ప్రజావాక్కు

Voice of the People
Voice of the People

తెలుగును ఆదరించాలి:-జి.అశోక్‌,గోదూర్‌,జగిత్యాలజిల్లా
ప్రపంచంలో ఎన్నో భాషలు, సంస్కృతులు ఉన్నాయి. ఎవరి భాషా సంస్కృతులపై వారికి అభిమానం ఉంటుంది. తెలుగు మాట్లాడే ప్రజలకు తమమాతృభాషపట్ల ఉన్నచులకన భావం, నిరాదరణ మరే భాషీయులలోను కనిపించదంటే అతిశయోక్తి కాదు. ఆంగ్లం, హిందీ వంటి ఎన్ని భాషలయినా నేర్వవచ్చు. వాటి మోజులో పడి తెలుగును నిరాదరించడం మాత్రం తగ దు.తెలుగేతర భాషమాత్రమే తెలిసిన వారితో ఆయా భాషల్లో మాట్లాడక తప్పదు. ఇద్దరు తెలుగువారే తెలుగులో కాకుండా ఇతరభాషల్లో మాట్లాడుకోవడం కృతకంగాఉంటుంది. ఇకనైనా తెలుగువారు తమ మాతృభాషపై మమకారం పెంచుకోవాలి.మద్యంమత్తులో యువత:-సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండదేశంలో యువత మద్యంమత్తులో తడబడుతోందన్న సామా జిక న్యాయమంత్రిత్వశాఖ తాజా నివేదిక ఆందోళన కలిగి స్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మద్యం వినియోగం గత పదేళ్లలో 59 శాతం పెరగగా, కొకైన్‌, హెరాయిన్‌, గంజాయి వంటిమత్తుమందుల వాడకం ఐదింతలుపెరగడం, ముఖ్యంగా 0-17 సంవత్సరాల మధ్య యువత ఈ అలవాట్లకు బానిస లవడం ఆందోళనకరం. మత్తులో వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యేవారు 63 శాతం కాగా, 21 శాతం ఉదయం వేళ్లలోనూ తూగుతుండడం, రెండు రాష్ట్రా లలోకనీసం తొమ్మిది లక్షలమంది తీవ్ర బానిసలకు అత్యవసర చికిత్సల అవసరం,నాలుగులక్షల మంది మాదకద్రవ్యాల బాని సలకు డీ అడిక్షన్‌ చికిత్సలుచేయించకపోతే ప్రాణాలకి ప్రమా దం అన్న సదరు నివేదిక ఆందోళన కలిగిస్తోంది.

రజకులను ఆదుకోవాలి:-యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం
రెడీమెడ్‌ దుస్తులు వచ్చాక టైలర్‌లు, వాషింగ్‌మిషన్లు వచ్చాక రజకులు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర బడ్జెట్లో దర్జీ,రజక,నాయీ బ్రాహ్మణులకు ఏటా పదివేలు ఆర్థిక సహాయం అందించేందుకు మూడువందల కోట్లు కేటా యింపు అభినందనీయం. అలాగే కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, కంసాలి వంటి కులవృత్తులతో జీవనం సాగించేవారు. నగరా లు చిన్నచిన్న పట్టణాలలో కూడా ఖరీదైన బహుళ అంతస్తు భవనాల్లో ఫర్నీచర్‌, జ్యుయెలరీ దుకాణాలు వెలిసి వాయిదా లపై వినియోగదారులకు అందుబాటులోఉన్నందున పై వర్గాల వారు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు.

వ్యవసాయంపై అవగాహన పెంచాలి-ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా
విధాన నిర్ణేతలలో చాలా మందికిగ్రామీణ భారతం, వ్యవసా యం గురించి సరైన అవగాహన లేకపోవడం పెద్ద శాపంగా పరిణమించింది. దేశంలో వ్యవసాయదారులకు సరైన ఉపాధి లేదు.అధికశాతం గ్రామీణ రైతులకు కనీసప్రాథమిక అవసరాలు కూడా తీరడంలేదు. దాదాపు 50 శాతం ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్న వ్యవసాయ రంగం జిడిపిలో 15 శాతం మాత్రమే వాటాకలిగిఉంది.కాబట్టి వ్యవసాయదారులకు అదనపు ఆదాయ మార్గాలని చూపించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. సబ్సి డీలు ఇవ్వడం కంటే కనీస మద్దతు ధరలు పెంచాలి. వ్యవసా య భూమిని,నీటి వనరులను సమర్థవంతంగా నిర్వహించడం, చిన్న కమతాలను విలీనం చేయడం వంటి వాటిపై అవగాహన కల్పించాలి.వ్యవసాయరంగానికి మౌలిక రంగం హోదా కల్పించి వ్యవసాయాధారిత వ్యాపారాలను పెంచాలి.

మహిళలకు రక్షణ కల్పించండి:-తూలుగు రమణారావు అక్కరాపల్లి దేశం నలుమూలలా ప్రతినిత్యం ఏదో ఒక చోట మహిళలు, చిన్నారులు,విద్యార్థినీలు,వివాహితులు,హత్యకు గురికావడమో, ఆత్మహత్యకు పాల్పడటమో జరుగుతుంది. దీనికి ప్రధాన కార ణాలు సమాజంలో కొంత మంది ఆకతాయిల వికృత చేష్టలు భరించలేకపోవడం, అత్తింటివారి వరకట్న వేధింపులు, లైంగిక హింసలు, అవగాహన లేని బాల్యవివాహాలు, పోలీస్‌ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖలు, న్యాయశాఖ, స్పందించి మహిళలు చైత న్యంనింపి, వారిని హింసిస్తున్నవారిపై కఠినమైన చర్యలు తీసు కొని మహిళలకు, చిన్నారులకు రక్షణ కల్పించగలరు.

వలసలను నిరోధించాలి: -తిరుమలశెట్టి సాంబశివరావ్ఞ, గుంటూరుజిల్లా కొత్తగా ఏర్పడిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ప్రకటించడం శ్లాఘనీయం. గ్రామీణ ప్రాంతా ల్లో యాంత్రీకరణ పెరిగి కులవృత్తుల వారికి ఉపాధి లభించక నిత్యం వందల సంఖ్యల్లో పట్టణాలకు వెల్లువెత్తే వలసలతో పట్టణాలు మురికి కూపాలుగా మారుతున్నాయి. లండన్‌ వంటి మహానగరాలకు సైతం వలసలు సంవత్సరానికి కొన్ని వందలు మాత్రమేనట.ఈ వలసలు ఇలానే కొనసాగితే మున్ముందు చెన్నై నగరానికి వలె రైళ్లలో నీరు తరలించే దుస్థితి ఎన్నో నగరాలకు రావచ్చు. జనసాంద్రత పెరిగి పౌరసేవలు సక్రమంగా లభించక అనారోగ్యాలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.ఎప్పటికప్పు డు మరమ్మతులంటూ వేలకోట్ల రూపాయలు ఖర్చుతోపాటు ప్రజలను తీవ్ర ఇబ్బందుల పాలుచేస్తున్నారు.