ప్రజావాక్కు

Voice of the People

ప్రాథమికోన్నత పాఠశాలలకు అన్యాయం?:-పారేపల్లి సత్యనారాయణ, దేవులపల్లి, ప.గోజిల్లా

రాష్ట్రంలో ప్రాథమిక,ప్రాథమికోన్నత,ఉన్నతపాఠశాలల ద్వారా ప్రభుత్వం ఉచిత విద్య అందిస్తుంది. ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వరకు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1 నుంచి 7 లేదా 8వరకు, ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10 తరగతుల వరకు ఉన్నాయి. ఉన్నత పాఠశాలల్లో ప్రతి సబ్జెక్టుకి సంబంధించిన ఉపాధ్యాయులుంటారు. అక్కడ చదువ్ఞకునే పిల్లలకి విషయ పరిజ్ఞానంపొందడానికి అవకాశాలుఎక్కువ.కానీ ప్రాథమికోన్నత పాఠశాలలో ఆరునుంచి7లేదా 8వతరగతి వరకు చదివే విద్యా ర్థులకుఅన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఉపాధ్యాయులుండరు. ఉన్నా ఉపాధ్యాయులలో తెలుగు, హిందీ, సైన్స్‌, సోషల్‌ పోస్టులు మాత్రమే ఉంటున్నాయి. ఇంగ్లీషు సబ్జెక్టుని సోషల్‌ బోధిస్తున్న ఉపాధ్యాయులే బోధిస్తారు. తెలుగుకి, హిందీకి ప్రత్యేకంగా ఉపాధ్యాయులున్నప్పుడు మరి ఇంగ్లీషుకి ఎందుకు ప్రాథమికోన్నత పాఠశాలల్లో పోస్టులు మంజూరు చేయరు?

గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల చేయాలి: -కె.శేఖర్‌బాబు, హైదరాబాద్‌

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఐదు సంవత్సరాలు గడి చినా ప్రభుత్వంఇంకనూ గ్రూప్‌-1నోటిఫికేషన్‌ ప్రకటించలేదు. ఎందరో నిరుద్యోగులు ఉన్నత అధికారులు కావాలని, ప్రజా సేవచేయాలని కలలుకంటారు.కానీ వారికలలు పగటి కలలుగా మిగిలిపోతున్నాయి.2011సంవత్సరంనుంచితెలంగాణ రాష్ట్రం లో గ్రూప్‌-1 ఉద్యోగాల నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. కొత్త జోనల్‌ వ్యవస్థ కారణంగా ఇవ్వాలని పరిస్థితులున్నాయి. ఎన్నికలు పూర్తిఅయ్యి ఒక నెలకావస్తున్నా ఇంతవరకు గ్రూప్‌-1 ఉద్యో గాల ప్రకటన విడుదలచేయలేదు.ప్రభుత్వం ఇకనైనా గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ప్రకటించి నిరుద్యోగులకు మేలు చేయాలి.

తుప్పు పడుతున్న ఉపకరణాలు:-గరిమెళ్ల భారతీదేవి, ఏలూరు, ప.గో.జిల్లా

గత ప్రభుత్వం వివిధ చేతివృత్తుల వారికి పంపిణీ చేయడానికి ఉద్దేశించిన ఉపకరణాలూ, పాఠశాల బాలికలకు పంపిణీ చేయ డానికి సైకిళ్లు సేకరించి ఆయా జిల్లాలకు పంపగా ఎన్నికల కోడ్‌ అమలుతో అధికారులు పంపిణీ నిలిపివేశారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అయిదు నెలలు గడచినా ఆ ఉపకరణాలను,సైకిళ్లను లబ్ధిదారులకు అందచేయకపోవడంతో కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన ఉపకరణాలు తుప్పుపట్టి పనికిరాకుండాపోతున్నాయి.ఎవరూ ఉపయోగించకుండా వాటి ని అలా వదిలివేయడం సమంజసంకాదు. అది ఏ ప్రభుత్వ పథకమైనా ప్రజాధనం అన్నసత్యాన్ని పాలకులు మరువరాదు.

ఆర్టీఐ చట్టం ఆన్‌లైన్‌ కావాలి: -జి.వి.సాయికుమార్‌గుంత, పెనుగొలను, కృష్ణజిల్లా

రాష్ట్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తుల స్వీకరణకు ఆన్‌లైన్‌ పోర్టల్‌ ఏర్పాటు చేయాలి. ఆన్‌లైన్‌ సదు పాయం లేకపోవడం వలన పారదర్శకత లోపించడంతోపాటు దరఖాస్తుకు కనీసం రూ.100 ఖర్చు అవ్ఞతుంది. దీంతో చట్టం వినియోగానికి పూర్తిగా నోచుకోలేకపోతుంది. కేంద్రప్రభుత్వ శాఖలకుసంబంధించి ఆన్‌లైన్‌ అవకాశం ఉండటంతో దరఖాస్తు ఏ దశలో ఉన్నది మొదలగు వివరాలు వాస్తవ సమయంలో తెలుసుకునేందుకు వీలు ఉంది. ఇప్పటికే మహారాష్ట్రలో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సదుపాయాన్ని తీసుకురావాలి.

కాలుష్యాన్ని నివారించాలి: -పద్మనాభుని మణిదీప్‌,వూటుకూరు, కృష్ణా జిల్లా

గాలిలో వివిధ రసాయనాల శాతాన్ని బట్టి (ఏక్యూఐ) వాయు నాణ్యతా సూచీని లెక్కిస్తారు.అయితే శుక్రవారం వచ్చిన గణాం కాలనుచూస్తే ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్యపూరితంగా ఉన్నది. మొత్తం 549 శాతంగా ఉన్నట్లు ఏ క్యూఐ సూచీ తెలి పింది. కాబట్టి ఇది చాలా ప్రమాదకరం. ఇది ప్రతి సంవత్సరం దీపావళి తర్వాత ఇలానే ఉంటుంది. కానీ ఈసారి ఇంకా ఎక్కు వగా ఉన్నట్లు తెలుస్తుంది. కాబట్టి కాలుష్యనివారణ మండలి ఇప్పుడు ఢిల్లీలో హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించింది. వారం రోజు లు ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. దీన్ని బట్టి చూస్తే రాజధాని ఢిల్లీలో దీపావళి బాంబు ఎంతలా ఉందో అర్థ మయింది. రానురాను హైదరాబాద్‌ కూడా ఇలానే అవ్ఞతుంది. కాబట్టికాలుష్య నివారణ మండలి, ప్రభుత్వాలు, ప్రజలు అంద రూ భాగస్వాములైతేనే ఈసమస్యకుపరిష్కారం దొరుకుతుంది.

యువకుల చేతుల్లో దేశభవిష్యత్తు: -షేక్‌ అస్లాం షరీఫ్‌, శాంతినగర్‌

ప్రస్తుతం యువత చాలావరకు తమ జీవితానికి గమ్యం లేకుం డా తిరుగుతున్నారు.జల్సాలకు, షికార్లకు బాగా అలవాటు పడి పోతున్నారు. యువత ఇలాగే తిరిగితే పెడదారిన పెట్టడానికి అవకాశం ఉంది. యువతపై తల్లిదండ్రులు పూర్తిస్థాయిలో దృష్టిపెట్టవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం యువకుల కోసం మానసిక విశ్లేషకులతో ప్రేరణ తరగతులు నిర్వహించాలి. అలాగే యువకులు స్వయం ఉపాధితో జీవించే విధంగా ప్రభు త్వంబ్యాంకులద్వారా రుణాలు మంజూరు చేయించాలి. ఉజ్వల దేశభవిష్యత్తుయువకుల చేతుల్లోఉందికాబట్టి వారు సన్మార్గంలో నడిస్తే బాగుంటుంది.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com