భద్రత లేని రైలు ప్రయాణం

train accident
Train Accident (File)

భద్రత లేని రైలు ప్రయాణం

రైల్వే వ్యవస్థ తీరు తెన్నులు రానురాను అధ్వాన్నంగా మారడంతో ప్రయాణికుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువ కొనసాగుతోంది. రైల్వే బడ్జెట్‌లో ఎన్నో భ్రమలు కల్పించారు. ప్రయాణికుల సౌకర్యాలకే ప్రాధాన్యం కల్పి స్తామని ప్రకటించారు. ప్రయాణికుల ఛార్జీలు పెంచకుండా రవాణా ఛార్జీలను సవరించారు. మోడీ కలల ప్రాజెక్టు అయిన బుల్లెట్‌ రైళ్లను ప్రవేశపెడతామని, స్టేషన్లలో ఉచితంగా వైఫై సౌకర్యం కల్పిస్తామని, స్టేషన్లలో అదనంగా 650 మరుగుదొడ్లు నిర్మిస్తామని, స్టేషన్లలోకి వచ్చిన అయిదు నిమిషల్లోనే టికెట్‌ తీసుకోడానికి వీలుగా ఆపరేషన్‌ ఫైవ్‌ మినిట్‌ స్కీమ్‌ను ప్రవేశపెడుతున్నామని అట్టహాసంగా ప్రచారం కావించారు.

ఇలా ఎన్ని ప్రకటనలు చేసినా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే పైన పటారం లోన లొటారం అని స్పష్టమ వ్ఞతోంది. ప్రయాణికులకు సౌకర్యాల సంగతి కన్నా ఇబ్బందులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రైలులో ప్రయాణం కన్నా బస్సులో ప్రయాణిస్తేనే మేలు అనే విసుగు ప్రయాణీకుల్లో చోటు చేసుకొం టోంది. కంట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) రైల్వేశాఖ బండారం ఎలాబయట పెట్టిందో అందరికీ తెలిసిందే. అపరిశుభ్రత, నిర్లక్ష్యం, నిర్వహణ లోపం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. రైల్వే కేటరింగ్‌ పదార్థాల్లో బల్లులు, బొద్దింకలు బయటపడడంతో ప్రయాణికులు కేటరింగ్‌ అంటేనే అసహ్యపడుతున్నారు. ఇప్పుడు మరో సమస్య వచ్చిపడింది. బోగీలలోని మరుగుదొడ్లకు, వాష్‌ బేసిన్లకు నీరు రావడం లేదు. ప్రయాణికులు దీనివల్ల ఎంతనరక యాతన పడతారో తెలిసిందే. రైల్వే వ్యవస్థ లోపాలకు ఇది ప్రబలసాక్ష్యంగా నిలుస్తుంది.

దేశ వ్యాప్తంగా రాకపోకలు సాగిస్తున్న 13,500రైళ్లలో సగటున రోజుకు 2.30 కోట్ల మంది ప్రయాణిస్తుంటారు. వీరికి మరుగుదొడ్లలో నీరు రాకపోతే ఇన్ని కోట్లమందికి ఏది దిక్కు? రైలు బయలు దేరినప్పుడు బోగీల్లో నీళ్లు నింపుతారు. అవి అయిపోతే మధ్యలో ఎక్కడెక్కడ నీళ్లు నింపాలో రైల్వే సిబ్బందికి తెలుసు. దారిలో ఏయే స్టేషన్లలో నీటి సరఫరా ఎలా ఉందో వచ్చిపోయే రైళ్ల బోగీలకు నీరు నింపడా నికి ఆయా స్టేషన్లలో తగిన సౌకర్యాలు ఉన్నాయో లేవో పరిశీలించ వలసిన యంత్రాంగం ఏమైనట్టు? బెంగళూరు నుంచి హైదరాబాద్‌ విజయవాడవైపు వెళ్లే రైళ్లలో నీటి సమస్య తరచుగా వస్తోందని ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నారు.

ఈ సమస్యపైనే గుంతకల్లు స్టేషన్‌లో అనేకసార్లు ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఇదే విధంగా ఢిల్లీ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల వైపు వచ్చే రైళ్లలో నూ నీటి సమస్య ఎదురవ్ఞతోంది. పగటిపూట ప్రయాణం సాగించే రైళ్లలోనూ నీటి సమస్య ఉంటోంది. రైల్వేశాఖ బయోటా§్‌ులెట్ల ఏర్పాటు ప్రారంభించినా ఇంకాపూర్తిస్థాయిలో అమలుకావడం లేదు. ఓపెన్‌ టాయిలెట్ల వల్ల కొంత నష్టం జరుగుతోంది. రామేశ్వరం- మనమధురై సెక్షన్‌ మొదటి ‘గ్రీన్‌ట్రయిన్‌ కారిడార్‌ (హరిత రైల్వే మార్గం)గా వెల్లడయింది.

మానవ విసర్జనల వ్యర్థాల నుంచి విముక్తి రైల్వేగా ప్రకటించారు. ఈ మేరకు రామేశ్వరం నుంచి వచ్చిపోయే రైళ్ల లో బయో టా§్‌ులెట్లు అమర్చడం పూర్తి చేశారు. ఇంతవరకు దక్షిణ రైల్వేలో మొత్తం 6197 ప్యాసింజర్‌ కోచ్‌ల్లోని 1255 కోచ్‌ల్లో 3861 బయో టా§్‌ు లెట్లను ఏర్పాటుచేసినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. కానీ కనీససౌకర్యాలు కల్పించకుంటే ఏం చేసినా ఫలితం ఏముంది? ఐరోపాదేశాల్లో విమానాలను ఏవిధంగా నిర్వహిస్తారో రైళ్లను కూడా అలాగే నిర్వహిస్తారు. పరిశుభ్రత, సదుపాయాలు అన్నీ పక్కగా ఉంటాయి.

మానవ వ్యర్థాలను విమానాల్లో ఒక ట్యాంకులో నిర్ణీత వ్యవధిలో ట్రిప్పుల ద్వారా నిర్వహిస్తారు. ప్రయాణం ఒక ట్రిప్పు కాగానే క్షేత్రస్థాయి సిబ్బంది వచ్చి ఆ ట్యాంకులను శుభ్రపరుస్తారు. మన దేశంలో అటువంటి పరిస్థితి ఉందా? దేశ ఆర్థిక అభివృద్ధికి రైల్వే వ్యవస్థ జీవనాడి వంటిది. 1950 ప్రాంతంలో దేశ ప్రయా ణికుల్లో 74 శాతం మంది రైలులోనే ప్రయాణించేవారు. ఇప్పుడు ఆ శాతం ఎనిమిది శాతానికి దిగజారింది. అంటే రైల్వేవ్యవస్థ నిర్వహణ తీరు ఎలా ఉందో చెప్పవచ్చు. సరకు రవాణా 86 శాతం నుంచి 36 శాతానికి పడిపోయింది. రైల్వే శాఖ ఎన్నో లక్ష్యాలు పెట్టుకున్నా ఆ లక్ష్యాలు పూర్తయ్యేలోగా ఈ లోపాలను సవరించి చక్కగా తీర్చిదిద్దడం అవసరం.

– కె.అమర్‌