ప్రజావాక్కు

Voice of the People
Voice of the People

రక్తనిల్వల కొరత:- సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో అత్యవసర పరిస్థితులలో రక్తం లభించక ఎందరో రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డుప్రమాదాలు, అత్యవసర శస్త్రచికిత్సల సమయంలో ఆస్ప త్రులలో తగినన్ని రక్తనిల్వలు ఉండడంలేదు. కాగా రాష్ట్రవ్యా ప్తంగా హైదరాబాద్‌, నల్గొండ, వరంగల్‌లో తప్పితే మిగితా ప్రాంతాలలో రక్తనిధి కేంద్రాలు లేకపోవడం వలన సరైన సమ యంలో రోగులకు రక్తంలభించడం లేదు. వివిధ ప్రాంతాలలో అవసరమైన రక్తనిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవడం, రక్త దాతల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరచడం, గ్రామస్థాయి లో రక్తదాన శిబిరాల నిర్వహణ, రక్తదానంపై అవగాహన సదస్సుల నిర్వహణ ఇత్యాది అంశాలలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం ప్రస్ఫుటమవ్ఞతోంది.

మ్యూజియంల నిర్వహణలో నిర్లక్ష్యం: -సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

రవి అస్తమించని బ్రిటిషు సామ్రాజ్యాన్ని గడగడలాడించిన పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు పేరిట విశాఖనగ రంలోనిశిల్పారామంలో రాష్ట్రప్రభుత్వం ఏర్పాటుచేసినమ్యూజి యం అత్యంత దయనీయస్థితిలో ఉంది. ఎంతో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ఈ మ్యూజియం కనీస నిర్వహణను అధికారు లు పట్టించుకోకపోవడం వలన సందర్శకులు ఎంతో ఆవేదన చెందుతున్నారు. ఇక్కడవ్ఞన్న అల్లూరి విగ్రహాలకు కాళ్లు, చేతు లు విరిగిపోయాయి.కొన్నింటికి దుస్తులు చిరిగిపోయాయి. కొన్ని బొమ్మలు స్థానభ్రంశం చెంది చెల్లాచెదురుగా పడి ఉన్నా యి. అంతటి మహోన్నత వ్యక్తిత్వం గల పోరాటయోధుడికి జరుగుతున్న అవమానంపై ప్రభుత్వం తక్షణం స్పందించాలి.

సంప్రదాయాలు మరిచిపోతున్న యువత: -వులాపుబాలకేశవులు, గిద్దలూరు, ప్రకాశంజిల్లా

చిరుగులు పట్టిన బట్టలను ఫ్యాషన్‌ పేరిట యువతీ యువకులు ధరిస్తున్నారు. దీనికంతటికి కారణం సినిమా లలో హీరోహీరోయిన్‌లు ధరిస్తున్న వస్త్రాలను నేటి కాలేజీ యువతీయువకులు ధరిస్తున్నారు. చిరిగిన బట్టలు సిని మాలవరకే పరిమితమైతే బాగుంటుంది. సాధారణ జీవి తంలో ఇలాంటి బట్టలు ధరించడం వల్ల సం పదాయాలు మట్టికలిసిపోతున్నాయి. గౌరవ మర్యాలు కోల్పోతున్నారు. సినిమాలలో ఎలాంటి భాష,వేషధారణ ఉంటే నేటి యువత వాటినే ఫాలో అవ్ఞతున్నారు. ఈ తీరు మారాలి.

పాలిథిన్‌కు ప్రత్యామ్నాయం ఏది?:-ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా

రాష్ట్రంలో నిషేధిత పాలిథిన్‌ సంచుల వాడకం యధేచ్ఛగా జరు గుతోంది.ప్రభుత్వం పాలిథిన్‌ సంచుల విక్రయాలను, వాడకాల ను నిషేధించినప్పటికీ ఆ ఆదేశాలను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. వ్యాపార సంస్థలు, పండ్ల దుకాణాలు, కూరగాయల మా ర్కెట్లలో పాలిథిన్‌ సంచులను ఇష్టారాజ్యంగా వాడుతున్నారు. పలు ప్రాంతాలలో పాలిథిన్‌ సంచులను ఉత్పత్తి చేసే కార్మా గారాలపైకూడా ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులకు పాలిథిన్‌ సంచుల విక్ర యాలపైనిఘా అధికారం ఉన్నప్పటికీ చూసీ చూడనట్లుగా వది లేస్తున్నారు. మితిమీరిన పాలిథిన్‌ వాడకం వలన పర్యావరణా నికి పెనుముప్పుఅని పర్యావరణవేత్తలుమొత్తుకుంటున్నా ప్రభు త్వంలో, ప్రజలలో ఎలాంటి చైతన్యం కానరావడం లేదు.పాలి థిన్‌సంచుల విక్రయాలపై గట్టినిఘా ఏర్పాటు చేయాలి.

మూఢనమ్మకాలు నియంత్రించాలి: -యం.రాంప్రదీప్‌,తిరువూరు

సాంకేతిక పరిజ్ఞానం పెరగని రోజులలో ఏ గ్రామంలో చూసినా చిలకజోస్యం చెప్పేవారు. సోదిచెబుతాం అంటూ కొంత మంది మహిళలు కన్పించేవారు.కాలంమారింది. ప్రజలలో అక్షరాస్యత పెరగడం వల్ల పాతకాలపు మూఢనమ్మకాలతో మోసం చేసే వారి సంఖ్య తగ్గిపోయింది. తాజాగా ఇరీడియంలోహంతో తయారు చేసే విగ్రహాలతో రైస్‌పుల్లింగ్‌ యం త్రాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. సోషల్‌మీడియాలో కూడా అస త్యాలనిప్రచారం చేసేవారు ఎక్కువయ్యారు.మహారాష్ట్ర, కర్ణా టక,తరహామూఢనమ్మకాల నియంత్రణచట్టాన్ని తెలుగు రాష్ట్రా లు కూడా తీసుకువచ్చి చేతబడి, బాణామతి తదితర పేర్లతో మోసం చేసేవాళ్లను కఠినంగా శిక్షించాలి. మూఢనమ్మకాలను నియంత్రించడానికి ప్రజలలో అవగాహన కల్పించాలి.

ఆగని ఇసుక దోపిడీ! -గరిమెళ్ల రామకృష్ణ, గన్నవరం, కృష్ణాజిల్లా

రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలోఇసుక బ్లాక్‌మార్కెట్‌లో అత్య ధిక ధరలకు అమ్ముతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్య మంత్రి ఇసుక మాఫియాను అరికట్టాలని మరలా పిలుపు ఇవ్వడంఇసుక అక్రమ వ్యాపారం కొనసాగుతున్నదని చెప్ప కనే చెబుతున్నారు. ఇక కొత్త విధానం తీసుకువచ్చామని చెప్పడం హాస్యాస్పదం కాదా? దుందుడుకు విన్యాసాలతో ప్రజలకు ఒరిగింది శూన్యం.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/nri/