ప్రజావాక్కు

Voice ot the people
Voice ot the people

మధ్యాహ్నభోజనంలో సమతులాహారం: -పారేపల్లి సత్యనారాయణ, దేవులపల్లి, ప.గోజిల్లా

గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువ్ఞతున్న విద్యార్థులకు మధ్యాహ్నభోజనం పథకం అమ లులోఉంది.నాసిరకం భోజనం నుంచి పౌష్టికాహారం అందించే దిశగా అనేకసార్లు భోజన పథక మోనుని మార్పులు చేర్పులు చేసి సవరించడం జరిగింది. వారానికి ఐదు కోడి గుడ్లు అంది స్తూ పప్పు,ఆకు కూరలు వడ్డిస్తున్నారు. కానీ పాఠశాలలకి అం దించే బియ్యం నాణ్యమైనవిగా ఉండటంలేదు. అన్నం బాగుం టేనే ఏ కూర కలుపుకున్నా రుచిగా అనిపిస్తుంది. నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలి. అంతేకాకుండా పిల్లలకు ఒక్క కూర అన్నం మాత్రమే తిని లేస్తే అది అర్థభోజనంతో సమా నం.కావ్ఞన ప్రభుత్వం పిల్లలకుకూరఅన్నంతోపాటు పెరుగును కూడా వడ్డించే దిశగా చర్యలు తీసుకోవాలి.

ప్రభుత్వ సొమ్మా? పార్టీల సొమ్మా?: -వీరభొట్ల పేరయ్యశాస్త్రి, విజయవాడ

ప్రభుత్వాన్ని నడిపే పార్టీలు మారుతూ ఉంటాయి. కానీ ప్రభు త్వం ప్రజలకోసం ఇచ్చేవివిధ సంక్షేమపథకాల కార్డులు, గుర్తిం పు పత్రాలు, అది ఆరోగ్యశ్రీ కార్డు, లేక రేషన్‌ కార్డు కావచ్చు. లేక వివిధ పెన్షన్‌ కార్డులు కావచ్చు. అన్న క్యాంటీన్‌ గోడల రంగులు, ఇలా అనేక రకాలు మాత్రం మారవు. కానీ ప్రభు త్వాన్ని ఏర్పాటు చేసే పార్టీలు మారినప్పుడల్లా వీటిరంగులు, ముఖచిత్రాలు మారిపోతున్నాయి. ఆయా పార్టీల దివంగత, ప్రస్తుత అధినాయకుల చిత్రాలు, పార్టీల గుర్తింపులు, రంగులు అద్దుతున్నారు. ఈ సంక్షేమ పథకాల ఖర్చు, ప్రజల నుంచి వసూలు చేసిన వివిధ రకాల పన్నులూ, ఇతర వసూళ్ల ద్వారా వచ్చిన ధనంతో ప్రభుత్వం అధికారికంగా చేస్తున్న వ్యయం. అంతేకానీ ఆయా పార్టీల ఫండ్‌ నుంచి కానీ, అధినాయకుల జేబునుంచి కానీ వసూలు చేయడం లేదు. అంతా ప్రభుత్వ వ్యయమే. మరి ఎందుకీ ఆర్భాట ప్రచారం?

పాఠ్యపుస్తకాలు సరఫరా చేయాలి:-నాగేశ్వరరావు, మన్నెం, నెల్లూరు

ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలు ప్రారంభమై నాలుగు నెలలు గడు స్తున్నా ఇంతవరకు విద్యార్థులకు యూనిఫామ్‌, రెండు మీడి యంల పాఠ్యపుస్తకాలు అందలేదు.ఏ ప్రభుత్వం ఉన్నా ఇలాగే జరుగుతుంది.ఈ సంప్రదాయాన్ని మాని విద్యార్థులకు యూని ఫామ్‌, పాఠ్యపుస్తకాలను పూర్తిస్థాయిలో పంపిణీ చేయాలి. ప్రభుత్వంఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో తెలియదు.

విద్యుత్‌ కొరత లేకుండా చూడాలి:-గరిమెళ్ల రామకృష్ణ, ఏలూరు, ప.గో.జిల్లా

రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తి సరఫరా, కొనుగోలు ఒప్పందాల విధివిధానాలపైకేంద్రం పదేపదే లేఖలురాయడంగతంలో లేవ్ఞ. రాష్ట్రపాలకులు కేంద్రంఅభ్యంతరాలను పట్టించుకోకుండా విద్యు త్‌ కష్టాలకు గత పాలకులను నిందించడం తమ తప్పులను కప్పిపుచ్చుకుంటున్నారన్న భావన సామాన్యులకు సైతం కలుగు తున్నది. ఇప్పుడు బొగ్గు, విద్యుత్‌ కొనుగోళ్లు కూడా అత్యధిక ధరలకు కొంటున్నట్లు వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం వైపు నుండి సమాధానం లేదు. విద్యుత్‌ విధానంలో ప్రస్తుత పాల కులు పిల్లిమొగ్గలు వేస్తున్నారనే ప్రజలు అర్థం చేసుకొంటున్నా రు. నిజానికి గణాంకాలు పరిశీలిస్తే గత పాలకులు విద్యుత్‌ రంగాన్ని సమర్థవంతంగానే నిర్వహించారని చెప్పకతప్పదు. పాలకులు ప్రజలకు విద్యుత్‌ కొరత లేకుండా చూడాలి. అదే సందర్భంలో రాష్ట్ర ఖజానాపై అధికభారం పడరాదు. అంతే కానీ గత పాలకులపై బురదజల్లుడే ఏక సూత్ర కార్యక్రమంగా పెట్టుకుంటే భంగపాటు తప్పదు.

పోయేది నాయకులే..పార్టీలు కాదు: -మిథునం, హైదరాబాద్‌

రేడియో వార్తల్లో ప్రతిపక్షాల గురించి చెప్పరు. టి.వి.ఛానల్స్‌ లో ప్రతిపక్ష నాయకులెవరూ కనిపించరు. అంతటా అధికార పక్షానిదే రాజ్యం.వారి గురించే చెబుతారు. వారినే చూపిస్తారు. ప్రసార సాధనాలు అధికార పార్టీ తప్ప దేశంలో మరో పార్టీ లేనట్లే ప్రవర్తిస్తున్నాయి. ఇదిలా ఉంటే అధికార పార్టీవారు ప్రశ్నించే ప్రతిపక్ష నాయకుల నోళ్లునొక్కేస్తున్నారు. వారిపై అక్రమకేసులు బనాయించి జైళ్లలోకితోస్తున్నారు. బయట ఉన్న వారికి లేనిపోని ఆశలు కల్పించి లాక్కుపోతున్నారు. అధికారం కోసం ఆర్రులు చాస్తున్నారు. ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నా రు. పార్టీల్లో చీలికలు తెస్తున్నారు.

వంతెనలు లేని గ్రామాలు: -షేక్‌ అస్లాం షరీఫ్‌, శాంతినగర్‌

చాలా గ్రామాలలో వాగులపై వంతెనలు లేవు, వంతెనలు లేని కారణంగా వర్షాలకు వాగులు బాగా పొంగిపొర్లుతున్నాయి. దీనివల్ల ప్రజలు వాగులు దాటలేకపోతున్నారు. సంవత్సరాలు గడుస్తున్న వాగులపై వంతెనల నిర్మాణం జరగకపోవడం ప్రజ లను విస్మయానికి గురి చేస్తుంది. ప్రభుత్వం ఈ సమస్యను అధిగమించడానికి ప్రయత్నంచేయాల్సిఉంది.ఎక్కడెక్కడ వాగు లపై వంతెనలు అవసరమో సంబంధిత అధికారులతో ప్రతిపా దనలు తీసుకొని దానికి తగ్గ బడ్జెట్‌ కేటాయించి, వంతెనల నిర్మాణం జరిగే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది.

తాజా నాడి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/health1/