మత్స్య పరిశ్రమలో దళారీ తిమింగలాలు!

AQUA11
AQUA

మత్స్య పరిశ్రమలో దళారీ తిమింగలాలు!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో తమ బతుకులకు భరోసా లభిస్తుందని ఇక్కడి సమాజంలోని అన్నివర్గాల ప్రజ లు ఆశించినట్లుగానే, భవిష్యత్తుపట్ల వారిలో ఆశలు చిగురించినట్లుగానే వలసపాలనలో తీవ్రమైన నిర్లక్ష్యా నికి వివక్షకు గురైన తెలంగాణ ప్రాంత మత్స్యకారులు సైతం తమ జీవితాల్లో వెలుగులు ప్రసరిస్తాయని విశ్వాసం పెంచుకున్నారు. తెలంగాణాలోని మత్స్యకారుల గురించి ముఖ్యమంత్రి సానుభూతి అనునయాలు అనేక సందర్భాలలో చూపించడంతో పెరిగిన ఆత్మవిశ్వాసంతో పొంగిపోయారు.కానీ రెండున్నర సంవత్సరాల కాలంలో ప్రభుత్వం నుండి ఎలాంటి సానుకూలచర్యలు కానరాకపోవడంతో, తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మత్స్యకారుల కుటుంబాలు నిరాశ, నిస్పృహ లకు లోనవ్ఞతున్న సమయంలో ఇటీవలి వర్షాలకు నిండిన చెరువ్ఞ ల్లో ఉచితంగా చేపవిత్తనాలను సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి చేసిన ప్రకటన వారిలో పునరుత్తేజాన్ని నింపింది. ప్రకటించినట్లుగానే సుమారు 48 కోట్ల రూపాయల ఖర్చుకాగల 35 కోట్ల చేపపిల్లలను ఎంపిక చేసిన 4533 చెరువ్ఞల్లో గతంలో ఎన్నడూలేని రీతిలో పూర్తి ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమానికి అక్టోబర్‌ మూడవ తేదీ నుండి శ్రీకారం చుట్టడంతో చేపల వృత్తిపై ఆధారపడిన సుమారు నాలుగు లక్షల మత్స్యకార కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నా యి.

అయితే చెరువుల్లో పూర్తి ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేసినంతమాత్రాన తమ వృత్తిని ఆవరించి ఉన్న సమస్యల వలయం నుండి తెలంగాణ రాష్ట్రంలోని మత్స్యకారులు ఒడ్డుకు చేరడం సాధ్యంకాదని వారు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని గొలుసుకట్ట చెరువ్ఞల్లోనూ కుంటలు, తదితర స్థానికచిన్ననీటి వనరుల్లోనూ సాంప్రదాయ పద్ధ తుల్లో చేపలను పెంచిన కాలంలో చేపవిత్తనాల అవసరం ఉండేది కాదు. వర్షాలు కురవక చెరువ్ఞలు ఎండిపోయే పరిస్థితులు ఏర్పడిన ప్పుడు చెరువ్ఞ సమీపంలోనే ప్రత్యేకంగా ఒక చెలిమె (చేపపిల్లలను పెంచడానికి ఉపయోగించేది) లేదా వ్యవసాయబావిలో చేపవిత్తనాల తయారీకి అవసరమైన ప్రత్యేక ఏర్పాటు మత్స్యకారులే స్వయంగా ఏర్పాటుచేసుకునేవారు.పెరిగిన జనాభాతోపాటు చేపల వినియోగం పెరగడంతో హైబ్రీడ్‌ వెరైటీ చేపల పెంపంకం ఊపందుకున్నది.

ఫలితంగా చేపవిత్తనాల పెంపకం మత్స్యపరిశ్రమకు ఒక ముఖ్య మైన అనుబంధ పరిశ్రమగా ఎదిగింది.దీనికోసం ప్రత్యేక చేపపిల్లల పెంపకం కేంద్రాలు ఏర్పాటయ్యాయి. తెలంగాణలో చేపల పెంపకా నికి అనువ్ఞగా ఉన్న సుమారు 35వేల చెరువ్ఞల్లో ప్రతియేటా చేపపిల్లల విత్తనాలను అందించడానికి కనీసం 130 కోట్ల చేపపిల్లల అవసరం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర పరిధిలో ప్రభుత్వం నెల కొల్పిన 28 చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలలో గరిష్టంగా కేవలం మూడుకోట్ల చేప పిల్లలను ఉత్పత్తిచేయగల సామర్థ్యం మాత్రమే ఉన్నది. అందువల్ల తెలంగాణ ప్రాంతంలోని చెరువ్ఞల్లో చేపలపెంప కానికి అవసరమైన చేపవిత్తనాల కోసం ఆంధ్రా ప్రాంతంలోని (ముఖ్యంగా ఉభయగోదా వరి జిల్లాలపై) చేపపిల్లల ఉత్పత్తి కేంద్రా లపైనే ఆధారపడాల్సి వచ్చింది.సీమాంధ్ర పాలకుల పక్షపాతధోర ణులు, తెలంగాణ ప్రాంత నాయకుల నిర్లక్ష్యం, ఇక్కడి మత్స్యపారి శ్రామిక సహకార సంఘాల అశక్తతల కారణంగా ఉమ్మడి రాష్ట్రంలోనే కాకుండా నేటికీ నిరాటం కంగా కొనసాగుతున్నది.

తమ చెరువ్ఞల్లో పెంచుకోవడానికి ఆంధ్రా ప్రాంతం నుండి చేప పిల్లలను కొని తెచ్చుకోవడానికి అవసరమైన పెట్టుబడి మూలధనం అందు బాటులో లేకపోవడం, బ్యాంకుల నుండి ఇందుకోసం ప్రత్యేకంగా రుణసౌకర్యం అందకపోవడం, తది తర కారణాల వల్ల తెలంగాణ చెరువ్ఞలపై మధ్య దళారీలు, కాంట్రా క్టర్ల పాత్ర ఇక్కడి చెరువ్ఞల్లో చేపవిత్తనాల సరఫరాతోనే ప్రారంభమ వ్ఞతుంది. ఆంధ్రాప్రాంతం నుండి చేపవిత్తనాలను దిగుమతి చేసుకో వడానికి అవసరమైన పెట్టుబడి మూలధనాన్ని సమకూర్చే కాంట్రాక్టర్‌ చెరువ్ఞలపైనా, చెరువ్ఞల్లో చేపల పెంపకంపైనా చేపల వ్యాపారం పైనా పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని స్వంతం చేసుకున్నారు.

మత్స్యకారులకు సంబంధించిన కొంతమంది కులపెద్దల లోపాయికారీ సహ కారం కూడా ఇందుకు తోడయ్యింది.ప్రభుత్వ పెద్దలెవ్వరికీ పట్టింపు లేనిమత్స్యశాఖలో అధికారుల అలసత్వానికి,అవినీతికి అంతులేకుం డా పోయింది. సహకార చట్టంలోని లొసుగులు, మత్స్యసహకార సొసైటీలలోసభ్యులుగా,బాధ్యులుగా ఉన్నవారి నిరక్షరాస్యత, అమా యకత్వం అధికారుల అవినీతిని మరింతగా పెంచిపోషించింది. విత్తన కేంద్రంలో ఉత్పత్తి చేసే ఒక చేప పిల్లకయ్యే ఖర్చు మొత్తంగా సగటున 40 పైసల నుండి 55 పైసలయితే ప్రభుత్వం ఒక రూ పాయి నుండి మూడు రూపాయలకు కొనుగోలు చేస్తుంది. ఒక్కో సారి తప్పుడు లెక్కలు చూపించి 200 కోట్ల నుండి 300 కోట్ల చేపపిల్లలను ఖరీదు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఒక్క తెలంగాణ ప్రాంతం నుండి చేపపిల్లల విత్తనాల కొనుగోలు కోసం ఈ ప్రభుత్వాలు 150కోట్ల నుండి 300 కోట్ల రూపాయలను ఖర్చు చేసారు.

ఇందులో నేషనల్‌ ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు (ఎన్‌.ఎఫ్‌.డి.బి) సంస్థ ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీ కూడా ఇమిడి ఉంటుంది. చెరువ్ఞల్లో చేపవిత్తనాలను సరఫరా చేసినప్పుడే, ఆ చెరువ్ఞలో ఉత్పత్తి అయ్యే చేపలకు ధర నిర్ణయం అవ్ఞతుంది. చేప పిల్లల విత్తనాలకు పెట్టుబడిని సమకూర్చిన కాంట్రాక్టర్లే ఇక్కడ వ్యాపారు లుగా అవతారమెత్తుతారు. మత్స్యకార కులాలకు సంబంధించిన కుల పెద్దలను, స్థానిక మత్స్యసహకార సంఘాలకు చెందిన చోటా మోటా నాయకులను,మత్స్యశాఖ,సహకార శాఖలకు సంబంధించిన అధికారులను సాంప్రదాయంగా మారినపద్ధతుల్లో లోబరుచుకుంటా రు. చెరువ్ఞల్లో విత్తనాలు పోసినప్పుడు తిరిగి చెరువ్ఞల్లో ఉత్పత్తి అయిన చేపలను పట్టుకున్నప్పుడు, పండగపబ్బాలకు, కులదేవతల పూజలకు, ఇలా అనేక సందర్భాలలో కాంట్రాక్టర్‌ తగినరీతిలో సహ కారం అందిస్తారు.

ఫలితంగా మత్స్యకారులకు, కాంట్రాక్టరుకు మధ్య న చెరువ్ఞకట్ట మైసమ్మ సాక్షిగా బానిస, యజమాని సంబంధం బలపడుతుంది. ఫలితంగా చెరువ్ఞకట్టపైన ఆ చెరువ్ఞల్లో పెరిగిన చేపల ధర నిర్ణయం అవ్ఞతుంది. గడచిన మూడు సంవత్సరాల కాలంలో ఇలా నిర్ణయమైన ధరలను బట్టి చెరువ్ఞకట్ట మీద కాంట్రా క్టరు చెల్లించిన కిలోచేపల ధర సగటున 28 రూపాయల నుండి 48 రూపాయలుగా నమోదయ్యింది. (అయితే చైతన్యవంతులైన యువకులు నాయకత్వం వహిస్తున్న కొన్ని మత్స్యసహకార సొసై టీల పరిధిలో పరిస్థితులుఇందుకు పూర్తి భిన్నంగా ఉంటాయి) చెరు వ్ఞగట్టుమీద ఇంత తక్కువ ధరకు చేపలను ఖరీదు చేస్తున్న కాంట్రా క్టర్లు, వ్యాపారులు బహిరంగ మార్కెట్‌లో మాత్రం కిలో ఒక్కింటికి 100 రూపాయల నుండి 160రూపాయల దాకా విక్రయిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన గడచిన రెండు సంవత్సరాల కాలంలో నూ ఈ పరిస్థితులను మార్చేందుకు ప్రభుత్వపరంగా ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. తెలంగాణ రాష్ట్రంలో 2014-15 ఆర్థిక సంవత్సరంలో రెండులక్షల 60వేల టన్నుల చేపల ఉత్పత్తి జరగ్గా, గత సంవత్సరం (2015-16)లో రెండు లక్షల 28వేల టన్నుల చేపల ఉత్పత్తి చేసారు. ఈ లెక్కన గడచిన రెండు సంవత్సరాల కాల వ్యవధిలోనే తెలంగాణ రాష్ట్రంలోని చెరువ్ఞల్లో చేపల పెంపకం ద్వారా కాంట్రాక్టర్లు కనీసం నాలుగువేల కోట్ల రూపాయల లాభాల ను మూటగట్టుకున్నారు.

ఇంత జరిగినా తెలంగాణరాష్ట్రంలో మత్స్య పరిశ్రమను, మత్స్య కారుల జీవన స్థితిగతులను సరిదిద్దేందుకు సమగ్రమైన మత్స్యపారిశ్రామిక విధానం రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కనీస ఆలోచనలు కూడా చేయడం లేదు. రాష్ట్రం ఏర్పా టైన రెండేళ్ల తర్వాత కేవలం చెరువ్ఞల్లో చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేయడంతోనే రాష్ట్రంలోని మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు తీసుకువచ్చినట్లు ఆర్భాట ప్రచారాలకు పూనుకోవడం విస్మయం కలిగిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో మత్స్యపరిశ్రమ ఎక్కువశాతం ప్రాథమిక సహకార మత్స్యసహకారసంఘాల ఆధ్వర్యంలోనే కొనసాగుతున్న ది. రాష్ట్రంలోని 3717 మత్స్యసహకార సొసైటీలలో 2,38,797 మంది మత్స్యకారులుగా సభ్యత్వం కలిగి ఉన్నారు.రాష్ట్రంలోని చెరు వ్ఞలన్నీ ఈ సహకార సొసైటీల ద్వారానే నిర్వహించబడుతు న్నాయి. జిల్లాస్థాయిలో జిల్లా సహకార సొసైటీ, రాష్ట్రస్థాయిలో రాష్ట్ర మత్స్యసహకార సంఘాలు సమాఖ్యలు నిర్మా ణంలో ఉన్నాయి.

అయితే అనేక అవాంతరాల తర్వాత తెలంగాణ లోని అన్ని జిల్లాలకు సంబంధించిన జిల్లా సహకార సొసైటీలకు ఎన్నికలు జరిగి, కార్యవర్గాలు, ఏర్పాటైనప్పటికీ రాష్ట్రస్థాయిలో ఫెడ రేషన్‌ ఇంతవరకూ నిర్మాణం జరగలేదు. ఈ కారణంగా ప్రభుత్వం తో నేరుగా మత్స్యసహకార సంఘాలకు సమన్వయం నిర్వహిం చేందుకు అధికారికంగా ఎలాంటి వ్యవస్థ మనుగడలో లేదు. ప్రభుత్వంలో అత్యంత ప్రాధాన్యతను కలిగిఉన్న అతిముఖ్య మైన వ్యవసాయశాఖలో మత్స్యశాఖ ఒక భాగంగా మాత్రమే ఉండటం వల్ల రాష్ట్రంలో మత్స్యశాఖ ఎలాంటి స్వయంప్రతిపత్తిని అనుభవించడంలేదు.దీనికితోడు మత్స్యశాఖ అధికారులు, సిబ్బంది కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్నది. ఇప్పటికౖైెనా ఈ ప్రభుత్వం రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమాన్ని గుర్తించి, అందులో తొలి అడుగుగా చెరువ్ఞల్లో ఉచితంగా చేపపిల్లలను సరఫరా చేసే ప్రక్రియ కు శ్రీకారం చుట్టడం ఆహ్వానించదగిన పరి ణామమే అయినప్పటికీ చెరువుల్లో ఈ ప్రభుత్వంఉచితంగా వదిలిన చేప పిల్లలు ఆరోగ్యంగా పెరిగిపెద్దవై,మధ్యదళారుల ప్రమేయం లేకుండా కాంట్రాక్టర్ల ఆధి పత్యం అంతమై మత్స్యకారుల వలల్లోకి సురక్షితంగా చేరగలిగిన ప్పుడే ఈ ప్రభుత్వం ఆశించినలక్ష్యాలు నెరవేరుతాయి. ఇందుకు అనుగుణంగా ఒకసమగ్రమైన మత్స్యపారిశ్రామిక విధానం రూపొం దించుకుని చిత్తశుద్ధితో అమలుపరచడమే ఏకైకమార్గం.

 

-పిట్టల రవీందర్‌