ప్రజావాక్కు

Voice of the People
Voice of the People

గ్రామాల్లో వైద్యం కొరత: -ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరు జిల్లా

ఏటా లక్షమంది భారతీయులలో 152మంది సరైన చికిత్స అందక మరణిస్తున్నారని జాతీయ వైద్యవిద్యామండలి అధ్య యన నివేదికలో తేలింది. ఈ విషయంలో పొరుగు దేశాలైన పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, నేపాల్‌ కంటే తీసికట్టుగా భార తదేశం ఉండడం బాధాకరం.ప్రపంచంలోనే అతిపెద్దవైద్య సం రక్షణ పథకం ఆయుష్మాన్‌భవ మనదేశంలోనే అమలవ్ఞతున్నా 2016-18 మధ్య కాలంలో అత్యవసర వైద్యం లభించక అకారణంగా తనువ్ఞలు చాలించిన వారి సంఖ్య అత్యధికంగా ఉంది. గ్రామప్రాంతాలలో వైద్యసేవలు ఎంతో అధ్వాన్నంగా ఉండడం వలన మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఇక్కడ 80 శాతం రోగులకు సరైన అర్హతలు లేని ఆర్‌ఎంపి వైద్యులు చికిత్స చేస్తున్నారు. అంతేకాకుండా దొంగ డిగ్రీసర్టిఫి కేట్లతో వైద్యం చేసేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి.

మిషన్‌ శక్తి:-సి.ప్రతాప్‌, శ్రీకాకుళం
అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపడమేకాక పనిచేయని ఉప గ్రహాలను తొలగించడానికి శత్రుదేశాల క్షిపణిదాడులను తిప్పి కొట్టేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధించి మిష న్‌శక్తిగా ప్రయోగించిన ఇస్రోకు అభినందనలు. క్షిపణి బ్రహ్మా అబ్దుల్‌ కలామ్‌ ప్రారంభించిన భారతక్షిపణి కార్యక్రమం ఇప్పు డు పూర్తిస్థాయిలో ఫలితాన్ని అందించే స్థాయికి ఎదిగింది. అణ్వస్త్రమైనా, అంతరిక్ష పరిజ్ఞానమైనా శాంతియుత ప్రయో జనాలు కోసమేనని మనదేశం ఎన్నో సందర్భాలలో స్పష్టం చేసింది.మనదేశం ప్రయోగించిన ఉపగ్రహాలన్నీ భూగర్భంలో, సాగరగర్భంలో, సహజవనరుల గుర్తింపు కోసమే పనిచేస్తున్నా యి. ఇంతవరకు శత్రుదేశాల ఉపగ్రహాలను పేల్చే సత్తా కేవలం అమెరికా, రష్యా, చైనాలకే ఉండగా ఇప్పుడు నాలుగో దేశంగా ఆ జాబితాలోకి భారత్‌ చేరడం అభినందనీయం.

రైతులకు సాయం అందించాలి:-గరిమెళ్ల రామకృష్ణ, కృష్ణాజిల్లా

తొలకరి వర్షాలతో రాష్ట్రంలోని రైతన్నలు భూములను సాగుకు సిద్ధం చేస్తున్నారు. ఈ తరుణంలో పాలకులు, బ్యాంకులు రైతులకు ఉదారంగా ఆర్థికసాయం, రుణాలు అందించాలి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తొలివిడతగా రైతు చేతికే అందిస్తానన్న పన్నెండు వేల అయిదు వందల రూపాయలు చెల్లించి రైతులకు భరోసా కల్పించాలి.

బెట్టింగ్‌ సంస్కృతిని నిషేధించాలి:-సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

ఒకప్పుడు మర్యాదస్తుల క్రీడగా వినుతికెక్కిన క్రికెట్‌ ఆటలో ఈ మధ్య విష సంస్కృతులు,దురదృష్టకర పరిణామాలు చోటు చేసుకోవడం బాధాకరం. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా బెట్టింగ్‌ సంస్కృతి బలంగా వేళ్లూనుకొని కోట్లలో వ్యాపారం యధేచ్ఛగా సాగుతోంది. మరొకపక్క ప్రపంచకప్‌, ఐపియల్‌ మ్యాచ్‌లలో కూడా బెట్టింగ్‌ వికృతరూపం దాల్చుతోంది. నిబంధనల ప్రకా రంనిజాయితీగా కృషి చేసి విజయం కోసం పోరాడే క్రీడాస్ఫూర్తి సన్నగిల్లుతోంది. ప్రపంచకప్‌ కోసం ఎంపిక చేసిన భారత జట్టు లో కొంత మందిని ఎంపిక చేయడంలో విరాట్‌ కోహ్లీ ప్రధాన పాత్ర వహించాడన్న వార్తలు మనదేశంలో పెరుగుతున్న రాజకీ యాలకు ప్రత్యక్షతార్కాణం.బిసిసిఇ నిర్వహణలో కేవలం మాజీ క్రికెటర్లు, క్రీడాస్ఫూర్తి కలిగిన వారికే స్థానం కల్పించాలన్న సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా బిసిసిఇలో రాజకీయ నాయ కులు, కార్పొరేట్లు, వ్యాపారస్థులు క్రికెట్‌ ఆట గురించి అ,ఆలు తెలియని వారికి స్థానం కల్పించడం బాధాకరం.

బాల్యవివాహాలను నిర్మూలించాలి:-తూలుగు రమణారావు, అక్కరాపల్లికొంత మంది అక్షరజ్ఞానం లేని తల్లిదండ్రులు తమ పిల్లలకు 18 సంవత్సరాలు నిండకుండానే వివాహాలు జరిపిస్తున్నారు. తల్లిదండ్రులకు, పిల్లలకు సరైన అవగాహన లేని కారణంగానే బాల్యవివాహాలు జరుగుతున్నాయి. పాఠశాలల్లో బాల్యవివాహా లు అనర్థాల గురించి ఉపాధ్యాయులు బోధించాలి. చైల్డ్‌ లైన్‌ వారు అవగాహన సదస్సులు ప్రతిగ్రామంలో నిర్వహించాలి. 1098 సర్వీసు ద్వారా పిల్లలకు రక్షణ కల్పించాలి. బాల్య వివా హాలుచేయడం చట్టరీత్యానేరం.బాల్యవివాహాలను ప్రోత్సహించే వారిపై చర్యలు తీసుకోవాలి. రెవెన్యూశాఖ, పోలీసు శాఖ, చైల్డ్‌ లైన్‌,బాలల అక్రమరవాణా నిరోధక బృందం, ఉపాధ్యాయులు అందరూ బాల్యవివాహాల నిర్మూలన తమ బాధ్యతగా గుర్తించి బాలలకు బంగారు జీవితాన్ని అందించే దిశగా పనిచేయాలి.

పెరిగిన బాధ్యతలు:- డా.డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం

ప్రమాణస్వీకారం నాడే ప్రజాసంక్షేమం పట్ట, అవినీతి రహి తపాలనపట్ల దృఢసంకల్పాన్నితెలియబరిచారు కొత్తముఖ్య మంత్రి.ప్రజలు తనకు అందించిన భారీవిజయంలోనే వారి భారీ ఆకాంక్షలు దాగివ్ఞన్నాయి. భుజస్కందాలపై బరువ్ఞ, బాధ్యతలున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర విభజన తాలూకా కష్టనష్టాలు ఆర్థిక లోటు రూపంలో కళ్లెదుటనే ఉన్నాయి. రాష్ట్ర అభివృద్ధికి అవి పరిమితుల్ని విధిస్తూనే ఉంటాయి.