ప్రజావాక్కు

Voice ot the people
Voice ot the people

తప్పులతడకతో నివేదికలు:- సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

కాశ్మీర్‌లో అశాంతిపరిస్థితులు నెలకొన్నాయని మానవ హక్కుల ఉల్లంఘన యధేచ్ఛగా సాగుతోందని ఐరాస మానవ హక్కుల కమిషన్‌ తప్పులతడకగా నివేదికను విడుదల చేయ డంగర్హనీయం.గత దశాబ్దకాలంలో పాకిస్థాన్‌వివిధ అంతర్జాతీ య వేదికలపై కాశ్మీర్‌లోని పరిస్థితులపై దురుద్దేశపూరిత అసత్యవాదనలకు ప్రస్తుత నివేదిక కొనసాగింపు మాత్రమే అన్న అంశాన్ని భారతదేశం గట్టిగా లేవనెత్తాలి. గత సంవత్స రం ఐరాస ఇలాంటి నివేదికనే విడుదల చేయగా భారత్‌ దానిని తీవ్రంగా ఖండించింది. భద్రతా కౌన్సిల్‌, ఐరాస్‌ సర్వ సభ్య సమావేశాలలో కూడా సదరు నివేదికపై భారత్‌ తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తింది. అయితే అదే నివేదికలో కాస్తంత మార్పులు చేర్పులు చేసి తిరిగి విడుదల చేయడం అహేతుకం. కాశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘనలఆరోపణలపై స్వతంత్ర అంతర్జాతీయ దర్యాప్తు కోసం విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలన్న సదరు నివేదికను భారత అంతర్జాతీయ వేదికపై తీవ్రంగా వ్యతిరేకించాలి.

పార్కుల నిర్వహణలో నిర్లక్ష్యం:-ఎం.కనకదుర్గ,తెనాలి, గుంటూరుజిల్లా

గుంటూరుజిల్లాలో ప్రజలు కాసేపు సేద తీరేందుకు ఏర్పాటు చేసిన పార్కుల నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా శిధిలావస్థకు చేరుకున్నాయి. కొన్ని మున్సిపాలిటీ డంపింగ్‌ యార్డులుగా, రాత్రిళ్లు పేకాట, జూదం, మందుతాగడం, వ్యభిచారం వంటి అసాంఘిక కార్యక్రమాలకు నిలయాలుగామారాయి. పార్కులు శిధిలావస్థకు చేరుకోవడంతో ప్రజలకుఆహ్లాదకర వాతావరణమే కరవైంది. ముఖ్యంగా లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసి ప్రజాప్రతినిధులతో అట్టహాసంగా ప్రారంభింపబడిన కొన్ని పార్కుల నిర్వహణ అధ్వాన్నంగా ఉండటం వలన తీవ్ర అపారి శుద్ధ్యపరిస్థితులునెలకొన్నాయి.సాయంత్రం అయిందంటే దోమ లు, ఇతర క్రిమికీటకాదులు సందర్శకులపై దాడి చేస్తున్నాయి.

చట్టం దృష్టిలో అందరు సమానమే: -బుగ్గన మధుసూదనరెడ్డి, బేతంచెర్ల, కర్నూలుజిల్లా

ఈ ప్రజాస్వామ్యంలో అందరికి సమన్యాయం చేయడం మన ప్రభుత్వాల, న్యాయవ్యవస్థల కనీస ధర్మం. ఎందుకంటే ఇప్పుడున్న వ్యవస్థ ఎలా తయారైంది అంటే అధికార పార్టీకి ఒక న్యాయం, ప్రతిపక్ష పార్టీలకు మరో న్యాయంలా చట్టాలు మారిపోవడం అత్యంత ఆందోళనకరం. మన దృష్టిలో చట్టం ఎవరికి తొత్తులుగా మారాల్సిన అవసరం లేదు. అది తన మా నాన పనిచేసుకుంటూపోతే ఎవరికి ఇలాంటి సమస్య ఉండదు.

పర్యాటకంపై అవగాహన కల్పించాలి: -సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

కార్పొరేట్‌ చదువులలో మార్కులు, ర్యాంకులు, ప్రాజెక్టులు కీల కంగా మారాయి. ఆటపాటలకు, యోగా ధ్యానం, సమాజసేవ వంటి అంశాలకు నేటి విద్యావిధానంలో స్థానం లేదు. చరిత్ర పట్ల, పర్యాటక ప్రాంతాలు, జలాశయాలు, చారిత్రక కట్టడాలు, జంతువ్ఞలు, గ్రామీణ భారతం, వ్యవసాయం వంటి విషయా లపై కేవలం పుస్తక పరిజ్ఞానం, అంతర్జాలం ద్వారా మాత్రమే నేటి యువత తెలుసుకుంటున్నారు. ప్రత్యక్షంగా వీటిని చూసి అనేక విషయాలను తెలుసుకునేందుకు తల్లిదండ్రులతోపాటు విద్యాసంస్థలు విరివిగా విహారయాత్రలు నిర్వహించాలి. వీటిని విద్యావిధానంలోతప్పనిసరిచేయాలి.మానసిక,శారీరక వికాసం, వ్యక్తిత్వనైపుణ్యాల సాధనలో విహారయాత్రల పాత్రకీలకం. అస లే సున్నిత మనస్కులైన నేటితరం యువత విహారయాత్రల ద్వారా కలిసిమెలిసి తిరగడం అలవరచుకుంటారు.

బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేయాలి: -షేక్‌ అస్లాం షరీఫ్‌,శాంతినగర్‌

ఇటీవల కురిసిన వర్షాలకు, వరదలకు గురైన నాగలదిన్నె బ్రిడ్జి పూర్తిగా పడిపోయింది. గత పది సంవత్సరాలుగా బ్రిడ్జి నిర్మా ణ పనులు జరుగుతున్నప్పటికీ పూర్తికాకపోవడం ప్రజలను విస్మయానికి గురిచేస్తుంది. ఈ బ్రిడ్జి ఉండటం వల్ల తెలుగు రాష్ట్రాలమధ్య ప్రజల వ్యాపార సంబంధాలు చాలా బాగుండేవి. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన మంత్రాలయానికి కూడా ప్రజలు ఈమార్గం ద్వారానే ప్రయాణం చేస్తారు. ఈబ్రిడ్జి పూర్తిఅయితే ప్రజలకు రవాణా సమస్యలు చాలా వరకు తీరుతాయి. సంబం ధితఅధికారులు ఈ బ్రిడ్జి పనులు త్వరగా అయిపోయే విధంగా చర్యలు తీసుకుంటే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది.

ఛార్జీల పెంపు సమంజసం కాదు: -యర్రమోతుధర్మరాజు, ధవళేశ్వరం

రైల్వేశాఖ ఆదాయం పెంపులో భాగంగా సామాన్యుల నడ్డి విర గ్గొడుతుంది. అవకాశం ఉండదని తెలిసినా ఏకంగా వందలాది గా రిజర్వేషన్‌ టికెట్లు అమ్మకం చేసి స్లీపర్‌ క్లాస్‌ బర్త్‌ రిజర్వు కాకపోయినా రద్దు చేస్తే నూట ఇరవైరూపాయల నుండి రెండు వందల నలభై రూపాయలు ఆపైన వరకు మినహాయించుకుని ప్రయాణికుడికి చిల్లుపెట్టడం ద్వారా ఏటా కోట్ల రూపాయలు దోచుకుంటుంది. ఇటీవల ప్లాట్‌ఫారం టికెట్‌ ధర పది నుండి ముప్ఫైరూపాయలకు పెంచి తమబంధవులను, వీడ్కోలు చెప్పే వారికి సైతం భారం మోపింది. ఫ్లాట్‌ఫారం టికెట్‌ ధర పెంపు సమంజసం కాదు. రైల్వేశాఖ దీనిపై పునరాలోచించాలి.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/