ప్రజావాక్కు

Voice ot the people
Voice ot the people

ప్రాజెక్టులను వెంటనే పూర్తిచేయాలి: -సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

తెలంగాణ రాష్ట్రానికి రైల్వేశాఖ ఇచ్చిన హామీలను నెరవేర్చ డంలో తీవ్ర జాప్యం జరుగుతుండడం బాధాకరం. 15 సంవ త్సరాల క్రితం కాజీపేట ఇంటిగ్రెల్‌ కోచ్‌ఫ్యాక్టరీ, చర్లపల్లిలో నూతన టర్మినల్‌, ఘట్‌కేసర్‌-యాదాద్రి ఎం.ఎం.టిఎస్‌ 2వ దశ విస్తరణ, నడికుడి- బీబీ నగర్‌ల మధ్య అదనపు రైల్వే ట్రాక్‌, రాష్ట్రంలో ఎనిమిది స్టేషన్ల ఆధునీకరణ, భద్రాచలం- కొత్తగూడెలం రైల్వే ట్రాక్‌ నిర్మాణం, వరంగల్‌-సూర్యాపేట్‌ల మధ్య నూతన రైల్వే కనెక్టివిటీ, అక్కనపేట, మెదక్‌, బీబీ నగర్‌, ఉందానగర్‌ నుండి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు ఎం.ఎం.టిఎస్‌ పొడిగింపు వంటివి ఎన్నోప్రాజెక్టులు పెండింగ్‌ లో ఉన్నాయి. తొమ్మిది రైళ్లను వారాంతపు సర్వీసు నుండి డైలీ సర్వీసుగా పొడిగించాలన్న విజ్ఞప్తులు 2015 నుండి పెం డింగ్‌లో ఉన్నాయి. రాష్ట్ర ఎంపిలు ఈ ప్రాజెక్టులు సత్వరమే పూర్తయ్యేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి.

కృతజ్ఞ్ఞత అంటే ఇదేనా!:-ఎం.శ్రీనివాస్‌, హైదరాబాద్‌

అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ తెలంగాణా ఇచ్చినందుకు ఆ పార్టీని వేనోళ్ల పొగిడారు. ఆ పార్టీ రుణాన్ని తీర్చుకోలేమని వారితో కలిసి పనిచేస్తామని, తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనంచేస్తామని, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా మని, పొరుగు రాష్ట్రంతో సఖ్యతతో మెలుగుతామని, అవని, ఇవని కబుర్లు చెప్పారు. ఆనక అధికారంలోకి వచ్చాక చెప్పిన వేమీ చేయలేదు.పైపెచ్చు తెలంగాణ ఇచ్చిన పార్టీని, ఉద్యమం లో పాల్గొని తెలంగాణ రాష్ట్రంఏర్పడటానికి కారకులైన వారం దరిని పూర్తిగా మరిచిపోయారు. వారి ఊసేఎత్తడం లేదు.

మద్యపానాన్ని నిషేధించాలి: -పి.గంగునాయుడు, శ్రీకాకుళం

మన రాజ్యాంగం 47వ అధికరణ ప్రకారం 28 రాష్ట్రాలలోనూ 9 కేంద్రపాలిత ప్రాంతాలలోనూ మద్యపానాన్ని సంపూర్ణంగా నిషేధించలేదు. ఇటీవల ఆవ్ఞలను, దున్నపోతులను చంపకూ డదని కేంద్రప్రభుత్వం నిషేధించింది. కానీ మద్యపానాన్ని నిషేధించలేదు. గుజరాత్‌, బీహార్‌ రాష్ట్రాలు మాత్రం మద్యపా నాన్ని సంపూర్ణంగా నిషేధించాయి. కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్‌ 370ని రద్దు చేసి పెద్ద నిర్ణయమే తీసుకుంది. ఇలాంటి నిర్ణయాలు చాలా చేసింది. కానీ మద్యపానాన్ని సంపూర్ణంగా ఎందుకు నిషేధించడం లేదు? మద్యపాన నిషేధానికి తక్షణమే చర్యలు తీసుకోవాలి.

ప్రజలను మోసం చేస్తున్న బ్యాంకులు:-సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

దేశంలో అనేక సహకార బ్యాంకులు దివాలా తీస్తూ లక్షలాది వినియోగదారుల జీవితాలలో తీరని సంక్షోభం సృష్టిస్తున్నాయి. వాణిజ్య బ్యాంకుల కంటె రెండు శాతం అధిక వడ్డీ ఇస్తూ, అనేక రాయితీల ఆకర్షణతో వినియోగదారులను ఆకట్టుకుంటు న్నఈ సహకారబ్యాంకులు ఆర్‌బిఐ నిబంధనలను అతిక్రమిస్తూ చేస్తున్న లావాదేవీల కారణంగా దివాలా తీస్తున్నాయి. తాజాగా పిఎన్‌బి బ్యాంకు దివాలా తీయగా తొమ్మిది లక్షల మంది కస్టమర్లు రోడ్డునపడ్డారు. తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఆరు వందల కోట్ల రుణాలను ఆ పార్టీ నేతలు పొంది పరారైపోవడం దిగ్భ్రాంతికరం.సహకార బ్యాంకులు ఏయేకారణాల వలన కుప్ప కూలుతున్నాయో తెలిసినా దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలో ఆర్‌బిఐ, కేంద్రఆర్థిక మంత్రిత్వశాఖ అలసత్వం కనబరుస్తోంది.

రహదారుల నిర్మాణంలో జాప్యం:-ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా

గుంటూరుజిల్లాలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ చేపట్టిన అనేక రహదారుల నిర్మాణాలు ఎక్కడికక్కడే నిలిచి పోయాయి.గతప్రభుత్వం సార్వత్రికఎన్నికలను దృష్టిలో ఉంచు కొని 2018వ సంవత్సరంలో పెద్దఎత్తున అభివృద్ధిపనులకు నిధులు మంజూరు చేస్తూ అందులో రహదారులకు పెద్దపీట వేసింది.జిల్లాకు కేటాయించిన 500కోట్ల నిధులలో కొన్ని పను లు మొదలుకాగా మరికొన్ని వివిధ దశలలో ఉన్న తరుణంలో కొత్త ప్రభుత్వం వాటిపై ఆంక్షలు విధించింది. మొదలుకాని వాటిని రద్దుచేస్తూ25శాతంలోపు ఖర్చాయిన వాటిని పున:సమీ క్షించి తిరిగి అనుమతులు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయినా పనులకు బిల్లులు రాలేదన్న సాకుతో గుత్తేదారులు పనులను ఆపివేసారు.

అవినీతిని తరిమికొడదాం: -కామిడి సతీష్‌రెడ్డి, జయశంకర్‌ భూపాలపల్లిజిల్లా

భారతదేశంలో అవినీతి, అక్రమాలు విలయతాండవం చేస్తున్నా యి. ప్రజాప్రతినిధులు, అధికారులు అవినీతికి పాల్పడుతూ కోట్లాది రూపాయలను అక్రమంగా సంపాదిస్తున్నారు. ఇటీవల ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ సంస్థ వెల్లడించిన నివేదికలో భారత్‌ మరింత అవినీతిగల దేశాలలో ముందంజలో ఉందని తెలిసింది. అవినీతి అభివృద్ధిని కబలిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అవినీతి అధికారుల హవా కొనసాగుతుంది. రెవెన్యూ, రిజిస్ట్రార్‌ శాఖలలో అవినీతి అధికంగా జరుగుతున్నట్లు సర్వేలో వెల్ల డైంది. గ్రామాలలో గ్రామపంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ కార్యదర్శులు ప్రజలను పీల్చిపిప్పిచేస్తున్నారు.

తాజా ‘నిఘా’ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/investigation/