్టాలు కానీ ఈ వ్యాపారాన్ని అడ్డుకోలేకపోతున్నాయి.

ఒక్క తెలంగాణాలోనే కాదు దేశవ్యాప్తంగా ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాపారం చాపకిందనీరులా విస్తరిస్తూనే ఉంది. మెక్సికో కేంద్రంగా రకరకాల మార్గాల్లో అన్ని దేశాల్లోకి ప్రవేశిస్తున్నది. ఏటా కొకైన్‌, బ్రౌన్‌షుగర్‌ లాంటిమాదకద్రవ్యాలు ఏడెనిమిది టన్నుల వరకు ప్రపంచవ్యాప్తంగా సరఫరా అవ్ఞతున్నట్లు అనధికార అంచనాలను బట్టి తెలుస్తున్నది. లక్షలాది కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నట్లు, ఇది ఏడాదికెడాదికి పెరిగిపోతున్నది. గతంలో హైదరాబాద్‌లో కూడా పెద్దఎత్తున ఈ మాదకద్రవ్యాలు పట్టుబడటం, అందులో రాజకీయ, సినీ పెద్దల పేర్లు కూడా వినిపించాయి.

అప్పుడు ఉన్న పోలీసు కమిషనర్‌ ఏకంగా ప్రెస్‌ కాన్ఫరెన్స్‌పెట్టి కొందరు పేర్లు బయటపెట్టి మరికొందరి ప్రముఖుల పేర్లు ఉన్నాయని దర్యాప్తు జరుగుతుంది కనుక ఆధారాలు లభిస్తే వారిని కూడా వదిలిపెట్టబోమని ప్రకటించారు. ఈ డ్రగ్స్‌వ్యాపారంలో ఎంతటి పెద్దవారు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని పాలకులు ఎప్పటికప్పుడు ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఆ తర్వాత ఎక్సైజ్‌ శాఖ కూడా ఆవైపు దృష్టిసారించి పెద్దఎత్తునే ఈ మత్తుపదార్థాలను పట్టుకున్నారు. ఆ సందర్భంగా ప్రముఖులను విచారించేందుకు కూడా సిద్ధం చేశారు. ఈ మేరకు ప్రకటనలు కూడా ఇచ్చారు. కానీ ఎందుకో ఆ కేసులు ఏమైయ్యాయో? దర్యాప్తులో ఏం తేలిందో నేటికీ వెలుగు చూడలేదు.

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యాపారం జోరందుకున్నట్లు ఏకంగా ఒక మహిళ పట్టుబడటంతో వెలుగులోకి వస్తున్నది. విదేశీ యువకులపై పోలీసులు కన్నువేసి తనిఖీలు చేస్తుండటంతో ఈ వ్యాపారులు ఏకంగా మహిళలనే రంగంలోకి దించినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నా యి. ఇప్పుడు ఈ వ్యాపారాన్ని విస్తరించేందుకు చిన్న చిన్న పిల్లలకు కూడా అలవాటు చేస్తున్నారు. ఏడు, ఎనిమిది తరగతులు చదువ్ఞతున్న విద్యార్థులకు కూడా మభ్యమాటలతో మోసగించి వాడకం అలవాటు చేస్తున్నారు. బడిపిల్లలు కూడా చాక్లెట్లు కొనుకున్నంత తేలికగా ఈ మత్తుపదార్థాలను కొనివాడేస్తున్నారంటే వాడకం ఏస్థాయిలోకి ఎగబాకిందో చెప్పకనే చెబుతున్నది.

ఉగ్రవాదం తర్వాత ప్రపంచానికి అత్యంత ప్రమాదకరమైనదిగా మాదకద్రవ్యాల వ్యాపారం రూపాంతరం చెందింది. వ్యాపారుల మధ్యపోటీ హత్యలకు కూడా దారితీస్తున్నట్లు సమాచారం. మలేషియా, థాయిలాండ్‌ వంటి దేశాలు మాదకద్రవ్యాలను నియంత్రించేందుకు ఈ వ్యాపారాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలనే ఉద్దేశ్యంతో అప్పుడప్పుడు సైన్యాన్ని కూడా రంగంలోకిదింపుతున్నది. ఉగ్రవాదం మాదిరిగానే మత్తుమందుల వ్యాపారానికి సరిహద్దులు లేవ్ఞ. ఎక్కడో లాటిన్‌ అమెరికా దేశాల్లో తయారు అయిన మాదకద్రవ్యాలు నిఘా సంస్థల కళ్లుకప్పి భద్రతా వలయాలను తప్పించుకొని అవసరమైన చోటుకు చేరుకుంటున్నాయి.

వాటి నియంత్రణకు పటిష్టమైన వ్యవస్థ లేదనే చెప్పొచ్చు. కానీ మనదేశంలో పరిస్థితి రానురాను దిగజారుతున్నది. చివరకు సిగరెట్లో మాదకద్రవ్యాలు నింపి అమ్మకాలు సాగుతున్నాయి. విదేశాల నుంచి వాయు, జలమార్గాల ద్వారా ఈ మందులు దేశంలోకి ప్రవేశిస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఈ వ్యాపారులు వ్యూహాలు మార్చుకుంటూ సరిహద్దులను దాటిస్తున్నారు. మత్తుపదార్థాలు ఏ రూపంలో ఎక్కడ ఉన్నా నిర్దాక్షిణ్యంగా కూకటివేళ్లతో పెెకిలించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు ఈ రక్కసి సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. మొత్తం ఈ మాదకద్రవ్యాల విషవలయంలో బలైపోతున్నది యువతీయువకులే.

ఒక వ్యూహం ప్రకారం ఎరవేసి ఈ మత్తులోకి దించుతున్న ఈ ముఠాల ఆటలు కట్టించకపోతే భవిష్యత్తులో జాతి భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఇప్పటికే ఈ మాదకద్రవ్యాల ప్రభావం సమాజంపైతీవ్రంగా చూపుతున్నది. హత్యలు, అత్యాచారాలు తదితర నేరాలు పెరిగిపోతున్నాయి. ఈ మాదకద్రవ్యాల మత్తులో వారు ఏం చేస్తున్నారో వారికే తెలియకుండా నేరాలకు పాల్పడుతున్నారు. అన్నిటికంటే పరిస్థితి ఇంత తీవ్రం కావడానికి పొగమంచులా విస్తరించడానికి కారకులు ఎవరు?

కారణాలు ఏమిటి? ఇందులో ముందుగా తప్పు పట్టాల్సింది పాలకులనే. రెండు మూడు దశాబ్దాలుగా ఈ రక్కసి విస్తరిస్తుంటే నిఘా విభాగం అధికారులు ఏంచేసినట్లు? ఇప్పటికైనా ఈ విషయంలో పాలకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వాడకం, విక్రయం తీవ్రతను పాలకులు గుర్తించాలి. రాజకీయాలకు అతీతంగా ఈ వ్యాపారాన్ని నిరోధించేందుకు కేంద్ర,రాష్ట్ర పాలకులు అందరూ త్రికరణశుద్ధిగా కృషి చేయాలి. ఈ యజ్ఞంలో ప్రజలను అప్రమత్తం చేసి భాగస్వాములను చేయాలి.

  • దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌, హైదరాబాద్‌