ప్రజావాక్కు

prajaavaakku
Voice of the people

ఇరవై ఏళ్ల తర్వాత నోబెల్‌ బహుమతి:- డా.డి.వి.జి శంకరరావు పార్వతీపురం

ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్‌ బహుమతి మరోసారి భారతీయునికి లభించడం గర్వించదగ్గ విషయం. ఇరవై ఏళ్ల క్రితం అమర్త్యసేన్‌ ఈ బహుమతి పొందిన తర్వాత మళ్లీ ఈ ఏడాది ప్రవాస భారతీయ శాస్త్రవేత్త అభిజిత్‌కి లభించింది. అభిజిత్‌తోపాటు ఆయన సతీమణిడఫ్లో,మరో శాస్త్రవేత్త క్రేమెర్‌ ఈసారి ఆర్థికశాస్త్రంలో నోబెల్‌ సహగ్రహితులు. ఆయన ప్రతి పాదనలు పేదరిక నిర్మూలన దిశగా సకారాత్మక మార్పుల్ని తీసుకువచ్చేవి.కనుకఆయన్ని అభినందిస్తున్న ప్రభుత్వం ఆయ నమాటల్ని కూడా గౌరవించాలి. ఒక విధానం రూపకల్పనతోనే సరిపోదు. దాని ఫలితాన్ని శాస్త్రీయంగా బేరీజు వేయాలి. క్షేత్ర స్థాయిలోవాటి ఉపయోగితనుపరీక్షించాలి.క్షేత్రస్థాయిలో పరిశో ధించి తగుసూచనలు చేయడంతో దేశంలో యాభైలక్షల మంది విద్యార్థులవిద్యలోగుణాత్మక మార్పుసాధించినట్లు నోబెల్‌ కమి టీ ప్రశంసించింది.ఆర్థికవిధానాలు అంతిమ ఫలితాల ఆధారం గా రూపు కట్టాలన్న హేతువైఖరి దేశానికి ఇప్పుడు అవసరం.

కార్పొరేట్‌ రాజ్యం:-సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

దేశంలో మంగళూరు, లక్నో, అహ్మదాబాద్‌, ఇండోర్‌ విమానా శ్రయాలనిర్వహణ, యాజమాన్యాన్ని అదానీ గ్రూప్‌కు అప్పగిం చాలన్న కేంద్రప్రభుత్వం నిర్ణయంఅహేతుకం. జాతీయ విమా నాశ్రయాల నిర్వహణ సంస్థపరిధి నుండివీటిని తప్పించి ప్రైవే ట్‌ సంస్థలకు అప్పగించే సదరు నిర్ణయం వెనుక దూరదృష్టి లోపించింది. తొలుతవీటి అభివృద్ధికి వందల కోట్ల ప్రజాధనం ఖర్చయింది. అనేక సదుపాయాలను కల్పించిన అనంతరం విందుభోజనం ఉన్న ప్లేటు మాదిరిగా ప్రైవేట్‌ సంస్థలకు అప్ప గించడం వెనుక అనేక దురద్దేశాలు దాగి వ్ఞన్నాయన్న అను మానాలు వ్యక్తమవ్ఞతున్నాయి.

పిఆర్సీ నివేదికలో తీవ్ర జాప్యం:-జి.అశోక్‌,గోదూర్‌, జగిత్యాలజిల్లా

వేతన కమిటీ సవరణ నివేదికను సకాలంలో ఇవ్వకపోవ డం వల్ల రాష్ట్ర ప్రభుత్వ సిబ్బంది చాలా నష్టపోతున్నారు. ఇప్పటికే గత కొన్ని పి.ఆర్‌.సిలను పొందడంలో వారు చాలా నష్టపోయారు. అసలు ఐదు సంవత్సరాల కొకసారి పిఆర్సీని నియమిస్తున్నట్టు ప్రకటించింది మొదలు దాని సిఫారసులు అమల్లోకివచ్చేవరకు అడుగడుగునా ఆలస్యం జరుగుతుండడం ఉద్యోగులకు ఆందోళన కలిగిస్తోంది. గత పిఆర్సీ గడువ్ఞ 2018 జూన్‌లోనే ముగిసింది.

కార్యాలయాలకు పార్టీ రంగులా?: -గరిమెళ్ల రామకృష్ణ, ఏలూరు, ప.గోజిల్లా

రాష్ట్రంలో జీతభత్యాలు ఇవ్వటానికే కష్టంగా ఉందని సీనియర్‌ మంత్రి సెలవిచ్చారు. నిజానికి ఆశా వర్కర్ల నుండి జూనియర్‌ డాక్టర్లు,చాలామంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు.కాంట్రాక్టు ఉద్యో గులు, స్వీపర్లు వగైరాలకు నెలల తరబడి వేతనాలు అందటం లేదు.తాజాగా ఈ జాబితాకు గ్రామవలంటీర్లు కలిశారు. సదరు మంత్రి గారే వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉన్నా యని అంటున్నారు.ఆర్థికపరిస్థితి బాగోనప్పుడు ఈ ఆర్భాటా లెందుకు?విద్యుత్‌ బిల్లులు కట్టలేని పంచాయతీ కార్యాలయాల కు,స్మశానాలకు పనిచేయనిమంచినీటి ట్యాంకులకు కోట్ల రూపా యల ఖర్చుతో పార్టీ రంగులు వేయడం ఎంతవరకు సబబు? అధికారంలోలేనప్పుడు బాధ్యతారాహితంగా మాట్లాడారు.

ఖాళీలను పూరించండి: -యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం

ఆంధ్రప్రదేశ్‌ గ్రామవార్డు సచివాలయ ఉద్యోగాలు సుమారు రెండులక్షలమంది నియామకాలుఏకకాలంలో చేపట్టడం అభినం దించదగ్గ విషయం. తద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం లభించగలదు.అయితే రైతన్నకు నీరం దించే జలవనరుల శాఖలో మైలు కూలీలు, కలాసి, లస్కర్‌లు వేలాదిగా ఖాళీలుఉండటంతో నీరందించే సిబ్బంది లేక మారు మూలపొలాలు బీడుగా మారుతున్నాయి. ప్రతి ఐదు కిలోమీట ర్లకు ఒక మైలుకూలీ విధులు నిర్వర్తించేందుకు అప్పట్లో ప్రభు త్వం నిర్ధారించింది. ఉద్యోగులు పదవి విరమణ చేయడం, కొందరు మరణించడంతో ఖాళీలు పూరించకపోవడంతో ప్రస్తు తం రైతులు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు.

వాతావరణ మార్పులపై దృష్టిసారించాలి: -ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా

గ్రీన్‌హౌస్‌ ఉద్గారాలను అరికట్టేఅంశంపై అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్‌,కొరియా,చైనావంటి దేశాధినేతలకు చిత్తశుద్ధి లోపిం చింది.ఇటీవలి అంతర్జాతీయ సదస్సులో కేవలం ఆర్భాట మైన ప్రకటనలకే పరిమితమైన వారి ప్రసంగాలు, ఫ్రాన్స్‌ ఒప్పందం తర్వాత మూడేళ్లకాలంలో ఏంచేసారనే అంశంపై కప్పదాట ధోరణి అవలంబించడం బాధాకరం. ఉష్ణోగ్రతల ను నియంత్రించేందుకు 2016 పారిస్‌ సదస్సులో కుది రిన ఒప్పందాల అమలులో దేశాధినేతలు నిర్లక్ష్యపూరిత, నిరాసక్త ధోరణితో సాగుతున్నారు.భూవిని యోగం, విద్యు త్‌వంటి సామాజిక, ఆర్థిక రంగాలలో ప్రాథమిక మార్పు లను అత్యవసరంగా చేపట్టాల్సిన అవసరం ఉంది. \

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి : https://epaper.vaartha.com