ప్రజావాక్కు

Voice of the People
Voice of the People

వాననీటిని ఒడిసిపట్టాలి:- సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ
తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 40 శాతం చెరువ్ఞలు ఆక్రమణ కారణంగా కనుమరుగైపోయాయన్న జాతీయ జలమండలి నివేదికపై రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం స్పందించాలి. 1972, 1992,2012 సంవత్సరాల సాటిలైట్‌ ఇమేజిల సహాయంతో వివిధ రాష్ట్రాలలో జలవనరులపై సుదీర్ఘ అధ్యయనం చేసి విడుదల చేసిన నివేదికలోని అంశాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నా యి. అంతేకాకుండా పూడికతీత పనులు గత రెండు దశాబ్దాలు గా చేపట్టని కారణంగా కృష్ణా, గోదావరి, కావేరీ, తుంగభద్ర నదుల సామర్థ్యం 2.8శాతంతగ్గిపోవడం,భూగర్భజలాలు 40 శాతందాకా కలుషితమైపోయి, కార్బొనెట్‌,పోటాషియం, జింక్‌ వంటి ప్రమాదకర రసాయనాల స్థాయి పెరగడం ఆందోళనకర పరిణామం.భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా వాననీటిని ఒడిసిపట్టే ఒక పటిష్ట కార్యాచరణకు రాష్ట్రప్రభుత్వాలు సన్నద్ధం కావాలి.

పెరుగుతున్న నిరుద్యోగం: -సి.ప్రతాప్‌, శ్రీకాకుళం దేశంలో పెచ్చుపెరుగుతున్న నిరుద్యోగంపై మేధావులు ఆందో ళన వ్యక్తంచేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం చురుకుగా వ్యవహ రించాలి. జాతీయ నమూనా సర్వే సంస్థ నివేదిక ప్రకారం గత డిసెంబరులో నిరుద్యోగిత రేటు 9.7 శాతంగా నమోదయింది. స్వాతంత్య్రం నాటి నుండే ఇది అత్యధిక రేటు. అయితే కేంద్ర గణాంకాల శాఖమంత్రి దీనిని నకిలీ నివేదికగా కొట్టిపారేయడం బాధ్యతారాహిత్యం.దేశంలో 2018సంవత్సరంలో కోటి మంది కిపైగా ఉపాధి కోల్పోయారని, వీరిలో అత్యధిక శాతం అంటే 84 శాతం గ్రామీణులే అన్న నివేదిక క్షేత్రస్థాయిలో ఉపాధి కల్పనలో ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని స్పష్టం చేస్తోంది.

నిరాశ మిగిల్చిన బడ్జెట్‌: -సి.సాయిప్రతాప్‌,హైదరాబాద్‌
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌ స్వరూపం ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, మాటల మాయాజాలం, సామాన్యులకు పన్నుల బాదుడు గా ఉంది. ఈ బడ్జెట్‌ తెలుగు రాష్ట్రాలను తీవ్ర నిరాశ పరి చింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నిరసనలను కూడా పట్టించుకోకుండా కేంద్రంతనదైన ప్రతీ కార ధోరణినే ప్రదర్శించింది. రెండు తెలుగు రాష్ట్రాలకు న్యాయం దక్కాల్సిన ఎన్నోప్రాజెక్టులు,వనరులు పెండింగ్‌ ప్రాజెక్టుల గురించి ప్రతిపాదనలు లేకపోవడం బాధాకరం.

పశుపోషణ పట్ల సన్నగిల్లుతున్న ఆసక్తి:-ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా
వ్యవసాయంతో విడదీయరాని అనుబంధం ఉన్న పశుపోషణ పట్ల రైతుల్లో ఆసక్తి సన్నగిల్లుతోంది.దాణా, తవ్ఞడు, గడ్డిధరలు అనూహ్యంగా పెరిగిపోవడంతోపాటు వాటి లభ్యత తగ్గిపోతుం డగా,అదేస్థాయిలో పాలఉత్పత్తి ధరలు పెరగకపోవడంతో రైతు లు పశుసంపద పోషణపట్ల అనాసక్తి కనబరుస్తున్నారు. గుం టూరుజిల్లాలో గత అయిదేళ్లలో పశుసంపద30శాతం తగ్గినట్లు జిల్లా వ్యవసాయ శాఖ నివేదికలో పేర్కొంది. గ్రామాల్లో బీడు భూములు తగ్గడం,బంజరుసాగుకు అనుకూలంగా మలుచుకుం టుండడం వలన పచ్చిగడ్డి కూడా దొరకడం కష్టమవుతోంది. మునుపటికంటే వేసవికాలం జూన్‌వరకు కొనసాగుతుండడంతో ఈ కాలంలో ఎండుగడ్డి లభ్యతపై కూడా పశుసంవర్థకశాఖ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.


పర్యావరణాన్ని కాపాడుకోవాలి: -జి.అశోక్‌,గోదూర్‌,జగిత్యాలజిల్లా ఈ వర్షాకాలంలో వరుణుడు మన రాష్ట్రం మీద శీతకన్ను వేశా డని అనిపిస్తుంది. వర్షాలు కురువక రైతులు ఖరీఫ్‌ సీజన్‌ను ఎప్పుడు ప్రారంభించాలో తెలియక దిగాలుగా ఉన్నారు. వర్షా లు పడాలని ఎందరో ప్రకృతికి వివిధరీతులలో మొరపెట్టుకుం టున్నారు.కొంతమంది కప్పతల్లి ఆటలాడి కప్పల ఉసురుపోసు కుంటున్నారు.కప్పలగోస చూడలేక వరుణదేవ్ఞడు కరుణిస్తాడని ఒక విశ్వాసం రైతుల్లో ఉంది. అయితే స్వార్థం కోసం అడవ్ఞల ను నరుకుతున్న మనిషికి దాని ఫలితాల సంగతి ఇంతవరకు అవగతం కాలేదు.ఇష్టానుసారంగా చెట్లు నరుకుతూ ఉంటే వర్షా లు ఎలా కురుస్తాయి. వర్షాలు కురవడానికి చెట్లు, పచ్చదనం పరిరక్షణ అనేవి శాస్త్రీయ పద్ధతులు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉందంటే వర్షానికి చిరునామాగా చెప్పే చిరపుంజిలో కూడా వర్షాలు తగ్గిపోతున్నాయి. ఇప్పుడు మనిషి ముందున్న కర్తవ్యం ఒక్కటే. అడవులను పెంచడం.

ధూమపానాన్ని నిషేధించాలి:-ఎం.రాధాకృష్ణ,హైదరాబాద్‌ బస్‌స్టాపుల్లో సిగరెట్‌ కాల్చేవారిపై సంబంధిత ఆర్టీసీ అధి కారులుచూసీచూడనట్టు ఊరుకోకుండా తగినచర్యలు తీసు కోవాలి. పొగ తాగే వారి కన్నా పీల్చే వారిపై దాని ప్రభా వం ఎక్కువగా ఉంటుంది.తోటి ప్రయాణీకులు ఎంతో ఇబ్బందులకు గురికావలసి వస్తుంది.కావ్ఞన సిగరెట్లు కాల్చే వారిపైనే కాకుండా అమ్మే స్టాల్స్‌ యజమానులపై కూడా దృష్టిసారించాలి. నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించిన వారికి జరిమానా విధించాలి.