ప్రజావాక్కు

Voice-ot-the-people
Voice-ot-the-people

ఎగుమతులపై ప్రభావం: -సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం నెలకొన్నందున భారతదేశ ఎగుమతులపై ఎన్నడూలేనంతగాప్రతికూల ప్రభావం పడింది. గతంలో అయిదేళ్లపాటు ప్రపంచ వాణిజ్యం మూడుపువ్ఞ్వలు ఆరు కాయలుగా వర్ధిల్లినప్పుడు భారత్‌ పటిష్టమైన ప్రణాళిక లోపించిన కారణంగా ఎగుమతులను అభివృద్ధి చేసుకోలేక సువర్ణావకాశాన్ని చేజార్చుకుంది. 2013-14లో 30వేల కోట్ల డాలర్ల రికార్డు ఎగుమతులను నమోదు చేసుకున్నాక క్రమంగా క్షీణత ప్రారంభమై 2017-18లో 18వేల కోట్ల డాలర్ల వద్ద చతికిలపడింది. ఇందువలన దేశ ఆర్థికవ్యవస్థపై కూడా పెను ప్రభావంపడింది.పారిశ్రామికోత్పత్తిరంగం, యంత్రాల తయారీ, ఆహార తయారీరంగం, ఔషధరంగాలలో ఎగుమతులు క్షీణించ డం ఆందోళన కలిగించే పరిణామం.

పెరుగుతున్న అవినీతి: -ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా

దేశంలో ప్రభుత్వ సేవలలో, కాంట్రాక్టుల నిర్వహణలో నేర పరిశోధనలలో,సహజవనరుల కేటాయింపులలోఅవినీతి విశృం ఖలంగా పెరిగిపోతోంది. ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన డబ్బుఉద్యోగుల జీతభత్యాలకు, ఉచిత హామీలకు సరిపోవడం లేదు. ఇంకొకవైపు ప్రజలు చెల్లించిన పన్నులకు ప్రతిఫలంగా వారికి లభించాల్సిన ఉమ్మడి సేవలు, మౌలిక సదుపాయాలు అందడం లేదు. సంపద, ఉత్పాదకత పెరగాలంటే ప్రభుత్వ సేవలు సకాలంలో అవినీతి బెడద లేకుండా సమర్థవంతంగా చేరాలన్న సదుద్దేశాలకు, అంతర్జాతీయ ప్రమాణాల మేరకు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలన్న సత్సంకల్పం, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పథకాల అమలు వంటి అంశాలను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించడం బాధాకరం.

హాస్యాస్పద ప్రకటనలు:-గరిమెళ్ల రామకృష్ణ, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా

రాష్ట్రంలోనాలుగు లక్షలమందికి ఉద్యోగాలు ఇచ్చామని ముఖ్య మంత్రి చెప్పడం హాస్యాస్పదంగా ఉంది.గ్రామ వాలంటీర్లను కలిపినా అంత సంఖ్య రాదు. వాస్తవానికి వివిధ రాష్ట్ర ప్రభు త్వ శాఖలలోని రెండు లక్షల ముప్ఫైవేల ఉద్యోగాలను అధికా రంలోకి వచ్చిన వెంటనే భర్తీ చేస్తామని వాగ్దానం చేశారు. ఇంతవరకు ఏ ఒక్కశాఖలలో కూడా భర్తీ చేయడం జరగలేదు. ఇలా అవాస్తవ ప్రకటనలతో నిరుద్యోగులను నిరాశానిస్పృహ లకు గురి చేయడం విజ్ఞతకాదు. ముఖ్యమంత్రి చేసిన వాగ్దానా లను సరిగా అమలు చేసి ప్రజల మెప్పు పొందాలి. మోసపూ రిత మాటలు చెబితే విశ్వసనీయత కోల్పోతారు.

పేదరికాన్ని రూపుమాపాలి:-సి. ప్రతాప్‌, శ్రీకాకుళం

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 73 సంవత్సరాలు పూర్తయినా మనముందున్న పెద్దసవాల్‌ పేదరికం,కులపరమైన దుర్విచక్షణ వలన పెరుగుతున్న సాంఘిక అసమానతలను తొలగించడం. దేశ ప్రజలందరికీ వారి పుట్టుకతో సంబంధం లేకుండా సాం ఘికంగా ఎదిగేఅవకాశాలను కల్పించి,వారి ఆదాయాలను మెరు గుపరిచి పేద, ధనికుల మధ్య అంతరాలను తొలగించే విధంగా పటిష్టమైన ప్రణాళికలను ప్రభుత్వాలు పెంపొందించడం ఎంతో అవసరం. ప్రతి బిడ్డకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను, ఉపాధికి పనికివచ్చే నైపుణ్యాన్ని ఆర్థికభారం లేకుండా అందిం చడం, ప్రతి కుటుంబానికి అన్ని స్థాయిలలో ఖర్చులేకుండా మంచి ఆరోగ్యాన్ని అందించడం ఎంతో అవసరం.

మట్టిపాత్రలు ఉపయోగించాలి: -యర్రమోతుధర్మరాజు, ధవళేశ్వరం

రైళ్లల్లో, రైల్వేస్టేషన్లలో మట్టిపాత్రలు (కప్పులు, ప్లేట్లు) వినియో గించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించడం సరైన చర్య. ఈ విధానం వలన ప్లాస్టిక్‌, కాగిత వ్యర్థాలు స్టేషన్‌ ఆవరణలో అస్త వ్యస్తంగా ఉండటం,వాటిపై ఈగలు, దోమలు, ఎలుకలు, పిల్లు లు, కుక్కలుచిందరవందర చేయడంతో ప్రయాణీకులకు అంటు రోగాలు ప్రబలుతున్నాయి. మట్టి పాత్రల వలన అంతకుమించి చేతివృత్తిపై ఆధారపడే వారికి ఉపాధి అవకాశాలు పెరుగుతా యి. అయితే గతంలో లాలూప్రసాద్‌ యాదవ్‌ రైల్వే మంత్రిగా ఉండగామట్టి, చేనేత వస్తువ్ఞలను రైళ్లలో వినియోగించాలని హుకుం జారీచేసినా సక్రమంగా అమలుజరగలేదు.గతంలో జరి గినపొరపాటుసరిదిద్దుకుని పగడ్బందీగా అమలుచేస్తే చేతివృత్తు ల వారికి ఉపాధితోపాటు స్టేషన్‌లు పరిశుభ్రంగా ఉంటాయి.

అన్ని జిల్లాల్లో ఒకే విధానం:-కె.రమ, దేవులపల్లి, ప.గోజిల్లా

ప్రతి సంవత్సరం మాదిరిగా ఇటీవల అన్ని జిల్లాల్లోనూ ఉపా ధ్యాయులకుజిల్లా ఉత్తమఉపాధ్యాయ అవార్డులు అందించారు. ఏ జిల్లాకాజిల్లా ప్రత్యేక కొలమానాలతో ఉపాధ్యాయులను ఎంపిక చేసి అవార్డులను ఇవ్వడం సముచితంగా లేదు.కొన్ని జిల్లాల్లో అయితే అప్లికేషన్‌ లేకుండానే మండల విద్యాశాఖ అధికారి సిఫారసు చేసిన వారికే అవార్డులు ఇస్తున్నారు. ఇలా కాకుండా రాష్ట్రవ్యాప్తంగాఅన్నిజిల్లాల్లోనూ ఒకటేవిధానం ఉండి, ఆ విధానం ప్రకారమే అవార్డులు ఇస్తే బాగుంటుంది. పారదర్శ కత విధానం లేని ఏ వ్యవస్థ అయినా అనేక అనుమానాలకు తావిస్తుందనేది తెలుసుకుని చక్కదిద్దే ప్రయత్నం చేయాలి.