ప్లాస్టిక్‌ విష ఊబిలో భారతం

ప్లాస్టిక్‌ విష ఊబిలో భారతం

ప్లాస్టిక్‌ వల్ల జూట్‌ మిల్లులకు పెద్దదెబ్బ తగిలింది. జూట్‌ మిల్లు కార్మికులంతా రోడ్డున పడ్డారు. ప్లాస్టిక్‌ వల్ల దేశీయ ఉత్పత్తులు మూలనపడ్డాయి. ముఖ్యంగా మట్టి చాలా గొప్పది. మట్టిపాత్రలు, కూజాల్లో నీరు, పానీయాలు తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది. శరీరంలోకి వ్యర్థపదార్థాలు ప్రవేశించవ్ఞ. లక్షలాది మంది కుండలు, కూజాలు తయారుచేసే వారి జీవనోపాధిని ప్లాస్టిక్‌ ధ్వంసం చేసింది. భారతదేశ పునరుజ్జీవనం నార, పీచు, మట్టి పాత్రల పునరుజ్జీవనంలోనే ఉంది. ఈ నేలను, ఈ సంస్కృతిని అర్థం చేసుకోని పాలకులు ప్లాస్టిక్‌ను ప్రోత్సహించడం వల్ల దేశ భవిష్యత్తు ప్రశ్నార్థకమవ్ఞతుంది. అందుకే ప్లాస్టిక్‌ను నిరోధించడంతోపాటు దేశీయ ఉత్పత్తుల పునరుజ్జీవన ఉద్యమానికి ప్రజలు, పాలకులు నడుం కట్టాల్సిన సందర్భం ఇది. భా రతదేశంలో నేడు ప్లాస్టిక్‌ పరిశ్రమ మూడు మిలి యన్‌ ఉద్యోగులకు జీవనో పాధి కల్పి స్తుంది.

25 వేల కంపె నీలు ప్లాస్టిక్‌ ఆధారితంగా నడుస్తు న్నాయి. ఆటో మొబైల్స్‌, ఎలక్ట్రా నిక్స్‌, ఆరోగ్యం, వైద్యం, వస్త్రాలు, ప్యాకేజింగ్‌ వంటి అనేక రంగాలలో ప్లాస్టిక్‌ వినియోగం క్రియాశీలకంగా మారింది. ఏడాదికి 12 శాతం చొప్పున ప్లాస్టిక్‌ వినియోగం పెరుగుతుంది. 0.15 బిలియన్ల టన్నుల సింథటిక్‌ పాలీమర్లను సాలీనా ప్రపంచవ్యాప్తం గా ఉత్పత్తి చేస్తున్నారు. మొట్టమొదటి సారిగా 1890లో అలె గ్జాండర్‌ పార్క్స్‌ ప్లాస్టిక్‌ను తయారు చేసి ప్రదర్శించాడు.పాలిథిన్‌, పాలీప్రొపైలిన్‌, పాలిస్లైరీన్‌, పాలిథిలిన్‌ టెరాఫ్టాలేట్లు సాధారణం గా ప్లాస్టిక్స్‌గా పిలువబడుతున్నాయి. అయితే వీటి నిర్మాణంలో క్లిష్టమైన స్టెబిలైజర్లు కలిగి ఉండడం వలన సులభంగా క్షీణించవ్ఞ. వందల యేళ్ల తరువాత కూడా మైక్రోప్లాస్టిక్లుగా వాతావరణంలోని అన్ని విభాగాలలోకి ప్రవేశించి హానికారకాలుగా మిగిలిపోతున్నా యి.

క్షీణించని పదార్థాన్ని విపరీతంగా ఉత్పత్తి చేయడం గ్లోబల్‌ ప్లాస్టిక్‌ వ్యర్థాల పెరుగుద లకు ప్రధాన కారణం. అయితే ప్లాస్టిక్‌ పునర్వినియోగానికి అను కూలం. నేడు వస్తు వ్యామోహం, వస్తు కొనుగోలు, వస్తు వినియో గం విపరీతంగా పెరిగింది. వినియోగిస్తు న్న వస్తువ్ఞ భూమిలో విచ్ఛిన్నం కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో వినియోగ దారుడికి అంచనాలేదు. వినియోగదారుడు వస్తువ్ఞ రంగుకు, రూపుకు ఇస్తున్న ప్రాధాన్యత ఆ వస్తువ్ఞ వినియోగం వల్ల వస్తున్న ప్రమాదాన్ని అంచనా వేయడానికి ఇవ్వడం లేదు.

పర్యావరణ జ్ఞానాన్ని జీవన క్రమంలో ఇముడ్చుకోవాలి. వస్తు వినియోగ సంస్కృతిలో మార్పులు తీసుకురావాలి. భారత ప్లాస్టిక్‌ వ్యర్థాల నియమావళి(2016) ప్రకారం యాభై మైక్రాన్ల కంటే ఎక్కువ మందం ఉన్న ప్లాస్టిక్‌ సంచులనే వాడాలి. ఒకసారి వినియోగించి పారవేసే ప్లాస్టిక్‌ వస్తువ్ఞలపై ఇరవై రాష్ట్రాలలో నిషేధం అమలులో ఉంది. అయితే కేంద్ర కాలుష్య నియంత్రణా మండలి నివేదిక ప్రకారం ఈ నిషేధం పేరుకే అమలులో ఉంది. ప్రజలు యధా విధిగా ప్లాస్టిక్‌ సంచులు వినియోగిస్తున్నారు.

ఈ రోజు మనం పట్టణాలలో వినియోగిస్తున్న ప్లాస్టిక్‌ సంచులు కాలువల్లో పేరు కుపోతున్నాయి. పారే నీటి ప్రవాహానికి అడ్డుపడుతున్నాయి. వీటివల్ల ఎండాకాలంలో కూడా కాలువలు పూర్తిగా ఎండటంలేదు. మురుగు నీటి ప్రవాహం తగ్గి ఎక్కడికక్కడ రోడ్ల మీదకు ప్రవహిం చే పరిస్థితికి దారితీస్తుంది. పర్యవసానంగా పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయి. దోమలు పెరిగి వ్యాధులు ప్రబలడానికి కారణ మవ్ఞతుంది. గడ్డి తినే పశువ్ఞలు అధికంగా ప్లాస్టిక్‌ సంచులుమేస్తు న్నాయి. వాటి గొంతునకు అడ్డం పడి ఊపిరాడక చనిపోతున్నా యి. జంతువ్ఞల జీర్ణకోశంలో ప్లాస్టిక్‌ విచ్ఛిన్నం కాదు.

అందుకే అవి తరచూ వాటి కడుపులో పేరుకుపోతాయి. అదేవిధంగా సము ద్రపు తాబేళ్ల వినాశనానికి ప్లాస్టిక్‌ సంచులు మింగటమే ప్రధాన కారణమని క్వీన్స్‌ ల్యాండ్‌ విశ్వవిద్యాలయం లో చేసిన పరిశోధ నల్లో వెల్లడయ్యింది. సముద్రాలలో నివసించే తిమింగాలలు, షార్కులు, చేపలు, పక్షులు మొదలైన జలచరాల మనుగడ సంక్షో భంలో ఉంది. సియానా విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్‌ క్రిస్టీనా ఫాసి నేతృత్వంలో సముద్ర జీవ్ఞల శరీరంలో నిక్షిప్తమైన మైక్రోప్లా స్టిక్‌ అవశేషాల అన్వేషణ జరుగుతుంది.

జలా శయాలలో తేలి యాడే సంచులు చిన్న చిన్న జలచరాల కదలికలకు విఘాతం కలుగచేస్తాయి. వాటి ఆవాసాలను విచ్ఛిన్నం చేస్తాయి. జంతువ్ఞల శరీరంలోకి చేరిన ఈ వ్యర్థాలు ఆహార వలయంలోకి చేరుతాయి. అంతేకాదు, క్లోరినేటెడ్‌ ప్లాస్టిక్లు భూమిలోకి హానికరమైన రసాయ నాలను విడుదల చేస్తాయి. ఇవి భూగర్భజలాలనుసైతం కలుషితం చేస్తున్నాయి. కలుషితమైన నీటిని తాగునీటిగా వినియోగించిన ప్పు డు జీవ్ఞల ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్లాస్టిక్స్‌ విచ్ఛిన్నం నుండి వెలువడే రసాయనాలు మానవ శరీరంలోకి చేరాక అనేక మార్పులను కలుగచేస్తాయి. ఈ సమ్మేళనాలు మానవ హార్మోన్లను అతలాకుతలం చేస్తాయి. స్త్రీలలో ప్రత్యుత్పత్తి వ్యవస్థనుప్రభావితం చేసే అవకాశం ఉంది.

మగపిల్లల్లో జననాంగాల అభివృద్ధిపై థాలేట్లు ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని రొచెస్టర్‌ సెంటర్‌ ఫర్‌ రీ ప్రొడక్టీవ్‌ ఎపిడెమియాలజి డైరెక్టర్‌ షన్నా స్వాన్‌ వెల్లడిస్తు న్నారు. ఇవి కలుగచేసే కాలుష్యం వలన హుద్రోగాలు, అభివృద్ధి లోపాలు, ఊబకాయం, క్యాన్సర్లు వంటి వ్యాధులు వచ్చేఅవకాశం ఉంది. జంతువ్ఞల శరీరంలోకి ప్రవేశించిన ఈ వ్యర్థాలు ఆహార వలయంలోకి చేరుతాయి. ఈ వ్యర్థాలు జలాశయాలలోపేరుకుపోవ డం వలన మత్స్యకారుల శ్రమ ద్విగుణీకృతమవ్ఞతుంది. వేటకు వెళ్లినప్పుడు వలలో ప్లాస్టిక్‌ సంచులు ఇరుక్కుపోతున్నాయి. బల వంతంగా లాగవల్సి వస్తుంది. వాటిలో చేపలు తక్కువ ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఎక్కువగా వస్తున్నాయి.

ఇటువంటి పరిస్థితుల్లో మత్స్య కారుల మనుగడే ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం లేకపోలేదు.సుమారు ఐదు బిలియన్‌ ప్లాస్టిక్‌ పదార్థాలు సముద్రంలో ఉన్నట్లు లాస్‌ ఏంజల్స్‌లోని ఫేవ్‌ గ్రే ఇన్సిస్ట్యూట్‌ వారు మార్కాస్‌ ఎరిక్సన్‌ నేతృత్వంలో వెల్లడిస్తున్నారు. ఈ పదార్థాల బరువ్ఞ 2,68,000 టన్నులు ఉండవచ్చు. ఈ ప్లాస్టిక్‌ పదార్థాల ముద్ద సముద్రంలో తేలియాడుతుంది. దీనినే గ్రేట్‌ పసిఫిక్‌ గార్బేజ్‌ ప్యాచ్‌ అంటున్నా రు. తేలియాడుతున్న భారీ వ్యర్థాల సుడిగుండం. దీని పరిమాణం ఫ్రాన్స్‌ దేశానికి రెండింతలు ఉండవచ్చునని అంచనా. చివరకు నిర్జన ప్రదేశాలైన అంటార్కిటికాలోని గ్రీన్విచ్‌ ద్వీపంలో కూడా ప్లాస్టిక్‌ అవశేషాలు కనుగొనబడటం విస్మయాన్ని కలుగచేస్తుంది. ఏడువేల ఐదువందల కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం కలిటిన దేశం మనది. ప్లాస్టిక్‌ వ్యర్థాలను సముద్రంలోకి విడుదల చేస్తున్న మొదటి ఇరవై దేశాలల్లో మనం కూడా ఉన్నాయం. ఇదే స్థితి కొనసాగితే రానున్న దశాబ్దంలో మొదటి ఐదులోకి చేరే ప్రమాదం ఉన్నదని అమెరికన్‌ శాస్త్రజ్ఞులు అభిప్రాయపడుతున్నా రు.

ఇక ప్లాస్టిక్స్‌ వాడకానికి ప్రత్యామ్నాయాలు అన్వేషించవలసిన సమయం ఆసన్నమైంది. వర్ధమాన దేశాలలో బయోప్లాస్టిక్స్‌ప్రాచు ర్యం పొందుతున్నాయి. ఇవి పునరుత్పాదకత కలిగిన, జీవక్షీణతకు అనుకూలమైన బయోమాస్‌ నుండి తయారు చేయబడుతున్నాయి. 2014 నాటికి ఇది మూడు వందల మిలియన్‌ టన్నులు ఉత్పత్తి చేయబడింది. ప్యాకేజింగ్‌, కంటేనర్ల తయారీ, సంచులు, తివాచీ లు, పైపులు, ఫోనుకేసింగులు, 3డి ముద్రణా, కారు ఇన్సులేషన్‌, మెడికల్‌ ఇంపాంట్లలో ఈ నవజాత ప్లాస్టిక్‌ వాడకం ప్రారంభమైం ది. మార్కెట్‌ విస్తృతంగా పెరుగుతుంది. 2022 నాటికి దాదాపు 44 బిలియన్‌ డాలర్లను తాకనుంది.

కొలంబియావిశ్వవిద్యాలయం లోని భూమి, పర్యావరణ విభాగంలో సెల్యులోలొజ్‌ ప్రధానంగా తయారవ్ఞతున్న నూతన ప్లాస్టిక్లపై అధ్యయనం జరుగుతున్నది. గోధమ, బార్లీ, కసావ, చెరకు వంటి పంటలను వీటి ఉత్పత్తిలో వినియోగిస్తున్నారు.గ్రీన్‌హౌస్‌ ఉద్గారాలను యాభై నుండి డెబ్భై ఐదు శాతం తగ్గించగలమని ఉత్పాదకులు వాగ్దానం చేస్తున్నారు. అయితే కలుపు మందులు, పురుగు మందులు, రసాయనిక ఎరు వ్ఞలతో పండించిన పంటలను బయోప్లాస్టిక్‌ తయారీలో ముడిసరు కుగా వాడినప్పుడు పర్యావరణంలోకి విషపూరిత పదార్థాల వ్యాప్తి జరుగవచ్చు. ఈ తరుణంలో మరింత సమర్థవంతమైన, పర్యావ రణ అనుకూల బయోప్లాస్టిక్ల తయారీకి పరిశోధనలు ముమ్మరమై నాయి. ప్లాస్టిక్‌ వల్ల జూట్‌ మిల్లులకు పెద్దదెబ్బ తగిలింది. జూట్‌ మిల్లు కార్మికులంతా రోడ్డున పడ్డారు.

ప్లాస్టిక్‌ వల్ల దేశీయ ఉత్ప త్తులు మూలనపడ్డాయి. ముఖ్యంగా మట్టి చాలా గొప్పది. మట్టిపా త్రలు, కూజాల్లో నీరు, పానీయాలు తాగడం వల్ల శరీరంచల్లబడు తుంది. శరీరంలోకి వ్యర్థపదార్థాలు ప్రవేశించవ్ఞ. లక్షలాది మంది కుండలు, కూజాలు తయారుచేసే వారి జీవనోపాధిని ప్లాస్టిక్‌ ధ్వం సం చేసింది. భారతదేశ పునరుజ్జీవనం నార, పీచు, మట్టిపాత్రల పునరుజ్జీవనంలోనే ఉంది. ఈ నేలను, ఈ సంస్కృతిని అర్థంచేసు కోని పాలకులు ప్లాస్టిక్‌ను ప్రోత్సహించడంవల్ల దేశభవిష్యత్తుప్రశ్నా ర్థకమవ్ఞతుంది. అందుకే దేశీయ ఉత్పత్తుల పునరుజ్జీవన ఉద్య మానికి ప్రజలు, పాలకులు నడుం కట్టాల్సిన సందర్భం ఇది.

– డాక్టర్‌ కత్తి సృజన
(రచయిత: పర్యావరణవేత్త)