ప్రజావాక్కు

Voice ot the people
Voice ot the people


ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి- జి.అశోక్‌,గోదూర్‌, జగిత్యాలజిల్లా
ప్రస్తుతం తెలంగాణాలో విద్యారంగంలో అధికారుల పోస్టుల న్నీ ఇంఛార్జీలతోనే నడుస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని విశ్వ విద్యాలయాల ఉపకులపతుల పదవీ విరమణలతో విసి పోస్టు లు ఇంఛార్జీలతో నడుస్తున్నాయి. ప్రతి జిల్లాలో 90 శాతానికి పైగా మండల విద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఆ మండలంలోని సీనియర్‌ హెడ్‌ మాస్టర్‌కు బలవం తంగాఅదనపు బాధ్యతలు అప్పచెప్పతున్నారు.దీంతో ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణ సరిగా జరగక పాఠశాలల పనితీరు అస్త వ్యస్థంగా తయారైంది. వీటిని చక్కదిద్దాల్సిన బాధ్యత ప్రభు త్వానిదే. మండల కేంద్రాల్లోని శాఖా గ్రంథాలయాల్లో లైబ్రేరి యన్‌ పోస్టుల సంగతి కూడా అధ్వాన్నంగా ఉంది.రాష్ట్ర ప్రభు త్వం వెంటనే పూనుకొని ఇంఛార్జీల పాలనలో కొనసాగుతున్న పోస్టుల్లో రెగ్యులర్‌ ప్రాతిపదికన అధికారులను నియమించి వ్యవస్థను గాడిలో పెట్టాలి.

దిగజారుతున్న పరిశ్రమ దుస్థితి -సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ
తెలుగు చిత్రపరిశ్రమ దుస్థితి చూస్తుంటే ఎంతో జాలి కలుగు తోంది.ఒకప్పుడు విభిన్నమైన కథాంశాలతోఆకట్టుకునే కథనం, సామాజిక, నైతిక ఆధ్యాత్మిక విలువలను జోడించి సకుటుంబ సపరివారసమేతంగా చూడగలిగే అద్భుతమైన సినిమాలను నిర్మించి యావత్‌ భారతదేశానికే తలమానికంగా నిలిచిన తెలు గు పరిశ్రమ ఇప్పుడు దారిద్య్రంలో కొట్టుమిట్టాడుతోంది. మంచి సినిమా కోసం పొరుగు రాష్ట్రాలపై ఆధారపడే దుస్థితి నెలకొంది. తెలుగు సినిమా చూసినా ఏమున్నది గర్వకారణం, అంతా పరసంస్కృతి అనుకరణే అంటూ తెలుగు సినిమా ప్రేక్ష కుడు పెదవి విరిచే పరిస్థితులు రావడం దురదృష్టకరం.


సమాచారాన్ని అనుసంధించాలి -సి.సాయిప్రతాప్‌, హైదరాబాద్‌
పన్నెండో పంచవర్ష ప్రణాళిక కాలానికే మనదేశంలో భూముల పున:సర్వే రికార్డుల ప్రక్షాళన, కంప్యూటరీకరణ కార్యక్రమం పూర్తయి ఉండాల్సింది.కానీ ప్రభుత్వాల నిర్ల క్ష్యందారుణంగా ఇప్పటికీ నిర్దేశిత లక్ష్యాలకు ఆమడదూరం లో నిలిచిపోయింది. కాగా దేశంలో 75 శాతం సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో కంప్యూటరీకరణ పూర్తయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. భూ రికార్డులు, రిజిస్ట్రేషన్‌ వ్యవహారాలకు సంబంధించి 58 శాతం మాత్రమే డిజట లీకరణ పూర్తయింది.


విఫలమైన నోట్లరద్దు -సి.ప్రతాప్‌, శ్రీకాకుళం
అవినీతి, అక్రమార్జనల సమాంతర ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వం ప్రయోగించిన నోట్ల రద్దు అస్త్రం విఫలమైందన్న రిజర్వుబ్యాంక్‌ తాజా నివేదిక, కీలక నిర్ణయాలు తీసుకునే ముందు ప్రభుత్వం పదిసార్లు ఆలోచించాల్సిన అవశ్యకతను తెలియచేస్తోంది. గతరెండేళ్లలో నోట్ల చెలామణి 9.5 శాతం పెరగడం, డిజిటల్‌ లావాదేవీలలో క్షీణత, ఆన్‌లైన్‌ మోసాలు, సైబర్‌ భద్రతపై భరోసా కొరవడటం, నిరుద్యోగిత నాలుగేళ్ల గరిష్టానికి చేరడం, దేశంలో 70వేల కోట్ల దాకా కరెన్సీ వెరిసి ఇత్యాది గణాంకాలు ప్రభుత్వ వైఫల్యాన్ని ముందస్తు సన్నద్ధత లేకుండా కీలక నిర్ణ యాలు తీసుకోరాదన్న సందేశాన్ని స్పష్టంగా చూపిస్తోంది.

భూమి రికార్డుల ఆధునీకరణ -ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా
జాతీయ భూమి రికార్డుల ఆధునీకరణ పథకాన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీని ద్వారా 86 శాతం రికార్డులు డిజిటలైజ్‌ చేసినా 35 శాతం పొలాలను మాత్రమే సర్వే చేయ డం వలన ఆన్‌లైన్‌లో పూర్తివివరాలు లభ్యంకావడం లేదు. సర్వే చేయకుండా చేసిన ఆధునీకరణతో ఎలాంటి ఉపయోగం ఉండదన్న విషయాన్ని ప్రభుత్వం గ్రహించాలి. ఈ విషయంలో 1920 సంవత్సరంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రవేశపెట్టిన టారెన్స్‌ పద్ధతి చక్కని ఫలితాలను ఇవ్వడం వలన అమెరికా, కెనడా, ఇంగ్లాండ్‌, ఫ్రాన్స్‌ వంటి దేశాలు అవలంబించాయి. ఈ పద్ధతిలో ప్రభుత్వం పట్టాదారునికి భూమిపై శాశ్వత పట్టాయి స్తుంది. ప్రభుత్వమే రికార్డులన్నింటినీ నిర్వహించి పట్టాకు జవాబుదారీగా వ్యవహరిస్తుంది.

అవినీతిలో అగ్రస్థానం-ఎన్‌.కృష్ణమూర్తి, విజయవాడ
విశ్వవ్యాప్తంగా సుమారుగా రూ.72లక్షల కోట్లు లంచం రూపంలో చేతులుమారుతుండగా,187 లక్షల రూపాయలు అవినీతి మూలంగా నల్లధనం రూపంలో వివిధ దేశాలలో పోగుపడుతోందన్న ట్రాన్స్‌పరెన్సీఇంటర్నేషనల్‌ వార్షిక నివే దిక అవినీతి జాడ్యం మొత్తం ప్రపంచాన్ని ఎలా పట్టి పీడి స్తుందో ఇట్టే అర్థమవ్ఞతోంది. ఈ నేపథ్యంలో 180 దేశాల పట్టికలో భారత్‌ 71వస్థానంలో నిలబడడం, గత రెండేళ్ల లోభారత్‌ రెండుస్థానాలు దిగజారడంచూస్తుంటే అవినీతిని సమూలంగా అంతం చేస్తామన్న ప్రభుత్వ వాగ్దానం నీటి మీద రాతలని అర్థమవ్ఞతోంది.