ప్రజావాక్కు

సమస్యలపై ప్రజాగళం: ప్రజల లేఖలు

Voice of the People
Voice of the People

వణికిస్తున్న కరోనా:- సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

ప్రపంచాన్ని ఒక ఊపు ఊపుతున్న కరోనావైరస్‌ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. సాధారణ ఫ్లూ లక్షణాల మాదిరిగానే ఈ ప్రమాదకర వైరస్‌ లక్షణాలు ఉండ టంతోస్వైన్‌ప్లూ, సాధారణఫ్లూ,కరోనా వైరస్‌లతో ప్రజలు భయ భ్రాంతులకు గురవ్ఞతున్నారు.

రెండురాష్ట్రాలలో కరోనావైరస్‌కు సంబంధించి అవగాహనలోపించడం రక్తంనమూనాలను పరీ క్షించేందుకు ఏర్పాట్లు లేకపోవడం, విపరీతమైన మీడియా ప్రచారం వలన కాస్త సాధారణ ఫ్లూ లక్షణాలు కని పిస్తే వైద్యు లు ప్రజలను భయపెడుతున్నారు. కరోనావైరస్‌ను ఎదుర్కోవ డంలో ప్రభుత్వాల సన్నద్ధత ఎక్కడా కానరావడం లేదు.

లైబ్రేరియన్లను నియమించాలి: -సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

ఉత్తరతెలంగాణ జిల్లాలో పలుప్రభుత్వ గ్రంథాలయాలకు రెగ్యులర్‌ లైబ్రేరియన్లు లేరు. రెండు,మూడు మండలాలకు కలిపి ఒక లైబ్రేరియన్‌ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తుండడం వలన గ్రంథాలయాల పనితీరు అస్తవ్యస్తంగా మారింది. అంతేకాకుం డా 25 శాతం ఉద్యోగులతోనే పని కానిచ్చేస్తుండడం వలన వీటి నిర్వహణ అంతంత మాత్రంగా నడుస్తోంది.

దాదాపుగా గత 15సంవత్సరాల నుండి లైబ్రేరియన్ల నియామకం జరగ డంలేదు.రిటైర్డ్‌ అయిన సిబ్బంది స్థానంలో కాంట్రాక్టు పద్ధతిన నియామకాలు కానిచ్చేస్తున్నారు. ప్రభుత్వం కూడా గ్రంథాల యాల నిర్వహణకు తగినన్ని నిధులు మంజూరు చేయకపోవ డం వలన కొత్తపుస్తకాల సేకరణ, శిధిలావస్థలో ఉన్న గ్రంథాలయాల రిపేరు పనులు సాగడం లేదు.

ఎంపిక చేసిన గ్రంథాలయాలలో ఉచిత ఇంటర్నెట్‌, డిజిటలైజేషన్‌ సౌకర్యం, ఈ లెర్నింగ్‌ సెంటర్ల పథకం ఇప్పటివరకు ప్రారంభం కాలేదు.

దివ్యాంగులను ఆదుకోండి:-కె.రామకృష్ణ, నల్గొండ

దేశంలో దివ్యాంగుల సంక్షేమం కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నా క్షేత్రస్థాయిలో అవి సత్ఫలితాలనివ్వడం లేదని యునెస్కో తన తాజానివేదికలో పేర్కొనడం పట్ల ప్రభు త్వాలు స్పందించాలి.

దేశంలో విద్యాహక్కుచట్టం, దివ్యాం గులహక్కుల చట్టంతోపాటు దివ్యాంగుల సంక్షేమం కోసం సుప్రీంకోర్టు2010లోనేస్పష్టమైన మార్గదర్శకాలు రూపొం దించినా వారి జీవితాలలో ఆశించిన మార్పు రావడం లేద న్న సదరు నివేదిక, మెరుగైన కార్యాచరణ కోసం ప్రణాళి కలు రూపొందించామని సూచించడం సబబుగా ఉంది.

విద్యార్థులను ఒత్తిడికి గురి చేయొద్దు:-ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా

ఈవారంలో పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. విద్యా ర్థుల భవిష్యత్తును నిర్ణయించే అతిముఖ్యమైన ఈ పరీక్షల వల న విద్యార్థులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయితే పర్సెం టేజీలు, ర్యాంకులే ధ్యేయంగా కార్పొరేట్‌ పాఠశాలలు విద్యార్థు లపైఈ పరీక్షల కాలంలో రాత్రింబవళ్లు చదివిస్తూ ఒత్తిడికి గురి చేస్తున్నాయి.

అలాగే తల్లిదండ్రులు సైతం తమ లక్ష్యాలను, కోరికలను పిల్లలపై రుద్దుతూ వారిని మరింత ఒత్తిడికి గురి చేస్తున్నారు. ర్యాంకులు, మార్కుల పోటీలో వెనుకబడుతున్న విద్యార్థినీ, విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కాబ ట్టి వారిలోఒత్తిడి తగ్గించేవిధంగా తల్లిదండ్రులు,కళాశాల యాజ మాన్యం, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

అక్షరాస్యతలో అంతరాలు:-సయ్యద్‌ షఫీ, హన్మకొండ

ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు, బేటీ బచావో బేటీ పడావో అనే లోకోక్తి దేశాభివృద్ధికి ఎంతైనా అవసరం. నేటి సమాజంలో స్త్రీలను పురుషుల కంటే తక్కువగా కొందరు భావిస్తారు. సమా జంలో తల్లిదండ్రుల దృక్పథంలో ఇప్పుడిప్పుడే మార్పువస్తుంది.

వారి ఆలోచనలు మారి ప్రపంచంలో అన్ని రంగాలలోనూ స్త్రీ ముందంజలో ఉంటుంది.నేటి సమాజంలో ప్రభుత్వం స్త్రీల ను దృష్టిలో ఉంచుకొని చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించింది.

ఉద్యోగ రంగాల్లో చాలా మార్పు వచ్చింది. అబ్బాయిల కంటే అమ్మాయిల ఉత్తీర్ణతశాతంపెరిగింది.ఇప్పటికైనా ప్రభుత్వం వీరి కి విద్య, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి.

పథకాలకు పేర్లు పెట్టకండి:-రాచమడుగు శ్రీనివాసులు,అనంతపురం

ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో పోటీ చేసి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇంకా ప్రజాదరణను పొందడానికి ఎన్నో కొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుంది. అయితే ఆయా పార్టీల నాయకుల పేర్లను ఆ సంక్షేమ పథకాల పేర్లకుముందు తగిలించడం ఆనవాయితీ.

‘ఇందిర ‘రాజన్న ‘చంద్రన్న ఇలాంటి పేర్లతో సంక్షేమ పథకాలు అమలవ్ఞ తుంటాయి. అయితే తదుపరి ఎన్నికల్లో గెలుపొంది ప్రభు త్వాన్ని చేపట్టినవారు ఆ పథకాలు ఎంత మంచివైనా రద్దు చేస్తారు.అలాకాక ఎవరి పేరునుతగిలించక,ఎవరికి ఆ సంక్షే మ పథకమో వారి పేరు తగిలిస్తే బాగుంటుంది.ఉదాహర ణకునిరుద్యోగులకు అయితే నిరుద్యోగ సంక్షేమ పథకమని, విద్యార్థికి అయితే విద్యార్థి సంక్షేమ పథకమని పెట్టాలి.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/