ప్రజావాక్కు

Voice of the People
Voice of the People

వైద్యరంగానికి అత్యవసర చికిత్స: – సి.హెచ్‌.ప్రతాప్‌, శ్రీకాకుళం
ప్రపంచ ఐక్యరాజ్యసమితి తన తాజా అధ్యయన నివేదికలో ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించడంలో భారతదేశం గత అయిదేళ్లలో రెండుస్థానాలు మెరుగుపరుచుకొని 103వ ర్యాంకుకు ఎగబాకడం శుభపరిణామం. 2014లో అధికారం చేపట్టిన నాటి నుండి చిత్తశుద్ధితో అంకిత భావంతో పనిచేసి ముఖ్యంగా ప్రభుత్వవైద్యానికి జవసత్వాలు కల్పించడం వలనే ఈ మాత్రం అభివృద్ధి అయినా సాధ్యపడింది. గత యుపిఏ ప్రభుత్వం ఒకదశాబ్దం పాటు ప్రభుత్వ వైద్యరంగాన్ని నిర్లక్ష్యం తో అనాధగా వదిలివేయడం వల్లనే ఈ దుర్గతి ప్రాప్తించింద నేది విస్పష్టం.అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. భారతీయ వైద్యరంగంలో వైద్యులు, నర్సులు,పారామెడికల్‌ సిబ్బంది, వైద్యశాలలలో మౌలిక సదు పాయాలలేమివంటి అనేక సమస్యలు హిమాలయాలవలె తిష్ట వేసుకొని ఉన్నాయి. ఏటా కొత్త కళాశాలలు ఆవిర్భవిస్తున్నా ఇప్పటికీ దేశంలో 60కోట్ల మందికి వైద్యసౌకర్యాలు అరకొరగా అందుతున్నాయని సదరు నివేదిక తేల్చి చెప్పింది.

పుస్తకాల బరువు తగ్గించాలి: -సయ్యద్‌ షఫీ, హన్మకొండ
పాఠశాలలు తెరుచుకొని పదిరోజులు అవుతుంది. ప్రైవేట్‌ పాఠశాలల తిరుమారలేదు. పుస్తకాల బరువ్ఞ తగ్గడం లేదు. ఫీజుల మోత పెరుగుతుంది. ఆడుతూ పాడుతూ చదువ్ఞ కోవాల్సిన వయస్సులో విద్యార్థులు వయస్సుకు మించిన బరువ్ఞను మోస్తున్నారు. పుస్తకాల అధిక బరువ్ఞ శారీరక ఎదు గుదల మీద తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. పుస్తకాల బరువ్ఞను, ఫీజుల మోతను తగ్గిస్తామని పాలకులు చెప్తూనే ఉన్నారు. కానీ ఎటువంటి చర్యలు మాత్రం తీసుకో వడం లేదు. కనుక విద్యాశాఖ అధికారులు పుస్తకాల బరువ్ఞ తగ్గించేలా చర్యలు తీసుకోవాలి.

సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలి:-షేక్‌ అస్లాం షరీఫ్‌, శాంతినగర్‌
రహదారుల వెంబడి ఏ పట్టణానికి ఎటు వెళ్లాలి. ఏ పట్టణా నికి ఎంతదూరం అని తెలిపే సూచికబోర్డులు చాలా చోట్ల కన్పించడం లేదు.ఈ కారణంచేత రహదారుల వెంట ప్రయా ణం చేసే వారు అయోమయంలో పడుతున్నారు. ఆర్‌ అండ్‌బి శాఖవారు ఈ సూచిక బోర్డులను ఏర్పాటు చేయడానికి ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. ఎక్కడెక్కడ ఈ సూచిక బోర్డులు ఏర్పాటు చేయలేదో, అక్కడక్కడ బోర్డులను ఏర్పాటు చేయాలి.

===
సోషల్‌ మీడియాకు యువత బానిస: -ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా
ప్రపంచీకరణ పుణ్యమా అని ఆధునిక దేశాలలో బహుప్రాచు ర్యం పొందిన సోషల్‌ మీడియా భారతదేశంలో కూడా ఎన్నో దుష్పరిణామాలకు దారితీస్తోంది. ఇటీవల సెంటర్‌ ఫర్‌ హ్యూ మానిటీస్‌ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం దేశంలో 75 శాతం యువత సోషల్‌ మీడియాకు బానిసలుగా మారారు. గ్రామీణ యువత కూడా పెరిగిన అవగాహన, ఇంటర్నెట్‌ వ్యస నం కారణాల వలన సోషల్‌ మీడియాను విస్తృతంగా ఉపయోగి స్తున్నారు. ఇంటర్నెట్‌ వ్యసనం వలన తెలివితేటలు క్షీణించడం, ఆటపాటలకు దూరం కావడం, శారీరక శ్రమ లోపించడం వంటి చెడు ఫలితాలు కలుగుతాయి. మానవ సంబంధాలు క్షీణించడం, సమాజంలో హింసపెరగడం, అసత్యవార్తల ప్రచా రం,నైతికవిలువలు బలహీనం కావడం వంటివి జరుగుతున్నా యి. ఇక పలు కార్పొరేట్‌ సంస్థలు సోషల్‌ మీడియాను తమ వ్యాపారాభివృద్ధికి వాడుకుంటున్నాయి.మంచికంటే చెడు ఎక్కు వగాచేసే సోషల్‌ మీడియాపై ప్రభుత్వం నియంత్రణ అవసరం.

పింఛన్లు ఇవ్వాలి: -కె.పాండురంగాచారి,దిల్‌సుఖ్‌నగర్‌
తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పింఛన్లు పొందడానికి పాత చట్టం ప్రకారం వయసు 65 సంవత్సరాలుండాలి.కానీ మున్సిపల్‌ కార్యాలయాల్లో 66 సంవత్సరాలు నిండి ఉండాలి అని అంటు న్నారు. దరఖాస్తులు తీసుకోవడం లేదు. ఇక కొత్త చట్టం ప్రకా రం 57సంవత్సరాలు ఉండాలని జి.ఒ రాలేదని, వచ్చిన దర ఖాస్తులను కూడా తీసుకోవడం లేదు. ప్రభుత్వం వెంటనే స్పం దించి ఆసరా పింఛన్లు అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో ఆసరా పింఛన్లు పొందేవారి సంఖ్య చాలా పెద్దదిగా ఉంది.అందరిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం చర్యలు తీసు కోవాలి.మున్సిపల్‌ కార్యాలయానికి అన్ని వివరాలతో కూడిన జి.వోను అందించాలి.

ఎంబిబిఎస్‌ సీట్లను పెంచాలి: -జి.భానువర్ధన్‌, ఫిరంగిపురం
ప్రపంచ ఆరోగ్యసంస్థ అంచనాల ప్రకారం వెయ్యి మందికి ఒక వైద్యుడు ఉండాలి. కానీ మనదేశంలో 1700 మందికి ఒక వైద్యుడున్నాడు. అందరికీ వైద్యం అందుబాటులోకి రావాలంటే వైద్యవృత్తిలో ప్రవేశాలు పెంపొందించాలి. ఇందుకు గాను కస్తూరిరంగన్‌ కమిటీ సూచించిన నూతన విధానాల అమలు అవశ్యకత ఎంతైనా ఉంది. ఎం.బి.బి.ఎస్‌ సీట్ల సంఖ్యను పెంచాలి. దీనికి ఒక ప్రత్యేక టాలెంట్‌ టెస్ట్‌ నిర్వహించాలి.