ప్రజావాక్కు

Voice of the people
Voice of the people

రహదారి ప్రమాదాలను కట్టడి చేయాలి: -సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

ఏటా లక్షల కుటుంబాలలో తీరని సంక్షోభం సృష్టిస్తున్న రహ దారుల ప్రమాదాల కట్టడి కోసం ఇటీవల అమలు పరుస్తున్న మోటారు వాహనాల సవరణ చట్టం పెను వివాదాలకు కేంద్ర బిందువ్ఞ అవ్ఞతోంది. ట్రాఫిక్‌ ఉల్లంఘనపై వేలాది రూపా యలు జరిమానా విధిస్తున్న వైనం తీవ్ర విమర్శలకు తావి స్తోంది. స్కూటరిస్టులకు 47వేల పెనాల్టీ, ఒక ఆటో డ్రైవర్‌కు 48వేల జరిమానాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేయ డమే కాకుండా నూతన నిబంధనలపై విమర్శలు, వ్యంగ్యోక్తు లు, ప్రభుత్వ విధానం పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం రహదారి భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు యుద్ధప్రాతిపదికపై చేపట్టాల్సినచర్యలపై దృష్టి సారించకుండా జరిమానాల వసూళ్లే పరిష్కారమార్గంగా విధాన రూపకల్పన చేయడం సమంజసంగా లేదు.

డిగ్నిటీ ఆఫ్‌ లేబర్‌: -మిథునం, హైదరాబాద్‌

గ్రామీణ యువకులు వ్యవసాయం చేసుకుంటూ అక్కడే ఉండ వచ్చు.వ్యవసాయ కూలీలుగా పనిచేసుకోవచ్చు. తమకు తామే ఉపాధికల్పించుకోవచ్చు.ఇవేమీ చేయకుండా ఉద్యోగాల కోసం, చిన్నచితక పనులనువెతుకుంటూ పట్టణాలకు, నగరాలకు పరు గులు పెడుతున్నారు. ఈ కారణంతో పల్లె ప్రాంతాలలో జనం లేక వెలవెలబోతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో జనాభా పెరిగి పోయిఅనేక సమస్యలు ఉత్పన్నమవ్ఞతున్నాయి. ఎక్కడి వాళ్లు అక్కడఉంటేనే జనాభానియంత్రణలోఉంటుంది.దొరికిన ఉద్యో గమేదో చేస్తేనే నిరుద్యోగ నిర్మూలనకు అవకాశం ఉంటుంది. అంతేకాని డిగ్నిటీ ఆఫ్‌ లేబర్‌, ఈ పని తప్ప మరో పని చేయ ను అని కూర్చుంటే సమస్య మరింత జటిలం అవుతుంది.

హౌడీ మోడీ – అంతా హడావిడి: -డా.డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం

అమెరికా టెక్సాస్‌లోని హూస్టన్‌ పట్టణంలో యాభైవేల మంది ప్రవాసభారతీయులతో నిర్వహించబడ్డ హౌడీ మోడీ కార్య క్రమంఒక మెగా ఈవెంట్‌గా చరిత్రలో నమోదౌతుంది. స్థూలం గా చూస్తే ఆ భారీ ప్రాయోజిత కార్యక్రమం ఉద్దేశిత ప్రయోజ నాన్ని ప్రధాని సంపూర్ణంగా సాధించినట్టే.కాశ్మీర్‌ అంశంపై కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడడం, ఉగ్రవాదంపై ఐక్యపోరు అవస రాన్ని నొక్కి చెప్పడంబాగుంది. అయితే వచ్చే ఎన్నికల్లో ట్రంప్‌నిగెలిపించాలని పిలుపునివ్వడంకొంతఅసంబద్ధం. ట్రంప్‌ కూడా రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రవాసభారతీ యుల ఓట్లు అడగడానికి వచ్చినట్లు అర్థమవ్ఞతుంది.

ఉద్దీపన పథకాలను నిలిపివేయాలి:.-ఎం.కనకదుర్గ, తెనాలి, గుంటూరుజిల్లా

మందగమనంలో చిక్కుకున్నదేశ ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టేం దుకు ప్రస్తుతం ఉద్దీపన పథకాలు చేపట్టడం సరికాదన్న రిజ ర్వుబ్యాంకు ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ సూచనలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి శిరోధార్యం కావాలి. ముఖ్యంగా అంచనాలకు భిన్నంగా ఏప్రిల్‌ జూన్‌ త్రైమాసికంలో స్థూల జాతీయోత్పత్తి వృద్ధిరేటు ఐదు శాతానికి మాత్రమే పరిమితం కావడంతో ఈ సూచనలకు ఎంతప్రాధాన్యత సంతరించుకుంది.పన్ను వసూళ్లు గత మూడేళ్లుగా బడ్జెట్‌ అంచనాల కంటే తక్కువగా ఉన్నాయి. నిర్దేశించుకున్న ద్రవ్యలోటు లక్ష్యాలను సాధించినట్లు చూపించ డం కోసం వ్యయాలను గణనీయంగా తగ్గించి, చివరకు ప్రభు త్వరంగ సంస్థలకు చెల్లింపులను కూడా నిలిపివేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ ఆహార సబ్సిడీని ఫుడ్‌కార్పొ రేషన్‌ ఆఫ్‌ ఇండియా ఖాతాలో వేయడం, జాతీయ చిన్న పొదుపు నిధి నుండి రుణాలుగా చూపించడం వంటి అనూహ్య మైన పద్ధతులను ఆర్థికశాఖ అనుసరించింది. ఈ నేపథ్యంలో ఉద్దీపన పథకాలను నలిపివేయడమే శ్రేయస్కరం

చేనేతకు సంక్షేమ పథకాలేవి?: -ఎల్‌.ప్రపుల్లచంద్ర, ధర్మవరం, అనంతపురం జిల్లా

మన రాష్ట్రంలో వ్యవసాయం తరువాత చేనేత పరిశ్రమపై ఆధా రపడి జీవించేవారే అధికంగా ఉన్నారు.అయితే ప్రస్తుతం చేనేత వర్గాలకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేసిందేమీ లేదు. కనీసం చేనేత సంక్షేమ పథకాలు ప్రకటించలేదు. గతంలో చేతివృత్తి చేనేతకు పన్నులు మినహాయించారు. మోడీ సర్కార్‌ జి.ఎస్‌.టి విధించి నేతన్నకు మరింత భారమయ్యారు. సంక్షోభంలో ఉన్న చేనేత పరిశ్రమ అభివృద్ధికి మన రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలి. జిఎస్టీ పన్నులు చేనేతలకు మినహాయించాలి. సమస్యలతో సతమతమవ్ఞతున్న చేనేతను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి.

కాశ్మీర్‌కు కొత్త వైభవం: -వులాపు బాలకేశవులు, గిద్దలూరు, ప్రకాశంజిల్లా

జమ్మూకాశ్మీర్‌ను రెండు భాగాలుగా విభజించి, రెండు కేంద్రపా లిత ప్రాంతాలుగా ప్రకటించడం,అధికరణ 370నుంచి విముక్తి కల్పించడం ద్వారా అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొంటా యని భారతీయుల్లో అత్యధికులు విశ్వసిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రెండు విషయాల్లో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. కాశ్మీరీల అభిమానం చూరగొనడం, నిర్ణయాలపై వారి ఆమోదం పొందడం ముఖ్యం. మరోవైపు కాశ్మీర్‌ను దేశంలోనే అత్యంత ఆకర్షణీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/