ప్రజావాక్కు

Voice ot the people
Voice ot the people

వ్యక్తిగత విమర్శలు సరికాదు: -గరిమెళ్ల రామకృష్ణ, ఏలూరు, ప.గోజిల్లా

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో నిర్బంధఆంగ్ల బోధన నిర్ణ యంసరికాదని పలువ్ఞరు మేధావ్ఞలు తమతమ అభిప్రాయా లు వ్యక్తపరుస్తున్నారు.అలాగే ఉపరాష్ట్రపతిగారు గతంలోనూ, ఇప్పుడు కూడా మాతృభాషను మరువద్దని సందర్భానుసారం గా తన మనోగతాన్ని తెలియపరిచారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కూడా నిర్బంధం తగదని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మాత్రానికి ముఖ్యమంత్రి సహనం కోల్పో యి, వారిపై వ్యక్తిగత విమర్శలుచేయడం చాలా బాధాకరం. ప్రజాస్వామ్యంలో వివిధ అంశాలపై భిన్నాభిప్రాయాలు రావ డం సహజం. ముఖ్యమంత్రి సహనం కోల్పోయి రాజ్యాంగ పదవ్ఞల్లో ఉన్నవారిపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం, కుటుంబ సభ్యులను,వ్యక్తిగతవిషయాలను ప్రస్తావించడం ముఖ్యమంత్రి విజ్ఞతలోపించిందన్న భావనసామాన్యులకుసైతం కలుగుతుం ది.ఇలాంటి పోకడలపై ముఖ్యమంత్రిఆత్మవిమర్శ చేసుకోవాలి.

గ్రంథాలయాలపై దృష్టి సారించాలి: -షేక్‌ అస్లాం షరీఫ్‌, శాంతినగర్‌

ప్రభుత్వ గ్రంథాలయాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. చాలా గ్రంథాలయాలకు సొంత భవనాలు లేవ్ఞ. చీకటిగదులలో, అరొకర వసతులతో గ్రంథాలయాలు నడుస్తున్నాయి.పలుచోట్ల గ్రంథాలయాలకోసం స్థలాలు ఉన్నా, నూతన గ్రంథాలయాల నిర్మాణం కాకపోవడం ప్రజలు విస్మ యానికి గురవ్ఞతున్నారు. ప్రభుత్వం సంబంధిత అధికారులతో చర్చించి గ్రంథాలయాలకు నూతన భవనాలు ఎక్కడెక్కడ అవసరమోనివేదికలు తీసుకోవాలి. ప్రజలు విజ్ఞాన భండాగా రాలు అయిన గ్రంథాలయాలు సకల సౌకర్యాలతో ఉంటే బాగుంటుంది. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి.

అధికారులు ఔదార్యం చూపాలి:-జి. భారతీదేవి, ఏలూరు, ప.గోజిల్లా

తన శాఖలోని ఒప్పందం, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతన బకాయిలు చెల్లించిన తర్వాత తనకు వేతనం ఇమ్మ ని ముఖ్యమంత్రి ప్రిన్సిపల్‌ సెక్రెటరీ, సీనియర్‌ ఐ.ఎ.ఎస్‌ అధికారికోరటం అభినందనీయం.నిజానికిదాదాపుగా అన్ని రాష్ట్ర ప్రభుత్వ శాఖలలోనూ ఈ కేటగిరి ఉద్యోగులకు నెలల తరబడి వేతనాలు అందటం లేదు. మరి వేతనాలు చెల్లించకుండా పనిచేయమనిఅడిగే నైతికహక్కు ఏ అధికా రికీలేదు.సీనియర్‌ అధికారులంతా ఈవిధంగా తమ శాఖల లోపనిచేస్తున్న ఉద్యోగులందరికీ వేతనాలుచెల్లించిన తర్వా తేవాళ్లు వేతనాలు తీసుకునే విధానాన్ని అమలు చేయాలి.

ఆస్పత్రుల్లో అగ్నిప్రమాదాలు: -సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

గత రెండేళ్లలో రెండుతెలుగు రాష్ట్రాల్లో బహుళ అంతస్తు వాణి జ్య భవనాలలో అగ్నిప్రమాదాల సంఖ్య ఎక్కువవ్ఞతుండడం ఆందోళనకర పరిణామం. ఇటీవల హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్‌ చిన్న పిల్లల ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో అభంశుభం తెలియని చిన్నారులు బలవడమో లేక క్షతగాత్రులు కావడమో జరగడం అందరి మనసులను కలిచి వేసింది.ఆస్పత్రులు, పాఠ శాలలు, కాలేజీలు,కోచింగ్‌సెంటర్లు, సినిమా థియేటర్లు కిక్కిరి సినవాణిజ్యభవనాలలో నిబంధనలను అతిక్రమించి నిర్మించడం ఆందోళన కలిగించే అంశం. సింహభాగం భవనాలకు అగ్నిమా పక సంస్థ నుండి ఎన్‌ఓసిలు లేకపోవడం గమనార్హం. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అధికారులు హడావ్ఞడి చేయడం, తూతూ మంత్రం చందాన దర్యాప్తులు నిర్వహించడం తర్వాత షరామామూలే అన్నట్లు జరుగుతోంది. ఇకనైనా ప్రభుత్వం సేఫ్టీ ఆడిట్‌ కమిటీల ద్వారా సమగ్ర సమీక్షతోపాటు విస్తృతంగా తనిఖీలు జరిపి నిబంధనలను అతిక్రమించేవారిపై చర్యలు తీసుకోవడం ఎంతో అవసరం.

సుప్రీం తీర్పు చరిత్రాత్మకం: -కామిడి సతీష్‌ రెడ్డి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా

భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం(సిజెఐ) సమాచార హక్కు పరిధిలోకి వస్తుందంటూ 2010 జనవరిలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గగో§్‌ు నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సమర్థిస్తూ తీర్పును వెలువరించడం చరిత్రాత్మకం. అయోధ్య వివాదంపై తీర్పు ఇచ్చిన నాలుగు రోజుల వ్యవధిలోనే దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసంచ లనమైన తీర్పును ఇవ్వడం భారత పౌరులందరిలో న్యాయ వ్యవస్థ పట్ల నమ్మకం పెంచింది.

పెరుగుతున్న నిరుద్యోగం: -వి.వివేక్‌, విశాఖజిల్లా

అసలు అభివృద్ధిఅంటే ఉద్యోగాల కల్పన. అమెరికా, దుబా యిలాంటి దేశాలు ఎందరో ప్రతిభగల అభ్యర్థులకు ఉపాధి కల్పిస్తున్నాయి. కానీ భారతదేశంలో మాత్రం ఏదీ లేదు. ఉన్నత చదువ్ఞలుచదివి,జీవితాంతం నిరుద్యోగులుగా మిగి లిపోయినవారుకోకొల్లలు.రాజకీయ నాయకులుతమ ప్రసం గాలతో హడలిగొడుతున్నారు కానీ ఫలితాలు మాత్రం శూ న్యంగా ఉన్నాయి. మొక్కలు నాటడం,గోడలకు రంగులు వేయడం ఇదే అభివృద్ధి అంటున్నారు. అభివృద్ధి అంటే ఆర్థికాభివృద్ధి అని పాలకులు గుర్తెరగాలి.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి : https://epaper.vaartha.com