ప్రజావాక్కు

People
voice of the people

పాఠశాలల్లో పర్యవేక్షణ అవసరం:-జి.అశోక్‌,గోదూర్‌, జగిత్యాలజిల్లా

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సక్రమంగా పాఠశాలకు హాజరై, సమయానుసారం సిలబస్‌ పూర్తి చేసి, పరీక్షలను సకాలంలో నిర్వహిస్తున్నారో,లేదోపర్యవేక్షించాల్సిన విద్యాశాఖాధికారులు జిల్లాకేంద్రాలకే పరిమితమవ్ఞతున్నారు. పర్యవేక్షణ లోపించడంతో ప్రాథమిక విద్య గాడితప్పే పరిస్థితి నెలకొంది.వారానికోసారి ప్రతిపాఠశాలను తప్పక పర్యవేక్షించి మధ్యాహ్నభోజనం, విద్యార్థులు,ఉపాధ్యాయులతీరుతెన్నులు, సిలబస్‌,విద్యాపరంగాఉపాధ్యాయులకు తగుసలహాలు, సూచ నలు అందించాల్సిన అధికారులే నిర్లక్ష్యం వహిస్తే పాఠశాలల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో వేరేచెప్పనవసరం లేదు.సంబం ధిత విద్యాశాఖాధికారులు ఇప్పటికైనా స్పందించాలి.

వాల్తేర్‌ డివిజన్‌లో కోచ్‌ల కొరత: -సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే వాల్తేర్‌ డివిజన్‌ పరిధిలో కోచ్‌ల కొరత తీవ్రం గాఉంది. ఇందువలన ప్రయాణీకులు నిత్యం నరకం చవిచూ డాల్సివస్తోంది. రైల్వేశాఖ నిర్లక్ష్యంవలన జనరల్‌ కోచ్‌ల సంఖ్య పెరగకపోవడంతోపాటు వాటి నిర్వహణ అధ్వాహ్నంగా ఉం టోంది. ఈ ప్రాంతంలో రోజుకు 130 రైళ్లు నడుస్తున్నా ప్రతీ రైలులో రెండు జనరల్‌ భోగీలు మాత్రమే ఉండడం వలన సాధారణ ప్రయాణీకులకు నరకం తప్పడం లేదు. ఎక్కిదిగే సమయంలో విపరీతమైన తొక్కిసలాట కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి.సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని జనరల్‌ కోచ్‌ల సంఖ్య పెంచాలన్న ప్రయాణికుల విజ్ఞప్తులను రైల్వేశాఖ పట్టిం చుకోవడం లేదు. సుప్రీంకోర్టు నిబంధనలకు అనుగుణంగా ప్రతీరైలులో మహిళలకు, దివ్యాంగులకు విధిగా కోచ్‌లు ఉండా లన్న అంశాన్ని రైల్వేశాఖ పట్టించుకోవడం లేదు.

హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాలి:-షేక్‌ అస్లాం షరీఫ్‌, శాంతినగర్‌

ప్రపంచం గర్వించదగ్గ గొప్ప మహానగరమైన హైదరాబా ద్‌ను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. చాలా మంది వివిధ పనుల నిమిత్తం హైదరాబాద్‌కు తరు చుగా వస్తుంటారు. ఈ మహానగరంలో ఏ మార్గం గుండా వెళితే ఎక్కడికి చేరుకోవచ్చు అని తెలిపే సూచికబోర్డులు చాలా చోట్ల లేవ్ఞ. ఇలా సూచిక బోర్డులు లేని కారణంగా సామాన్య ప్రజలు అయోమయానికి గురవ్ఞతున్నారు. అంతేకాకుండా రోడ్లన్నీ గతుకులమయంగా ఉన్నాయి. అలాంటి రోడ్లను మరమ్మతులు చేయించాలి.

పాకిస్థాన్‌కు బుద్ధిచెప్పాలి:-సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

భారత్‌తో సమీప భవిష్యత్తులో అణుయుద్ధం తప్పకపోవచ్చు నని పాకిస్థాన్‌ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అంతర్జాతీయవేదికగా చేసిన వ్యాఖ్యల పట్ల భారత్‌ అప్రమత్తంగా ఉండాలి. అణుయుద్ధం పేరుతో బెదిరించి సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడడం పాకి స్థాన్‌కు దశాబ్దాలుగా వస్తున్న అలవాటు.అణుశక్తితో పాకిస్థాన్‌కు దీటైన జవాబు ఇవ్వగల స్థితిలో భారత్‌ ఉన్నా దానిని సాధ్యమై నంత వరకు వినియోగించకూడదన్నదే భారతదేశ సిద్ధాంతం. అయితే భారత దేశం అహింసాయుత విధానాన్ని సాకుగా తీసు కొని భారత్‌లో అణుయుద్ధం తప్పకపోవచ్చునని పాకిస్థాన్‌ పదే పదే హెచ్చరికలు చేయడాన్ని భారతదేశం సీరియస్‌గా తీసుకో వాలి.అంతర్జాతీయ వేదికలపైఅణ్వాయుధాన్ని బూచిగా చూపిం చి, యుద్ధానికి కవ్వించి మరొకపక్క సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు దీటైన జవాబు ఇవ్వగల స్థితిలో భారత్‌ ఎప్పుడూ తయారుగా ఉండడం ఎంతో అవసరం.

పల్లెవెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించాలి: -ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా

రాష్ట్ర ప్రభుత్వం ఏటా పేద, బడుగు వర్గాల అభ్యున్నతి కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా సత్ఫలితాలను ఇవ్వడం లేదన్నది నిర్వివాదాంశం.అధికారుల నిర్లక్ష్యం,అవినీతి, రాజకీ య నాయకుల జోక్యం, పర్యవేక్షణా లోపంకారణంగా ఎన్నో పథకాలు కాగితాలపైనే కనిపిస్తున్నాయి. గతంలో సంక్షేమ పథ కాలను ప్రకటించడంతోనే ప్రభుత్వాల బాధµ్యత తీరిపోదని, సరైన పర్యవేక్షణ, పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకత్వం వెలువరించినా దాని ని పట్టించుకోవడం లేదు.సంక్షేమ పథకాల అమలు తీరును క్షుణ్ణంగా పరిశీలించి ఉన్నతాధికారులు,పాలకులు లోపాలను సవ రిస్తేనే సమస్యలు కొంతవరకు పరిష్కారం అవ్ఞతాయి. ఇందు కోసంగతంలో నిర్వహించి, అర్థాంతరంగా ఆపేసిన పల్లెవెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్రారంభించాలి.

నకిలీ డాక్టర్లను నిరోధించాలి: -కొవ్వూరు వెంకటేశ్వరప్రసాదరావు ప్రకాశంజిల్లా

దేశంలో రోజురోజుకు నకిలీ డాక్టర్ల హవా అధికమై రోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. నిర్లక్ష్యవైఖరిగా మారి న వైద్యరంగం పరిస్థితి రోజురోజుకు క్షీణదశకు చేరుకుం టోంది. గ్రామాల్లో వచ్చీరాని వైద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారు.వీరిని నిరోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఇలాంటి వారిపెప్రభుత్వౖం వెంటనేచర్యలు చేపట్టాలి.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/