ప్రజావాక్కు

PEOPLE
Voice of the people

సయోధ్య తీర్పు: -డా.డి.వి.జి శంకరరావు, పార్వతీపురం

సున్నితమైన, సంక్లిష్టమైన దీర్ఘకాలంగా కొనసాగుతున్న అయోధ్య రామమందిరం వ్యాజ్యంలో అత్యున్నత న్యాయ స్థానం చారిత్రాత్మక తీర్పువెలువరించింది. అంతిమంగా సమా జంలో సయోధ్య నెలకొనడమే ముఖ్యోద్దేశ్యంగా అత్యున్నత మైన మార్గదర్శనం చేసింది. కోట్లాది ప్రజల విశ్వాసాల్ని గౌర విస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. వివాదాస్పద భూభాగంపై ఏ కక్షిదారూ హక్కులు చూపలేకపోయినందున ఆ భాగం ప్రభు త్వానిదనితేల్చింది.అదే సమయంలో బాబ్రీమసీదు కూల్చివేతని తప్పుడు చర్యగా తేల్చింది. హిందూమత విశ్వాసాల ప్రకారం అయోధ్య రాముని జన్మస్థలం అయినందున, ఆ స్థలంలో రామమందిర నిర్మాణ భారం ప్రభుత్వం ఆధ్వర్యంలోని ట్రస్ట్‌ చేపట్టాలని సూచించింది. అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి ఐదెకరాల స్థలం కేటాయించాలని సూచించింది. డెబ్భై ఏళ్లుగా వివాదం పెరిగిపోతూపోయినవ్యాజ్యాన్ని అర్థవంతంగా ముగిం చిన న్యాయస్థానం ఒక మేలిమలుపుకు శ్రీకారం చుట్టినట్టే.

నిర్వీర్యమవుతున్న ప్రభుత్వ పాఠశాలలు:- ఇమ్మడి నాగేశ్‌, సంస్థాన్‌ నారాయణపూర్‌

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, పాఠశా లలను రేషనలైజేషన్‌ సాకుతో కుదించేందుకు,సంఖ్య తగ్గించేం దుకు విద్యాశాఖ పావ్ఞలు కదపడం రేపటి పౌరుడు ము ఖ్యం గా గ్రామీణ విద్యార్థుల పాలిట శాపంలా పరిణమించనున్నది. ఆయా కళాశాలల్లో, పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎందుకు పడిపోతున్నదనిఆరా తీసిందా ఈవిద్యాశాఖఎప్పుడైనా? చాలా విద్యాలయాల్లో నేటికీ పూర్తిగా విద్యుత్‌ లేదు. మరుగుదొడ్లు లేవ్ఞ.ముఖ్యంగా విద్యార్థుల సంఖ్యకు సరిపోయే అధ్యాపకులు లేరు. పారిశ్రామికవేత్తలు,రాజకీయనేతల కళాశాలలకు, పాఠశా లలకు విద్యాశాఖ బాసటగా నిలుస్తూ ప్రభుత్వ కళాశాలలను, పాఠశాలలను నిర్వీర్యం చేయడం అన్యాయం.

అనుకున్నది ఒక్కటి, అయింది మరొక్కటి:-ఎం.శ్రీనివాస్‌, హైదరాబాద్‌

కేంద్రంలోనే కాక ఉత్తరాది రాష్ట్రాలన్నింటిలోనూ బిజెపి అధికా రంలోఉంది.దేశవ్యాప్తంగానరేంద్రమోడీ గాలులు వీస్తున్నాయి. ఆయన వచ్చిప్రచారం చేస్తేచాలు తాము గెలిచిపోతామని తమ గెలుపు నల్లేరు మీద నడకే అనుకున్నారు. ఎన్నికల ముందు బిజెపిలో చేరిన ఇతర పార్టీల నాయకులు. అయితే వారికున్న ట్టు ఏమీ జరగలేదు. మహారాష్ట్ర శాసన సభకు జరిగిన ఎన్ని కలలో బిజెపి తరపున పోటీ చేసిన ఫిరాయింపుదారులందరు ఓటమి చెంది ఇంటిదారి పట్టారు.

ఆంగ్లమాధ్యమంపై ఆందోళనలు:-బి.ఎన్‌.సత్యనారాయణ, హైదరాబాద్‌

ప్రభుత్వపాఠశాలల్లో 1నుండి 6 తరగతుల వరకు ఆంగ్ల మాధ్య మంలోబోధన ప్రవేశపెడుతూ ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పెద్ద గందరగోళమే నెలకొంది. విమర్మలు, వ్యతిరే కతలు వెల్లువెత్తుతున్నాయి.కడకు మతాలనుకూడా ఇందులోకి లంకెకడుతున్నారు.ఇది శోచనీయం.ఆంగ్ల మాధ్యమంలోబోధన సాగిననాడు మాతృభాష తెలుగుకు అన్యాయం జరుగుతుందని, అది మరుగున పడిపోతుందని పలు విధాలుగా పలువ్ఞరు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. అందులో ఏమాత్రం వాస్తవం లేదని చెప్పవచ్చు. ఒక వ్యక్తి జీవితంలో ఆర్థికంగానూ, సామా జికంగాను ఎదగాలంటే తప్పనిసరిగా అతడికి ఆంగ్లభాషా పరి జ్ఞానం ఉండి తీరాలి. అభివృద్ధే లక్ష్యంగా చేసుకుంటూ సాగే ప్రభుత్వనిర్ణయాలను అందరం తప్పక స్వాగతించాలి.

అన్న క్యాంటీన్లను పున:ప్రారంభించాలి: -గరిమెళ్ల భారతీదేవి, ఏలూరు, ప.గోజిల్లా

రాష్ట్రంలో పనులు లేక రెక్కాడితేకానీ డొక్కాడని అభాగ్యజీవ్ఞలు కాలే కడుపులతో పస్తులుంటున్నారు. ప్రభుత్వం వారు అన్న క్యాంటీన్లలో ఏదో అవినీతి జరిగిందని సెప్టెంబర్‌ మాసంలోనే పున:ప్రారంభిస్తామని గత జులైమాసంలో మూసివేసిన సంద ర్భంలో వెల్లడించింది. ఇంతవరకు ఆ అవినీతి విచారణపై ఎటు వంటి పురోగతి లేదుసరికాదా మూసిన క్యాంటీన్లను ఎప్పుడు తెరుస్తారో చెప్పేవారే లేరు.కనీసం ఏదోఒక పేరుతో ఆక్యాంటీ న్లనుపున:ప్రారంభిస్తే పేదలు కడుపునింపుకుంటారు. పాలకులు మానవతాదృక్పథంతో ఆలోచించి క్యాంటీన్లను వెంటనే ప్రారం భించాలి.రాజకీయాలకు పేదలను బదిలీ చేయడం తగదు.

కొలీజియంపై భిన్నాభిప్రాయాలు: -సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

దేశ న్యాయవ్యవస్థలో కొలీజియం విధానంపై పలు వివాదాస్ప ద అభిప్రాయాలు వ్యక్తమవ్ఞతున్నాయి. తాజాగా తనకు సరైన ప్రాధాన్యత కల్పించడం లేదని తమిళనాడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజీనామా చేయడం ఈ వివాదానికి మరింత ఊతం ఇచ్చింది. కొలీజియం చెప్పిందే రాజ్యాంగమా? అంతా న్యాయంగా,పారదర్శకంగా జరుగుతోందా అన్న ప్రశ్నలు ఉత్ప న్నం అవ్ఞతున్నాయి.న్యాయవ్యవస్థలో పారదర్శకత, జవాబు దారీతనం నెలకొల్పడం పటిష్ట యంత్రాంగాలను రూపొందించా ల్సిన అవసరం ఎంతో ఉంది. న్యాయమూర్తులను నియమించే ముందు ప్రభుత్వసిఫారసుతో కాకుండా బహిరంగంగా అందుకు సంబంధించిన గ్రూపులతో చర్చించి పారదర్శకంగా ఎంపిక విధానాన్ని అనుసరించడం ప్రస్తుత తరుణంలో అనివార్యం.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com