ప్రజావాక్కు

Voice ot the people : Prajavakku
Voice ot the people

చెల్లని ఓట్లతో సమస్య:-జి.అశోక్‌,గోదూర్‌, జగిత్యాలజిల్లా

ఇటీవల జరిగిన శాసనమండలి కరీంనగర్‌ ఉపాధ్యాయ నియోజకవర్గంలో 532 ఓట్లు, నల్గొండ ఉపాధ్యాయస్థానంలో 585 ఓట్లు, ఉత్తరాంధ్ర టీచర్‌ నియోజకవర్గంలో 550 ఓట్లు చెల్లకుండాపోయాయి. ఓటు వేసే విధానంపై అవగాహన లేక, నిరక్షరాస్యత తదితర కారణాలతో సాధారణ ఎన్నికల కౌం టింగ్‌ కేంద్రాలలో చెల్లని ఓట్లు కనిపించడం సహజం. కానీ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తూ, ఇతరులకు ఆదర్శంగా ఉండాల్సిన వారు వేసిన ఓట్లు చెల్లకపోవడం విస్మయం కలిగి స్తోంది. మరోవైపు ఎన్నికల సంఘం అధికారులు చేసిన పొర పాట్ల వలన శాసనమండలి ఓటర్ల జాబితాలో అనేక తప్పులు దొర్లాయి. సొంతమండలంలో ఉండాల్సిన పేర్లు ఇరుగుపొరుగు మండలాల్లో దర్శనమిచ్చాయి.దీంతో పోలింగ్‌శాతం బాగా తగ్గి పోయింది. ప్రతిసారి ఎన్నికల్లో ఇలాంటి పొరపాట్లు జరుగుతు న్నాయి. లోపాలను నివారించడానికి ప్రయత్నాలు చేయాలి.

డ్రైవర్లకు అదనపు బాధ్యతలు: -ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా
ఇటీవల ఆర్టీసి సంస్కరణలు పొదుపు పేరిట పలు బస్సు సర్వీసులలో కండక్టర్లను తీసేసింది. ఆ బాధ్యతను కూడా డ్రైవర్లపై ఉంచడం సమంజసంగా లేదు. అన్ని స్టాపుల్లో కొత్త ప్రయాణీకులకు టిక్కెట్లు ఇచ్చే బాధ్యత డ్రైవర్లపై ఉంచడం వలన పని ఒత్తిడి బాగాపెరుగుతుంది.మన రోడ్లు నిత్యం ఇరు కుగా,ట్రాఫిక్‌తో ఉంటాయి.ఇటువంటిరద్దీలో డ్రైవర్‌ అతి జాగ్ర త్తగా బస్సును నడపాల్సిఉంటుంది.అదనపు పని ఒత్తిడి వలన డ్రైవర్ల దృష్టి బెదిరిపోయే అవకాశాలు ఎక్కుగా ఉంటాయి. నిరుద్యోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కండక్టర్‌ పోస్టులను భర్తీ చేయకుండా ఆ బాధ్యత ఇంకొకరికి అదనంగా అప్పగించడం మంచి విధానం కాదు.

నాయకులకు పదవీవిమరణ ఉండాలి: -సి.హెచ్‌.ప్రతాప్‌,హైదరాబాద్‌

మనదేశంలో ఎన్నికలలో పలు రాజకీయ పార్టీలు వయసుపై బడిన వారికే టిక్కెట్లు, పదవ్ఞలు ఇస్తున్నాయి. దశాబ్దాల పాటు వివిధ పార్టీలలో, వివిధ పదవ్ఞలను అలంకరించిన వారు 70వ ఒడిలో పడినా ఇంకా రాజకీయాల నుండి విశ్రంతి తీసుకోవడానికి ఇష్టపడటం లేదు.తప్పనిసరి పరిస్థితుల్లో తమ వారసులకు టిక్కెట్టు ఇప్పించుకొని వారసత్వ రాజకీయాలకు పాల్పడుతున్నారు. రాబోయే ఎన్నికలలో 75 శాతం మంది 60 సంవత్సరాలుపైబడినవారు. ఈ పరిస్థితి మారాలి.

బుట్టదాఖలైన వాగ్దానాలు: -సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

తెలంగాణ రాష్ట్రంలో గత శాసనసభ ఎన్నికలలో నిరుద్యోగుల కు కనిష్టంగా మూడువేల రూపాయల నిరుద్యోగభృతి అంద చేస్తామని టిఆర్‌ఎస్‌ పార్టీవాగ్దానం చేసింది. అధికారం చేపట్టాక రాష్ట్ర ప్రభుత్వం ఆ వాగ్దానాన్ని బుట్టదాఖలు చేసింది. తాజాగా పార్లమెంట్‌ ఎన్నికల ప్రచార సమయంలో తిరిగి నిరుద్యోగ భృతి అంశాన్ని ఆ పార్టీ లేవనెత్తింది.ఈ పథకం సత్వరం ప్రభు త్వం అమలు చేయాలని రాష్ట్రంలోని లక్షలాది నిరుద్యోగులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు.డిగ్రీ,పిజి కోర్సులతో పాటు ఇతరవొకేషనల్‌ కోర్సులలో ఉత్తీర్ణులైన వారికి కూడా ప్రభుత్వం సమానంగా వర్తింపచేయాలి.పోటీపరీక్షలకు అప్లి కేషన్‌ రుసుం, కోచింగ్‌ ఫీజులు, పుస్తకాలు కనుక్కునేందుకు సదరు నిరుద్యోగ భృతి ఎంతగానో ఉపయోగపడుతుంది. పైగా నిరుద్యోగులకు వారి తల్లిదండ్రులు,కుటుంబంపై ఆర్థికంగా బరువ్ఞ మోయకుండా స్వతంత్రంగా నిలిచేందుకు అక్కరకు వస్తుంది.

వేలసంఖ్యలో తిరస్కృత ఓట్లు:-ఎం.రాంప్రదీప్‌, గోపవరం ఖమ్మంజిల్లా

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో శాసనమండలికి సంబంధించి పట్టభ ద్రుల నియోజకవర్గాల్లో నిర్వహించిన ఎన్నికలలో తిరస్కరణకు గురైన ఓట్లు వేలసంఖ్యలో ఉండటం దురదృష్టకరం. సాధా రణంగానే విద్యావంతులు, మేధావ్ఞలు ఎన్నికలలో తమ ఓటుహక్కుని వినియోగించుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఎన్నికల సందర్భంగా సెలవ్ఞ ప్రకటించినప్పటికీ ఓటింగ్‌ శాతం పట్టణాలలో పెద్దగా పెరగడం లేదు. కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచిన అభ్యర్థి తర్వాత స్థానంలో చెల్లని ఓట్లే ఉండటం గమ నార్హం. ఏకంగా 13,509 ఓట్లు తిరస్కరణకు గురవడం ఆశ్చ ర్యాన్ని కలిగిస్తుంది. గతంలో కూడా ఒక నియోజకవర్గంలో 12 వేలకుపైగా పట్టభద్రుల ఓట్లు చెల్లకుండా పోయాయి.

ఏరులైపారుతున్న కల్తీ మద్యం:-గరిమెళ్ల రామకృష్ణ, ఏలూరు,పశ్చిమగోదావరి జిల్లా
ఎన్నికలలోఓటర్లను ప్రలోభపెట్టే పనిలో భాగంగా కల్తీ మద్యం ఏరులైపారిస్తున్నారు. గత ఎన్నికలలో ఓ రాజకీయ పార్టీ వారు ఇలా నాసిరకం మద్యం పెద్దఎత్తున సరఫరా చేసి, తాగించి, ఎంతోమంది అమాయకుల ప్రాణాలు తీశారు. ఆ కేసులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆకల్తీ మద్యమే యధేచ్ఛగా రాష్ట్రవ్యాప్తంగా సరఫరా చేస్తున్నారు. అమాయక ప్రజ లు ఊరికే వస్తున్నదని తాగి ప్రాణాల మీదకు తెచ్చుకొంటున్నారు.