ప్రజాసేవకు అనుమతులెందుకు?

ఒక్కమాట

ప్రతిశనివారం

Mandal Parishad Meeting (File)
Mandal Parishad Meeting (File)

ప్రజాసేవకు అనుమతులెందుకు?

కొన్ని ప్రాంతాల్లో అధికారుల పరిస్థితి అడకత్తెరలో చిక్కిన పోకచెక్కలా ఉంది. పార్లమెంటు సభ్యులు ఒకవైపు, శాసనసభ్యులు మరోవైపు ఉండడంతో పరిస్థితి ఇరకాటంగా మారింది. ఏదేమైనా ఈ సంప్రదాయం ఏమాత్రం సమర్థనీయం కాదు. ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వాల్సిందే. గౌరవమర్యాదలనేవి బెదిరిస్తేనో, భయపెడితేనో, భంగపడితేనో వచ్చేవి కావ్ఞ. ప్రజలతో వారికున్న సంబంధ బాంధవ్యాలనుబట్టి, సేవాకార్యక్రమాలు, నడవడిక, అన్నిటికంటే మించి మాటతీరు, ప్రవర్తనా శైలినిబట్టి ఆధారపడి ఉంటాయి. మొత్తం మీద ఈ విషయంలో రాజకీయ నాయకుల్లోనేకాక సామాన్యుల్లోకూడా చర్చ జరుగుతోంది. రేపు జిల్లాల్లో పర్యటించాలంటే తమకు తెలియచేయాలని జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌, మండలాల్లో పర్యటించాలంటే తమను సంప్రదించాలని మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షుడు, అలాగే గ్రామ విషయానికి వచ్చేసరికి గ్రామ సర్పంచ్‌ తనకు తెలియకుండా గ్రామంలో అడుగుపెట్టరాదని ఇంకా కిందికి వెళితే… వార్డు మెంబర్‌ ఇలా ఎవరికివారు సరిహద్దులు గీసుకుని అందుకుభిన్నంగా వ్యవహరించినవారి కార్యక్రమాలు జరగకుండా వారిశక్తిమేరకు ఆటంకం కలిగిస్తే… ఏమవ్ఞతుందో ఒక్కసారి ఆలోచించాలి. ప్రజాసేవకోసం ఇలా బజారునపడడం ఏమాత్రం సమంజసం కాదు. 

 

ప్రజాప్రతినిధులపట్ల నమ్మకం, విశ్వాసం ప్రజాస్వామ్యా నికి ప్రాణాధారం. తమను మోసం చేస్తున్నారని తమ జీవితాలతో ఆటలాడుకుంటూ రాజకీయాలను వ్యాపా రంగా చేసి లాభార్జనవైపు అడుగులు వేస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో కలిగిననాడు ప్రజాస్వామ్యమనుగడే అర్థరహితమవ్ఞతుంది. ప్రజాసేవ చేసేందుకు సరిహద్దులు, పోట్లాటలు,వాదులాటలు పడ డంచూస్తుంటే అసలు ప్రజాస్వామ్యం ఎటువైపుపోతుందనే ఆవేదన వ్యక్తం అవ్ఞతున్నది.రాజులుపోయారు, రాచరికాలు అంతరించాయి. ప్రజలే ప్రభువ్ఞలనే రోజులు వచ్చాయని చెప్పుకుంటున్న కొందరు రాజకీయ నాయకులు ప్రవర్తిస్తున్న తీరు చూస్తే ఇంకా ఆ రోజులు పోలేదేమోనని పిస్తున్నది.గతంలో రాజ్యంసరిహద్దు దాటి లోపలికి ప్రవేశించాలంటే.. అనుమతులు అవసరమయ్యేవి.రాజు అనుమతి లేకుండా ఏ వ్యాపారం చేసుకునే అవకాశాలుండేవి కావ్ఞ. పొరుగు రాజ్యాలకు సంబంధించిన పశువ్ఞలు కూడా తమ రాజ్యంలోకి ప్రవే శించకుండా కట్టుదిట్టం చేసేవారు. తమ రాచరికానికి ఎక్కడ ముప్పు వస్తుందోననే భయం నాటిరాజులకు ఎప్పుడూ వెన్నంటే ఉండేది. పొరుగు రాజులనుంచే కాక ఇతర రాజ్యాలకు చెందిన కొన్ని అరాచకశక్తులు తమ ప్రజలకు ఇబ్బంది కలిగించి కల్లోలంసృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తాయనే భయంతో బయటవారిని తమ అనుమతిలేకుండా రాజ్యంలోకి అడు గుపెట్ట నీయకపోయేవారు.అంతేకాదు తమ రాజ్యంలోని ఒకప్రాం తం నుంచి మరొకప్రాంతానికి వ్యక్తి వచ్చినా… అంతెందుకు ఒక గ్రామంలో బంధువ్ఞల ఇంటికి ఒక చుట్టం వచ్చినా ఆనాడు రాజ ప్రతినిధులుగా గ్రామాల్లో ఉన్న గ్రామాధికారులద్వారా వివరాలు ఎప్పటికప్పుడు సేకరించి పంపేందుకు సమగ్ర విధానం ఉండేది.ఆ వ్యక్తి ఎక్కడినుంచివచ్చాడు?పూర్వాపరాలేమిటి? ఎన్ని రోజులుంటా డు?తదితర వివరాలన్నీ సేకరించి అంచెలంచెలుగా రాజసంస్థానాని కి చేరేవి.ఇవన్నీ గతించినరోజులు. ఇప్పుడు రాజులు లేరు. రాచరి కాలు లేవ్ఞ. ప్రజలే ఇప్పుడు రాజులని, వారికి సేవలు చేయడానికి ఉన్నామని,రాజకీయ నాయకులు ఒకపక్క, అధికారులు మరొకపక్క పోటీపడుతున్నారు. ప్రజాసేవలు అందించే కొన్ని కీలక ఉద్యోగాల కొరకు కొందరు రకరకాల అవస్థలుపడుతున్నారు.ఇలా ప్రజాసేవకు లమని చెప్పుకునే నాయకులు ఇది నా ప్రాంతం, నా అనుమతి లేకుండా నాప్రజలను ఎలా కలుసుకుంటారు? అంటూ హెచ్చరికలు చేస్తున్నారు.

కొన్ని సందర్భాల్లో వాదులాడుకుంటున్న సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.అంతేకాదుఅధికారులను నిలదీస్తున్నారు. గతంలో ఒక కేంద్ర మంత్రికి మరొక రాష్ట్రమంత్రికి, శాసనసభ్యు లకు ఇలాంటి వాదులాటే జరిగింది. ఈ వాదులాటలో ఉరిమి ఉరిమి మంగళం మీదపడ్డట్టు ప్రజలముందే వాగ్వాదాలకు దిగుతూ మధ్యలో అధికారులపై విరుచుకుపడ్డారు. అంతేకాదు చిన్న చిన్న ఉద్యోగాలుసైతం ప్రజాప్రతినిధుల అనుమతులు లేకుండా పోస్టింగు లు ఇవ్వలేకపోతున్నారు.ఒకవేళ పోస్టింగులు తెచ్చుకున్నాతమ అను మతి లేకుండా పోస్టింగులు తెచ్చుకుని ఎలా ఉద్యోగం చేస్తారని బెదిరించేవారు కూడా ఉన్నారు. అందరిలా చేస్తున్నారని చెప్పడం లేదుకానీ అధిక శాతం నాయకుల్లో ఈ సంస్కృతి పెరిగిపోతున్నది. ఇక విమర్శలకు కూడా హద్దూ అదుపూ లేకుండాపోతున్నది.

రాష్ట్ర నాయకులమని చెప్పుకుంటున్నవారే చేస్తున్న విమర్శలు ఆరోపణలు వారి స్థాయినే దిగజారుస్తున్నాయి. అర్థంపర్థం లేని ఆరోపణలతో పత్రికలకెక్కి తాత్కాలికంగా సంతృప్తిచెందినా భవిష్యత్‌లో వారి ప్రకటనలకు, మాటలకు ఎంత విలువ ఉంటుందో వారే ఒక్కసారి ఆలోచించుకోవాలి.దేశవ్యాప్తంగా వివిధ శాసనసభల్లో గౌరవసభ్యుల ప్రవర్తన తీవ్ర అభ్యంతరకరంగా ఉంది. నాయకులమనుకునేవారు ప్రజలకు ఎంతోఆదర్శంగా ఉండాలి.ముఖ్యంగా శాసనసభ్యుల ప్రవ ర్తన తీరుపై పలు సందర్భాల్లో శాసనసభలో చర్చలు జరిగాయి. అనేక తర్జనభర్జనలనంతరం దీనిపై 1998 ఏప్రిల్‌ 29న సీనియర్‌ శాసనసభ్యుడు ఎన్‌.యతిరాజారావ్ఞ ఛైర్మన్‌గా అప్పటి శాసన సభ్యులు సిహెచ్‌.రాజేశ్వరరావ్ఞ,నర్రా రాఘవరెడ్డి, గాదె వెంకటరెడ్డి, బషీరుద్దీన్‌ బాబూఖాన్‌, జి.విజయరామారావ్ఞ,అప్పల సూరినారా యణరావ్ఞ తదితరులతో నైతిక విలువల సంఘం (ఎథిక్స్‌ కమిటీ)ని నియమించారు.శాసనసభల లోపల, బయట శాసనసభ్యులు ప్రవర్తి స్తున్నతీరు, నియమావళిపై సమగ్రపరిశీలన పలువ్ఞరు ప్రజాస్వా మ్యవాదుల అభిప్రాయాలను సేకరించారు. అందుకోసం తెలుగు రాష్ట్రాల్లోనేకాక ఢిల్లీకికూడా వెళ్లి లోకసభ మాజీ స్పీకర్లు శివరాజ్‌ పాటిల్‌, బలరాం జాఖడ్‌, సీనియర్‌ పార్లమెంట్‌ సభ్యులు ఎస్‌.బి. చౌహాన్‌, టి.ఎస్‌.చతుర్వేది, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్‌ ఎస్‌. ఎల్‌.శద్దర్‌ తదితర పెద్దలను కలిసి వారి సలహాలను స్వీకరించిన అనంతరం 1998 నవంబరు 17న ఆ కమిటీ శాసన సభకు నివేదిక సమర్పించింది. ఈ సందర్భంగా శాసనసభకు అధ్యక్షతవహించిన అప్పటి స్పీకర్‌ యనమల రామకృష్ణుడు శాసనసభను ఉద్దేశించి ప్రసంగిస్తూ ‘శాసన సభలోనే కాదు సభ వెలుపల కూడా మన ప్రవర్తన నీతివంతంగా నియమబద్ధ్దంగా ఉండాలి, శాసనసభలో నీతి వంతంగా ఉంటాం, బయట మరోవిధంగా ఉంటాం అని ఎవరూ అనరని నేను అనుకుంటున్నాను.

సభలోకానీ, సభ వెలుపలకానీ మన ప్రవర్తన ఆదర్శప్రాయంగాఉండాలి.శాసనకర్తలమైనా శాసనాల కు అతీతం కాదు. సామాన్య పౌరులకు వర్తించే చట్టాలన్నీ మనకూ వర్తిస్తాయి.చట్టాలను చేసే మనమే చట్టాలను పాటించలేదనే అభిప్రా యం కలిగితే ప్రజలకు చట్టబద్ధమైన పాలనపట్ల గౌరవం ఎలా ఉంటుంది. కనుక సభలో మన ప్రవర్తన గురించేకాక సభ వెలుపల మన ప్రవర్తన గురించి కూడా ఎథిక్స్‌ కమిటీ కొన్ని సిఫారసులు చేసింది.చట్టసభల సభ్యులుగా మనకు విధులు, బాధ్యతలు రెండూ ఉన్నాయంటూ చేసిన ప్రసంగం నాడు సభలో ఉన్న సభ్యులనే కాదు,సామాన్య ప్రజలనుకూడా ఆకట్టుకుంది. రాజకీయాల్లో నైతిక, మానవతా విలువలు పడిపోతున్న తరుణంలో శాసనసభ లోపల, బయటసభ్యుల ప్రవర్తన నియమ నియమావళిని రూపొందించడా నికి నడుంకట్టడం ఆనాడు ప్రజాస్వామ్యప్రియులంతా హర్షించారు. రాజకీయాల్లో మనస్పర్ధ్దలు తలెత్తడం అభిప్రాయబేధాలు రావడం, ఎత్తుకు పైఎత్తువేసి చిత్తుచేయడం కొత్తేమీకాదు,అందులో వింతలు, విశేషాలు ఏమీలేవ్ఞ.కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ప్రధా నంగా ఆంధ్రప్రదేశ్‌లో వాటితో పోలిక కన్పించడం లేదు.

రాజకీయ విబేధాలను రాజకీయాలకే పరిమితంచేసి వ్యక్తిగత స్నేహాన్ని కాపాడుకునే మానసిక పరిణతి, ఔదార్యం కొందరిలో రానురానూ తగ్గిపోతున్నది.వ్యక్తిగతస్థాయిలో ప్రతీకారేచ్ఛ క్రోధం రాజకీయేతరం గా దెబ్బతీయాలనే ఉబలాటాలే ఈ దుష్పరిణామాలకు తావిస్తు న్నాయి.ప్రజా ప్రతినిధులకు ముఖ్యంగా శాసనసభ్యులకు గౌరవం ఇవ్వాల్సిందే. అందులో మరో అభిప్రాయానికి తావ్ఞలేదు. కానీ తమకు తెలియకుండా తమ నియోజక వర్గంలో ఎటువంటి కార్యక్రమాలూ జర గకూడదని పట్టుబడడం ఎంతవరకూ సమంజసమని ఆలోచించాలి. ఉత్తరాంధ్రలో ఇటీవల ప్రజాప్రతి నిధులమధ్య గొడవలకు కూడా దారి తీసింది. తమను సంప్రదించకుండా, తమ అనుమతి తీసుకోకుండా ఎలా కార్యక్రమాలు నిర్వహిస్తారని ప్రశ్నిస్తు న్నారు.అంతేకాదు ఆ కార్యక్రమాలు జరుగకుండా అడ్డుకునేందుకు కూడా వెనుకాడడంలేదు.కొన్ని ప్రాంతాల్లోనైతే ప్రైవేట్‌కార్యక్రమాలకు కూడా తమ అనుమతి కావాలని.. మంత్రులు కానీ, అధికారులుకానీ,తమకు తెలియకుండా ఆ ప్రైవేట్‌ కార్యక్రమా లకు హాజరుకాకూడదని అభ్యంతరం చెబుతున్నారు.చివరకు మరి కొన్ని ప్రాంతాల్లో పెళ్లిళ్లవంటి శుభకార్యాలకు హాజరు కావాలన్నా పెద్దలు ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇది చాలా అభ్యంతరకరం.గతంలో ఈ స్థాయిలో ఇలాంటిసంప్రదాయం లేదు.

రానురానూ ఇది పెరిగిపోతుండడం ఆందోళన కలిగించే అంశం. కొన్నిప్రాంతాల్లో అధికారులపరిస్థితి అడకత్తెరలో చిక్కి న పోకచెక్క లా ఉంది.పార్లమెంటు సభ్యులుఒకవైపు, శాసనసభ్యులు మరోవైపు ఉండడంతో పరిస్థితి ఇరకాటంగా మారింది.ఏదేమైనా ఈ సంప్రదా యం ఏమాత్రం సమర్థనీయం కాదు. ప్రజాప్రతి నిధులకు గౌరవం ఇవ్వాల్సిందే.గౌరవమర్యాదలనేవి బెదిరిస్తేనో, భయపెడితేనో, భంగ పడితేనో వచ్చేవి కావ్ఞ.ప్రజలతో వారికున్న సంబంధబాంధవ్యాలను బట్టి,సేవాకార్యక్రమాలు,నడవడిక, అన్నిటికంటే మించి మాటతీరు, ప్రవర్తనా శైలినిబట్టి ఆధారపడి ఉంటాయి. మొత్తంమీద ఈ విష యంలో రాజకీయ నాయకుల్లోనేకాక సామాన్యుల్లోకూడా చర్చజరు గుతోంది. రేపుజిల్లాల్లో పర్యటించా లంటే తమకు తెలియచేయాలని జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌,మండలాల్లో పర్యటించాలంటే తమను సంప్ర దించాలని మండల ప్రజాపరిషత్‌ అధ్యక్షుడు,అలాగే గ్రామ విషయా నికి వచ్చేసరికి గ్రామ సర్పంచ్‌ తనకు తెలియకుండా గ్రామంలో అడుగుపెట్టరాదని ఇంకా కిందికివెళితే…

వార్డుమెంబర్‌ ఇలా ఎవరికి వారు సరిహద్దులు గీసుకుని అందుకుభిన్నంగా వ్యవహరించినవారి కార్యక్రమాలు జరగకుండా వారిశక్తిమేరకు ఆటంకం కలిగిస్తే..ఏమవ్ఞ తుందో ఒక్కసారి ఆలోచించాలి. ప్రజాసేవకోసం ఇలా బజారునపడ డం ఏమాత్రం సమంజసం కాదు.ప్రజల సంగతేమోకానీ అధికార వర్గాలు తీవ్ర ఇబ్బందులకు గురవ్ఞతున్నాయి.ఏ నాయకుడికి ప్రాధా న్యత ఇవ్వాలో తెలియక వారి కార్యక్రమాలకుపోతే ఏమౌతుందో, పోకపోతే ఏమౌతుందో అనే సందిగ్ధంలో పడిపోతున్నారు. ప్రోటో కాల్‌ పాటించాల్సిందే. ఎవరిగౌరవం వారికి ఇవ్వాలిందే.అందులో మరోవాదనకు అవకాశం లేదు.కానీ తాము లేకుండా ,తమకు తెలి యకుండా తమకు గౌరవమర్యాదలు ఇవ్వకుండా అది ప్రైవేట్‌కాని ,ప్రభుత్వకార్యక్రమం కాని జరగకూడదని పట్టుపట్టడం ఎంత వరకు సమంజసమో ఒక్క సారి మనసుపెట్టి ఆలోచించాలి.

– దామెర్ల సాయిబాబ