ప్రజావాక్కు

Voice of the People
Voice of the People

నరకానికి రహ’దారులు: -పారేపల్లి సత్యనారాయణ, దేవులపల్లి, ప.గో.జిల్లా

రహదారులే అభివృద్ధికి సూచికలు అని స్వర్గీయ పండిట్‌ జవ హర్‌లాల్‌ నెహ్రూ అనేవారు.రాష్ట్రంలో చాలాచోట్ల రహదారుల పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నాయి. వరుసగా కురుస్తున్న వానల వలన మరీ పాడైపోయాయి. కొన్ని చోట్ల ఆర్టీసీ తమ సర్వీసులను సైతం రద్దు చేసిందంటే పరిస్థితిని అర్థం చేసు కోవచ్చును. రోడ్ల మీద చాలా పెద్దపెద్ద గోతులు ఏర్పడి చిన్న పాటి చెరవ్ఞలను తలపిస్తున్నాయి. వాహనచోదకులు నిత్యం నానా తంటాలు పడి మరీ పాలకుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ తమ గమ్యస్థానాలను చేరుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. గోతుల వలన అనేక ప్రమాదాలు జరిగి చాలా మంది ప్రాణా లు పోగొట్టుకుంటున్నారు. పజాపాలకులు సత్వర చర్యలు తీసుకుని రహదారి వ్యవస్థను మెరుగుపరచకపోతే ఎవరి పాలన వచ్చినా ‘నా దారి నరక దారి అనే పరిస్థితి వస్తుంది.

కరవ్ఞభత్యం చెల్లింపులో నిర్లక్ష్యం: -యర్రమోతుధర్మరాజు, ధవళేశ్వరం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రప్రభుత్వఉద్యోగులకు గతఏడాది జులై నుండి కరవ్ఞ భత్యం కిస్తీలను చెల్లించాల్సి ఉంది. నిత్యావసర సరు కులధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పప్పులు, కూరగాయలు, ప్రధానంగాఉల్లిపాయలు కిలోఎనభైరూపాయలపైమాటే. సాధా రణఉద్యోగికి అందుబాటు ధరలోలేక కుటుంబపోషణ భారం గా మారింది. తీసుకుంటున్న వేతనాలకు ఖర్చులకు పొంతన లేక అప్పుల బారినపడుతున్నారు. ప్రజాప్రతినిధులు తమకు రావలసిన జీతాలు, పారితోషికాలు రాత్రికిరాత్రే పెంచేసుకుం టారు.ఉద్యోగికి చెల్లించాల్సిన రాయితీలపై కమిటీలు నివేదికల పేరుతో ఏళ్లతరబడి సాగతీస్తున్నారు. ప్రతి కార్యాలయంలో సగం సిబ్బంది ఖాళీగా ఉండటంతో పనిభారంపెరిగి తీవ్ర ఒత్తి డికి గురవ్ఞతున్నారు.కరవ్ఞ భత్యం బకాయిలను వెంటనే విడు దల చేసి ఉద్యోగులను అప్పుల బారినపడకుండా కాపాడాలి.

ఆగని రైతు ఆత్మహత్యలు:-గరిమెళ్ల రామకృష్ణ, గన్నవరం, కృష్ణాజిల్లా

రాష్ట్రంలోరైతుల ఆత్మహత్యల వార్తలు రోజూపత్రికలలో రావ టం చాలా ఆందోళన కలిగిస్తున్నది. అయినా పాలకులు ఆత్మ హత్యలనుఆపటానికి ఎటువంటిఆలోచనాచేయకపోవడం బాధ్యతారాహిత్యమనే చెప్పాలి. కనీసం ఆత్మహత్యలు చేసుకు న్న రైతు కుటుంబాలకు పరిహారం కూడా సాయం చేయడం లేదు. రైతు సంఘాల నేతలు ఈ విషయంలో పాలకులపై ఒత్తిడి తీసుకువచ్చి రైతు కుటుంబాలకు అండగా నిలవాలి.

ఆస్పత్రుల్లో మందుల కొరత: -ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా

గుంటూరుజిల్లాలో వివిధ ప్రభుత్వ ఆస్పత్రులలో నిర్లక్ష్యం కార ణంగా రోగులు తమ ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఇటీ వలి కాలంలో ఎక్కువవ్ఞతున్నాయి. ఆస్పత్రులలో నిత్యవసర మందులు, ఇంజెక్షన్లు లభ్యంకాకపోవడం, రోగుల ప్రాణాలను కాపాడేందుకు, ఇతర ఆస్పత్రులకు తరలించేందుకు తగినన్ని అంబులెన్సులు లేకపోవడం, వైద్యసిబ్బంది, సహాయ సిబ్బంది కొరత, సీనియర్‌ వైద్యులు కొందరు దీర్ఘకాలిక సెలవ్ఞపై ఉండటం వలన పిజి విద్యార్థులే చికిత్సలు చేస్తుండడం వలన ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. కార్పొరేట్‌ ఆస్ప త్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను నిలబెడతామని ప్రభు త్వాలు చేస్తున్న వాగ్దానాలు అమలుకు నోచుకోవడం లేదు. ఇక ఆస్పత్రులలో దళారుల వ్యవస్థ, సిబ్బంది అవినీతి, నిర్లక్ష్యవైఖరి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

నాయకులు ప్రజాభిమానం పొందాలి: -ఎం.శ్రీనివాస్‌, హైదరాబాద్‌

ప్రజాభిమానం ఉన్నవారే రాజకీయాలలో రాణించగలుగుతారు. నాయకులుగా ఎదగగలుగుతారు. ఎన్నికలలో గెలుపొందగలు గుతారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వంటి పదవ్ఞలను అం దుకోగలుగుతారు. జాతీయ స్థాయిలో నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్‌, చంద్రబాబునాయు డు, రాజశేఖర్‌ రెడ్డి, జగన్మోహన్‌రెడ్డి, కె.సి.ఆర్‌, కె.టి.ఆర్‌ వీరంతా రాజకీయ మేధావ్ఞలు, సమర్థులు. ప్రజలకు నచ్చిన వారు అందుకే వారికి అడుగడుగునా నీరాజనాలు పలికారు. పట్టంకట్టి పదవ్ఞలలో కూర్చోబెట్టారు.

తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/women/