ప్రజావాక్కు

Voice of the people
Voice of the people

రాజద్రోహం చట్టం కొనసాగడమే ప్రజాద్రోహం: -డా.డి.వి.జి శంకరరావు, పార్వతీపురం

ఎప్పుడో భారతీయుల్ని అదుపులో పెట్టడానికి ఆంగ్లేయులు తీసుకువచ్చిన చట్టం రాజద్రోహం చట్టం. నాడు బాలగంగాధర తిలక్‌ మొదలుకొని స్వాతంత్య్ర సమర యోధులపై బనా యించబడి,నేడు ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు 49మంది ప్ర ముఖులపై ప్రయోగింపబడేలా బతికి ఉంది. ప్రజాస్వామ్యంగా దేశంమారిన పిమ్మట ఆ చట్టం అవసరం ఎంత మాత్రం లేదు. తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నుండి సుప్రీంకోర్టు వరకు ఇదే అభిప్రాయం.చట్టం ఉండడమే తప్పు అనుకుంటే అది దుర్విని యోగం అవ్వడం మరింత పెద్ద తప్పు. దేశభద్రత పేరుతో పౌరుల భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హరించగల అవకాశం ఉన్న ఈ చట్టం ఒకవేళ ఉన్నా జాగ్రత్తగా వినియోగించాలి. ఒక వ్యక్తి చర్య వల్ల దేశంలో హింస, అలజడి రేగుతుందన్నా, భద్రతకు ముప్పు అనుకున్నా ఈ చట్టం ప్రకారం కేసు వేస్తే ఒక అర్థం ఉంది. కానీ ప్రభుత్వాన్ని నిలదీసినం దుకుఈకేసు ఎదుర్కో నాల్సివస్తే అదిప్రజాస్వామ్యానికే ప్రమాదం.

ప్రకృతి వైపరీత్యాలపై పభుత్వ నిర్లిప్తత!: – గరిమెళ్ల రామకృష్ణ, గన్నవరం, కృష్ణాజిల్లా

ఈ సంవత్సరం రాష్ట్రంలో వర్షాకాల ప్రారంభంలో వర్షాలు లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట విస్తీర్ణం కూడా ఎన్నడూలేనంతగాపడిపోయింది.ఇటీవల అదునుదాటిన తర్వా త అధిక వర్షాలతో పంట పొలాలకు అపార నష్టం జరిగినట్లు వ్యవసాయశాస్త్రజ్ఞులు తెలియచేస్తున్నారు.ఇలా వాతావరణంలో అసహజ మార్పుల వలన పంటలు చీడపీడలతో దిగుబడులు గణనీయంగా తగ్గే సూచనలు కనపడుతున్నాయి.పరిస్థితి ఇంత తీవ్రంగాఉన్నా పాలకులుఅన్నదాతకు తగిన సహాయం అందిం చడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరం. కనీసం మూడు వందలకుపైగా మండలాల్లో కరవ్ఞ అలాగే ఉంటే కేంద్రానికి సాయం కోసం కూడా నివేదికలు పంపకపోవడం బాధ్యతారాహిత్యానికి పరాకాష్ఠ!

అధ్వాన్నంగా మారుతున్న పాఠశాలలు:-షేక్‌ అస్లాంషరీఫ్‌, శాంతినగర్‌

చాలా జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలకు ప్రహరిగోడలు లేవ్ఞ. కొన్ని పాఠశాలలకు ప్రహరిగోడలు సగం వరకు ఉన్నా యి. నిధుల లేమితో మధ్యలో ఆగిపోవడం జరిగింది. పాఠశా లలకు ప్రహరిగోడలు లేని కారణంగా పాఠశాల పరిసరాలు అధ్వాన్నంగా తయారవ్ఞతున్నాయి.పశువ్ఞలు వచ్చి చేరుతున్నా యి. ఆవరణలో నాటిన మొక్కలను నాశనం చేస్తున్నాయి.

నోటిఫికేషన్‌ విడుదలలో జాప్యం: -కె.శేఖర్‌బాబు, హైదరాబాద్‌

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఐదు సంవత్సరాలు గడిచినా ప్రభు త్వం ఇంకాను గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ప్రకటించలేదు. ఎందరో నిరుద్యోగులు ఉన్నత అధికారులు కావాలని, ప్రజాసేవ చేయా లని కలలుకంటారు. కానీ వారి కలలు పగటి కలలుగా మిగిలి పోతున్నాయి. 2011 సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్‌-1 ఉద్యోగాల నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. కొత్త జోనల్‌ వ్యవస్థ కారణంగా ఇవ్వాలని పరిస్థితులు ఉన్నాయని ఎలక్షన్‌ ముందు చెప్పారు. కానీ ఇప్పుడు ఎలక్షన్స్‌ పూర్త అయ్యి ఒక నెల కావస్తుంది. కానీ ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం గ్రూప్‌-1 ఉద్యోగాల ప్రకటన విడుదల చేయలేదు. పత్రికలలో గత ఆరు నెలల నుంచి గ్రూప్‌-1 ప్రకటనల త్వరలో వస్తుందని వార్తలు వస్తున్నాయి. కానీ ఇంతవరకు ప్రకటన వెలువడలేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలి.

అధికార దాహం: -ఎం.శ్రీనివాస్‌, హైదరాబాద్‌

తాము పోటీ చేస్తున్న పార్టీ ఎన్నికలలో ఓడిపోవడం ఖాయ మని గ్రహించి నాయకులు గెలిచే అవకాశాలున్న పార్టీల్లో చేరు తున్నారు. మరికొందరు పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆ పనిచేస్తున్నారు. ఇవేమి చేయకుండా సందిగ్ధావస్థలో ఊగిసలా డుతున్న నాయకుల ఇళ్ల చుట్టు తెగ తిరిగి ఎలాగోలా వారిని తమ పార్టీలోకి గుంజుకుపోతున్నారు. ఇవి చాలక తమ నిర్ణ యాలతో సంచనాలను సృష్టిస్తున్నామని ప్రచారం చేసుకుంటూ అందరి మద్దతు కూడగట్టుకుంటున్నారు. రాజకీయ లబ్ధిపొందు తున్నారు.గోరంతను కొండంతలు చేసి చెప్పుకుంటున్నారు. అడుగుఅడుగున అడ్డంకులు కలిగిస్తున్నారు. ఇలాంటి పనులు చేసేది కేవలం అధికార దాహం కలిగినవారే.

విదేశాల్లో వేధింపులు: -సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

విదేశాలలో ఉన్న తెలంగాణ ఆడపిల్లలకు నిత్యం ఎదురయ్యే వేధింపులు, గృహ హింస సంఘటనలపై సత్వర చర్యలు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం మహిళాభద్రతా విభాగం కింద ప్రత్యేక సెల్‌ను నియమించడం హర్షణీయం. చట్టాలలోని లొసుగుల ఆధారంగా కొందరు భర్తలు విదేశాలలో పెళ్లాయ్యాక భార్యలను అదనపు కట్నం కోసం వేధించడం, పుట్టింటికి బల వంతంగా పంపివేయడం, అక్రమంగా రెండోపెళ్లి చేసుకోవడం, అమ్మాయిలను వేధింపులకు గురి చేయడం వంటి ఘటనలకు పాల్పడుతుండగా,ఇటువంటి ఘటనలకుఆయాదేశాలలో ప్రత్యేక చట్టాలు లేనందున ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/