ప్రజావాక్కు

Voice ot the people
Voice ot the people

కోతికి కొబ్బరి చిప్ప: -ఎం.శ్రీనివాస్‌, హైదరాబాద్‌

చేసిన మంచి పనిని ఎవరూ గుర్తుపెట్టుకోరు. ప్రశంసించరు. తెలిసో తెలియకో ఒక చెడు చేస్తే మాత్రం వేలెత్తి చూపుతారు. అందరూ ఏకమై మీదపడతారు. ప్రతిచోటా ఇలానే జరుగు తోంది. మనుషులంతా ఇలానే ఉంటున్నారు. రాజకీయాలలో ఇలాంటి వారు మరీ ఎక్కువగా ఉంటున్నారు. తెలంగాణాలో ఇప్పుడు ఇలాంటి వారంతా ఏకమై ప్రభుత్వంపై విరుచుకుప డుతున్నారు. అయిన దానికి, కాని దానికి ఒంటికాలుపై లేస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. తెలంగాణాలో ఎలాగోలా పాగా వేయాలనే ఉబలాటంతో ఉన్న బిజెపి ఈ విషయంలో మిగతా పార్టీల కన్నా చాలా ముందుటున్నది. గోరంత సమస్యను కొండంతగా చూపుతోంది. ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మెను కూడా వారు ప్రజలకు కొండంతగా చూపుతున్నారు. ఈ సమ్మె వారికి కోతికి కొబ్బరి కాయదొరికినట్టుగా అయింది.

సవాల్‌గా మారుతున్న సమాచార పరిరక్షణ: – సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

దేశంలో సమాచారపరిరక్షణ అనేదిప్రభుత్వాలకు పెను సవాలు గా మారింది. అనేక సందర్భాలలో ఆధార్‌, టెలికం వంటి సంస్థలకు ఇచ్చే సమాచారం తేలికగా లీకవ్ఞతున్న ఘటనలు సమాచార పరిరక్షణ క్షేత్రస్థాయిలో ఎండమావే అన్న సంగతిని గుర్తుకు చేస్తున్నాయి.ఆధార్‌కు సంబంధించి చట్టాలఉల్లంఘన జరుగుతున్నా ఆయారాష్ట్ర ప్రభుత్వాలు అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు.చట్టవిరుద్ధంగా వ్యక్తిగత సమాచారం అందుతున్నందు వలన ప్రతిరోజు వివిధ మార్కెటింగ్‌ సంస్థల నుండి ఫోన్లు రావడం, వ్యక్తిగత బ్యాంకు ఖాతాలోనికి డబ్బు జమ అవడం, ఫోన్లలో పాస్‌వర్డ్‌ అడగడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. శత్రుదేశాలతోపాటు అంతర్జాతీయ హ్యాకర్ల నెట్‌వర్క్‌ బారినపడకుండా కీలక సమాచారాన్ని పరిరక్షించా ల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వంపై ఉంది.

వక్రీకరించడం సరికాదు: -గరిమెళ్ల రామకృష్ణ, ఏలూరు, ప.గోజిల్లా

ప్రతిపక్షనేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన విశాఖ పర్యటనలో కొంత మంది పోలీసు అధికారులు అత్యు త్సాహం ప్రదర్శిస్తున్నారంటూ వ్యాఖ్యానిస్తే, అదే విషయం అన్ని పత్రికలలోనూ ప్రచురించారు. కానీ కొందరు మాత్రం ఆయనే పోలీసుల అంతు చూస్తానని అన్నారని అనడం చాలా తప్పు. అనని మాటలు ఆపాదించి పోలీసులను తప్పుదోవ పట్టించాలని దుర్భుద్దితో వ్యవహరించడం సరికాదు.

చట్టాల అమలులో కఠినంగా వ్యవహరించాలి: -సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఎన్నో కీలక చట్టాలను ప్రభుత్వం చేసింది. అయితే అమలులో చిత్తశుద్ధి లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ నాయకుల జోక్యం కారణంగా ఇటువంటి చట్టాలు క్షేత్రస్థాయిలో సరిగ్గా అమలు కావడంలేదు. ఉదాహర ణకు బాల్యవివాహలు,బాలకార్మికుల వ్యవస్థ, వరకట్నం, గృహ హింస, విద్యాహక్కు చట్టం, గిరిజన హరిజనులు, దళితులపై అత్యాచార నిరోధక చట్టం,పోక్సో,నిర్బ§్‌ు, సైబర్‌ నేరాల నిరో ధక చట్టం, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వంటి ఎన్నో కీలక చట్టాలు చట్టసభల ఆమోదం పొందినా అమలు అలక్ష్యం కారణంగాహింస, అవినీతి, అత్యాచారాలు, వేధింపులు జరుగు తూనే ఉన్నాయి. నేతలు ఒక పార్టీ టిక్కెట్‌పై గెలిచి మర్నాడే పార్టీలు మార్చేస్తున్నారు. ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం సడలకముందే చట్టాల అమలులో కఠినంగా వ్యవహరించాలి.

కార్మికుల సమస్యలను పరిష్కరించాలి: -యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం

ఉద్యోగులను, కార్మికులను కన్నబిడ్డలుగా ఆదరిస్తున్నామని, దేశంలో తెలంగాణ ప్రభుత్వం దిక్సూచిగా ఉందని, అన్ని రాష్ట్రాలు కేంద్రప్రభుత్వం కూడా మేము చేస్తున్న పథకాలను అనుసరిస్తున్నాయని ఇదే మా పాలనకు గీటురాయి అని తండ్రి కొడుకులు ప్రజలచెవ్ఞల్లో జోరీగలా చిల్లుపడేలా చెబుతున్నారు. గత పది రోజులుగా సమ్మె చేస్తున్న రాష్ట్రరోడ్డురవాణా సంస్థ కార్మికులు తమ న్యాయమైన కోరికలు తీర్చమని కుటుంబాలతో సహా నడిరోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తుంటే కనీసం స్పం దించిన జాడ లేదు. కార్మికులు కంటి ముందు ఆత్మహత్యలు చేసుకుంటుంటే సమస్యను పరిష్కరించాల్సిందిపోయి రెచ్చ గొట్టేలా మాట్లాడటం సరికాదు. బలిదానాలు వేదికగా చేసుకు న్నా ఆపే ప్రయత్నం చేయలేదు.

కొత్త కమిటీలను ఏర్పాటు చేయాలి: -జి.అశోక్‌,గోదూర్‌, జగిత్యాలజిల్లా

ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీలను ఏర్పా టు చేసి ఐదేళ్లవ్ఞతున్నా కొత్త కమిటీలను ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. 2014 సంవత్సరంలో రెండేళ్ల పదవీ కాలానికి ప్రభుత్వ ఆదేశాలతో ఎస్‌.ఎం.సీలను ఏర్పాటు చేశారు. మరో రెండేళ్ల కాలం కోసం పాత వాటినే పునరుద్ధరించారు. తిరిగి ఈ విద్యాసంవత్సరం కూడా వాటినే మళ్లీ పునరుద్ధరిస్తూ విద్యాశా ఖాధికారులు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల తో ఏర్పాటయ్యే ఈ కమిటీలలో చదువ్ఞలు పూర్తయిన విద్యా ర్థులు పాఠశాల విడిచి వెళ్లిపోతే, వారి తల్లిదండ్రులతో కమిటీ లను ఎలా కొనసాగిస్తారు?ఇది చాలా అసంబద్ధం.

తాజా నాడి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/health1/