స్మార్ట్‌ఫోన్‌ ఒక వ్యసనం

ప్రజావాక్కు

Smart Phone using
Smart Phone using

స్మార్ట్‌ఫోన్‌ ఒక వ్యసనం:-కాయల నాగేంద్ర, హైదరాబాద్‌
స్మార్ట్‌ఫోన్‌ రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. దాంతో కాలక్షేపంచేయవచ్చు.అలాగే దుర్వినియోగం చేయవచ్చు. సెల్‌ ఫోన్‌ మన నియంత్రణలో లేకపోతే దానికి బానిసలవ్ఞతాం. ఎక్కువసేపు ఫోన్‌లో గడపడం అనేది ఒక వ్యసనం లాంటిది. కొందరు వీడియోలు, సినిమాలు చూస్తే మరికొందరు గాసిప్స్‌ చదివేవారు,ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసేవారు ఉంటారు. మరికొంద రైతే గంటల తరబడి గేమ్స్‌ఆడుతుంటారు.ఇలా ఎందరో తమను తాము సెల్‌ఫోన్‌తో కట్టేసుకుంటున్నారు. తింటున్నా, నడుస్తున్నా,వాహనాలు నడుపుతున్నా చివరికి పడుకున్నా కూడా చేతిలో సెల్‌ఫోన్‌ ఉండాల్సిందే! సెల్‌ఫోన్‌ అవసరమే. కానీ వాడకానికి ఒక పరిమితిఉంటుంది.

ఉపాధి చూపని డిగ్రీలు:- ఉలాపు బాలకేశవులు, గిద్దలూరు, ప్రకాశంజిల్లా
విద్యార్థుల చదువ్ఞలుపూర్తయినా ఏళ్లతరబడి ఉద్యోగాలు లభిం చడంలేదు. పట్టాలు పుచ్చుకున్నాక పనికోసం కాళ్లరిగేలా తిరు గుతున్నారు.పూర్వం కులవృత్తులు యువతకుఉపాధి కల్పించే వి.ఇప్పుడవి మరుగునపడటంతో స్వయం ఉపాధి పరికల్పన లు లేక ఒడ్డునపడ్డ చేపపిల్లల్లా సతమతమవ్ఞతున్నారు. సం ప్రదాయ డిగ్రీలు, ఇంజినీరింగ్‌ పట్టాలనే భేదం లేకుండా అన్ని కోర్సులవారిలో అత్యధికులు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నా రు. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం ఉన్న విద్యార్థులు నైపుణ్య లేమితో బాధపడుతున్నారు.డిగ్రీచదువులకు ఉద్యోగ నైపుణ్యా లకుమధ్య అంతరాలు పెరిగిపోయాయని ఇటీవల విద్యానాణ్యతా ఉన్నతీకరణ సమ్మిళిత కార్యక్రమం నివేదికస్పష్టం చేసింది. అలాంటప్పుడు ఇప్పుడున్నడిగ్రీలతో ప్రయోజనం ఏమిటి?

జాతీయహోదా ప్రకటించాలి: -సి.ప్రతాప్‌, శ్రీకాకుళం
రెండు తెలుగురాష్ట్రాలకు జీవధార, వరప్రదాయిని అయిన పోలవరం, కాళేశ్వరం ప్రాజెక్టులకు జాతీయహోదా ఇవ్వా లన్న ముఖ్యమంత్రుల విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం సానుకూ లంగా పరిశీలించాలి. రెండు రాష్ట్రాలలో కేవలం ఎనిమిది శాతం సాగు భూమి మాత్రమే సాగవ్ఞతోంది. జలవనరుల లో 60 శాతం మాత్రమే వినియోగంలోకి వచ్చి మిగతాది వృధాగా సముద్ర పాలవుతోంది.వ్యవసాయరంగం పుంజు కోవడానికి అందుబాటులో ఉన్న వనరులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థవంతంగా వినియోగించుకుంటున్నారు.

అమలు కాని నిబంధనలు: -సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ
తెలంగాణ రాష్ట్రంలో బోరుబావ్ఞలలో పడి చిన్నారులు ప్రాణా లు పోగొట్టుకుంటున్న ఘటనలపై జాతీయ బాలల కమిషన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడం సమంజసంగా ఉంది. వ్యవసాయం, వ్యక్తిగత అవసరాల కోసం బోరుబావ్ఞలు తవ్వడం, నీళ్లు పడకపోవడమో లేక ఇతరత్రా కారణాల వలన యాజమానులు వాటిని పూడ్చకుండా అలాగే వదిలేస్తున్నారు. ఈచిన్నపాటి నిర్లక్ష్యం అనేకమంది చిన్నారులప్రాణాలు తీస్తోం ది.వాల్టా చట్టం ప్రకారం బోరుబావ్ఞలు తవ్వేందుకు సంబంధిత తహసీల్దారు ముందస్తు అనుమతి తప్పనిసరి.అయితే ఈ నిబం ధన ఎక్కడా అమలు కావడం లేదు. బోరుబావ్ఞల ఘటనలపై స్పందించి తదనుగుణంగా నియంత్రణా చర్యలు చేపట్టాలని 2007లోనే ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఉమ్మడిరాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చినా ఎలాంటి ఫలితం లేకపోయింది.

పనితీరును పర్యవేక్షించాలి:-జి.అశోక్‌,గోదూర్‌, జగిత్యాలజిల్లా
కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైంది.చాలా ప్రభుత్వ పాఠశా లల్లో ఉపాధ్యాయుల కొరత ఉంది.ప్రైవేట్‌ ఉపాధ్యాయులను విద్యావాలంటీర్లుగా నియమించుకుని తరగతులు నడిపిస్తున్నా రు.గత సంవత్సరం పదో తరగతి విద్యార్థులు రికార్డుస్థాయిలో ఉత్తీర్ణత, గ్రేడింగ్‌లు సాధించడం ముదవాహమే. అయినప్పటికీ ఏ పరిస్థితుల్లో ఆస్థాయి ఫలితాలు వచ్చాయన్నదీ చూడాలి. గత సంవత్సరం ఉపాధ్యాయ బదిలీలు తదితర కారణాల నేపథ్యంలో చాలా పాఠశాలల్లో బాహాటంగానే కాపీలు జరిగా యి. మూల్యాంకనలో ఉపాధ్యాయులూ ఔదార్యం ప్రదర్శించా రు. పదవతరగతి విద్యావిధానం తీరుమారాలి. విద్యాసంవత్స రం మొదటి నుంచే తరగతులు పకడ్బందీగా జరిపించాలి. అంతర్గతమూల్యాంకనం చిత్తశుద్ధిగా జరగాలి.

ఐ.ఆర్‌, పి.ఆర్‌.సి ప్రకటించాలి: -సి.వి.ఆర్‌.కృష్ణ, హైదరాబాద్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ప్రభుత్వ సంస్థల ఉద్యోగులకు జులై 1, 2019 నుండి 27 శాతం తాత్కాలిక ఉపశమనం (ఐఆర్‌) మంజూరు చేశారు. దానికి సంబంధించిన జి.ఓ కూడా జారీ చేశారు. కానీ తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం అయినప్పటికీనేటికీ రాష్ట్రఉద్యోగులకు అదిగోఇదిగో అంటూ ఇంకా కాలయాపన చేస్తున్నారు. ఇకనైనా సత్వరం తాత్కా లిక ఉపశమనం ప్రకటించాలి. వెంటనే పి.ఆర్‌.సి ఇచ్చే శాతాన్ని, విడుదల తేదీని ప్రకటించాలి.