ప్రజావాక్కు

Voice of the People
Voice of the People

కొడిగడుతున్న వలంటీర్ల వ్యవస్థ: -గరిమెళ్ల రామకృష్ణ, ఏలూరు, ప.గోజిల్లా

రాష్ట్రంలో కొత్తగా వలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చిన ప్రభు త్వం, రాష్ట్రం మొత్తం మీద మూడు లక్షల మంది వలంటీర్ల అవసరం ఉండగా,కేవలం ఒక లక్షాతొంబైవేల మందిని మాత్ర మే నియమించారు. వారిలో వివిధ కారణాలతో ఇప్పటికే ఓ ముప్ఫై వేల మంది వరకు విధుల్లోకి రావడం మానివేశారు. కొనసాగుతున్న వాలంటీర్లలోనూ చాలా మందికి గత రెండు నెలలుగా వేతనాలు అందటంలేదన్న వార్తలు వస్తున్నాయి. పనిభారం పెరగటం, వేతనాలు రాక, సరైన విధి విధానాలు లేక చాలా మంది మానుకునే ఆలోచనలో ఉన్నారు. ఈ పథకం ఉద్దేశ్యం నిరుకారినట్లే అనిపిస్తున్నది.

ప్రమాణాలు ముఖ్యం:-కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట, భూపాలపల్లిజిల్లా

తయారు చేయబడే అన్ని వస్తువ్ఞల విషయంలో అనివార్యంగా పాటించాల్సిన కొన్ని సాంకేతిక సూత్రాలు ఉంటాయి. స్వచ్ఛం దంగా చేసుకునే ఈ నియమావళినే ప్రమాణాలని అంటారు. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యం,పరిశ్రమలు, ప్రభుత్వాలు విని యోగదారుల అవసరాలను తీర్చడంలో ప్రమాణాల స్థాయి ముఖ్యం. నేడు మార్కెట్లో కొనుగోలు చేస్తున్న అనేక వస్తువులు సరైన ప్రమాణాలతో తయారు కావడం లేదు. నాణ్యత కొర వడుతుంది.రకరకాలవస్తువ్ఞలకంపెనీలు పుట్టగొడుగుల్లా పుట్టు కువస్తున్నాయి.ఏ వస్తువ్ఞ నాణ్యతతోఉందో? నకిలీగా ఉందో? గుర్తించడం కష్టతరంగా మారింది. సంబంధిత అధికారులు కొరవడినారు. వస్తువ్ఞలు తయారుచేసే కంపెనీలపై నాణ్యత విషయంలో ఎలాంటి ప్రమాణాలు పాటిస్తున్నారో తనిఖీలు చేస్తే విషయం తేటతెల్లమవ్ఞతుంది.

వినియోగంలోకి రాని బస్టాండ్లు: -షేక్‌ అస్లాం షరీఫ్‌, శాంతినగర్‌

చాలా బస్టాండ్లను కట్టినప్పటికీ అటువంటి బస్టాండులు నిరు పయోగంగా ఉన్నాయి. బస్టాండ్ల నిర్మాణం జరిగినప్పటికీ అక్కడ బస్సులు నిలుపకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురికావడం జరుగుతుంది. లక్షలు వెచ్చించి కట్టిన బస్టాండ్‌ లను ఉపయోగంలోకి తీసుకురావాలి. బస్టాండ్‌ పరిసరాలు చెత్తాచెదారంతో, ముళ్ల కంచెలతో అపరిశుభ్రంగా ఉంటున్నా యి. అంతేకాక కొంత మంది అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా మార్చేస్తున్నారు. ఇలాంటి బస్టాండలపై సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలి.

నిబంధనలు ఉపసంహరించాలి: -యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం

గ్రామ, వార్డు సచివాలయాలకు ఎంపికైన ఉద్యోగులు మధ్యలో మానేస్తే జీత భత్యాలు వెనక్కి ఇవ్వాలని ప్రభుత్వం ఆంక్షలు విధించడం సరైంది కాదు. రాష్ట్రంలో లక్షలాదిగా నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూ స్తున్నారు.తక్కువ వేతనంఅయినా పనిభారం అయినా నివాసం ఉంటున్న సమీపంలో కొలువ్ఞలే అనే ఒకే ఒక్క కారణంతో ఉన్నత చదువ్ఞలు చదివిన వారు కూడా ఈ ఉద్యోగాలకు ఆకర్షి తులయ్యారు.ప్రభుత్వం పెట్టిననిబంధన ప్రైవేట్‌ కర్మాగారాలు, కార్యాలయాలు, ఆఖరుకి కిరాణా, వస్త్ర దుకాణాల్లో కూడా ఇటువంటి నిబంధన లేదు. దీనివలన ఇప్పటికీ వేలాది ఖాళీలు పూరించలేకపోయారు. చేరిన అభ్యర్థులు వెనకడుగు వేస్తున్నా రు. ప్రభుత్వం సదరు నిబంధన ఉపసంహరించి స్వేచ్ఛగా ఉద్యోగాలు చేసుకునే విధంగా ఆంక్షలు రద్దు చేయాలి.

ఆర్టీసీని లిమిటెడ్‌ కంపెనీగా మార్చాలి:-ఇమ్మది నాగేశ్‌, సంస్థాన్‌ నారాయణపూర్‌, యదాద్రిజిల్లా

టిఎస్‌ఆర్‌టిసి పట్ల ప్రభుత్వం కఠిన వైఖరి వీడనాడాలి. ప్రజా రవాణా స్తంభించి ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు నానా అవ స్థలుపడుతున్నారు.విద్యార్థుల గైర్హాజరు పెరుగుతోంది. తీవ్ర నష్టం వాటిల్లుతున్నది.రవాణాశాఖ మంత్రికానీ, ముఖ్యమంత్రికి కానీ చీమకుట్టినల్లు కూడా లేదు. ఆర్టీసీ ఇంధనంపై వ్యాట్‌ వసూలుచేయాలి.ఎమ్‌విట్యాక్స్‌ మినహాయింపు ఇవ్వాలి. వివిధ వర్గాలకు ఇస్తున్న పాస్‌లపై రాయితీ సొమ్మును ప్రభుత్వం వెం టనేఆర్టీసీకి చెల్లించాలి. కాంట్రాక్టు బస్సులను ఆర్టీసీలో విలీనం చేయాలి. ప్రైవేట్‌ పరిమ్మిట్‌లను పది శాతమే ఉంచాలి. మెకాని కల్‌సెక్షన్లలో బడా అధికారులు విడిభాగాలపై కుంభకోణం చేయ కుండా ఉండటానికి పక్కా ఆడిటింగ్‌ తనిఖీలు నిర్వహించాలి.

సిబిఐపై విమర్శలు: -ఎం.కనకదుర్గ, తెనాలి, గుంటూరుజిల్లా

అధికారంలోకి వచ్చాక సిబిఐ తన నిష్పక్షపాత వైఖరిని కోల్పో యిందన్నవిమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్‌ హయాంలో సిబిఐ అధికారపార్టీ తొత్తుగా పనిచేసిందని విమర్శలు గుప్పిం చిన బిజెపి తనహయాంలో కూడా అదేవిధానాన్ని అనుసరించ డంబాధాకరం. సుప్రీంకోర్టు పలుమార్లు సిబిఐను పంజరంలోని చిలుక అని అభివర్ణించినా, సిబిఐ పనితీరు మీద ఆక్షేపణలు వ్యక్తంచేసినా దాని పనితీరులో ఎలాంటి మార్పురావడం లేదు. ముఖ్యంగా ప్రత్యర్థులను వేధించేందుకు, వారిని తమకు అను కూలంగా మలచుకునేందుకు అధికారపార్టీ సిబిఐను వాడుకుం టోందన్న విషయంమాజీనాయకుల విషయంలో బలపడింది.

తాజా నాడి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/health1/